💔 ప్రవీణ్ – ఒక మిత్రుని జ్ఞాపకం
అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు — వినోద్ మరియు ప్రవీణ్. చిన్నతనం నుంచే వారుకలిసే చదువుకున్నారు, కలిసే తిరిగారు, ఒకరి కోసం మరొకరు ప్రాణం పెట్టేంతగా, వారి స్నేహం ఒక ఉదాహరణగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది — అది ఒక నిశ్శబ్దమైన అర్థం, ఒక హృదయపు బంధం.
వినోద్‌కి ప్రవీణ్ అంటే ప్రత్యేకమైన అనుబంధం. స్కూల్ మానేసి బయట తిరిగినరోజులు, సైకిల్ పై కలిసి తిరిగిన సాయంత్రాలు, ఇవన్నీ వారి జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రవీణ్‌కి వన్యప్రాంతాలంటే ఇష్టం. అతని తల్లి, తండ్రి అప్పుడప్పుడూ అడవికి వెళ్లేవారు. ఆ విషయాన్ని ప్రవీణ్ సరదాగా వినోద్‌కి చెప్పేవాడు.
“అక్కడ పాములు ఉంటాయట్రా!” అని వినోద్ నవ్వుతూ జోకులు వేసేవాడు. వారి మధ్య ఉన్న హాస్యం, సరదా, మరియు నమ్మకం — ఇవన్నీ ఒక బలమైన బంధాన్ని నిర్మించాయి.
ఇంటర్ పూర్తయ్యాక, SET పరీక్షలు రాశారు. వినోద్‌కి సీటు వచ్చింది, ప్రవీణ్‌కి రాలేదు. “ఏం కాదులే, మళ్లీ ప్రయత్నించు. లేకపోతే నా కాలేజీలో Recommend చేస్తా,” అన్నాడు వినోద్. ప్రవీణ్ చిరునవ్వుతో “సరే” అన్నాడు. అది ఒక చిన్న మాటే అయినా, అందులో ఉన్న నమ్మకం, స్నేహం, ఆశ — ఇవన్నీ వినోద్‌కి ఎంతో విలువైనవి.కొన్ని రోజులు గడిచాయి.
ఒక రోజు ప్రవీణ్ తన తల్లిదండ్రులతో అడవికి వెళ్ళాడు. అది చాలా దూరంగా, చుట్టూ అడవి మాత్రమే ఉన్న ప్రాంతం. వెతుకుతూ అడవిలో నడుస్తుండగా, ఓ కొమ్మపై విషపూరిత పాము కనిపించకుండా ఉండిపోయింది. అది వారు దానిని గమనించలేదు పాము ప్రవీణ్‌ను మెడా పై కాటు వేసింది.
అతను కింద పడిపోయి, నోట్లో నుంచి నురుగు రావడం మొదలైంది. తండ్రి భుజంపై ఎత్తుకుని ఊరి దారి పట్టారు. కానీ... మార్గం మధ్యలోనే ప్రవీణ్ ప్రాణం విడిచాడు.ఆ వార్త ఊరంతా కుదిపేసింది. తల్లి, తండ్రి కన్నీటి మడుగులో మునిగిపోయారు. ప్రవీణ్ శవాన్ని మట్టిలో పూడ్చిన రోజు, వినోద్‌కి జీవితం శూన్యంగా అనిపించింది.
“నా ప్రాణ స్నేహితుడు ఇక లేడా?” అనే ఆలోచన అతని మనసును ముక్కలు చేసింది. అతని లోపల ఏదో విరిగిపోయింది — అది మాటల్లో చెప్పలేనిది, కానీ ప్రతి చూపులో కనిపించేది.
ఒక సంవత్సరం పాటు వినోద్ కాలేజీకి వెళ్లలేదు. ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రవీణ్ జ్ఞాపకాలతో గడిపాడు. అతని నవ్వు, మాటలు, జోకులు — ఇవన్నీ వినోద్ మనసులో మార్మోగుతూనే ఉన్నాయి. అతను రాయడం ప్రారంభించాడు — కాగితంపై ప్రవీణ్‌కి అంకితమైన భావాలు, జ్ఞాపకాలు, బాధలు. ప్రతి పదం, ప్రతి వాక్యం — ఒక మిత్రుని కోసం, ఒక కోల్పోయిన అనుబంధం కోసం.ఇప్పటికీ... ప్రవీణ్‌ను మర్చిపోలేదు వినోద్.
అతని కోసం రాయబడిన ప్రతి పదం, ప్రతి భావం — ఒక మిత్రుని ప్రేమకు, కోల్పోయిన అనుబంధానికి, జీవితం లోని అసలు విలువలకు ప్రతిబింబం. ప్రవీణ్‌కి అంకితమైన ఆ కథలు, ఆ భావాలు — వినోద్‌కి ఓ మార్గం అయ్యాయి. బాధను అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకాలను నిలుపుకోవడానికి, జీవితం కొనసాగించడానికి.
🌌 జీవితం ముందుకు సాగుతోంది... కానీ జ్ఞాపకాలు వెనకే నడుస్తున్నాయి
వినోద్‌కి ఇప్పుడు కొత్త బాధ్యతలు వచ్చాయి. కాలేజీ, కుటుంబం, భవిష్యత్తు — ఇవన్నీ అతని దృష్టిలోకి వచ్చాయి. కానీ... ప్రతి ఉదయం అతను నిద్రలేచినప్పుడు, ప్రవీణ్‌కి చెప్పిన చివరి మాట గుర్తొస్తుంది. ప్రతి సాయంత్రం, సైకిల్‌కి చేతి పట్టినప్పుడు, ఇద్దరూ కలిసి తిరిగిన రోజులు గుర్తొస్తాయి.
ప్రవీణ్ లేకపోయినా, అతని జ్ఞాపకాలు వినోద్‌కి బలంగా మారాయి. అతను నవ్వినప్పుడు — ప్రవీణ్ నవ్వు గుర్తొస్తుంది. అతను మౌనంగా ఉన్నప్పుడు — ప్రవీణ్‌కి చెప్పలేకపోయిన మాటలు వినిపిస్తాయి. అతను ముందుకు నడిచినప్పుడు — ప్రవీణ్‌కి చూపించాల్సిన మార్గం గుర్తొస్తుంది.
ఇలా... జీవితం సాగుతోంది. కానీ ప్రవీణ్ జీవితం లోంచి వెళ్లిపోలేదు — అతను జ్ఞాపకాల రూపంలో వినోద్‌కి తోడుగా ఉన్నాడు.
🌱 అధ్యాయం: మార్గం మారిన రోజు.
ఒక ఉదయం, వినోద్ తన డైరీని తెరిచి, ప్రవీణ్‌కి రాసిన పాత పంక్తులు చదివాడు:
“నువ్వు ముందుకు సాగాలి. నా జ్ఞాపకాలతో కాదు... నా ఆశయాలతో.”
ఆ మాటలు అతని హృదయాన్ని కదిలించాయి. ఇప్పటివరకు వినోద్ బాధను మోయడం నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు... బాధను బలంగా మార్చే దిశలో అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు.
అతను తన గ్రామంలో ఉన్న పిల్లలకు నైతిక విలువలు, స్నేహం, జీవిత పాఠాలు నేర్పేలా ఒక చిన్న వర్క్‌షాప్ ప్రారంభించాడు. “ప్రవీణ్‌కి అంకితంగా” అనే పేరుతో, ప్రతి శనివారం పిల్లలతో కథలు చెప్పడం, భావాలు పంచుకోవడం మొదలుపెట్టాడు.
ఆ పిల్లల్లో ఒకరు అడిగాడు: “అన్నా... ప్రవీణ్ ఎవరు?” వినోద్ నవ్వుతూ, కన్నీటి తడితో చెప్పాడు: “అతను నా స్నేహితుడు కాదు... నా జీవితం.”
“మిత్రులారా... జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులను మర్చిపోవద్దు. కలిసే మెలిసే ఉండండి. ఎందుకంటే... స్నేహం అంటే కాలం కాదు, మనసు.”
నీవు నమ్మిన దానికోసం నిలబడితేనే విజయం వస్తుంది.
మీ ఆశీస్సులతో
నేను... ✍️ Naik 💞