Don't Expect its too danger in English Motivational Stories by Lakshmipriya books and stories PDF | ఆశిస్తూ కూర్చుంటావా... బాధ్యత లేదా?

Featured Books
Categories
Share

ఆశిస్తూ కూర్చుంటావా... బాధ్యత లేదా?

నా ఫ్రెండ్ ఒకరు (సురేష్) తన ఫ్రెండ్ కి (శ్యామల)

మెసేజ్ లు పెడుతూ ఉండేవాడు గుర్తుకువస్తే చాలు ఆమెపై కథలు రాస్తూ ఉండేవాడు....

ఆమె కొన్ని వాటికి రెప్లైలు ఇచ్చేది కొన్ని వాటికి రెప్లైలు ఇచ్చేది కాదు పని ఒత్తిడి వలన కావొచ్చు లేక వీలు లేక కావొచ్చు

@వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే @

సురేష్ ప్రతీ నిమిషం తన రిప్లై కోసం మొబైల్ ని ముప్పు తిప్పలు పట్టించేవాడు...

తన రెప్లై కోసం ఆశిస్తూ సమయాన్ని వృధా చేసేవాడు... ఉన్న వ్యాపారాన్ని కొన్ని మెట్టులు తిగించాడు.....ఇది చాలదా expectation is injures to wealth అని.తను ఆమెపై రాసిన కథలు, వ్యాసాలు, పద్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆశ తొ పాటు.... ఆమె తనను గుర్తిచాలి తనకోసం సమయాన్ని వెచ్చించాలి అనే ఆశ, ఆరాటం... సురేష్ సమయాన్ని తినేసింది...ఇక్కడ ఆశ తప్పులేదు కానీ, ఆమె ఏ పరిస్థితిలో ఉన్నా తన కోసం సమయాన్ని త్యాగం చేయాలి అనేది కొంచెం ఆలోచించవలసిన విషయం అని అర్ధమవుతుంది...

అందుకే పెద్దలు అంటూ ఉంటారు..

ఇష్టపడినప్పుడు కష్టాన్ని కౌగిలించుకోవాలి అని..

అంతేగా..

తన స్నేహం అంటే ఇష్టం అయినప్పుడు ఆమె గౌరవం కోసం ఎంత దూరమైనా నడవాలి చెప్పులు వేసుకునే అంటాను నేను.. (అంటే నీ పనులు పక్కకు పెట్టకుండా.).....ఎంత దూరం అయినా నడవచ్చు.    కానీ....

"ఎదో తననుంచి ఆశిస్తూ కూర్చుంటే నీ బాధ్యత ను విస్మరిస్తే "

నష్టం నీకు కాదా? మరి

బాధ్యత లేకుండా బడికి వెళ్లకుండా పుస్తకాలు పట్టకుండా క్లాస్ పాస్ ని ఆశిస్తే..

 తప్పా? ఒప్పా?? ఆలోచించు మిత్రమా?

నీకు ఉన్న చిన్న సమయాన్ని వదులుకోవద్దు దానిని నీకోసమే ఖర్చు చేయ్..

అందుకే ఆశించకు...

పూర్వం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్ ఒకటి ఉండేది అది ఇప్పుడు తొలగించబడింది...

కవి ఆ లెసన్ లొ కథను ఎంత అద్భుతంగా తెలియచేసాడో ఆ వివరణ ఇప్పుడు మీకు.....

 పదవ తరగతి పాస్ అయ్యి కొత్తగా ఇంటర్మీడియట్ లొ జాయిన్ అయిన ఒక అబ్బాయి హాస్టల్ ఉండి చదువుకోవడం ప్రారంభించాడు....

ఒక అందమైన అమ్మాయిని చూసి ముగ్ద్థుడై అమ్మాయి వెనక తిరగడం కూడా ప్రారంభించాడు...

మొదటి ప్రారంభించిన చదువును చులకనతో చక్కగా మూట కట్టి పక్కన పెట్టాడు..

ఆ అమ్మాయి  తనను చూసి నవ్వింది అంతే 

ఇక మన హీరో ఆ అమ్మాయి నుండి ఎదో ఆశించాడు చదువు అనే తన బాధ్యను పూర్తిగా గాలికి వదిలేసాడు...

ఒక రోజు ఆ అమ్మాయి తనకు రెడ్ రోజ్ కావాలని అడిగింది... అది అసలు రెడ్ రోజ్ పుష్పాలు పూచే సీజన్ కాదు... కానీ

మన హీరో ఎలా అయినా రెడ్ రోజాని తీసుకువచ్చి తను ఎలా అయినా ఆ అమ్మాయి దగ్గర నుండి ఇప్రెస్ కొట్టాలని బయలుదేరాడు...

తిరిగాడు తిరిగాడు..కానీ రెడ్ రోజా దొరకలేదు మన హీరో ఇలా తిరుగుతూ ఉండడం చూసిన ఒక పక్షి ఈ అబ్బాయికి సహాయం చేయాలనీ నిర్ణయం తీసుకుంది... తనకి ఎటువంటి సహాయం కావాలో తెలుసుకుంది...

"ఇక రెడ్ రోజా దొరకని మన హీరో హాస్టల్ రూంకి దిగాలాగా వెళ్ళిపోయాడు"

హాస్టల్ ఎదురుగా ఉన్న గార్డెన్లో ఒక వైట్ రోజా మొక్కను చూసిన పక్షి ఆ వైట్ రోజాను ఎలా అయినా రెడ్ రోజాగా చేయాలని నిచ్చయించింది... ఆలోచించింది... ఆలోచించింది..

తన గుండెని ఆ వైట్ రోజా మొక్కకు ఉన్న ముల్లుకు గుచ్చి రాత్రంతా అలా ఉండిపోయింది

ఎంతటి త్యాగం... ఈ నోరులేని పక్షిది ఎంతటి త్యాగం....

మరుసటి రోజు ఉదయం మన హీరో హాస్టల్ రూమ్ నుండి బయటకు వస్తూ పక్షి గుండె రక్తంతో రెడ్ రోజాగా మారిన ఆ వైట్ రోజాను చూసి గంతులు వేసుకుంటూ వెళ్లి దానిని కోసి

తన ప్రియురాలు ఎక్కడ ఉందొ వెతక ప్రారంభించాడు...

చివరికి కాలేజీ ఫంక్షన్ హాల్ తలుపు తెరిచాడు ఆ అందమైన అమ్మాయి తన ప్రియురాలు అనుకునే ఆ అందమైన అమ్మాయి వేరే అబ్బాయితో డాన్స్ వేస్తూ కనిపించింది..

మన హీరో మనసు ఆ సన్నివేశం చూడగానే ఒక్కసారిగా పగిలింది...

పగిలింది మరి ఎప్పటికి అతుకుంది

సమయం పడుతుందిగా...

ఆ సమయమే మన జీవితానికి విలువైన విజయాన్ని తెచ్చే అదృష్టం..

ఆ అదృష్టాన్ని నీ అంతట నీవే దూరం చేసుకుంటే...దురదృష్టం నీకు దగ్గరవుతుంది..

ఆశించడం మొదలు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకున్న మన హీరో కొన్ని రోజులు దుఃఖంలొ మునిగి సమయాన్ని వృధా చేసుకున్నాడు..

ఆ విలువైన సమయాన్ని ఆ అందమైన అమ్మాయి తిరిగి ఇస్తుందా???

ఓ మిత్రమా ఆశించి ఆత్రుతపడి సమయాన్ని వృధా చేసుకుని జీవితాన్ని ఎవరి చేతిలోనో పెట్టకు...

ఉన్న ఈ చిన్న జీవితానికి కష్టాలు కొని

ఖర్చు పెట్టి తెచ్చే నష్టాలు కోలువతో బొమ్మలు కొలువు పెట్టకు...

అవమానాలు అయినా, బాధలు అయినా

కష్టాలు అయినా, నష్టాలు అయినా, ఇబ్బందులు అయినా అన్ని సమస్యలకు ఒకే ఒక "కారణం" అదే ఆశించడం...

అందుకే బాధ్యత ఉందిగా 

ఆశించడం దండగ...

EXPECTATIONS ARE EXTREMELY HAZARD.

 ఆశించడం అతి ప్రమాదకరం..

EXPECTATIONS MAKE OUR AIMS DESTROY..

ఆశిస్తే మన విజయపు గురి తప్పుదారి పెడుతుంది..

అందుకే మిత్రమా!

ఆశించకు...

అవసరమైన ఆశలు మిన్న 

అతి ఆశలు సున్నా...

సున్నా సున్నా పెద్ద సున్నా... ఆశించకు...... Ok

ఇట్లు...

మీ లక్ష్మి ప్రియ