Our good brother in Telugu Short Stories by renuka Ayola books and stories PDF | మా మంచి అన్నయ్య

Featured Books
Categories
Share

మా మంచి అన్నయ్య

ముక్కు దూలం మీద చాలా గట్టిగా తగిలిందేమో రక్తం బోట బొటాఇంకా కారుతోంది చేతి రుమాలుని అడ్డం పెట్టుకుని కూర్చున్నాడు చైతన్య హాస్పిటల్ ఎమర్జన్సీబెడ్ మీద.
“కిరణ్ ‘వాడ్ని ఫ్రెండ్స్ కి అప్పచెప్పి ఫ్లాట్ కి వెళ్లి మళ్లీ వస్తా అక్కడ రవిగాడు ఏంచేస్తున్నాడో చూడాలి మీరు జాగర్తగా చూడండి వీడ్ని మానాన్నకి తెలుస్తే పెద్ద గొడవ అవుతుంది అన్నాడు .వాళ్లు సరే అని తల ఊపారే కానీ మనసులో భయం ఎక్కడ పోలీసులు వస్తారో అని అసలే డిగ్రీ ఫైనల్ఇయర్ కొద్దిరోజుల్లోపరీక్షలుమొదలు అవుతాయి,ఇంట్లో వాళ్లకి కాలేజీ ప్రిన్సిపల్ కి తెలుస్తే అనే బెంగ మొదలుయ్యింది.అయినా చైతన్యని జాగ్రతగా చూడాలి అనుకున్నారు.వాళ్ల అమ్మకి నాన్నకి నేను ఫోన్ చేస్తాను మీరేమీ భయపడకండి అంటూ కిరణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు..
 దెబ్బ ఎలతగిలింది ఏమర్జన్సీ వార్డులో ఉన్న డ్యూటీ ‘డాక్టర్’ అడిగాడు చైతన్యని దెబ్బ తగిలి రక్తం కారుతున్న ముక్కుని పరీక్షిస్తూ…
మందు ‘పార్టీలో ‘ ఫ్రెండ్స్ మధ్య చిన్న గొడవ అన్నాడు ‘చైతన్య’ అతని తో పాటు వచ్చిన అబ్బాయిలని చూస్తూ అడిగాడు డాక్టర్ నిజమేనా! అని అవును అంటూ తల స్పీడ్ గా ఊపారు డాక్టర్ ప్రశ్నకి..
చైతన్యని బెడ్ మీద ముక్కుని శుభ్రం చేసి,పడుక్కోపెట్టి ఇంజక్షన్
సెలెన్ బాటిల్లో ఎక్కిస్తూ చాలా రక్తం పోయింది రెస్ట్ అవసరం అతన్ని పడుకోనివ్వండి మీరు వెళ్లి బయట కూర్చోందిఅందినర్స్.
రాత్రిమూడుగంటలుఅవుతోంది.
కొన్ని టెస్టులు చేయాలి చేసాక చెప్తాను వాళ్ళ తల్లి తండ్రులకి చెప్పేరా అంటూ బయటికి వెళ్ళ బోతున్న మాదగ్గరకి వచ్చి అడిగాడుడాక్టర్! అంతలోనే హడావిడిగా అందోళనగా వచ్చారుచైతన్యతల్లి,తండ్రి.
‘ఆంటీ ‘ఏమి కంగారు పడకండి చైతన్య కి ఏమి కాలేదు! అన్న మాఇద్దర్ని చూస్తూ ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. ఏమర్జన్సీ వార్డులో అని చూపిస్తుండగానే మాదగ్గరకి వచ్చిన డాక్టర్,వాళ్ల దగ్గరకి వెళ్లి వాళ్లతోమాటలాడుతుంటే..
బయటికివచ్చారునవీన్,రాజేష్.
కొద్దిగా కాఫీ తాగుదాం పద!అనుకుంటూ కెంటీన్ వైపుకి వచ్చారు అప్పటికే పదిసార్లు ఫోన్ చేసిన వాళ్ళ తల్లి తండ్రులకి ఫ్రెండ్ చైతన్యహాస్పిటల్లోఉన్నాడని,వచ్చేస్తామని చెప్పారు ఇద్దరూ కాఫీ తీసుకుని కుర్చీలు లాక్కుని కూర్చున్నారు ఒకరి మొహాలు ఒకరుచూసుకుంటూ.కొద్దిగా ఆందోళన తగ్గింది వేడి కాఫీ తాగగానే..
అమ్మాయిలకి ఈ విషయం చెప్పాలాఒద్దాఆనిమాట్లాడుకుంటుండగానే -ఇంతలో ‘
‘రవి ‘ వీళ్ల దగ్గరకి వేగంగా కాస్త ఆవేశంగావచ్చాడు!వెతుకుంటూ వాడిని చూస్తూఎలా వచ్చావు ‘కిరణ్ ‘నీదగ్గరికి రాలేదా అడుగుతున్నా సమాధానం చెప్పకుండా వాడెక్కడ అడిగాడు ఎమర్జన్సీలో అంటూండగానే వార్డు వైపు గబగబా వెళ్తున్న వాడి వెనకే కాఫీ కప్పులు పట్టుకుని పరిగెత్తారుఇద్దరు!ఇంకా ఏం గొడవ చేస్తాడో అనుకుంటూ.
రవి ‘చైతన్య ‘బెడ్ దగ్గరికి వెళ్లీఇంకెప్పుడు ఇలా చేయకు
ఇదే నీకు ఆఖరి వార్నింగ్ అన్నాడు.వాడు చిరునవ్వు నవ్వుతూ నేను ఏమీ చేయలేదు నువ్వేఅంతచేసావుఅన్నాడు.
నీకు ఇంకా బుద్ధి రాలేదురా ఇంకా ‘నాకొడక ‘అంటూ తిడుతున్న వాడిని బలవంతంగా బయటికి లాకొచ్చారు..
డాక్టర్ తో మట్లాడి ‘చైతన్య ‘దగ్గరకి వస్తున్న ‘తల్లి తండ్రులు’ఏమి అర్ధంకాక ఏమిటి ఎం జరిగింది అంటున్న వినిపించుకోకుండా..
రవిని లాకోస్తూ వదలండిరా అంటూఅంటూగింజుకుంటున్నవాడిని పట్టుకుని ఆపుతూ..
అరే నీకేమైనా బుర్ర ఉందా వాడు నీ పేరు చెప్పి కేసు పెడితే జైల్లో ఉంటావు అన్నారువాడి మొఖం చూస్తూ… వాడు ఆవేశంగా బాధతో 
కాలేజీ వచ్చి వాడి ముఖాన్ని రోజు చూస్తూ,అమ్మాయిల ఓవర్ యాక్షన్ చూసేకన్నా జైలు నయంరాఅన్నాడు దిగులుగా . చాల్లే!ఫైనల్ ఇయర్కి వచ్చాం మహా అయితే రెండు నెలలు పరీక్షలు అయిపోతే ఎవరు ఎక్కడ.ఏ యూనివర్సిటీలో పి,జి సీటు వస్తుందో ఎక్కడికి పోతామో ఎవరికి తెలుసు ముందునీ ఆవేశం తగ్గించుకో మాకు మాత్రం కోపం లేదా వుంది. కానీ ఎందుకు ఊరుకున్నాము మనం ఎంత మొత్తుకున్నా ఆ చెల్లెళ్లు నమ్మరు…
అదేరా నా బాధ అంతా గొర్రెల్లా వాడినే నమ్ముతారు అయినా అయినా ఆ చెల్లెళ్ల కి బుద్ది రావాలి మనకి కాదు.
వాడ్ని హాస్పిటల్ ల్లో జాయిన్ చేసాము వాడు మనమీద కేసు పెట్టలేదు పెడితే వాడి బండారమే బయట పడుతుంది అందుకే మహా త్యాగ మూర్తిలా,జ్ఞానిలా ఊరుకున్నాడు.అన్నాడు ‘రవి’ కోపంగా….
మనకెదుకురా ఒకసారి వాడి సంగతి తెలిస్తే వాడి వెనక వెనక తిరిగే చెల్లెళ్లే మూతి పళ్ళు రాల గోడతారు అన్నాడు నంతవరకు మనం ఓపిక పట్టాలి..
‘నవీన్ ‘పార్కింగ్ లో ఉన్న బైక్ మీద కూర్చుంటూ .ఉంటారా ఇంటికి వెళ్లి కాస్త ఫ్రెష్ అవ్వాలి ‘చల్ ‘బై అంటూ వెళ్లిపోయాడు 
ఆ తరువాత రవి,రాజేష్ కూడా వెళ్ళిపోయారు..
 మూడురోజుల తరువాత ముక్కుకి పెద్ద ప్లాస్టర్ వేసుకుని కాలేజీకి వచ్చిన చైతన్య ని చూసి అందరూబాధపడ్డారుకాలేజికి వచ్చినచైతన్యనిచూసి..
క్లాస్ రూంలోకి రాగానే చెల్లెళ్లు అందరూఏడ్చినంతపనిచేశారు
‘అన్నయ్య ‘ఏమైంది అంటూ
.నాకేమీ కాలేదు బాగానే ఉన్నాను అన్నాడు ‘అన్నయ్య ‘నిన్ను రవి కొట్టాడని విన్నాను నిజమేనా 
బిందుఅడిగిందికోపంగా…ఆవిషయం తరువాత చెప్తాను లంచ్ అవర్లోఅన్నాడువినయంగా.
అందరూ సరే అక్కడే కలుద్దాము అంటూక్లాసులోకిలెక్చరర్ రాగానే ఎక్కడివాళ్ళు అక్కడ సర్దుకుంటూ 
ఆఖరి పిరియడ్ లొ లెక్చరర్ వెళ్లిపోగానే ‘బిందు ‘అందరికీ నేను ఒక్క మాట చెప్పాలి దయచేసి అందరూ ఉండండి అంది అందరూ కూర్చున్నారు.
అన్నయ్యని ‘రవి ‘ఎందుకు కొట్టాడోమీరందరూతెలుసుకోవాలి అంది అవేశ పడుతూ!అందరీ కుతూహలమైన ముఖాల వైపు చూస్తూ.మనం అన్నయ్య వెనకాల బైక్ ఎక్కినప్పుడు అన్నయ్య అనే ముసుగులో వాడి ‘టచ్’ ని ఆనందిస్తున్నామట!
అన్నయ్య ఆది తప్పు అంటే ఇదిగో ఇలా ముక్కు పగిలేలా కొట్టాడు.
అనయ్యతలచుకుంటేపోలీసులకు చెప్పొచ్చు కానీ చెప్పలేదు. అది అన్నయ్య మంచితనం.ఆమె మాటలు విన్న రవి అసహ్యంతో బయటికి వెళ్లి పోతుంటే బిందు ఆపింది .
రవి నువ్వు నిజాలే చెప్పే గొప్ప మొగాడివే కాచ్చు కానీ ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని సంకించావు “ఛీ “ సిగ్గు ఉందా నీకు అంటూ పెద్దగా అరిచింది.అందరూ కోపంగా చూశారు ..అసలు నిజం తెలిస్తే మీరు ఈ మాటలు అనరు అన్నాడు కోపంగా.ఏమిటా నిజం చెప్పు రవి మేముకూడావింటాము అంది. ఏదో చెప్పబోతున్నా రవి బుజం పట్టి ఆపేశాడు రాజేష్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినరు అంటూ.
అసలు వీడిని కొట్టాలి చెప్పుతీసి అందిఆవేశంగా వనజ ,ఇంతలో ఊహించని విధంగా వినోదిని వచ్చి రవి చెంప మీద గట్టిగా కొట్టింది.’ఏయ్ ‘అంటూ చేయి పట్టుకున్నాడు ఆవేశంగా రవి చేయి విదిలించుకుంటూ కొడతావా కొట్టు అంది కోపంగా .’చైతన్య ‘ఒద్దు ఒదిలేయ్ వినోదిని అన్నాడు సరే అన్నయ్య నువ్వు చెప్పావుగా పట్టి ఒదిలేస్తున్నాను అంది.క్లాసులో అందరూ తలో మాట అనుకుంటూ రవి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయారు.
 అన్నయ్య ఒద్దు అన్నాడు కాబట్టి బతికిపోయావు రవి,లేకపోతే ‘ప్రిన్సిపల్ ప్sir కి చెప్పా లనుకున్నాము అంది బిందు బ్యాగ్తీసుకునిసుకునిబయటికివెళుతూ.
ఆతరువాత రవి కాలేజీకి రాలేదు పరీక్షలు రాశాడు.
పూనా వెళ్లిపోయాడు అక్కడ పి.జి చేయడానికి ....
దేవుళ్ళని అడ్డం పెట్టుకునే దొంగ బాబాలు ,గురువులు కన్నా ప్రమాదమైన వాళ్లు ఈ మంచి అన్నయ్యలు,బాబాయిలు చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చో పెట్టుకుని వెధవ వేషాలు వేసే వీళ్ల గురించి ఎవరికీ చెడు ఆలోచనే రాదు చెప్పడానికి చిన్నపిల్లలకి అర్థం కాదు.వాళ్లు చేసే చేతలు మంచికో చెడుకో అర్థం కాదు ‘బాబాయి’ అంటే మంచివాడు అంతే.
ఇలాంటి వాళ్లల్లో తాతగార్లు 
వాళ్ళ మీద అస్సులు అనుమానం రాదుకూడా!వీీళ్ళుఇంటిమనుషులుకారుపక్కింటిబాబాయిలు…
అనుమానం రాదు రానివ్వరు అలాంటి వాళ్లు ఎవరికి సోతం కారు .సొంత వాళ్ల కన్నా ఎక్కువగా సమాజంలో మనపక్కనే ఉంటూ మనల్ని దారుణంగా మోసగిస్తారు వీళ్లు ఆడవాళ్లని చీటికి మాటికి హత్తుకుంటారు నెత్తి మీద చేతులు వేసి దీవెనలు ఇస్తూ ఉంటారు,వీపు మీద చేతులు వేస్తారు,జబ్బలు తడుముతారు ఎవ్వరూ ఏమీ అనుకోరు.
ఈ అన్నయ్యాలు బాబాయిలు అంత మాయ చేస్తారు ‘వరుస ‘కలిపి మాట్లాడే మొగవాళ్లతో ఆడవాళ్లు ఎంతో భద్రత అనుభవిస్తారు కొన్ని సార్లు అర్థం అవుతున్నా ‘అన్నయ్య గారు’ అలా!చెయ్యరు అనే నమ్మకం వాళ్ళని అయోమయంలో పడేస్తుందిఎంత మంచివాడైన వరుస పెట్టి పిలవని మొగవాడిని చస్తే నమ్మరు ఆడవాళ్లు…
సంబంధ బాధవ్యాలు అంటేఅర్థం స్త్రీ పురుషులిద్దరికి కూడా తెలియదేమో ఒక స్త్రీ ఒక పురుషుడు కలయిక అంటే భార్య భర్త లే అయి ఉండాలిఅంతకంటే మరో ఆలోచన రానియ్యని సమాజంలోవరసలు పెట్టి పిలుస్తూఅందులోప్రమాదమేలేదుఅనుకుంటూబతికేసేఆడవాళ్ళ
కోసంఅన్నయ్యలు,బాబాయిలు దీవెనలు అందించే ‘బాబాలు ‘ పుట్టుకొస్తునే ఉంటారు .ఇదిగో ఇలా మోసపోతూనే ఉంటారు...
“ చైతన్య “డిగ్రీ మొదటి సంవత్సరంలో కొద్దిగా ఆలస్యంగా చేరాడు వాళ్ళ నాన్నగారికి ఈ ఊరు ట్రాన్ఫర్ అయ్యినందుకు 
అంతదూరం నుంచి చూడగానే అబ్బాయిలకి గమ్మత్తుగా అనిపించాడు ఉంగరాల జుట్టు పక్కా పాపిడి దువ్వి నుదిటిన చిన్న కుంకుమ బొట్టుతో చిరునవ్వుతో ఎంతో మర్యాదగా ఉన్నాడు.మొదటి చూపులోనే అందరికీ ముఖ్యంగాఅమ్మాయిలకి నచ్చేశాడు…
వాడి చూపులోని,వేష భాషలోని 
ఆత్మీయత గమనించారు లెక్చర్లకి నచ్చేశాడు అందరితో స్నేహంగా ఉండే ‘చైతన్య ‘మంచి అబ్బాయి లిస్టులోకి వచ్చేశాడు ఎలాంటి సహాయానికైనా ముందు ఉండే చైతన్య ఈకాలం అబ్బాయి లిస్టులోంచి పక్కకి వచ్చేసి మంచి అబ్బాయివరసలోనిలబడ్డాడు.
ఆడవాళ్లకి సాయం చేయడానికే పుట్టినట్లు ఉండేవాడు.
చైతన్య ఉన్నాడుగా మనకేం భయంలేదుఅనుకునేవారు.
లెక్చరర్లు సైతం అవసరం వస్తే వాడి బైక్ ఎక్కి వెళ్లి పోయేవారు.
నిర్మొహమాటంగామాట్లాడేే ‘
‘రవి ‘ఎవరికీ నచ్చేవాడు కాదు
 చైతూఅన్నయ్యగురించిఅందరిముందు వి పరీతంగా పొగిడే అమ్మాయి వెళ్లిపోగానే ఏమో అన్నయ్య ముసుగులో వీళ్లు కూడా ఆ టచ్ ని ఎంజాయ్ చేస్తున్నారేమో అనేసరికి అందరికి నవ్వు వచ్చినా ఆపుకున్నారు రవి అన్నమాటలకి.
వాడు చాలా నిర్మొహమాటి ఎవరు ఎన్ని అనుకున్నా వాడికి నచ్చక పోతే ముఖం మీదే వాడు అనుకున్నది అనేస్తాడు వాడంటే అమ్మాయిలకి అస్సలు పడదు .అరేయి !మీలో ఎంతమంది చెెల్లినో అక్కనో అమ్మనో చీటికి మాటికి రోజు కౌగలించుకుటా రో చెప్పండి అని వో డిబెట్ పెట్టాడు అందరిసమాధానంఒకటే.
ఎప్పడూ లేదు మరి సంతోష వార్త అయితే తప్ప దగ్గరకేరారు.
అసలువాళ్ళగదిలోకేరానివ్వరు
గదిలోకి వెళ్ళాలి అంటే తలుపు కొట్టి వెళ్ళాలి అన్నాడో కడు ఆడపిల్లతో నీకెందుకురా అంటూ మా ‘నాయనమ్మ’ అసలు మా చెల్లెల్నితాక నివ్వదు అన్నాడు ఒకడు.చూశారా ఫ్రెండ్స్!సినిమా కాదు చెళ్ళ ళ్ల ని మాటి మాటికీ కౌలించుకోవడానికి,అందరూ గట్టిగా నవ్వేశారు చైైతన్య అంతా వింటూనే ఉన్నాడు చిరునవ్వుతో .
చైతన్యకి అర్థం అయ్యిది వాడిమీదే ఈ సెటైర్లుఅని.
అయినా ఒక్క మాట మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్లిపోయాడు వారం రోజుల తరువాత అందరికీ మంచి ఫ్రెండ్ అయిన ‘కిరణ్ ‘బర్త డే పార్టీకి అందరినీ పిలిచాడు వాళ్ల నాన్న పెద్ద బిల్డింగ్ కాంట్రాక్టర్ వాడి పార్టీ అంటే అందరికీ ఇష్టమే వాడికి సోతంగా ఒక ఫ్లాట్ ఉంది పార్టీ అంటే అందరూ అక్కడికి చేరుకుంటారు అదేఅందరిఅడ్డా.
ఆ రోజు పార్టీకి చైతూ కూడా వచ్చాడు.చైతూ రవి పొడి పొడిగా పలకరించుకున్నారు.
పార్టీ మొదలు అయ్యింది ఖరీదైన మందు ,భోజనంసిద్దంగాఉన్నాయి కేక్ కట్ చేసి అందరూ మెల్లగా మందు తాగుతూ తింటూ బాతాఖానీ మొదలుపెట్టారు అందులో కొత్తగా వచ్చిన వెంకట్,చైతు భాయి అదృస్టం అంటే నీదే అందరూ అమ్మాయిలు నివెంటే ఉంటారు ,మమ్మల్ని ఒక్కరూకూడాచూడరు..
మాట్లాడారు ‘అన్నయగా’ మస్తు సెటిల్ అయ్యావు లక్కీ బాయ్ అన్నాడువాడిబుజంతడుతూ.
అప్పుడే అందరికి మెల్ల మెల్లగా మందు మత్తు ఎక్కుతోంది .
చైతు అవునురా అందరూ నన్ను హత్తుకుని కూర్చుంటారు భలే మత్తుగా ఉంటుంది బైక్ మీద ఆటోకాలు ఇటోకాలు వేసి కూర్చుంటారు శరీరంలో అన్ని పార్ట్లు మెత్తగా తగులుతుంటాయి ఒక బూతుమాట అంటూ రాత్రిళ్లు నిద్ర రాదు.అందులో ‘బిందు ‘అయితే భలే ఉంటుంది ఇంకో మాట నోట్లోంచి రాకుండానే మొఖం మీద రెండు సార్లు కొట్టాడురవి వాడు అసలే బాక్సికింగ్ ప్రాక్టీస్ చేస్తాడేమో ముక్కులోంచి బొటా బొటా రక్తం కారింది ముఖం మీదనుంచి ధారలా కారే రక్తం చూసి వాడి మత్తు ,అందరి మత్తు ఒక్క సారిగా ఒదిలి పోయింది.
 వాడి చొక్కా పట్టుకుని కింద పడేసి కొడుతున్న రవిని పట్టుకుని ఆపారు.రేయి వాడ్ని చంపేస్తావా ఏంటి అంటూ రవిని పక్కకి లాగేసి కిందపడేసారు.”దొంగనాకొడుకు”అన్నయ్య ముసుగులో ఎంత కామం దాచుకున్నాడు ఇలాంటి వాడ్ని చంపేయాలా నరకలా చెప్పండిరాఅరుస్తూఒగరుస్తున్నరవిని చూసి భయపడి పరుగు తీశాడు ‘చై తన్య’ ముక్కులోంచి కారుతున్న రక్తానికి చేయి అడ్డంపెట్టుకునిపరిగెత్తాడు…
వాడి వెనకాలే కిరణ్ పరిగెత్తాడు అగురాఅంటూవాడ్నిబలవంతంగా కారులో కూర్చో పెట్టుకుని హాస్పిటల్కి దారితీశాడు .
కారులో కూర్చున్న చైతన్యకి వాడు చేసిన తప్పు తెలిసింది ఏం చెయ్యాలో కూడా అర్థం అయ్యింది ఒక వ్యూహం మనసులో సిద్ధం అయ్యక,నిశ్చంతగా కిరణ్ తోకూడా మాట్లాడకూడా సీటు వెనక్కి వాలిపోయిపడుక్కున్నాడు
ముక్కుకి చేతి రూమలు అడ్డం పెట్టుకున్నాడు ధారగా కారుతున్న 
రక్తం కారుతున్న లెక్క చేయకుండా
కిరణ్ కి వీడీ మాటలకి అసహ్యం వేసినా వాడి స్థితి చూస్తే జాలి వేసింది అంతకన్నా వాడి నాన్న ఏమంటాడో అని భయం పట్టుకుంది.అరేయి పోలీసులకు ఇవేమీ చెప్పకురా మా నాన్న నన్ను చెంపేస్తాడు అన్నాడు చైతన్య మెల్లగా కళ్ళు విప్పి చెప్పనులేరా భయపడకు నీలాంటి స్నేహితుడిని పోగొట్టుకోనురా అన్నాడు ఆమాటతో కిరణ్ రిలాక్స్ అయిపోతూ థాంక్స్ రా అన్నాడు..కారు మెల్లగా హాస్పిటల్ ముందు ఆగింది..... 
      రేణుక అయోలా 
Renuka.ayola@gmail.com
Cel: 9676853987
 
 .