జాన్ వ్యూహాలు & యుద్ధం తీవ్రతరం
ఇక జాన్ మాట్లాడుతూ, "పెద్ద పెద్ద వాళ్ళను పట్టుకుని కిడ్నాప్ చేయాలి. ఇంకొకటి, రుద్రవైపు వెళ్లాలి. రుద్రే మనకు మొదటి టార్గెట్. అతను మన చేతిలో ఉంటే, ఇంకా మనల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఈ శివ కాని, ఆ ముసలోడు లింగయ్య కాని ఎవ్వరూ ఆపలేరు," అంటూ ముందుకు సాగుతున్నాడు. మెల్లగా వాడు చెప్పినట్టే, మూడు టీములుగా విభజించబడ్డాయి. ఒకటి జాన్ వెనుక వస్తోంది, ఇంకోటి ముందుకెళ్ళి స్టేజ్ నిర్మిస్తుంది (అంటే రుద్రను ఎక్కడ పట్టుకోవాలో ప్లాన్ చేస్తుంది). ఇక మూడో టీమ్ సిటీలోకి ఒక్కసారిగా బయలుదేరాయి. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోకి దూసుకెళ్లి వేగంగా కిడ్నాప్ చేస్తున్నారు.
టీవీలో కొత్తగా రోబోలు వచ్చాయని, అవి 'రోబో' సినిమా కంటే దారుణంగా ఉన్నాయని రిపోర్టర్ చెబుతున్నాడు. గోడలను పగలగొట్టి, పెద్ద పెద్ద వాళ్ళను కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్త విధ్వంసం
మరోపక్క, ఒక చోట రోబోలన్నీ చెట్లలో కలిసిపోయి మాయమయ్యాయి. రుద్ర టీమ్ ఎప్పుడైతే అక్కడికి వస్తుందో, అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మళ్ళీ సిటీలో చూస్తే, అవి చేసిన యుద్ధానికి ఎన్నో నగరాలు కూలిపోయాయి, భవనాలు కాలిపోయాయి, మనుషులు తగలబడ్డారు. సముద్రమంతా ఉగిపోతోంది. అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు మళ్ళీ వస్తున్నాయి. అలాగే, ఎక్కడో ఉన్న అగ్నిపర్వతాలు వేడెక్కడం మొదలుపెట్టాయి.
సముద్రంలో అలలు... ఏవో రెండు భారీ స్వర చాపల (లేదా పాములు?) లాంటివి, అర్థం కావడం లేదు, కానీ సముద్రంలో విహరిస్తున్నాయి. కనిపించిన ప్రతి నావను, ప్రతి పెద్ద జీవిని చంపుతూ ఉన్నాయి. ఇక సముద్రం ఎరుపు రంగులోకి మారిపోయింది.
రుద్ర టీమ్ ప్రమాదంలో
ఇంకా అలా కట్ చేస్తే, ఒక్కసారిగా అడుగుల శబ్దం... కేవలం శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అది కూడా వాళ్ళు నడిచే శబ్దం. ఎవరూ అనుకున్నారేమో, అది రుద్ర టీమ్. లింగయ్యకు అనుమానం కలిగి, "ఏంటి, ఇంత మంది మనుషులు వస్తే పక్షులు కనీసం శబ్దం చేయడం లేదు, చెట్లు ఊగడం లేదు. ఏదో అనుమానం," అని అనుకుంటూ ఉండగా, శివ తన రోబోటిక్ సూట్‌లో తన సెన్సార్‌ను ఓపెన్ చేసి చెక్ చేశాడు. పెద్దగా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు 'కూల్ వే హార్డ్' అంటే, చల్లగా కనిపించే కళ్ళను సృష్టించి చుట్టూ చూశాడు. అక్కడ ఏవో కనిపిస్తున్నాయి, కానీ అర్థం కావడం లేదు.
ముందుకు సాగుతున్నారు. ఒక్కసారిగా ఏదో శబ్దం, ఏవో వస్తున్నాయి. వెంటనే శివ పైకి ఎగిరాడు. తన రెక్కలు విచ్చుకున్నాయి. రెక్కల నుంచి ఇంకొన్ని బాణాల్లాంటివి ఏవో వచ్చాయి. అటాక్ చేయడానికి వచ్చిన వస్తువును పట్టుకున్నాయి. అవి ఏవో కాదు, స్పిన్నర్లు! అంటే కత్తుల్లాంటివి, మనిషి చర్మం కోసుకుపోతుంది, రక్తం వస్తుంది, బ్లీడింగ్ ఆగదు, నరాలకే తగులుతుంది!
వాటిని మళ్ళీ తిరిగి కొట్టాడు. అవి ఒక్కసారి ఒక చెట్టుకు తగులుకున్నాయి, చెట్టు తెగిపోయింది. ఒక్కొక్కటిగా వచ్చాయి, అవి గన్‌లు తీసుకున్నాయి. వీళ్ళు కూడా గన్‌లు తీసుకున్నారు. శివ "సూపర్‌సోనిక్ వేవ్!" అన్నాడు. వచ్చిన బుల్లెట్లను వచ్చినట్టే ఆపేసి, పిండి చేసి పడేస్తున్నాయి. కొద్దిసేపటికి బుల్లెట్లు ఆగిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అని చూడగా, చేతుల్లోకి లేజర్ గన్‌లు వచ్చాయి. ఇప్పుడు అవి లేజర్ పవర్‌ను ఉపయోగించాయి. అవి దాదాపు సోనిక్ వేవ్‌ను ఆపేశాయి. శివ మరోసారి తన రెక్కలతో వదిలించాడు. ఇప్పుడు అసలైన వేవ్ వచ్చింది. ఒక్కసారిగా గన్‌లు విరిగిపోయాయి, రోబోలు తునిగిపోయాయి. కానీ ఒక్కసారిగా అవి రోబోలుగా మారిపోయాయి.
వీళ్ళందరినీ కాపాడుతుంది శివ అని అర్థం చేసుకున్న అవి మరో వ్యూహం పన్నాయి. అన్నీ ఒకే చోట, అంటే శివ పైన దాడి చేస్తున్నాయి. కానీ శివ సూట్ మాత్రం చెక్కుచెదరలేదు. ప్రతి బుల్లెట్‌ను ఆపుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఎంత సేపు ఉంటుందో అర్థం కావడం లేదు.
జాన్ చివరి వ్యూహం & శివ పతనం
ఇంకొన్ని రోబోలు దూరంగా వెళ్లి చెట్లకు తాడు కట్టి గట్టిగా వెనక్కి లాగాయి. వాటిపై బాంబులు, ఇంకొన్ని రాళ్ళు పెట్టాయి. వెనకాల నుంచి దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే, ఇంకొన్ని వెనకాల నుంచి రుద్ర టీమ్‌పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇలా చుట్టూ దాడి జరగడంతో శివ కూడా తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ కిందపడ్డాడు. ఇక అయిపోయిందని అనుకునే లోపు మళ్ళీ శివ లేచాడు. అలా జరుగుతూనే ఉంది.
జరుగుతూ ఉంది. శివకు ఓపిక తగ్గిపోయింది. కిందికి దిగి, చేతిలోకి లేజర్ ఖడ్గాన్ని తీసుకున్నాడు. పోరాడటానికి సిద్ధమయ్యాడు. తనమీద ఎన్ని బుల్లెట్లు వచ్చినా, అస్సలు తగ్గడం లేదు. వెళ్లి ఒక్కొక్క దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. తగిలిన ప్రతి ఒక్కటి బూడిదైపోతున్నాయి.
రుద్ర రంగ ప్రవేశం & యుద్ధ భీభత్సం
రుద్ర కూడా మరో కత్తి తీసుకున్నాడు. లింగయ్య వద్దంటున్నా వినకుండా శివకు తోడుగా వెళ్ళాడు. అటు ఇటు ఇద్దరూ విధ్వంసం చేస్తున్నారు. తగిలిన ప్రతి రోబో పిండి పిండి అయిపోతోంది. రుద్ర తన శక్తిని యాక్టివేట్ చేయకముందే ఇంత బలంగా ఉన్నాడు, చేస్తే ఎలా ఉంటాడు? 'అయినా ఎందుకు ఇంతసేపు తాతయ్య వద్దంటున్నాడు?' అని అనుకుంటూ శివ పోరాడుతున్నాడు. మెల్లగా చీకటి పడటం మొదలైంది. చీకటి శబ్దం వినిపించడం మొదలైంది. మరోపక్క, కొన్ని రోబోలు రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాయి. అక్కడున్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువస్తున్నాయి.
రుద్రను ఉపయోగించడానికి ఇంకా అది తప్ప ఇంకేం లేదనుకున్న జాన్, అదే చేశాడు. ఇక రుద్ర, శివ రాత్రి అవుతున్నా, రోబోలు చస్తున్నా వస్తూనే ఉన్నాయి. వీళ్ళకు ఓపిక తగ్గిపోయింది. రుద్ర తాతయ్య వైపు చూశాడు. 'వద్దన్నట్టు సరిగా చేశాను' అన్నట్లు ప్రతి ఒక్క దాన్ని నాశనం చేస్తున్నాడు. పట్టుకొని విసిరి కొడుతున్నాడు. రుద్రకు ఇంకా ఓపిక తగ్గిపోతోంది. "ఎంతసేపు ఈ పోరాటం?" అంటూ వేగంగా కదలడం మొదలుపెట్టాడు. తన శక్తి యాక్టివేట్ కాలేదు, కానీ వేగం అద్భుతంగా ఉంది. దయ్యం కళ్ళ కంటే చాలా వేగంగా ఉంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చేతిలో పట్టుకొని గిరగిరా తిప్పుతూ విసిరి విసిరి కొడుతున్నాడు. ఆ దెబ్బకు రోబోలు ఎక్కడ పడుతున్నాయో వాటికి కూడా తెలియడం లేదు.
ఇక లింగయ్య ఒకచోట కూర్చుని ఆయాసం తీర్చుకుంటున్నాడు. రుద్ర ఎప్పుడైతే బరిలోకి దిగాడో, వేగం పెరిగిపోయింది. అక్కడ ప్రశాంతత పోయింది. రోబోలు పగులుతున్న శబ్దం. అదంతా గమనిస్తూ ఉన్న వాళ్ళందరూ మెల్లగా 'ఇక మన పని ఉండదేమో' అని అనుకుంటూ కూర్చుంటున్నారు. ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది: "నువ్వు విధ్వంసం ఆపకపోతే మీ వాళ్లు ఒక్కరూ బతికుండరు!" అని కొన్ని గొంతులు వినిపించాయి. అమ్మ, నాన్న, అక్షర అలాగే ఇంకొక అమ్మాయి శ్వేతగాని. శివ ఒక్కసారిగా ఆగిపోయాడు. చుట్టూ చూస్తున్నాడు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. కనిపించనంత చీకటి! ఇది మాయాశక్తి అని అర్థం చేసుకున్నారు.
ఎపిసోడ్ 13: రుద్ర శక్తి ప్రదర్శన
ఇక రుద్ర కళ్ళ నుంచి ఒక రకమైన అలజడి మొదలైంది. గాలి వేగం తగ్గింది. చుట్టూ ఉన్న ప్రదేశంలోని బండరాళ్లు పైకి లేచాయి. అవి ఎవరికీ కనిపించడం లేదు, కానీ రోబోలు వాటికి తగిలి పగిలిపోతున్నాయి, గట్టి రాళ్లు తగులుతున్నట్టుగా ఎగిరెగిరి పడుతున్నాయి. భూమిపై ఉన్న చెట్లతో సహా అన్నీ రుద్రకు సాయం చేస్తున్నాయి. వాళ్ళ చుట్టూ ఒక రక్షణ కవచంలా చెట్లు ఉపయోగపడుతున్నాయి. అతను రుద్రమనుల రాజ్యంలో నేర్చుకున్న శక్తులు ఎప్పుడు, ఎక్కడ ఉపయోగపడుతున్నాయో అతనికి తెలుసు.
యుద్ధం చేస్తున్న రుద్రకు ఒక్కసారిగా ఒక అరుపు వినిపించింది. తిరిగి చూశాడు. ఎదురుగా అక్షరను చూసిన వెంటనే ఆగిపోయాడు. "అందుకే మానవులంటే ప్రేమలు, ఆప్యాయతలు ఉండకూడదు. ఇప్పుడు మీ చావుకు వచ్చింది!" అంటూ జాన్ అందరినీ కూర్చోమన్నాడు. అందరూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. ఎవరికి తగినట్టు వాళ్ళు నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఒక పెద్ద బంగళాలోకి అందరినీ తీసుకువెళ్లాడు జాన్. అక్కడ ముఖ్యమంత్రి నుంచి చిన్న ప్రజల వరకు అందరినీ బంధించాడు. ముఖ్యమైన వాళ్ళందరితో మాట్లాడుతూ, "చూడండి, ఇక నా కోపం, విధ్వంసం అన్నీ నీ మీదనే ఆధారపడి ఉంటాయి. మీరు నన్ను రాజుగా ఒప్పుకుంటారా, లేదా మీ అందరినీ చంపేసి కొత్త రాజ్యాన్ని సృష్టిస్తానా? అంతేకాదు, నాకు పెద్దగా ఫీలింగ్స్ లేవు," అని రుద్ర వైపు చూస్తూ అన్నాడు, "నీ మాదిరి ఒకరి మీద ఫీలింగ్స్ పెట్టుకుంటే చివరికి ఇలాగే జరుగుతుంది." రుద్ర చేతులకి ఒక నల్లటి కవచం చేతులను కట్టేసి ఉంది.
జాన్ vs. రుద్ర - వాదోపవాదాలు
జాన్ మళ్ళీ మాట్లాడుతూ, "మీరేమంటారు?" అనగా, రుద్ర మాట్లాడుతూ, "మాది ఓటింగ్ వేసి గెలుస్తాం. ఒకటి నా వైపు ఉండాలి, లేదా నీ వైపు ఉండాలి. ఈ శక్తి ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినా, నీ భార్య నా చేతిలో ఉంది. చంపేస్తాను. అంతేకాదు, నీకు కొడుకు కూడా పుట్టబోతున్నాడంట కదా? కందిపోయావంట కదా? ఇన్ని కుటుంబ సంబంధాల్లో నువ్వెందుకురా అడ్డం వస్తున్నావ్?" అనగా, రుద్ర మళ్ళీ సైలెంట్ అయిపోయాడు.
రుద్ర మరోసారి కళ్ళు పైకి, తలకాయ పైకి ఎత్తి, అడుగు ముందుకేశాడు. వెంటనే పక్కనే ఉన్న చైర్ ముందుకు వచ్చి వాలింది. కుర్చీలో కూర్చుని, "చూడు జాన్, నీకు 20 నిమిషాల టైం ఇస్తున్నాను. పోతావా? లేదా లొంగిపోతావా? లొంగిపో. అంతేకాదు, నాకు అది ఉంది, ఇది ఉంది అని ఏమాత్రం ఎగతాళి చేసినా బూడిద కూడా మిగలదు, చెప్తున్నాను," అని స్టైల్‌గా కూర్చుంటాడు. అక్షరను అక్కడి నుంచి లాగి తన పక్కకు తెచ్చుకున్నాడు. దానిని ఎవరూ ఆపలేకపోతున్నారు. "అసలు ఏంటిది?" అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. "కత్తిని కూడా చీల్చగల శక్తి నాకుంది, నాతో పెట్టుకోకు," అని అంటూ ఒక్కసారిగా రుద్ర కళ్ళు ఎర్రబడ్డాయి. చుట్టూ చీకటి ఎగిరిపోతోంది. అతని కంటి నుంచి వచ్చిన వెలుగు వల్ల చీకటి దూరం అవుతుంది. చుట్టూ ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు.
"చూడు జాన్, నాకు ఇంకా సాగదీయాలని లేదు. నువ్వు ఇప్పుడు లొంగిపోతావా లేదా చచ్చిపోతావా? ఇదే ఉండాలి," అని అంటూ ఉండగా, జాన్, "చూడు, ఒక వైపు చూడు, రెండు వైపులా చూడకు!" అన్నాడు. "చూడు, నేను చూసేది ఒక వైపే. చూడమంటే నా వల్ల కాదు," అని మెల్లగా తల దించుకొని నిద్రలోకి జారుకుంటాడు. అందరూ ఉలిక్కిపడతారు. "ఏంటి ఈ సమయంలో నిద్రపోతున్నాడు?" కానీ ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. కనీసం జాన్ కూడా కదలలేకపోతున్నాడు. అది రుద్ర యొక్క శక్తి.
నల్లగా తల ఎత్తి, "ఏంటి కదలలేకపోతున్నావా? నా ముందు జూసిపిరా నువ్వు!" అంటాడు. "చూడు," అని మాట్లాడుతూ ఉంటే, "ఎన్నిసార్లు చూడాలి? నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావా?" అని నవ్వుతాడు రుద్ర.
తన వాళ్ళందరినీ ప్రత్యేకంగా సీట్లలో కూర్చోబెట్టి, "వీళ్ళు నా వాళ్ళు, చూడు ఇప్పుడు చూడు!" అని అంటూ తన చైర్ ముందుకు జరుపుకొని, "ఏంటి ఇప్పుడు నీ బాధ? ఏంటి ఏం కావాలి? ప్రపంచం కావాలా? తీసుకుని ఏం చేస్తావు? వీళ్ళందరినీ నువ్వే సాకాలి," అంటాడు. "నేనెందుకు సాకాలి వీళ్ళని? పనులు చేసి పన్ను కట్టి నన్ను రాజుగా స్వీకరించాలి," అంటాడు జాన్. "చూడు బాబు, ఇదేమీ పురాతన కాలంది కాదు. ఇప్పుడు ఇది కొత్త కాలం. ఓటింగ్ ఉండాలి లేదా ఆన్‌లైన్‌లో షేర్ ఉండాలి. అంతేకాదు, ఇలా పన్నులు అంటే కుదరవు," అని అంటూ ఎగిరిపడతాడు రుద్ర.
"అప్పుడు రాజులు రాజులే, కానీ ఇప్పుడు ప్రజలే రాజులు. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే రాజులు," అని చెబుతాడు రుద్ర. "అలాగే, ఈ సోది అంతా నాకెందుకు? ఇప్పుడు నీ సంగతి ఏంటి? పోరాడుకుందామా? వన్ బై వన్, నువ్వు నేను అంతే. ప్రపంచంలో ఎవ్వరూ వద్దు. పోరాడుకుందామా? పోరాడుకుందామా?" అని రెచ్చగొడతాడు. జాన్ కొంచెం భయపడినట్టుగా ఉన్నాడు. "అయితే మనం చీకటిలోనే పోరాడుకుందామా?" అంటే, "చీకటిలోనే ఏంటి? నేను పుట్టించే చీకటిలో పెరిగింది, చీకటిలో. నాకు చీకటి అంటే భయం కాదు," అని అంటాడు రుద్ర.