first step in Telugu Business by Bk swan and lotus translators books and stories PDF | తొలి అడుగు

Featured Books
Categories
Share

తొలి అడుగు

తొలి అడుగు
                                                          రెండు కాళ్ళు నడచు దారి ఒకటైననూ
                                                          అడుగులన్నవి ముందు వెనుక పడును
                                                           అటులె మన పనులన్ని నెరవేరు అటు ఇటుగ
                                                             కార్య సాధక ముందుకు సాగుమిపుడే
అడుగు ... మన జీవన పదాన్ని నిర్దేశించే అతి ముఖ్యమైన అంశాల్లో అత్యంత ప్రధానమైనదీ కీలకమైనది... నిజానికి మన చిన్న తనంలో మనం నేర్చుకునే అత్యంత క్లిష్టమైన విద్యల్లో ఒకటి అడుగులు సరిగా వేయడం .... అటువంటి పసిప్రాయంలో వడి వడిగా నడవాలన్న తాపత్రయంలో మనం పడే ఆపసోపాలు చూడడం పెద్దలకు ఒక ముచ్చట వేడుక సంబరం.. వీటినే 'తప్పటడుగులు' అని అంటారు
" బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు" అని యమలీల అనే చిత్రంలోవచ్చిన పాట ఎంత గొప్ప సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.... కానీ ఈ తప్పటడుగుల వలన వచ్చే ప్రమాదం ఏమీ లేదు .. వినోదం తప్ప ....
కానీ మనం జీవితాంతం వేసే అడుగులు కొన్నుంటాయి .. అవే మనం తీసుకునే నిర్ణయాలు... ఇవే మనల్ని అందాలన్నీ ఎక్కిస్తాయి అలాగే కాస్తో కూస్తో తేడా వస్తే.. అధః పాతాళానికి పడేస్తాయి... చరిత్రలో నిలిచిపోయేలా చరిత్ర సృష్టించిన ఎందరో ఈ నిర్ణయాల విషయంలో తప్పటడుగులు వేసి తమ భవిష్యత్తును అంధకార బంధురం చేసుకున్నారు ... అలాగే వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ భవితను వాళ్లనే నమ్ముకున్న వాళ్ల .. భవిష్యత్తునూ సందిగ్ధాలు సుడిగుండంలో పడేశారు.. అలాంటి వారు చేసిన తప్పులకు వాళ్ళను నిందిచడమో లేక అపహాస్యం చేయడమో కాకుండా వారి అపజయాలనుండి గుణపాఠాలు నేర్చుకుని మన జీవితం లో అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి
                                               ఆలోచనలే మనసు లోచనాలు.. అంటే కళ్ళు
                                               ఆచరణలో కర చరణాలు .. అంటే చేతులూ కాళ్ళు
ఎవరు అవునన్నా కాదన్నా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ సిద్ధాంతం నూటికి నూరుపాళ్లూ నిజం.. అంతెందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా ఒక ఆరోగ్యవంతమైన మనిషికి ఉండవలసిన లక్షణాల్లో ఆర్ధిక పరమైన పరిపుష్టికూడా ఒకటని తేల్చి చెప్పింది
ఈ రోజుల్లో చాలా మంది ఎదో ఒక రకంగా డబ్బు సంపాదిస్తూనే ఉన్నారు .. కానీ కొందరు మాత్రమే సంపన్నులుగా ఎందుకు అవుతున్నారు .... ఎందుకంటే మనం జీవితంలో తీసుకునే ప్రతీ నిర్ణయం మన జీవితాన్ని క్రొత్త మలుపు తిప్పడం కాదు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది .. అందువల్ల మనం మనసు తో అలోచించి బుద్ధితో తీసుకునే ప్రతీ నిర్ణయం మనం జీవితం లో వేసే తోలి అడుగే.. ఆ నిర్ణయాలే సరైనవైతే చెక్కుచెదరని గొడుగులై మనల్ని సమస్యల జడివానలా నుంచి రక్షిస్తాయి కానీ అవి మానని ఏ మాత్రం తప్పుదారిలో నడిపించినా జీవితాంతం వెంటాడి పీడించే పిడుగులై మననీ మన ఉనికినీ సర్వ నాశనం చేసి నామరోపాల్లేకుండా మసి చేస్తాయి
మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మనిషి బాగా ఆలోచించి అలోచించి పరిశీలించి పరిశీలించి సమీక్షించి పునః సమీక్షించి తీసుకోవాల్సిన అతి కొద్దిపాటి నిర్ణయాల్లో అత్యంత కీలకమైనవి పెట్టుబడులు .. కాదంటారా
నమ్మకమే జీవితం అని అంటారు అలాంటిది మనల్నే నమ్ముకుని మన మీదనే ఆధారపడి ఉన్న ఎన్నో జీవితాల ఆశలూ ఆశయాలూ బుగ్గిపాలు కాకూడదంటే మనం పెట్టె పెట్టుబడులు ఎంత నమ్మకమైన రంగంలో పెట్టుబడి పెట్టాలి.. ఆ రంగంలోకూడా ఏ సంస్థలో పెట్టాలి .. నన్నడిగితే దీర్ఘకాలిక ప్రయోజనాలనిస్తూ మన స్వర్ణిమ భవిష్యత్తును సుస్థిరం చేసే రంగం ఏదైనా ఉంది అంటే భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన మన రియల్ ఎస్టేట్ రంగం.. అందుకేనేమో "మనిషిని నమ్మితే ఏముందిరా మన్నుని నమ్మినా ఫలితముందిరా.." అని ఏనాడో అన్నారు .. కానీ నిజానికి మనం నమ్మాల్సింది మట్టినీ మనిషినీ ఇద్దర్నీ.. ఎందుకంటే మనంకూడా మనుషులమే మనం బ్రతకాల్సింది కూడా ఈ మట్టిలోనే .. కాబట్టి రండి మనమంతా మట్టినే నమ్ముకుందాం .. మనీ ప్లాంట్లను కొందరు ఇళ్లలో పెంచుకుంటారు మంచిదే.. కానీ నిజంగా మనం లాభపడాలంటే మాత్రం మనం నాటాల్సింది పెట్టుబడి వృక్షాలు అదీ ఈ భూముల్లో .. అప్పుడు అవి అందించే అభివృద్ధి ఫలాలను వాటి సుఖశాంతులు నీడల్లో కూర్చుని మన తరాలు కాదు మన ముందు తరాలుకూడా ఆస్వాదిస్తాయి .. మరి మాతో కలిసి ఈ ప్రయాణంలో మరో తోలి అడుగు వేయడానికి మీరు సిద్ధమా.. సిద్ధమా చెప్పండి.. ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను ఇక్కడ మీరు వేసే ప్రతి అడుగూ మాయ సభ లో దుర్యోధనుడు వేసే అడుగులాంటిది కాదు మిమ్మల్ని కష్టాల మడుగులో ముంచేయడానికి... రావణ సభలో అంగదుడు వేసిన అడుగులాంటిది .. ఎవ్వరు ఎంతగా కదిలించాలని చూసినా ఒక్క అరంగుళం కూడా కదిలించలేనంతగా సుస్థిరం చేసింది.. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్.. చంద్రుడి మీద మానవుడు వేసిన తోలి అడుగు ఒక చరిత్ర.. కానీ ఇక్కడ వేసే ప్రతీ అడుగూ మన భవిష్యత్తు.. అందుకోసం మనం అందరం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అవ్వవలసిన అవసరం లేదు కేవలం మన మైండ్ సెట్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటే చాలు అందుకు కావాల్సిన స్ట్రెంగ్త్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం
so .. come on friends why are you still waiting .. let's plant the plants of our dreams in the these lands to reach the peak of success which is beyond the sky.. thank you