My soul story in Telugu Horror Stories by Sivaji books and stories PDF | నా ఆత్మ కథ

The Author
Featured Books
Categories
Share

నా ఆత్మ కథ

ఆత్మలు ఉన్నాయో లేవో తెలియాలి అంటే నేను ఆత్మగా మారితే కానీ తెలియదు ఏమో కాబట్టి ఒకవేళ ఆత్మలు ఉండి అవి మన చుట్టూనే తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఒక కథ చెబుతాను.

కథ పేరు "నా ఆత్మ కథ" మొదటి భాగం


క్లూ నెంబర్ 1: ఫ్లాట్ డోర్ లాక్ చేసాను.లిఫ్ట్ బటన్ నొక్కాను.లిఫ్ట్ పని చేయలేదు.

ఈ రోజు నేను శృతిని కలవడానికి వెళ్తున్నాను.ఇది నాకు లైఫ్ లో చాలా ముఖ్యమయిన రోజు.శృతి అనే పేరు తలుచుకుంటేనే నా పెదవులు విచ్చుకుంటాయి.నా మనసులో జిల్ అన్నట్లు ఉంటుంది.
అలా శృతి గురించి ఆలోచిస్తూ మెట్లు దిగి కిందకి వచ్చాను.బైక్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కాను.

క్లూ నెంబర్ 2: బైక్ స్టార్ట్ అవ్వలేదు.

చాలా సేపు కిక్ కొట్టి ప్రయత్నించాక విసిగి వేసారి అటూ ఇటూ చూశాను.మా గేట్ బయట ఒక ఆటో ఆగి ఉంది.

ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. ఇంకా స్టార్ట్ అవలేదా? అని అటు వైపు ఫోన్లో శృతి. బైక్ స్టార్ట్ అవ్వలేదు వచ్చేస్తున్నా! పది నిమిషాలు శృతి.సరే త్వరగా రా బాబు నేను వచ్చి 15 మినిట్స్ అయింది. నాకు చాలా బోర్ గా ఉంది అని శృతి ఫోన్ కట్ చేసాక..
నా ఎదురుగా నాకు కేవలం నాలుగు ఇంచుల దూరంలో గళ్ళ లుంగీలో ఒకతను ఉన్నాడు.నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కళ్ళలో కళ్ళు పెట్టి.అతని కళ్ళు వార్మ్ వైట్ బల్బుల్లాగా వెలిగిపోతున్నాయి పట్ట పగలు కూడా.
ఎవరు మీరు? మీరెవరో నాకు తెలియదే అన్నాను కొంచెం వెనక్కి జరిగి.
నేను నీ ఆత్మని అన్నాడు అతను.ఒళ్ళు మండింది నాకు.
రేయ్ పిచ్చా నీకు?? పక్కకి జరుగు నేను వెళ్ళాలి అని బైక్ కిక్ రాడ్ ని కసిగా కొట్టాను వెళ్ళాలి అన్న తొందరలో.
నిజంగా నేను నీ ఆత్మనే. కావాలంటే నీ గురించి ఏదయినా అడుగు నేను చెబుతాను అని అన్నాడు అతను.
అప్పటికే కిక్ కొట్టి కొట్టి విసిగిపోయిన నేను వీడిని ఎలా అయినా వదిలించుకోవాలని సరే రా! నేను ఎప్పుడు పుట్టాను అని అడుగాను.
ఫిబ్రవరి 7న 1983 అర్ధరాత్రి.ఆ రోజే మనిద్దరం పుట్టాం అన్నాడు అతను. నేను కొంచెం ఆలోచనలో పడ్డాను.
సరే ఇంకో ప్రశ్న. నా మనసులో శృతి మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది? ఇది చెప్పు నమ్ముతాను.లాస్ట్ ఇయర్ కరెక్టు గా ఇదే రోజు. శృతిని మన ఫ్రెండ్ అంజాద్ పెళ్లిలో చూశావ్. అప్పటి నుంచి తన చుట్టూ తిరిగితే ఇవాళ నీకు ఓకే చెప్పడానికి నిన్ను స్మశానం పక్కన ఉన్న కాఫీ షాప్ కి రమ్మంది.అంతేనా?

మన లవర్ స్మశానం పక్కన ఉన్న ఆ కాఫీ షాప్ కే ఎందుకు రమ్మన్నది సిటీ లో ఇన్ని కాఫీ షాప్ లు ఉంటే.ఆలోచించు!నేను షాక్.

అయినా నా ఆత్మకి నా పోలికలే కదా ఉండాలి.నా ఆత్మ ఏంటి ఇలా ఉన్నాడు ఎర్ర గళ్ళ లుంగీలో పుచ్చకాయలు అమ్ముకునే వాడి లాగా? అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి నీలాగా లేను పుచ్చ కాయలు అమ్ముకునే వాడిలాగా ఉన్నా అని ఆలోచిస్తున్నావా? అని అడిగాడు నా ఆత్మ అని చెప్పుకుంటున్న అతను.
అవును అన్నట్లు తల ఊపాను నేను సంకోచంగా.
అదంతా సినిమాల్లోనే. నిజంగా చెప్పాలంటే ఆత్మ కి రూపం లేదు.నీ ఆత్మ నీ రూపంలొనే ఉండాలని లేదు.తనకి నచ్చిన రూపంలో కనిపించగలదు.సమయానికి అందుబాటులో ఉన్న మనిషి రూపంలో కనిపించగలదు.

ఆ మాట కి వస్తే రోజూ మనుషుల చుట్టూ ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. మనుషులకి అవి అసలు ఆత్మలు అని కూడా తెలియదు. బస్ స్టాప్ లో కాకుండా మధ్యలో చేయి ఎత్తి బస్ ఆపేసి ఎక్కుతారే వాళ్లందరూ ఆత్మలే. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుంటారే వాళ్లందరూ కూడా ఆత్మలే.బ్యాంకుల్లో క్యూల్లో నిలబడని వాళ్లందరూ కూడా ఆత్మలే.అలాగే ఇక్కడే పక్కనే కదా అని రాంగ్ రూట్లో వన్ వే ల్లో బండ్లు నడిపే వాళ్లు కూడా ఆత్మలే.కానీ బైక్ లకి కార్లకి సైలెన్సర్స్ మార్చి ఘోరమయినా శబ్దాలు చేస్తూ రోడ్లలో బండ్లు నడిపే వాళ్లు మాత్రం ప్రేతత్మలు.

ఆత్మలు ప్రేతత్మలు ఇలా వాటికి నచ్చిన రకరకాల మనుషులలోకి దూరి వాటి ఇష్టం వచ్చినట్లు చేయిస్తుంటాయి ఆ మనుషులతో.
ఇది ఒక గుడ్డి గుర్తు ఆత్మలని గుర్తుపట్టడానికి.

అయితే రోజూ ఎన్నో ఆత్మలు నా చుట్టూ తిరుగుతున్నాయి అని ఆలోచిస్తూ అతని మాటలతో నేను అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయాను.అతన్ని చూస్తుంటే భయంగా అనిపించింది కొంచెం.కాలేజీ లో ఉన్నపుడు నేను కూడా నా బైక్ సైలెన్సర్ మార్చాను శబ్దం చేయడం కోసం.

ఇప్పుడు నువ్వు చూస్తున్న రూపం అదిగో ఆ ఆటోలో నిద్రపోతూ ఉన్న డ్రైవర్ ది అని గేట్ బయట ఊడల మర్రి చెట్టు నీడలో ఆగి ఉన్న ఆటో ని చూపించాడు నా ఆత్మ అనే అతను.
నేను ఆటో దగ్గరికి వెళ్ళి చూడగా సరిగ్గా నా ఎదురుగా ఉన్న రూపంలో ఉన్న అతనే ఆటోలో నిద్ర పోతూ ఉన్నాడు.మళ్ళీ నా బైక్ దగ్గరికి వచ్చాను.అతను నిద్ర లేచే వరకు నీ ఆత్మని అయిన నేను అతని రూపాన్ని వాడుకుంటున్నాను అంతే.టైం చాలా తక్కువ ఉంది.అతను నిద్ర లేచే లోపు నీకు ఒక ముఖ్యమయిన విషయం చెప్పాలి.

నాలో అప్పటి వరకు ఉన్న సందేహాలని తొలగిపోయాయి ఆటోలో నిద్రపోతున్న అతను నా ఎదురుగా ఉన్న అతను ఒకేలా ఉండడంతో.సరే !! కాసేపు నువ్వు నా ఆత్మనే అని అనుకుంటాను.నాతో ఏమి చెప్పాలనుకుంటున్నావు? త్వరగా చెప్పు అవతల నాకోసం అక్కడ శృతి ఎదురు చూస్తుంది అన్నాను.

సరే నేరుగా పాయింట్ కి వచ్చేస్తాను.నువ్వు ఇపుడు శృతిని కలవడానికి నేను ఒప్పుకోను అన్నాడు నా ఆత్మ.ఏంటి పిచ్చా నీకు??? వన్ ఇయర్ వెయిట్ చేసాను ఈ రోజు కోసం.తనే నా నెంబర్ పట్టుకుని నాకు ఫోను చేసి కలవాలి అని పిలిస్తే కలవ వద్దు అంటావేంటి?నేను వెళ్తున్నాను.వచ్చాక ఫ్లాట్ కి రా తీరికగా మాట్లాడుదాం.ఉంటా! అని బైక్ స్టార్ట్ చేసాను.ఈ సారి బైక్ స్టార్ట్ అయిపోయింది.నేను బైక్ మూవ్ చేసాను.

నా ఆత్మ అనే అతను గట్టిగా అరిచాడు.ఇప్పుడు నువ్వు వెళ్తే దారిలోనే నువ్వు చచ్చిపోతావ్!!! అని గట్టిగా చెప్పగానే నేను షాక్ తో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు.
చుట్టూ చూడగా ఆటోలో ఉన్న వ్యక్తి నిద్ర లేచి ఉన్నాడు.

ఆటోలో అతను నిద్ర లేవగానే మాయం అయిపోయడంటే ఇదంతా నిజంగా నిజమా?? నేను ఇప్పుడు వెళ్తే నిజంగానే చచ్చిపోతానా?అని అనుకుంటూ ఉండగా నా ఫోన్ రింగ్ అయింది.

ఫోన్ లో శృతి.ఎక్కడున్నావ్? స్టార్ట్ అయ్యవా అసలు?ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అన్నది.
వచ్చేస్తాను.అయిదు నిమిషాలు ఐదే అయిదు నిమిషాలు.సరే! లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉన్నాయి నీకు.కరెక్ట్ గా ఫైవ్ మినిట్స్ చూసి నేను వెళ్లిపోతాను.నేనే నీకు ఫోన్ చేసి పిలిచా అని పోజులు కొడుతున్నావ్ కదా?

క్లూ నెంబర్ 3: లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉన్నాయి నీకు.ఆ తరువాత మళ్ళీ నిన్ను ఎప్పటికీ మీట్ అవ్వను అని శృతి ఫోన్ కట్ చేసింది.

అంటే నాకు జీవితంలో మిగిలింది ఆఖరి ఐదు నిమిషాలేనా? శృతి అలా అనడంలో ఉద్దేశ్యం అదేనా ఏంటి కొంపతీసి!ఇక మళ్ళీ ఎప్పటికి శృతి ని చూడలేనా?అని నాలో ఎన్నో ఆలోచనలు భయాలు.

నేను బైక్ స్టాండ్ వేసి గేట్ బయట ఉన్న ఆటో దగ్గరికి నడిచాను అసలు ఇది అంతా ఎంటో తెలుసుకుందాం అని.
ఆటోలో ఉండే అతను ఆటోలో ఆత్మ బంధం సినిమా లోని "ఒట్టేసి చెప్పనా ఇంకొక్కసారి" అనే పాట పెట్టుకుని ఆటో అద్దం తుడుచుకుంటూ ఉన్నాడు నిద్ర లేచి.
నన్ను చూసి ఎక్కడికి పోవాలి సర్ అన్నాడు?
నీ పేరు ఏంటి అని నేను అతన్ని అడిగాను.లుంగీ కిందకి వదులుతూ.. నా పేరు చిన్న రాజా సర్ అని మళ్లీ ఎక్కడికి పోవాలి సర్? అని అడిగాడు. పంజాగుట్ట వరకు వెళ్లాలి తీసుకుపోతావా?
ఎందుకు తీసుకుపోను సర్! ఆటో నడిపేదే మీ లాంటి వాళ్ళని తీసుకుపోవడం కోసమే కదా!పంజా గుట్ట లో ఎక్కడ సార్? స్మశానం దగ్గరికి అన్నాను నేను.అరవై రూపాయలు అవుతుంది అని చెప్పాడు. నేను అలాగే చూస్తూ ఉండడంతో సరే సార్ యాభై చేస్కుకుని ఎక్కండి సర్! అని ఆటో అతను అన్నాడు. నేను ఆలోచించేది ఆ పది గురించి కాదు నా ప్రాణం గురించి అని అతనికి ఎలా చెప్పను??

ఒక్కోసారి పది రూపాయలు కూడా మన జీవితాల్ని తారు మారు చేసేస్తాయి.ఎక్కాలా వద్దా ? అని ఆలోచిస్తూ ఆటో ఎక్కాను.బైక్ లో వెళ్తే చచ్చిపోతాను అన్నాడు కానీ ఆటోలో కాదు కదా అనుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ మనసులో శృతిని తలుచుకున్నాను. మనసులో జిల్ అనిపించింది ఇంత టెన్షన్ లో కూడా.అంటే శృతిని నేను అంత ఘాటుగా ప్రేమిస్తున్నాను అన్నమాట.

క్లూ నెంబర్ 4: ఆటో అతను ఆటో స్టార్ట్ చేశాడు కానీ ఆటో కూడా స్టార్ట్ అవ్వలేదు.

అంటే ఎదో శక్తి నా చావును ఆపేందుకు ప్రయత్నిస్తోంది.లిఫ్ట్ పని చేయలేదు బైక్ స్టార్ట్ అవ్వలేదు ఇపుడు ఆటో స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇదంతా ఎలా నమ్మడం.ఆత్మలు ఉన్నాయా అసలు???

ఇంతలో నా ఫోన్ ఫోన్ రింగ్ అయింది.ఫోన్ లో శృతి
గొంతు.తను మాట్లాడక ముందే..శృతి! వచ్చేస్తున్నాను.దారిలో ఉన్నా! రెండే రెండు నిమిషాలు.

నేను శృతిని కాను శివాజీ! శృతి శరీరంలో ఉన్న నీ ఆత్మని. నీకోసం వెయిట్ చేస్తూ చేస్తూ తను కార్ లోనే నిద్ర పోయింది అని శృతి గొంతుతో నా ఆత్మ చాలా అందవికారంగా మాట్లాడాడు.అయినా కూడా నాకు చాలా రొమాంటిక్ గా అనిపించింది నా ఆత్మ శృతి శరీరంలోకి వెళ్ళడం అనే తలంపు రాగానే.మగ బుద్ది.
నేను చెప్పేది జాగ్రత్తగా విను.నువ్వు మాత్రం ఆ ఆటో ఎక్కకు.దిగేసి ఇంట్లోకి వెళ్లిపో అన్నాడు నా ఆత్మ ఈ సారి కొంచెం దబాయించి.

అంతే ఒక్కసారిగా నాకు పిచ్చి లేచింది.నేను ఫిక్స్ అయిపోయాను.
శృతి గొంతుతో మాట్లాడేది ఖచ్చితంగా శృతి కాదు నా ఆత్మనే అని.అసలు శృతికి నేను ఆటోలో వస్తున్నా అని తెలియదు కదా! నిజంగా నా ఆత్మ నాతో మాట్లాడుతుంది.

నాకు కోపం చిరాకు అన్నీ ఒక్కసారిగా వచ్చేశాయి.గట్టిగా ఎందుకు నేను ఈ ఆటో ఎక్కకూడదు? అని అరిచాను ఫోన్ లో.
బండి స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఆటోలోనే ఉన్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా నా అరుపుకి భయపడి చచ్చేంత దడుచుకున్నాడు.
ఎందుకంటే నువ్వు వచ్చే దారిలో ఘోరమయిన యాక్సిడెంట్ అయి నువ్వు చచ్చిపోతావ్.నువ్వు పోతే నీతో పాటు నేను కూడా అనంత వాయువుల్లోకి కలిసిపోతాను.యాక్సిడెంట్లో చనిపోయే ప్రతి ఒక్కరికి ఇలాగే వాళ్ళ ఆత్మలు ముందే హెచ్చరిస్తాయి.ఆత్మ మాట నిర్లక్ష్యం చేస్తే చావు తప్పదు.నా మాట నమ్మాలి నువ్వు ఎందుకంటే నేను అక్షరాలా నీ ఆత్మని.

ఇంతలో ఒక్కసారిగా ఆటో స్టార్ట్ అయింది. "ఒట్టు వేసి చెప్పనా" అని ఇంతకు ముందు ఆగిన దగ్గరి నుంచి పాట అందుకుంది పెద్ద శబ్దంతో.

ఆటో కదిలింది.యూ టర్న్ తీసుకున్నది.అంతే! ఒక్కసారిగా నేను ఆటోలో నుంచి బయటికి దూకాను.నాలో చిన్నగా భయం మొదలయింది.లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి లిఫ్ట్ ఎక్కాను.లిఫ్ట్ పైకి చేరుకుంది.

కాసేపటికి నాలో ఉన్న భయంతో పాటుగా లిఫ్ట్ కూడా కిందకి దిగింది.

లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి.నేను లిఫ్ట్ లో నుంచి హెల్మెట్ పట్టుకుని బయటికి వచ్చాను.
బైక్ ఎక్కి హెల్మెట్ పెట్టుకుని కిక్ కొట్టి స్టార్ట్ చేసి బైక్ మూవ్ చేసాను.

బైక్ రోడ్ లో దూసుకుపోతుంది పంజాగుట్ట స్మశానం వైపు.నా కోసం స్మశానంలో ఉన్న ప్రేతాత్మలు గుంపులు గుంపులుగా ఎదురు చూస్తున్నాయా?

నాకు నా ప్రాణం కావాలి శృతి కావాలి అని మనసులో గట్టిగా అనుకున్నాను.


పంజాగుట్టకు చేరుకున్నాను.శృతి కార్ కాఫీ షాప్ పార్కింగ్ లో ఉండడం చూసి కార్ దగ్గరికి వెళ్లి కార్ గ్లాస్ లో నుంచి లోపలికి చూసే సమయానికి నా ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసాను.ఫోన్ లో శృతి కాలింగ్ అని ఉంది. శృతి కార్ లోనే ఉంది కదా అని చూస్తే శృతి లేదు కార్ లో.ఫోన్ ఆన్సర్ చేసాను.

ఫోన్ లో మళ్ళీ నా ఆత్మ గొంతు.నిన్ను రావద్దు అని చెప్పాను కదా ఎందుకు వచ్చావు?శృతి ఎక్కడ అని గట్టిగా అరిచాను.నీకు శృతి కావాలి నాకు నువ్వు కావాలి.నేను చెప్పినట్లు చేస్తే నేను శృతి శరీరం నుంచి బయటకి వచ్చేస్తాను అన్నాడు నా ఆత్మ.అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ అంతు చూస్తాను అని నా ఆత్మ మీద పిచ్చి కోపంతో గట్టిగా అరిచాను.

బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో చూడు అని నా ఆత్మ చెప్పడంతో పైకి చూసాను.శృతి బిల్డింగ్ అంచులో నిల్చుని ఫోన్ పట్టుకుని ఉంది.నా గుండె ఆగినంత పని అయింది.నా మాట వినకపోతే శృతి నేను ఇద్దరం కిందకి దూకేస్తాం.అది 7 అంతస్తుల బిల్డింగ్.ఫోన్ లో గట్టిగా అరిచాను రేయ్ పిచ్చా నీకు?నా ఆత్మ నా మాట వినకపోవడం ఏంటి? నా ఆత్మతో నాకు శతృత్వం ఏంటి? ఆలోచించాను అనవసరంగా శృతి జీవితంని ప్రమాదంలో నెట్టకూడదు అనుకున్నాను.నేను ఇంటికి వెళ్ళిపోతాను దయచేసి శృతిని అక్కడి నుంచి కిందకు దించు అని బ్రతిమలాడాను.శృతి పారాపిట్ వాల్ నుంచి కిందకి దిగింది.

నేను బైక్ స్టార్ట్ చేసాను.కానీ నా ఆలోచనలతో పాటుగా నా బైక్ ముందుకు కదలలేదు.

అసలు నా ఆత్మ ఎందుకు నన్ను బయటికి రావద్దు అని ఇంతగా ఘోషిస్తుంది?నా ఆత్మ ఘోష ఏంటి?

బైక్ దిగి లిఫ్ట్ వైపు నడిచాను.టెర్రస్ మీదకి చేరుకున్నాను.చుట్టూ చూశాను.శృతి వాటర్ ట్యాంక్ క్రింద ఒక మూలాన మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుని ఉన్నది.మెల్లగా దగ్గరికి వెళ్లి శృతి అని పిలిచాను మోకాళ్ళ మీద కూర్చుని.ఉలుకు పలుకు లేదు శృతి నుంచి.మళ్ళీ మళ్ళీ పిలవడంతో శృతి తల పైకి లేపి నన్ను చూసి ఒక్కసారిగా గట్టిగా పట్టేసుకుంది.ఏడుస్తూ అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలియడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది.కార్ లోనే ఉన్నాను అంతే గుర్తు ఉంది అని శృతి ఏడుస్తుంటే ఇదంతా నా మూలంగానే అని నా మీద నా ఆత్మ మీద కోపం వచ్చింది.నా ఆత్మని అమాంతంగా చంపేయాలి అన్నంత కోపం.నేను ప్రాణంగా ప్రేమించే శృతిని ఏడిపించాడు నా ఆత్మ.ఇక వాడు బ్రతకడానికి లేదు.

అంతే ఒక్కసారిగా శృతి గొంతు మార్చి ముఖఖవళికలు మార్చి ఏంటి నీ ఆత్మని నువ్వు చంపుతావా?నీ ఆత్మని చంపి నువ్వు బ్రతికే ఉంటావా? అని శృతి కళ్ళు పెద్దవి చేసి మాట్లాడడంతో నా గుండె జల్లుమన్నది.నా మనసులో అనుకున్న ప్రతి మాట నా ఆత్మకి తెలిసిపోతుంది.

నిన్ను ఇంటికి వెళ్ళమన్నాను కదా మళ్ళీ పైకి ఎందుకు వచ్చావ్?అని గట్టిగా అరిచాడు నా ఆత్మ.

ఎందుకంటే నేను శృతిని ఈ పరిస్థితిలో వదిలి వెళ్లలేకపోయాను అని నేను అంతే గట్టిగా కేకలు వేశాను.

నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఇంకోసారి శృతి జోలికి వెళ్లినా ఒకవేళ శృతిని చంపే ప్రయత్నం చేసినా నేను ఆ మరుక్షణం ఆత్మ హత్య చేసుకుంటాను.అంటే నిన్ను హత్య చేస్తాను.ఆ తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా నాతో పాటు నువ్వు కూడా అనంత వాయువుల్లో కలిసిపోతావు అని నా ఆత్మని గట్టిగా బెదిరించాను.

ఆ మాటతో నా ఆత్మ ఒక క్షణం ఆలోచలనో పడ్డాడు.షాక్ కి గురి అయ్యాడు అని చెప్పాలి.

మళ్ళీ తేరుకొని సరే ఒక ఒప్పందం చేసుకుందాం.నేను శృతి జోలికి వెళ్ళను అయితే నువ్వు ఇవాళ రాత్రి 12 గంటలు వరకు నా మాట వింటావని నాకు మాట ఇస్తావా?

నేను ఆలోచించాను.సరే మాట ఇస్తున్నాను చెప్పు ఏం చేయాలో అని అడిగాను.కానీ దాని కంటే ముందు నువ్వు శృతి శరీరం నుంచి బయటికి రావాలి అన్నాను.వస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళాలి. మధ్యలో ఎక్కడా ఆగకూడదు.నువ్వు ఇంటికి వెళ్లి శృతికి ఫోన్ చేయి నేను ఈ లోపు శృతిని వాళ్ళ ఇంట్లో క్షేమంగా డ్రాప్ చేస్తాను.తర్వాత శృతి నీతో మాట్లాడుతుంది అన్నాడు నా ఆత్మ.సరే నేను వెళ్తాను అని పైకి లేచి రెండు అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి తిరిగి అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు?

ఇంటికి వెళ్ళే దారిలో నాకు ఆక్సిడెంట్ కాదు అన్న గ్యారెంటీ ఏంటి?ఒకవేళ ఇంట్లోనే కూర్చుని ఉన్నా కూడా నేను చావను అన్న గ్యారెంటీ ఏంటి?అని గట్టిగా నిలదీసాను శృతి శరీరంలో కూర్చుని ఉన్న నా ఆత్మని.నువ్వు ఇంటికి వెళ్ళాక నీకే అర్ధం అవుతుంది అని అన్నాడు నా ఆత్మ పైకి లేస్తూ.ఆలస్యం చేయకుండా వెళ్ళు ముందు అని మరొక్కసారి నా ఆత్మ చెప్పడంతో నేను అక్కడి నుంచి కదిలాను అయిష్టంగా.

కిందకి వచ్చి పైకి చూసాను శృతి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుని బైక్ కిక్ స్టార్ట్ బటన్ నొక్కాను.బండి కదిలించాను.కాఫీ షాప్ నుంచి బయటికి రాగానే నా ఎడమ చేయి వైపు రోడ్ పక్కనే ఉన్న స్మశానం వైపు చూసాను.అప్పటికే సమయం వెలుగుకి చీకటికి మధ్యలో ఊగిసలాడుతుంది.సుమారుగా రాత్రి 7 గంటలు అయింది.స్మశానం కాంపౌండ్ వాల్ తక్కువ ఎత్తులో ఉండడం వలన దూరంగా జుట్టు విరబోసుకుని నలుపు రంగు బట్టల్లో శ్మశానంలో ఉన్న చింత చెట్టుకి ఊయల కట్టుకుని ఊగుతున్న ఒక స్త్రీ రూపాన్ని చూసాను.నోట్లో తడి ఆరిపోయింది.బైక్ స్లో చేసాను.సైడ్ కి ఆపాను.కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ మళ్ళీ చూసాను కానీ ఈ సారి అక్కడ చెట్టు లేదు ఊయల లేదు అందులో ఊగుతున్న స్త్రీ రూపం లేదు.అసలు నాకు ఏం జరుగుతుంది అని బైక్ కి తగిలించి ఉన్న హెల్మెట్ తీసి పెట్టుకున్నాను.బైక్ స్టార్ట్ చేశాను. బైక్ లో వెళ్తూ ఉన్నాను. నాలో ఏవేవో ఆలోచనలు.అంటే నేను హెల్మెట్ పెట్టుకోకపోతే ఇదే స్మశానంలో నేను కూడా ఆత్మగా మారి ఊయల ఊగాలి అని నాకు ఎదో శక్తి గుర్తు చేస్తుందా?? చావు భయం తో పాటు ఒకవేళ నిజంగా నేను చనిపోతే శృతి కి దూరం అయిపోతాను అన్న భయం నన్ను ఇంకా భయపెట్టింది.

అలా ఆలోచిస్తూ బైక్ నడుపుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక ట్రక్ అదుపుతప్పి నా వైపు కి వేగంగా దూసుకుని వచ్చింది. నేను వెనువెంటనే అప్రమత్తం అయ్యాను. బైక్ ని రోడ్డు పక్కకి దించేశాను.ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న స్థలం లో ఏపుగా పెరిగిన జిల్లేడు చెట్లు పొదల్లోకి వెళ్ళి పడిపోయాను.తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను.

ఇంటికి చేరుకున్నాను.శృతికి కాల్ చేసాను.తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.మళ్ళీ మళ్ళీ చేసాను.ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా 24 ఏళ్ల అందమైన అమ్మాయి పసుపు రంగు పెళ్లి బట్టల్లో ఒళ్ళంతా నగలతో నిల్చుని ఉంది.నన్ను చూసి ఓరగా నవ్వుతూ లోపలికి రావచ్చా అని అడిగింది.ఎవరు మీరు అని అడిగాను.ప్రస్తుతానికి నీ ఆత్మకి స్నేహితురాలినిని అన్నది.నా ఆత్మ తోనే భరించలేకపోతుంటే ఇపుడు మళ్ళీ వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్.ఇలా ఒక అమ్మా యిని బయటే ఉంచి మాట్లాడుతారా అని వయ్యారాలకి పోయింది ఆ అమ్మాయి.అలా మాట్లాడుతూనే నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చేసింది నా అనుమతి లేకుండా.కరెంట్ పోయింది తను లోపల అడుగుపెట్టగానే. అంతా చిమ్మ చీకటి.డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగాను తను క్యాండిల్ పట్టుకుని నిల్చుని ఉంది. క్యాండిల్ టేబుల్ మీద పెట్టి సోఫా లో కూర్చున్నది స్వతంత్రంగా.సోఫా కి ఎదురుగా ఉన్న పడక కుర్చీలో నేను కూర్చుని అసలు ఎవరు మీరు అని అడిగాను.నన్ను చూసి అతి వికారంగా నవ్వింది. నా గుండె జారిపోయింది ఆ నవ్వుకి.


మెడికవర్ హాస్పిటల్ ఐసీయూ లో గత పన్నెండు నెలలుగా కోమాలో ఉన్న అమ్మాయిని.నా పేరు బ్యూటీష్క.నా ఆక్సిడెంట్ ఎలా జరిగిందో నీకు తెలుసు కదా అని అడిగింది.నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాను.గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకో అన్నది బ్యూటీష్క.

ఇంతలో ఆ అమ్మాయిలో నా ఆత్మ వచ్చి కూర్చున్నాడు.అప్పటి వరకు తియ్యటి స్వరంతో మాట్లాడుతున్న అమ్మాయి గొంతు మారిపోయింది.భయపడకు అని నాకు ధైర్యం చెబుతున్నాడు నా ఆత్మ.నాకు కోపం వచ్చింది అసలు ఎందుకు నన్ను విసిగిస్తున్నారు మీరందరూ?ఇన్ని రోజులు నాకు ఎప్పుడూ కనపడని నువ్వు నా ఆత్మ అని ఇవాళే ఎందుకు వచ్చావు? ఇప్పుడేమో నీ గర్ల్ ఫ్రెండ్ అని ఇంకో అమ్మాయి. అసలేం జరుగుతుంది నా చుట్టూ?అని నిలదీశాను.

తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు.నువ్వు ఆక్సిడెంట్ చేసిన ఈ అమ్మాయి. తను ఇంతకు ముందే చనిపోయి ప్రేతత్మ గా మారిపోయింది. నిన్ను ఆ ప్రేతాత్మ నుంచి కాపాడడానికి నేను వచ్చాను అన్నాడు నా ఆత్మ.ఇంతలో శృతి నుంచి కాల్ రావడంతో ఫోన్ ఆన్సర్ చేసి పైకి లేచి బాల్కనీ వైపు కి వెళ్ళాను.

నీ ఆలోచనలు కూడా నాకు తెలిసిపోతాయి ఇక్కడే కూర్చుని మాట్లాడొచ్చు అని అన్నాడు నా ఆత్మ.నేను ఈ అమ్మాయి శరీరంలో ఉంటేనే నిన్ను రక్షించగలను.అతి కష్టం మీద వచ్చాను ఈ అమ్మాయి శరీరంలోకి.ఒకసారి నేను బయట వెళ్తే మళ్ళీ ప్రవేశించడం కష్టం అన్నాడు నా ఆత్మ.అయినా నేను అదేం పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్లి ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే ఏమయిపోయావ్ నువ్వు?అసలు నేను ఇంటికి ఎలా చేరుకున్నానో కూడా తెలియడం లేదు.నన్ను అలానే వదిలి వెళ్ళిపోతావా?ఐ హేట్ యు. నీ మీద నాకు చాలా కోపం గా ఉంది.మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు అని శృతి నేను మాట్లాడేలోపు తాను చెప్పాలి అని అనుకున్నవన్నీ చెప్పి విసురుగా ఫోన్ పెట్టేసింది.తను నా మీద అంత కోప్ప డినప్పటికీ శృతి మీద నాకేం కోపం రాలేదు. తను క్షేమంగా ఇంటికి చేరుకున్నదానికి సంతోషించాను. ఒక మనిషిని ప్రేమిస్తే తన కోపం కూడా ఒక వరంలా అనిపిస్తుందా?

ఇంతలో నా పక్కనే పాల బుగ్గల బ్యూటీష్క.నా బుగ్గల మీద తన అందమైన వేళ్ళతో సుతారంగా తాకింది.నేను వెంటనే తన చేతిని పక్కకి నెట్టి హాల్ లోకి వెళ్లి పడక కుర్చీలో కూర్చున్నాను.నా కుర్చీ వెనుక వైపున నిల్చుని నా తలలో తన అందమైన వేళ్ళని పోనించి సుతారంగా నాకు మసాజ్ చేస్తూ చిల్ అవ్వు నేను వచ్చేశా కదా ఎందుకంత చిరాకు అన్నది.

వర్షాకాలం.ఆ రోజు జోరు వాన.సుమారుగా రాత్రి 10 గంటలు.నేను వేగం గా కార్లో వెళ్తున్నాను. ఒక అమ్మాయి పెళ్లి బట్టలో ఉన్నట్లుండి నా కార్ కి అడ్డు వచ్చింది.నేను బ్రేక్ వేసే గ్యాప్ లేదు నా అతి వేగం వలన.అంతే ఒక్కసారిగా ఆ అమ్మాయి కార్ కి తగిలి గాల్లోకి ఎగిరింది.నేను కార్ ఆపలేదు కేసు అవుతుంది అని.ఆ తర్వాత కొన్ని రోజులు వరకు నేను నిద్రపోలేదు.ఎప్పుడూ నిద్రపోయినా ఆ అమ్మాయి గాల్లోకి ఎగురుతున్న దృశ్యం నన్ను వెంటాడేది.అప్పుడే ఒక రోజు పెళ్లిలో నేను శృతిని చూసాను.తొలి చూపులోనే ప్రేమించాను.శృతి గురించి ఆలోచించినపుడు నా మనసు తేలిక అయ్యేది.శృతిని మళ్ళీ మళ్ళీ చూడాలి మాట్లాడాలి అని అనుకుని నేను శృతి కంట్లో పడడానికి చేసే ప్రయత్నంలో నా కలలోకి వచ్చి ప్రతి రోజు గాల్లోకి ఎగురుతున్న ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోయాను.కానీ మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి గాల్లోకి ఎగురుతున్న దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతుంది పైగా ఏకంగా ఆ అమ్మాయి నా ఇంటికే వచ్చి కూర్చుంది.నా చేతుల్లో చెమట. నా కాళ్ళు చిన్నగా వణకడం నేను గమనించాను.

బ్యూటిష్క నా ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని కాలు మీద కాలు వేసి నేను అందంగా ఉన్నానా? అని అడిగింది.నేను అవును అన్నట్లుగా తల ఊపాను. గుక్క తిప్పుకోలేని తన అందం నన్ను తల ఆడించేలా చేసింది.ఒక అందమైన అమ్మాయిని కార్ తో గుద్దేసి ఆపకుండా వెళ్లిపోయావ్!నీ మూలంగా నేను సంవత్సరం నుండి కోమాలో ఉండి ఇంతకు ముందే చచ్చిపోయాను.నువ్వు శ్మశానం లో చూసింది నా ప్రేతాత్మనే. నిన్ను చంపి ఆ తర్వాత నిన్ను మోహించాలని నిన్ను వెంటాడుతూ నీ మీదకి ట్రక్ ని పంపించాను.తప్పించుకున్నావు. నీ వాసనని వెంబడిస్తూ నీ ఇంటికి వచ్చాను.ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు.

నా ఆత్మ బ్యూటీష్క శరీరంలోకి వచ్చేశాడు.భయపడకు శివాజీ! నిన్ను నేను ఎలా అయినా కాపాడుకుంటాను అన్నాడు నా ఆత్మ.మొదటిసారి నా ఆత్మ మీద నాకు అమితమయిన ప్రేమ కలిగింది.నా ఆత్మ ఘోష నాకు ఇప్పుడే అర్దమయింది. నన్ను కాపాడడానికి ఎంతగా తపించిపోయాడో నాకు ఇప్పుడే అర్దమయింది.అమాంతంగా లేచి నా ఆత్మ ని ఆలింగనం చేసుకోవాలని అనిపించింది.కానీ నా కాళ్ళు నాకు సహకరించడం లేదు నేను కుర్చీలోనుంచి పైకి లేవలేకున్నాను.


To be continued..