Deep Web in Telugu Detective stories by SriNiharika books and stories PDF | డీప్‌ వెబ్‌

Featured Books
Categories
Share

డీప్‌ వెబ్‌

డీప్‌ వెబ్‌ (Deep Web):
అర్థం:
సాధారణ శోధన ఇంజిన్లతో సూచిక చేయబడని వెబ్ యొక్క భాగం.
ఉదాహరణలు:
ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, ప్రైవేట్ డేటాబేస్‌లు, ఈమెయిల్ ఖాతాలు, రక్షిత ఫైల్‌లు మొదలైనవి.
ప్రవేశం:
నిర్దిష్ట జ్ఞానం లేదా ఆధారాలు అవసరం, సాధారణ శోధన ఇంజిన్ల ద్వారా ప్రాప్యత లేదు.
ప్రయోజనం:
ప్రధానంగా వ్యక్తిగత లేదా సురక్షిత సమాచారం కోసం, ఇది బహిరంగ ప్రదర్శన కోసం రూపొందించబడలేదు.
అసాంఘీక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా డార్క్ వెబ్ నెలవైంది. ఈ వెబ్సైట్లో దొరకనిది అనేది ఉండదు. మనిషిని చంపాలన్న మనిషిని వెంటాడి కిడ్నాప్ చేయాలని, డ్రగ్స్ కావాలన్నా, ఆయుధాలు కావాలని డార్క్ వెబ్‌లో విచ్చలవిడిగా దొరుకుతాయి.
 డార్క్ వెబ్ పైన ఎవరు నిఘా పెట్టలేదు. అయితే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డార్క్ వెబ్ పైన నిఘా పెట్టారు. సిటీ పోలీస్ నుంచి ఎప్పటికప్పుడు డార్క్ వెబ్‌ పై అనాలసిస్ చేస్తున్నారు.
అంతేకాదు డార్క్ వెబ్ నుంచి ఎవరైనా యాక్సెస్ అవుతే వెంటనే పోలీసులకు సమాచారం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే డార్క్ వెబ్ అనాలసిస్ చేస్తున్న పోలీసులకు యూనివర్సిటీ కాలేజీ లో చదివే విద్యార్థులు పెద్ద ఎత్తున డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు తేలింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
చదువుతున్న సాయి విగ్నేష్ అనే విద్యార్థి పెద్ద మొత్తంలో ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా బయటపడింది. దీంతో సాయి విగ్నేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సాయి గత కొంత కాలం నుంచి గంజాయి కి అలవాటు పడ్డాడు. ఇటీవల కాలంలో గంజాయి పై కట్టడి పెరగడంతో డార్క్ వెబ్ ద్వారా గంజాయిని తీసుకొని రావడం మొదలు పెట్టాడు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని పోలీసుల విచారణలో బయట పడింది. అయితే ఇద్దరు విద్యార్థినీలు, విద్యార్థులతోపాటు సాయి విగ్నేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో సాయి విగ్నేష్ అతిపెద్ద నెట్వర్కులు ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఇంజనీరింగ్ తో పాటుగా డిగ్రీ చదివే విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి విద్యార్థులకు పెద్ద మొత్తానికి అమ్మి వేశాడు. సాయి విగ్నేష్ తో పాటు ప్రతిభ డిగ్రీ, కాలేజ్ అవినాష్, ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు పలు సాఫ్ట్వేర్ కంపెనీలో కీలక పదవుల్లో ఉన్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 దీంతోపాటుగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అంతా కూడా గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. వీళ్లంతా కోవిడ్‌ సమయంలోనే అలవాటు పడ్డారని పోలీసుల విచారణలో బయట పడింది.
డార్క్ వెబ్ పైన నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎవరైనా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ తీసుకున్నట్లయితే వాళ్ళ పైన తీవ్ర చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఇకపోతే లో జొమాటోలో పనిచేసే డెలివరీ బాయ్ కూడా కొత్తరకంగా ఆలోచన చేశాడు. ఎవరికైతే డ్రగ్స్ కావాలో వాళ్ళకి డోర్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ధూల్ పేట కేంద్రంగా మహేందర్ సింగ్ అనే జొమాటో బాయ్ డెలివరీ నేరుగా ఇంటికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. డెలివరీ బాయ్ కూడా ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి డ్రగ్స్ సరఫరా చేశారు.
 చాలామంది డెలివర్ బాయ్స్ గంజాయ్ డ్రగ్స్ లాంటివి సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. వీళ్ళ పైన కూడా నిఘా ఉందని త్వరలోనే చాలామంది కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇప్పుడు డ్రగ్స్ వాడకం కోసం కొత్త రూటు ఎంచుకున్నారు.
 డ్రగ్స్ వాడకంలో కొత్తకొత్త పందాలను ఎంచుకుంటున్నారు. గతంలో రేవ్ పార్టీల పేరుతో ఎంజాయ్ చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఇప్పుడు కొత్త విధానంతో ముందుకు పోతున్నారు. కరోనా ఈ సమయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ లు కొత్త పేరు పెట్టుకున్నారు. నెట్ ఫిక్స్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన హౌస్ ఆఫ్ కార్డ్స్ పేరుకు తగ్గట్టుగానే హౌస్ పార్టీలను నిర్వహిస్తున్నారు.
హౌస్ పార్టీల పేరుతో ఇప్పుడు డ్రగ్స్ , గంజాయిని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు వాడుతున్నారు. దీనికితోడు సౌండ్ ను విపరీతంగా గదుల్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పోలీసులకు వస్తున్న సమాచారంతో నిఘా పెట్టారు.
పని ఒత్తిడితో పాటు ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా మాదాపూర్ జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడా, సికింద్రాబాద్, మారేడిపల్లి తదితర ప్రాంతాల్లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఎక్కువగా హౌస్ పార్టీలను నిర్వహిస్తుండగా బయటపడింది.
ఇందుకోసం నైజీరియాతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ లకు హెరాయిన్, కోకేన్‌, ఎండిఎంఏ, ఎల్ఎస్డీ, లికస్తి పిల్స్ ను సరఫరా చేస్తున్నారు..
 నిఖిల్ చెన్నై అనే డీజే ప్లేయర్ ని అదుపులోకి తీసుకోవడంతో హౌస్ పార్టీలకు సంబంధించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్ తో పాటు నైజీరియన్ నిక్కొల్స్ పట్టుకోవడం తో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కెమికల్ డ్రగ్స్ తో పాటు గంజాయిని కూడా వీళ్లు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు సరఫరా చేసినట్లు విచారణలో బయట పడింది. నిఖిల్ గంజాయితో తయారుచేయబడిన యాషిస్‌ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా కెమికల్ డ్రగ్స్ ను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు సరఫరా చేశాడు.
దీనికి తోడుగా స్టాక్ మార్కెట్లో బ్రోకెన్‌ చేసే అతి పెద్ద వ్యాపారి పాండేతో వీరికి స్నేహం ఏర్పడింది. అదిలాబాదు జిల్లాకు చెందిన సోనీ రావు అనే రైతు తో కూడా పరిచయం పెంచుకున్నారు. సోనే రావు తన పొలంలో గంజాయి పండిస్తాడు.
దీనిని లకన్ అనే మరొక రైతు ద్వారా గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తారు. వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇలా తీసుకువచ్చిన గంజాయిని పాండేకు అప్పగిస్తారు. ఈ గంజాయిని నిఖిల్ తీసుకెళ్లి ఇస్తాడు. నిఖిల్ కాస్త యాషిస్‌ తయారు చేస్తాడు.. ఇలా తయారు చేసిన ఆయిల్ నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు సరఫరా చేస్తున్నారు.
ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు కాస్త హౌస్ పార్టీల పేరుతో వీకెండ్ లో ఎంజాయ్ చేస్తారు. శుక్రవారం అర్ధరాత్రి మొదలయ్యే ఈ హౌస్ పార్టీలు ఆదివారం తెల్లవారుజాము వరకు నడుస్తుంటాయి. ఇక్కడ గానా, తానా, తందానా కొనసాగుతాయి.
రెండు రోజులపాటు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని విధంగా వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి హౌస్ పార్టీలు ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయిందని అధికారులు చెబుతున్నారు. అరెస్టయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లో ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న వారి అధికంగా ఉన్నారు. అంతే కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులు సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
 ఇప్పటి వరకు 11 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అంతేకాకుండా ఇందులో డీజే నిఖిల్ కూడా అరెస్టు చేయడంతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఎక్కడెక్కడ పని చేసాడు. ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా చేసాడా..? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.