Adhuri's story - 6 in Telugu Love Stories by surya Bandaru books and stories PDF | అధూరి కథ - 6

Featured Books
  • Shadows Of Love - 18

    टूटते मंदिर के धुएँ और राख से घिरी घाटी में जब करन और अनाया...

  • तेरे मेरे दरमियान - 42

    दुसरा बदमास कहता है --->" अरे मेरी जान , इतनी खुबसूरती का क्...

  • और एक बार की सनक

       अपनी असफलता के लिए सिर्फ भाग्य को कोसते-कोसते, वह अपने आप...

  • BTS Femily Forever - 11

    Next Ep,,,  Jimin घबरा कर हड़बड़ाते हुए "ह,न,,नहीं नहीं मै त...

  • सुख की कामना

    सुख की कामना लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्दों की कहानी)...

Categories
Share

అధూరి కథ - 6

రాధిక తో పాటు Luggage తీసుకుని బయటకు వెళ్తున్న సమయంలో tv లో కార్పొరేటర్ కొడుకు వాడి friends ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న news వస్తుంది. మీడియా వాళ్ళ తో collage లో ఈ నలుగురు drugs అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక team ని form చేసి read handed పట్టుకున్నాము. ఇప్పుడు వీళ్ళని నార్కోటిక్స్ వాళ్ళకి అప్పగిస్తున్నాం, case వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు, Thank you అని మీడియా వాళ్ళు అందరూ ఒకేసారి ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థం అవకుండా questions అడుగుతున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు acp, , జ్యోతి కోపంగా tv చూస్తుంది. ఇంతలో ప్రియ వచ్చి జ్యోతి భుజం మీద చేయి వేసి తలతో సైగ చేస్తూ "పద" అంది. లగేజ్ తీసుకుని బయటకు వెళ్ళారు. అర్జున్, అశోక్ కూడా వాళ్ళ వెనుక వెళ్లారు. లగేజ్ అంతా car డిక్కీ లో పెట్టి car లో కూర్చున్నారు. అశోక్ driver seat లో కూర్చోబోతుంటే నేను drive చేస్తలేరా అన్నాడు అర్జున్. అర్జున్ కి car keys ఇచ్చి వెళ్ళి అర్జున్ పక్క seat లో కూర్చున్నాడు అశోక్. జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళగానే call చేయ్ ప్రియ అంది కౌసల్య. ప్రియ తల ఊపుతూ సరే అత్తయ్య అంది. Car start అయ్యి వెళ్తూ ఉంది. కౌసల్య బాడుతోనే నవ్వుతూ bye చెప్తూ చేయి ఊపుతుంది..

కాకినాడ పవన్ house:

గేట్ బయట car horn వినిపించడంతో చొక్కా, నిక్కరు వేసుకొని నోట్లో చుట్ట పెట్టుకుని కలుస్తూ ఉన్న, పని మనిషి గంగ భర్త బొంగరం చుట్ట పక్కన పడేసి కంగారుగా పరిగెడుతూ వెళ్ళి గేట్ Open చేశాడు. Car లోనికి వచ్చి ఆగింది. ప్రియ వాళ్ళతో మీరు లోపలికి వెళ్ళండి లగేజ్ మేము తీసుకొస్తాం లే అన్నాడు అశోక్. ప్రియ వాళ్ళు లోనికి వెళ్తున్నారు. అశోక్ car డిక్కీ Open చేశాడు.  అర్జున్ లగేజ్ బయటికి తీయబోతుంటే బొంగరం వచ్చి అర్జున్ చేతిలో బ్యాగ్ తీసుకుని నేను తీసుకొస్తాను మీరు లోనికి వెళ్ళండి సారు అన్నాడు వినయంగా నవ్వుతూ, ఇంతలో అశోక్ వచ్చి ఇవన్నీ ఒక్కడివే ఎలా తెస్తావ్ మేము help చేస్తాం లే అని సూట్కేస్ తీస్తుంటే, సూట్కేస్ తీసుకుని నేను తెస్తాను సారు పర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు వినయంగా నవ్వుతూ, బొంగరం నవ్వులో ఏదో భయం గమనించిన అశోక్ పర్లేదు లేరా నేను help చేస్తా అని సూట్కేస్ తీసుకొబోతుంటే బొంగరం మోహం ఒక్కసారిగా కోపం గా మారి, సూట్కేస్ పక్కన పెట్టి మీరే తెచ్చుకోండి సారు అని వెళ్తున్నాడు. అశోక్ షాక్ గా ఏమైంది రా అన్నాడు. బొంగరం కోపంగా మా పని కూడా మీరే చేసేస్తే మేమెందుకు సారు ఇక్కడ, మా సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతాం అన్నాడు. అశోక్ అయోమయంగా చూస్తూ ఇప్పుడు నేను ఏమన్నాను రా సామాన్లు ఎక్కువగా ఉన్నాయి అని నేను కూడా సహాయం చేస్తాను అన్నాను అంతే కదా, దానికి ఏంట్రా పిచ్చి, పిచ్చి గా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్ అన్నాడు. బొంగరం కోపంగా చూస్తూ నేను అడిగిన్నా మిమ్మల్ని నాకు సాయం సేయమని, ఈ పనులు సేయడానికే కదా సారు మమ్మల్ని పెట్టుకున్నారు అన్నాడు అశోక్ కోపంగా చూస్తూ ఏదో అనబోతున్న time లో గంగ పరిగెత్తుకుని వచ్చి , సెమంచండి సారు సిన్నప్పుడు ఈడి తలకి దెబ్బ తగిలింది. అప్పట్నుంచి కొంచెం తింగరి పనులు అన్నీ సేత్త ఉంటాడు. మీరు రాగానే నాకు సెప్పమని సెప్పను, సచ్చినోడు సేప్పనేదు అంది బొంగరం తల మీద కొడుతూ, ఆడి పనులు ఆడే సేయాలి అంటాడు సారు, వేరే వాళ్ళు సేతే అస్సలు ఒప్పుకోడు అంది గంగ. అశోక్ ఆశ్చర్యం గా చూస్తూ ఇలాంటి డిసీజ్ కూడా ఉంటుందా అని బొంగరం వైపు చూస్తూ నువ్వే తెచ్చుకోర ఆ లగేజ్ అని ఇదేం రోగం రా బాబు అని మనసులో అనుకుంటూ అర్జున్ తో కలిసి లోనికి వెళ్ళాడు, వాళ్ళ వెనకే బొంగరం, మంగ లగేజ్ తీసుకుని లోనికి వెళ్ళారు. 

అర్జున్ dinner చేసి తన రూం లోకి వెళ్ళి bed మీద పడుకుని book చదువుకుంటున్నాడు. Night dress తో ఉన్న ప్రియ room లోకి వచ్చి, briefcase లో ఉన్న తన dresses ఒక్కొక్కటిగా బయటకు తీసి cupboard లో సర్దుతూ ఉంది. అదంతా ఓరకంటి తో గమనిస్తున్న అర్జున్ ఏం పట్టించుకోనట్లు act చేస్తూ book చదువుతున్నట్లు act చేస్తున్నాడు. బట్టలు అన్ని సర్ది వచ్చి bed మీద కూర్చుని నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటున్న, నువ్వు పడుకునేప్పుడు light off చేసి పడుకో అని, అర్జున్ కి opposite side కి తిరిగి పడుకుంది. అర్జున్ tension గా ప్రియ వైపు చూస్తూ, భయపడుతూ ఇబ్బందిగా priya అని పిలిచి మాట్లాడడం ఆపే సరికి ప్రియ ఏమైంది వీడికి మాట్లాడడం ఆపేశాడు అనుకుని, తన వైపు తిరిగి అర్జున్ ఇబ్బంది పడడం కొన్ని క్షణాల పాటు గమనించి ఏంటి అని అడిగింది. అర్జున్ భయపడుతూనే మెల్లగా నేను పక్క room లో పడుకోనా మనిద్దరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నాడు.. ప్రియ కొంచెం సేపు serious గా అర్జున్ వైపు చూస్తూ ఉంది. అసలే బయం గా అడిగిన అర్జున్ కి ప్రియ serious face చూసి ఇంకా భయం పెరిగిపోయి tension గా చూస్తూ ఉన్నాడు. కొంచెం సేపు తన వైపు కోపంగా చూసిన ప్రియ sudden గా పైకి లేచి, car keys ఇవ్వు అని అడిగింది. అసలే tension గా ఉన్న అర్జున్ భయపడుతూ car keys దేనికి అన్నాడు. ఇది నీ ఇల్లు నా కోసం నువ్వు వేరే room లో పడుకోవడం దేనికి, మా ఇల్లు పక్కనే కదా నేనే రోజు night మా ఇంటికి వెళ్లి morning వస్తాను అంది. అర్జున్ భయంగా పైకి లేచి ప్రియ కి దగ్గర గా వచ్చి తడబడుతూ మీ.. మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? అని భయంగా ప్రియ వైపు చూస్తూ ఉన్నాడు....

కొత్త ఇంట్లో కథ ఏలాంటి మలుపులు తీసుకోబోతుంది అనేది రానున్న కథ లో తెలుసుకుందాం...