స్క్రీన్ మీద వివేక్ నంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెంట్ కాల్ అని బ్యూటీ బేబీస్ మధ్యన ఉన్న రానని పక్కకు లాగి వివేక్ మాట్లాడు అన్నాడు ఫోన్ చేతిలో పెట్టి
నా బామ్మర్ది గాడు, ఆ ముసలోడు ఏదో చెప్పుకుంటాడు అందుకే కాల్ చేశాడని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి పోయావా ఇంటికి అని అడిగాడు.
ఆ ఇప్పుడే వచ్చాను అన్నాడు చిరాకుగా.
మండుతున్నట్టుంది అని రాణా వెటకారం గా అడుగుతుంటే
ఒరేయ్ ఎందుకురా వాడిని కూడా డిస్టర్బ్ చేస్తావని సైడ్ నుంచి మేటర్ ఏంటో కనుక్కోమని అరుస్తున్నాడు ఉదయ్.
పెట్రోల్ పోసినట్టు మండుతుంది బావ. ఈ డ్రైవర్ డ్యూటీ చేయడం నావల్ల కాదు. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు.
యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ బామ్మర్ది. బట్ ఒక్కటే కండిషన్ మీ అమ్మకి చెప్పి రా.
మళ్లీ నీలాంటి ఉత్తమ కొడుకుని నేనేదో చెడగొట్టానని నా మీద పడుతుంది అంటూ కాల్ కట్ చేసిన అరగంటకి గెస్ట్ హౌస్ లో తేలాడు వివేక్.
మందు కొట్టి చిందులు వేస్తూ ప్రతాప్ వర్మ ఇంటర్వ్యూ పోస్ట్ పూన్ చేయమన్న విషయం రానా కు చెప్పాడు.
ఏంట్రా నువ్వనేది ఇంటర్వ్యూ మండే కి పోస్ట్ పూన్ చేయమన్నాడా..?? ఇరిటేట్ అవుతుంటే
రాంగ్ టైంలో లీక్ చేసి తగలెట్టేసాడని వివేక్ ని తిట్టుకుంటూనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటే
ఒరేయ్ ఆగు అని అడ్డుపడి ఆపిన రాణా ఇందాక నా బాబు నీకు ఫోన్ చేసింది ఈ మేటర్ గురించే కదా అని మత్తులో కూడా తూగుతూ కోపంగా అడిగాడు.
అంటే సాటర్డే మంచిది కాదంట నీకు తెలుసు కదా అంకుల్ కి కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయి.
ఏదైనా మన మంచికే కదా చెప్పేది, అందుకనే మండే కి పోస్ట్ పోన్ చేశాను అని చిన్న గొంతుతో మేనేజ్ చేయాలని చూశాడు.
ఆయన గారి సెంటిమెంట్స్ ఆయన వరకు మాత్రమే. నా కంపెనీ, నా పిఏ, నా ఇంటర్వ్యూ, నా ఇష్టం. నేను సాటర్డే పెట్టుకుంటా లేదా సండే పెట్టుకుంటా, ఇంకా నాకు నచ్చినప్పుడు నా ఇష్టానికి పెట్టుకుంటా అడగడానికి ఆ ముసలోడికి ఎటువంటి హక్కు లేదు.
ఎవ్వరికి నా పర్సనల్స్ లో వేలు పెట్టే రైట్స్ ఎవ్వడికి లేవు. ఒక్కళ్ళు కాదు నలుగురు నలుగురు P.A లను సెలెక్ట్ చేసుకుంటా.
వీక్ మొత్తం ఎంజాయ్ చేస్తానని ఫుల్ ప్రస్టేట్ అవుతూ ఫుల్ బాటిల్ తీసుకొని తాగుతుంటే
వీడు తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో నాకు అసలు అర్థం కావట్లా అని వివేక్ వైపు కోపంగా చూసాడు ఉదయ్.
మావయ్య చెప్పమన్నదే చెప్పాను. ఇందులో నా మిస్టేక్ ఏం లేదు.
అంకుల్ చెప్పమన్నది వాడికి కాదు నాకు. వాడికి కోపం వస్తుంది అని తెలిసి కూడా ఎందుకు వాడి ముందు మొదలుపెట్టావ్నుం ఉదయ్ సీరియస్ అయ్యేసరికి ...
నేను అంత దూరం ఆలోచించలేదు అంటూ జారుకున్నాడు నిశాంత్.
ఎవరిని.. ఎవరిని.. నమ్మకూడదు. డబ్బుంటే చాలు డబ్బుకు లోకం దాసోహం. అమ్మ తప్ప అన్ని బంధాలు అవసరానికే.
ఎవరు కరెక్ట్ కాదని ఫుల్ గా తలకి ఎక్కిన మత్తుతో పిచ్చి పిచ్చిగా వాగుతున్న రాణా ను పట్టుకొని అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లాడు ఉదయ్.
సాటర్డే.. టైం కన్నా ఒక 20 మినిట్స్ ముందే ఆటోలో లొకేషన్ కి వచ్చింది చైత్ర.
కింద మెయిన్ సెక్యూరిటీ దగ్గర ఇంటర్వ్యూ జరిగేది ఏ ఫ్లోర్ కనుక్కొని స్ట్రైట్ గా RV కన్స్ట్రక్షన్స్ ఉన్న 14th ఫ్లోర్ కి వచ్చింది.
ఇంకా టెన్ మినిట్స్ టైం ఉండడంతో ఇంటర్వ్యూకి వచ్చిన మిగతా వారిని అబ్సర్వ్ చేస్తూ రిలాక్స్ గా తనకంటూ ఒక ప్లేస్ సెట్ చేసుకొని కూర్చుంది.
ఇంకా ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ వస్తూనే ఉన్నారు.
అక్కడ చైత్ర మాత్రమే చుడీదార్ లో ఉంది.
మిగతా గర్ల్స్ మొత్తం మినీసు, టాప్స్, జీన్స్, స్కర్ట్స్, డిఫరెంట్ స్టైల్స్ తో చాలా పోష్ గా ఉన్నారు.
వీళ్ళు ఇంటర్వ్యూ కి వచ్చారా? ఏదైనా మోడల్ షూట్ కి వచ్చారా అని ఫింగర్ నెయిల్స్ తినేస్తూ తన టెన్షన్ కంట్రోల్ చేసుకోవడానికి చూస్తుంది చైత్ర.
తన చాంబర్ మానిటర్ స్క్రీన్ మీద గర్ల్స్ మొత్తాన్ని ఒక రౌండ్ చూసిన రాణ కళ్ళు అప్పుడే వచ్చి కూర్చున్న అమ్మాయిని చూస్తూ కార్నర్ లో ఆగిపోయాయి.
జూమ్ చేసి చూస్తుంటే నీకు సెట్ అవుతుందా అని అడిగాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న హాఫ్ సారీ బ్యూటీ ని చూస్తూ ఉదయ్.
ఆ అమ్మాయికి నెక్స్ట్ చైర్ లోనే చైత్ర ఉంది.
రేపు సండే కి పర్ఫెక్ట్, సెట్ చేస్తావా..?? అన్నాడు స్క్రీన్ మీదే ఆ పిల్ల బాడీ స్ట్రక్చర్ మేజర్ చేస్తూ.
అంత ట్రెడిషనల్ గా ఉన్న పిల్లని అలా ఎలా అడుగుతున్నావని సీరియస్ అయ్యాడు ఉదయ్.
స్టార్ట్ చెయ్ ఎంత ట్రెడిషనల్ నీకే తెలుస్తుందని ఒక ఆరగెంట్ లుక్ తో తన చైర్ లో కూర్చుంటే
వీడు ఇలా ఎలా జడ్జ్ చేస్తాడని అనుకుంటూ పక్కనే ఉన్న తన చాంబర్ కి వెళ్ళాడు ఉదయ్.
ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది ఉదయ్.
@@@@@@@@@@@@@@@@@@@@@
మరి సెలక్షన్ ఎవరికి ఫెవర్ గా ఉంటుందో చూడాలి.
అబ్బా కొడుకుల మధ్య నలిగిపోతున్నాడు పాపం ఉదయ్ బాబు...😞
@@@@@@@@@@@@@@@@@@@@
షేర్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.
థాంక్యూ
______వర్ణ_____