The Endless - 2 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 2

Featured Books
Categories
Share

అంతం కాదు - 2

అమ్మాయి అలా వెళ్తూ ఉండగా రుద్రకు ఇక్కడ ఏదో తెలుస్తుంది. తన దగ్గర ఉన్న కొన్ని మంచి మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బయటికి తీసి అన్నిటినీ ఏదేదో చేసి ఒక పెద్ద కమ్యూనికేషన్ లేయర్ లాంటిది సృష్టించి దానిని కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి బ్లాక్ చేసిన అకౌంట్‌ని అలాగే వాళ్ళ లొకేషన్‌ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న చుట్టూ ఉన్న పదిమంది ఇలా చేస్తున్నాడు ఏం చేస్తున్నావ్ రా అసలు రజిని సార్‌కి తెలవాలి నీ పని అయిపోతుంది కనీసం రజిని సార్ కూడా ఇది తెలిసి ఉండదు అని అంటూ బిత్తర పోయి చూస్తూ ఉండగా రుద్రకి బ్లాక్ చేసిన అకౌంట్స్ ఒకటి కాదు కనీసం 20 కి పైనే ఉన్నాయి. నిన్న మొన్న చేసిన బ్యాంక్ అకౌంట్ ఒకటి దా సిరీస్ అనే పేరుతో అకౌంటు మొన్న డబ్బు పోయిన రోజు వాళ్ళిద్దరి అకౌంట్‌కి కనెక్ట్ అయ్యి మళ్ళీ డబ్బులు తీసుకుని పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలా సీన్ కట్ అవుతుంది ఇప్పుడు అక్కడ కట్ చేస్తే మరో పక్క ఒక వ్యక్తి ఒక బ్లూ కలర్ స్పేస్ షిప్ సృష్టిస్తూ దాంట్లో ఏవేవో అంటిస్తూ ఒక శూలం నుంచి సంబంధించిన ఒక లేయర్‌ని ఒక వస్తువును పట్టుకుని దీన్ని ఎక్కడ ఒకే ఒక్కసారి ఫిక్స్ చేయాలి దాని కోసం చాలా ఎనర్జీ కావాలి ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది దాని కోసం ఏదైనా కావాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అతనికి అప్పుడే కాల్ వస్తుంది సార్ ఇక మీకు డబ్బు చేత పోయినట్టే ఫస్ట్ టైం పది లక్షలు ఒకేసారి ఇబ్బంది లేకుండా మనకు ఇక ఎటువంటి సామాన్లు అయినా కొనుక్కోవచ్చు కాబట్టి మీరు ఇంకా ఫిక్స్ అయ్యి మళ్ళీ సిరీస్ అని మన సంస్థను పూర్తి చేయండి అని చెబుతూ ఫోన్ చేశాడు డబ్బు కొట్టేసిన సైబర్ నేరస్తుడు వ్యక్తి మాట్లాడుతూ ఏంటి ఇది నా ఆశయం దీనికి ఎంత డబ్బు చాలదు లేదంటే మన కంపెనీలో ఎప్పుడూ డబ్బు చిక్కేది ఇప్పుడు మనం ఇలా దొంగతనం చేస్తున్నామంటే అది కూడా ఈ ప్రపంచంలో లేని దాని గురించి వెతుకుతున్నట్టే అనిపిస్తుంది ఇది నిజమేనేమో ఇది నా చేతిలో ఉన్న ఈ వస్తువు ఈ ప్రపంచాన్ని కాదు దీన్ని ఎట్లు చూసినా మన టెక్నాలజీతో అసలు వాడలేము దీనికి ఏదో ప్రత్యేకమైనది కావాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ సరే మీరు ఇంకా ఏదైనా చేయడానికి చూడండి నాకు ఇంకా డబ్బులు కావాలి అని అంటూ ఆ వ్యక్తి ఫోన్ కట్ చేశాడు అటుపక్క ఉన్న పదిమంది మాట్లాడుతూ ఏంటి వీడికి ఇంకా డబ్బులు కావాలా మనమేమైనా అమ్మఒడి పథకాల నుంచి తీసుకొస్తున్నాం అనుకుంటున్నావా ఇది దొంగతనం ఇక్కడ రజిని అని ఒక పెద్ద గొరిల్లా ఉంది దాని చేతికి చిక్కితే మన సమస్యని అంతం చేస్తాడు అని భయపడుతూ చూడండి మన అకౌంట్లను ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఇక్కడ వీళ్ళు ఫ్రీ ఫ్రీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారిగా మన రుద్ర ఏదో బటన్ నొక్కగానే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఒక్కసారిగా యోగయ్య అకౌంట్‌లో కి చేరుతుంది ఇదంతా గమనిస్తున్న ప్రతి ఒక్కరు షాక్ తో బిత్తర పోయి అలా డిపోయి బిగిసుకుపోయి గుడ్లు తేలేసి స్థితికి చేరుకున్నారు ఇదంతా జరిగిన తర్వాత పోలీస్ ఆఫీసర్ రజిని మొత్తం రుద్రని మెచ్చుకుంటున్నాడు ఇక రుద్ర మనుషులు తనకు ధైర్యం కలిగింది నాకు ఇక అదృష్టం వచ్చింది దరిద్రం పోయింది అని అనుకుంటూ అరెస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక అమ్మాయి బండిమీద స్పీడుగా వస్తుంది రుద్ర బాగా ఫుల్లు గా ఎంజాయ్ చేసి ఫుల్లు గా మందు తాగి రోడ్డు మీద నడుస్తూ రేయ్ బావ ఎక్కడికి వెళ్ళావు రా నన్ను వెళ్ళి వదిలి వెళ్ళిపోయావా అని అంటూ ఏదేదో మాట్లాడుతూ నల్లగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు అప్పుడే ఆ పసుపు కలర్ లో దిగిన బాబీ అని అమ్మాయి ఎదురవుతూ రుద్రను చూసిన అమ్మాయి ఇతనేనా ఇతనేనా అని అనుకుంటూ పైనుంచి కిందికి చూడగా తన మెడలో ఉన్న లాకెట్ చూసి ఇతడే నాకు కావలసింది ఇతడే అని అనుకుంటుంది.ఎపిసోడ్ 6: మత్తులో రుద్ర, మెలకువలో రహస్యాలు

(సీన్ 1: మత్తులో రుద్ర, అక్షరతో సంభాషణ)

అక్షర తన బైక్‌పై వేగంగా వచ్చి రుద్ర దగ్గర ఆపింది. "హలో! మిమ్మల్ని ఎక్కడ దింపాలి? మీ పేరు ఊరు?" అని అడిగింది.

రుద్ర, మత్తులో తూగుతూ, ఆమె వైపు చూసి, "హాయ్ బేబీ! ఇక్కడ ఉన్నావ్రా? రాత్రిపూట ఇలా తిరగకూడదు. బూచోళ్ళు వస్తారు, ఎత్తుకెళ్ళిపోతారు!" అంటూ చిన్నపిల్లలకు చెప్పినట్లుగా గొణుగుతూ ఉన్నాడు.

రుద్ర పరిస్థితిని గమనించిన అక్షర చిన్నగా నవ్వింది. "సరే మాస్టర్, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ దించేసి వెళ్ళిపోతా" అంది.

"నువ్వు మాత్రం భయపడకు, నీ వెనకాలే నేనే ఉన్నా!" అని అంటూ, "చిన్నగా నన్ను అక్కడిదాకా విడిపించు" అని చెబుతూ, బైక్ ఎక్కబోయి, ఎక్కకముందే అక్షర మీద మత్తులో అలా పడిపోయాడు.

కొంచెం ఇబ్బందిగా కదులుతూ, "ఎక్కడిదాకా?" అని అడిగేలోపే రుద్ర పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు. అక్షర అటు ఇటు చూస్తూ, మెల్లగా తన కళ్ళు మూసుకుని ఏదో చూస్తున్నట్టుగా, "అంతే కదా?" అని అనుకుంది. వేగంగా బండిని నడుపుతూ, రుద్ర మరియు అతని స్నేహితుడు సుమిత్ కలిసి ఉండే ఒక చిన్న హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళింది.

(సీన్ 2: సుమిత్ ఆందోళన, అక్షర మకాం)

అక్కడ రుద్రను బైక్ మీద నుంచి దించి, అక్షర కూడా దిగింది. ఉదయాన్నే, రుద్రను పైకి తీసుకువెళుతూ, "హలో బాస్! లేవండి! ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఇద్దరం కిందపడి చస్తాం!" అని అంటూ మెల్లగా అతని తలపైన కొట్టింది.

రుద్ర మేల్కొంటూ, "ఎవరు? నన్ను లేపింది? చంపేస్తా!" అని గొణుగుతూ, చిన్నగా అడుగులు వేసుకుంటూ మెట్లు ఎక్కాడు. అక్షర అతన్ని తన రూమ్ దాకా తీసుకెళ్ళింది. డోర్ కొట్టగానే సుమిత్ డోర్ ఓపెన్ చేశాడు. ఎవరో అమ్మాయి రుద్రను తీసుకురావడంతో సుమిత్ భయంతో, "సారీ అండి! వాడు ఏదైనా తప్పు చేశాడా? క్షమించండి! వాడు చాలా మంచివాడండి, చిన్నపిల్లల ప్రవర్తిస్తాడు. మనకేం తెలీదు" అని భయంతో రుద్రను తన చేతుల్లోకి తీసుకున్నాడు. "సరే మీరు ఎవరండి? ఇతన్ని ఎక్కడ చూశారు? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా?" అని గడగడలాడుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు సుమిత్.

అక్షర చిన్నగా నవ్వి, "సారీ, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను ఏమీ అనలేదు. తాగి అలా ఇలా తూలుతూ ఉంటే, తనే తీసుకువచ్చింది అని చెప్పడంతో..."

"సారీ, నీ పేరు?" అని సుమిత్ అడిగాడు. ఒక్కసారిగా అక్షర నిద్రలోకి జారుకున్నట్లుగా, "నా పేరు అక్షర" అని చెప్పింది. ఇలా సీన్ కట్ అవుతుంది.

(సీన్ 3: రుద్ర కల – భయంకరమైన గతం)

అది గమనించిన సుమిత్, "ఏంటిది, ఇలా నిద్రపోయిందే?" అని అనుకుంటూ, తను కింద ఒక పక్కన చాప పరుచుకుని పడుకున్నాడు. రుద్ర మంచం మీద పడుకున్నాడు. అటు పక్కనే అక్షర పడుకుంది.

అలా సీన్ కట్ అవుతూ, రుద్ర కలలోకి అందరినీ తీసుకువెళుతుంది. అది ఏంటంటే...

ఒక చిన్న చీకటి రాత్రివేళ, అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అదే టైంలో ఒక కారు వేగంగా వెళ్తోంది. సీట్లో ఒక అబ్బాయి, అటు పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చూడడానికి న్యూస్ రిపోర్టర్ లా కనిపిస్తున్నాడు. అతని ముందు ఒక బగ్ లాంటి పురుగులా కనిపిస్తున్న ఒక బొమ్మ ఉంది, కానీ కళ్ళు ఉన్నట్లుండి బ్లూ కలర్‌లో వెలిగి ఏదో మెసేజ్ చెప్పి ఆగిపోయింది. అప్పుడే వెనుక నుంచి కొంతమంది కార్లు వేసుకుని వస్తున్నారు.

పక్కనే ఉన్న ఇంగ్లీష్ రిపోర్టర్ మాట్లాడుతూ, "సార్, మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి కదా? ఇది ఎలా జరిగింది? ఇలా ఎలా...?" అని అడుగుతుండగా, కారు నడుపుతున్న వ్యక్తి, "దీనికి సమాధానం కావాలంటే మనం ఫస్ట్ బతికి ఉండాలి!" అని అంటూ వేగంగా రేస్ తొక్కుతూ వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ మూడు కార్లు వచ్చి ఆ కారును గుద్దాయి. వెంటనే అది ఎగురుతూ ఒక లోయలోకి పడిపోతుంది.

ఆ పడిపోయిన వెంటనే ఆ న్యూస్ రిపోర్టర్ ఆ దెబ్బకు చనిపోతాడు. పక్కనే ఉన్న అబ్బాయి, "గేమ్ ఈజ్ ఆన్!" అని అంటూ తన నడుము పైకి చెయ్యి పోనిచ్చి ఏదో నొక్కాడు. వెంటనే అతని నుండి ఒక బ్లూ రేస్ విడుదలై, అతని చుట్టూ ఒక బ్లూ కలర్ ఆర్మర్ చుట్టుకుంది. అప్పటికి అది సగం దారిలో ఉండగా, ఒక్కసారిగా ఏదో సౌండ్ వస్తుంది. అది గాలిలోనే అవుతుంది. కారు వేగంగా వెళ్ళిపోతుంది. అప్పటికి ఉలిక్కిపడి రుద్ర లేస్తాడు.