Meera (One Love, One Revenge) - 5 in Telugu Love Stories by surya Bandaru books and stories PDF | మీరా (One Love, One Revenge) - 5

Featured Books
Categories
Share

మీరా (One Love, One Revenge) - 5

తన అన్నయ్య నుంచి అలాంటి ప్రశ్న ని ఎదురు చూడని మౌనిక shocking గా చూసి తడబడుతూ "sudden గా ఏమైంది ఇలా అడుగుతున్నావ్? వాడు నాకు మంచి friend అంతే" అంది.

"ఏం లేదు ఒకవేళ నువ్వు అతన్ని లవ్ చేస్తుంటే, ఆ విషయం ఎవరో చెప్తే వినేకంటే, నీ నుండి తెలుసుకుంటే better కదా" అన్నాడు చందు.

మౌనిక ఇబ్బందిగా తన వదిన వైపు చూసి నవ్వుతూ box తీసుకుని కొంచెం దూరం వెళ్ళి ఆగి, "అవును నేను వాడ్ని love చేస్తున్నాను. నువ్వు చెప్పమన్నావ్ చెప్పాను. ఇద్దరి గురించి నీకు ఇంకా ఏమైనా doubs ఉంటే వచ్చిన తర్వాత చెప్తాను సరే  నా"? అని speed గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. 

చందు ఏం మాట్లాడకుండా silent గా చూస్తూ ఉన్నాడు.

గీత  ఓరగా చందు వైపు చూస్తూ నవ్వుతూఉంది.

గీత నవ్వుకోవడం చూసిన చందు, తేజస్వి కి తినిపిస్తూ, కొద్ది సేపటి తర్వాత తను కూడా నవ్వుతూ మౌనిక వెళ్లిన వైపు చూస్తూ ఉన్నాడు..



నాని ఫ్లాట్:
మౌనిక scooter మీద నాని ఉంటున్న అపార్ట్మెంట్ apartment బయట ఆగి, డిక్కీ Open చేసి box తీసుకుని లోనికి వెళ్తూ ఉంది.

అదే time లో ఒక పోలీస్ వెహికల్ ఒకటి వచ్చి మౌనిక దగ్గర ఆగింది. దాంట్లోంచి si ప్రమోద్ కిందకి దిగాడు.

మౌనిక doubt గా SI వైపు చూస్తూ apartment లోనికి వెళ్తూ ఉంది.

"ప్రమోద్ excuse me అని పిలిచే సరికి మోనిక ఆగి అతని వైపు చూస్తూ ఉంది.

ప్రమోద్, మోనిక దగ్గరకి వచ్చి తన pocket లో నుంచి ఒక paper తీసి మోనిక కి చూపిస్తూ "కొంచెం ఈ address ఎక్కడో చెప్తారా"? అని అడిగాడు.

మౌనిక పేపర్ చూసి "ఆ right side లో ఉన్న second flat" అని చెప్పి ఓరగా si వైపు doubt గా చూస్తూ లోనికి వెళ్ళింది.

ప్రమోద్ car ఎక్కి ముందుకు వెళ్ళాడు.

మోనిక lift ఎక్కి పైకి వెళ్లి, నాని flat calling bell కొట్టింది.

సుదీర్ వాళ్ళతో కూర్చుని cards ఆడుతున్న నాని, సుదీర్ తో "ఎవరో వెళ్ళి చూడరా" అన్నాడు.

సుధీర్ లేచి వెళ్ళి door open చేసి, మోనిక వైపు షాక్ గా చూస్తూ నువ్వేంటి sudden గా ఈ టైమ్ లో అన్నాడు.

మౌనిక లోనికి వస్తూ "నాని ఏడి"? అంది.

"ఆ room లో cards ఆడుతున్నాం" అన్నాడు.

మౌనిక speed గా ఆ room లోకి వెళ్ళి నాని పక్కన కూర్చుని నాని చేతిని గట్టిగా పట్టుకొని సంతోషంగా "నీకు ఒక విషయం చెప్పాలి" అంది.

శ్రీను వెటకారం గా ఓర చూపులు చూస్తూ "ఏంటది? ఇకమీద వాడ్ని tourcher చేయకూడదు అని deside అయ్యవా ఏంటి కొంపతీసి" అన్నాడు.

అందరూ నవ్వుతారు. మౌనిక నాని వైపు కోపంగా చూస్తూ "నువ్వెందుకు నవ్వుతున్నావ్"! అంది.

"వాళ్ళు కూడా నవ్వుతున్నారు కదా"? అన్నాడు నాని.

మోనిక కోపంగా చూస్తూ "నువ్వు నవ్వకూడదు అంతే" అంది.

మోనిక ఇచ్చిన box లోంచి ఒక చికెన్ ముక్క తీసుకుని తింటున్న sudeer "అవును రా ప్రేమలో ఉన్నవాళ్ళు, బానిసలుగా ఉన్నవాళ్ళు permission లేకుండా నవ్వుకూడదు" అని అందరు silent అవడం గమనించి మోనిక వైపు చూసాడు.

మోనిక కోపంగా సుదీర్ దగ్గరకి వచ్చి చెంపమీద కొట్టి కోపంగా వెళ్తూ ఉంది.

శ్రీను, నాని వైపు చూసి ఇప్పుడు దీన్ని బ్రతిమాలి వెనక్కి తీసుకు రాకపోతే వీడు బాధ తట్టుకోలేం అని మనసులో అనుకుని విసుక్నుకుంటూ పైకి  లేచి వెళ్ళి మోనిక చేయి పట్టుకుని ఏదో సరదాగా అన్నాం, ఇప్పుడు నువ్వు కోపంతో వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిన తర్వాత ఆ నాని గాడు మమ్మల్ని చావగొడతాడు అని ఎంత బ్రతిమాలినా వినకుండా కోపంగా వెళ్ళిపోతుంది మానిక.

నాని వచ్చి మోనిక చేయి పట్టుకుని సోఫాలో బలవంతంగా కూర్చోబెట్టి, వాళ్లు అంటే నా మీద కోపం చూపిస్తున్నవేంటి నువ్వు? అని 2 క్షణాలు silent గా మోనిక ని చూస్తూ సరే సారీ అన్నాడు.

మౌనిక కొంచెం cool అవడం గమనించిన నాని, సరే  ఏంటో చెప్పాలి అన్నావ్ ఇప్పుడు చెప్పు ఏంటది అని అడిగాడు.

ఇప్పుడు కాదులే తర్వాత చెప్తా, వదిన వాళ్ళు wait చేస్తూ ఉంటారు, late అవుతుంది అని లేచి వెళ్ళింది. 


2nd murder:

మొహానికి mask పెట్టుకున్న వ్యక్తి ఒక apartment goda దూకి లోనికి వెళ్లి, వాటర్ pipe పట్టుకుని ఒక ఇంటి బాల్కనీ లోకి వెళ్ళాడు.  నడుచుకుంటూ వెళ్ళి ఒక room door open చేసి లోనికి వెళ్ళాడు.

అక్కడ 50 సంవత్సరాలు వయసు గల సత్యవతి గతంలో మీరా hostel warden పడుకుని ఉంది.

mask వేసుకున్న వ్యక్తి వెనుక నుంచి కత్తి తీసి ఆవిడ పీక మీద పెట్టి లేపుతాడు.

నిద్ర మత్తుతో లేచిన ఆవిడ మెల్లగా కళ్ళు తెరిచి mask వేసుకున్న వ్యక్తిని చూసి గట్టిగా అరుస్తుంది.

mask వేసుకున్న వ్యక్తి ఆవిడ నోరు మూసే లోపే ఆ అరుపు పక్క రూం లో పడుకున్న సత్యవతి కూతురు పావని కి వినిపించింది.

సత్యవతి కూతురు ఏమైంది అని భయంగా పైకి లేచి సత్యవతి room వైపు వస్తూ ఉంది.

mask వేసుకున్న వ్యక్తి సత్యవతి ని పొడవబోతు ఆవిడ ఏదో మాట్లాడడానికి ప్రయత్నించడం చూసి చిరాకు పడుతూనే నోటి మీద చేయి తీస్తాడు.

సత్యవతి చావు భయంతో వణికిపోతూ ఎవరు నువ్వు, ఏం కావాలి? అంది.

"ఇప్పుడు నేను ఎవరు, నా పేరు ఏంటి, నిన్ను ఎందుకు చంపుతున్నాను తెలుసుకుని ఏం చేస్తావ్ పైకి వెళ్ళి ఎవరికైనా చెప్పాలా"? అని ఆవిడ నోరు మూసి కత్తితో పీక కోసాడు.

సత్యవతి నొప్పితో గిల, గిల కొట్టుకుంటూ ఉన్న time లో hall లో light వెళగడం గమనించిన మాస్క్ వేసుకున్న వ్యక్తి కంగారుగా అటు వైపు చూసాడు.

అమ్మా నువ్వు అరిచవా అంటూ పావని voice విన్న mask వేసుకున్న వ్యక్తి  బాల్కనీ లోకి పరిగెడుతూ వెళ్ళాడు.

పావని వచ్చి light on చేసి తన తల్లి మెడ మీద రక్తం కారుతూ ఉండడం చూసి ఏం చేయాలో తెలియక పిచ్చిదానిలా తన అమ్మ దగ్గర కూర్చుని ఏడుస్తూ, accidental గా బాల్కనీ door  వైపు చూసింది. అక్కడ mask వేసుకున్న అతను కిందకి వెళ్ళడం గమనించి అతని వైపు చూస్తూ ఉండగా, పక్క ప్లాట్ లో ఉండే కానిస్టేబుల్ door కొడుతూ అమ్మ పావని ఏమైంది అని పిలవడం విని కంగారు గా వెళ్ళి door open చేసింది.

బయం గా అంకుల్ అమ్మని ఎవరో పీక మీద కోసి, బాల్కనీ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాడు అంది,

కానిస్టేబుల్ కంగారుగా నువ్వు అంబులెన్స్ కి call చేయ్ అమ్మ అని కిందకి పరిగెడుతూ వెళ్ళి watchman ని పిలిచి ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగాడు.

watchman లేదు sir అని చెప్పాడు. కానిస్టేబుల్ సత్యం పరిగెడుతూ బయటకు వెళ్లి road కి రెండు వైపులా చూసి కొంచెం దూరం లో ఒక వ్యక్తి పరిగెడుతూ వెళ్ళడం గమనించి రేయ్ ఎవడ్ర నువ్వు అంటూ అటువైపు పరిగెడుతూ వెళ్తుండగా , తను park చేసిన bike ఎక్కి ఎంత start చేసిన start కాక పోవడంతో కంగారుగా bike వదిలేసి పరిగెడుతూ వెళ్తున్నాడు.


To be continued....