If you look back in Telugu Motivational Stories by Lakshmipriya books and stories PDF | వెనక్కి తిరిగి చూస్తే....

Featured Books
Categories
Share

వెనక్కి తిరిగి చూస్తే....

అయిపోయిన అపజయాన్ని, అసత్యపు నిజాన్ని నెమరువెసుకుంటూ ఉంటే....జీవితం దుఃఖ్తానికి బానిస అవ్వవలసి వస్తుంది...

మహాకవులు చెప్తూ ఉంటారు....

@వెకక్కి తిరిగి చుస్తే వెన్నుముక కళ్ళకు కనిపించదు కానీ, వెన్నుముకకు నొప్పి వస్తే చూడలేని ఆ కళ్ళే కన్నీరు పెడతాయి అని @

అంటే.... గటించిపోయిన గత తాలూకు కష్టాలను తలంచుకున్నా.. అవి ఇక కనిపించవు అయినా నువ్వు తలంచుకుంటూ ఉంటే చూడలేని ఆ కళ్ళు గుర్తు తెచ్చుకున్న మనసు బాధకు గురి కావాల్సి వస్తుంది... కన్నీరు కార్చే ఆ కళ్లు మసకభారతాయి ఆ మసకలో ఏది క్లియర్ గా కనిపిస్తుంది చెప్పండి

అందుకే వెనక్కి చూడొద్దు....చూడలేని నీ కళ్ళను కూడా బాధ పెట్టవద్దు.....

@గతం వద్దు ప్రస్తుతం ముద్దు ఇక భవిష్యత్తుకు

అస్సలు ఆలోచన వద్దు @

ప్రస్తుతాన్ని ప్రేమించేయ్ సంతోషం నీ దగ్గరికి వస్తుంది.. గతాన్ని ఆరాధిస్తే కష్టం నీ బానిస అవుతుంది...

గతంలో 13 సంవత్సరాలకే పెళ్లి అయిన ఒక నర్సు జీవితం...(8వ తరగతిలో)

20 ఏళ్లకే 3గురు పిల్లలు భర్తతో విడాకులు...

ఈమె ప్రస్తుతం  నర్సు మరి 8వ తరగతి చదివిన ఈమె నర్సు ఎలా అయ్యింది...

విడాకులు తర్వాత గతానికి చింతించకుండా వెనక్కి తిరిగి తన కళ్ళకు కన్నీరు ఇవ్వకుండా ప్రస్తుతంపై పరుగులు తీసింది 3గురు పిల్లలు ఉన్న మళ్ళీ బడి బాటకు పయనమైయ్యింది..

సాధించింది....

ఆ జయం ప్రస్తుత బాటకు గతుకులు లేకుండా సిమెంట్ వేసింది....

గతం అనుకుంటే అనుకూలత లేదు

గతం రాదు అనుకుంటే ప్రస్తుతమే...

భవిష్యత్తును తీసుకువస్తుంది...

విజయాలు సాధించిన లెజెండ్స్ అందరూ...

అపజయాలు పలుమార్లు రుచి చూసినవారే..

వాళ్ళు కూడా వాళ్ళ అపజయాల వైపు వెనక్కి చూస్తే.... ఈ రోజు వాళ్ళు కనిపెట్టిన అనేక వస్తువులు మనం వాడడానికి ఉండేవి కాదు...

 44 ట్రైన్లు కాలుపై ఎక్కిన అరునిమా సిన్హా...

ఈమె ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా దొంగల బారిన పడి అనుకోకుండానే దురదృష్టం ఆమెను వెంటాడింది కిందకు పడిపోయింది ఒకదానిపై ఇంకొకటి కాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తు ఉన్నలోపు ఇంకొక ట్రైన్ ఇంకొకటి... ఇంకొకటి... ఇంకొకటి ఇలా 44 ట్రైన్లు తన కాలుపై పయనించాయి కాలు గుజ్జు గుజ్జుగా మారింది

ఇక చనిపోయే స్టేజ్ కి వచ్చేసింది...

మొత్తానికి ఒక దయగల హృదయం కలిగిన వ్యక్తి తనను చూసి రైల్వే హాస్పిటల్ లొ చేర్చాడు..

ఇక్కడ ఈయనను చూస్తే ఇంకా మంచి చచ్చిపోలేదు అనిపిస్తుంది...

అక్కడ ఆ హాస్పటిల్ లొ అరగంటలో చనిపోయే స్టేజ్ లొ ఉన్న ఆమెను రక్షించిన డాక్టర్ ను గుర్తుకు తెచ్చుకుంటే మానవత్వం మాయమైపోలేదు అనిపిస్తుంది... మొత్తానికి ఆమె బ్రతికింది  కానీ....

కాలును పూర్తిగా కోల్పోయింది..

ఆమె పరిస్థితిని తలంచుకోలేదు కాలు లేదని చింతించలేదు... "వెనక్కి తిరిగి చూడలేదు"

తన డ్రీమ్ వైపే చూస్తుంది  డ్రీంతోనే డీల్ కుదుర్చుకుంది పోరాటం మొదలు పెట్టింది

మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే తన కోరికను కసితొ గట్టిగా కౌగిలించుకుంది... చివరికి సొంతం చేసుకుంది....

గతాన్ని నువ్వు స్వాగతిస్తే స్థితిగతులను అది మార్చేస్తుంది.

గాతనికే నువ్వు గతిలేని స్థితిని తీసుకువస్తే...

కంటికి కనిపించకుండా పోతుంది...

మనిషిని చూడకు మందలో ఒకటైపోతావ్

మనసును చూడు మందిలో ఒకటిగా ప్రత్యేకమవుతావ్...

అనవసరంగా నీ మైండ్ కి  గత తాలూకా జ్ఞాపకాలను పంచకు, ఎంచకు..

ఇక తీపి జ్ఞాపకాలైతే తీయని పదార్ధంలా తినిపించు శక్తిని పొందుకో...

ఉత్సాహంగా ఉండడానికి పనికివస్తుంది...

బర్రెలు కాచుకునే కుర్రాడు కూడా నిన్న నేను ఈ బర్రెలకు ఎక్కడ మేతను ఇచ్చాను అని ఆలోచన చేయడు వీటిని మేతకు ఈ రోజు ఎక్కడికి తోలుకుపోవాలి అని ఆలోచిస్తాడు అంటే...

నిన్నటి వైపుకు చూడడం లేదు ఈ రోజు కోసం  ఆరాటపడుతున్నాడు...

ఓ మిత్రమా!   నిన్నటి కోసం ఆరాటపడితే...

.                     భవిష్యత్తకు బాధ కలుగుతుంది..

.                     భవిష్యత్తు కోసం ఆలోచిస్తే

.                     ప్రస్తుతం ఏడుస్తుంది....

ప్రస్తుతానికి నువ్వు సంతోషాన్ని ఇస్తే...

భవిష్యత్తు జయంతో గంతులు వేస్తుంది..

@అందుకే వెనక్కి చూడొద్దు @

చూసేకొద్దీ దారి తరగదు...

గోల్ కనబడదు....

మీకు తెలుసా!

@మంచినికి మాయ తెలీదు

మాయకు మంచి తెలీదు@

అందుకే...

మాయచేసిన గతం దుమ్ము దూళి అనే చెడ్డ మాత్రమే ఇస్తుంది దానితో నిన్ను....

ఇంకా చెడ్డగా మారిన కష్టం 

అనే మేఘాలు....

నీపై కన్నీళ్లు అనే కక్షపు వర్షం కురిపిస్తుంది

దీనితో..... ప్రస్తుతానికి సిద్దమై అందంగా కనిపించే నిన్ను  అందవికారంగా చేస్తుంది...

ఇది చెడ్డ తాలూక గతపు లక్షణాలు....

ప్రస్తుతం చాల అందమైనది మిత్రమా...

అందుకే వెనక్కి చూడొద్దు...

@ మేఘం వర్షాన్ని అడిగిందట@

మేఘం మేఘం...

ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు నాకంటే ఎక్కువగా ఇచ్చే వర్షంలా మారవా? అని 

మేఘం అందట...

ఇంతకు ముందు... అనే మాటే నాకు అవసరం లేదు ఇంకా ఇప్పుడు నేను దట్టంగా మారాలి

అనే ఆలోచనే నాకు మైండ్ లొ మెదులుతూ ఉంటుంది అందుకే cyclone పేర్లు మారుతూ ఉంటాయి అందట... 👏👏👏

ఇంత లోతుగా మనం ఆలోచిస్తే మరి మనకు సాటి ఎవ్వరు నాయనా???

మన ఆలోచనకు మన మనసే  సలాం కొడుతోంది....

సంతోషం వెనకాల కష్టం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది....

వెనకాల కష్టం  నడుస్తుంది కాబట్టి...

సంతోషపు అడుగులు ఆగినా, వెనక్కి చూసినా

కష్టం మనల్ని డికొంటుంది కదా...

అందుకే...

@వెనక్కి చూడొద్దు @

@నిన్ను ప్రేమిస్తున్నాను అని వెనకాల పడే వారిని చూస్తే.... కరిచే చలిలో నిన్ను దింపి రోగానికి గాయపడిన బాధితుడిగా మారుస్తారు 

అదే తనను ప్రేమించేటట్టు చేసుకుంటే తన ప్రవర్తన ఉంటే వెనక ఉన్న కష్టం ఆ ఇష్టంలో కరిగిపోయి మాయమైపోతుంది...

ఇక సంతోషం మాత్రమే మిగులుతుంది

అందుకే.....

@వెనక్కి చూడొద్దు @ 


ఇట్లు

మీ లక్ష్మి ప్రియ..... ✍️