The POCSO (Protection of Children from Sexual Offences) Act covers a broad range of sexual offences against children, including sexual assault, sexual harassment, and using a child for pornography. Specifically, the Act addresses penetrative sexual assault, aggravated penetrative sexual assault, non-penetrative sexual assault, aggravated sexual assault, sexual harassment, and using a child for pornographic purposes.
Key aspects of POCSO Act cases:
Sexual Assault:
This includes various forms of sexual acts, including penetrative acts, sexual intercourse, and non-penetrative acts like touching or molestation.
Aggravated Sexual Assault:
This involves sexual assault with additional aggravating factors, such as the use of a weapon, causing injury, or involving multiple offenders.
Sexual Harassment:
This includes unwanted sexual advances, requests for sexual favors, and other verbal or physical conduct of a sexual nature that creates a hostile environment.
Use of Child for Pornography:
This involves using a child in a sexual context, including the production, distribution, or possession of pornography involving a child.
Child Pornography:
This includes creating, possessing, or distributing child pornography, even if it’s not used for commercial purposes.
Penetrative Sexual Assault:
This is a specific type of sexual assault that involves the penetration of the child’s body by another person.
Aggravated Penetrative Sexual Assault:
This involves penetrative sexual assault with aggravating factors, such as the use of a weapon or causing serious injury.
Child-Friendly Mechanisms:
The POCSO Act also emphasizes child-friendly mechanisms for reporting, recording, and processing cases, ensuring the child’s interests are protected throughout the legal process. This includes creating a child-friendly atmosphere in court, ensuring the child’s evidence is recorded in a way that minimizes trauma, and providing support services for the child and their family.
Punishments:
The POCSO Act prescribes penalties for various offenses, including imprisonment and fines. The severity of the punishment depends on the nature and circumstances of the offense, with harsher penalties for aggravated offenses.
Special Courts:
The Act also provides for the establishment of Special Courts to ensure speedy trials and the protection of children’s interests. These courts are equipped to handle POCSO cases with the necessary expertise and resources.
పోక్సో చట్టం కింద లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు కఠినమైన శిక్షలు విధించబడతాయి. లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారికి 10 నుండి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించవచ్చు, ఇది జీవిత ఖైదు వరకు కూడా పొడిగించబడుతుంది.
పోక్సో చట్టం కింద శిక్షలు:
లైంగిక వేధింపులు:
కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఇది జీవిత ఖైదు వరకు పొడిగించబడుతుంది.
అత్యాచారం:
కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఇది జీవిత ఖైదు వరకు పొడిగించబడుతుంది.
16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం:
కనీసం 10 నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష.
జరిమాన:
లైంగిక నేరాలకు పాల్పడిన వారికి జరిమానా కూడా విధించవచ్చు.
నేరం తెలిసినా ఫిర్యాదు చేయకపోవడం:
పోక్సో చట్టం ప్రకారం, పిల్లలపై నేరం జరిగిందని తెలిసినా ఫిర్యాదు చేయకపోతే కూడా నేరంగా పరిగణించబడుతుంది, దానికి కూడా జైలు శిక్ష ఉంది.
పోక్సో చట్టం పిల్లల లైంగిక రక్షణ కోసం రూపొందించబడిన చట్టం. ఈ చట్టం లైంగిక నేరాలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించేందుకు ఉపయోగిస్తారు.
POCSO Act: చిన్నారులను చిదిమేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు,బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై ఈ దుర్మార్గులు వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది.
POCSO Act: “తల్లిదండ్రులు పని కోసం బయట వెళ్ళారు. ఇంటి పక్కన ఉన్న పెద్దాయిన వారి పాపపై కన్నేశాడు. చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆడకుంటున్నా పాపపై ఇలాంటి అఘాయిత్యమే, బడిలో చదువుతున్న పాపపై మాస్టర్ కన్ను, పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్తున్న చిన్నారిపై ఓ కుర్రాడు అకృత్యం”
గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు ప్రాణాన్నికూడా చిదిమేస్తున్నారు కామాందులు. పిల్లల జీవితాలను ఛిద్రం చేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు,బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి పరిణామాలు సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
POCSO చట్టం
ఇలాంటి ఘటనలపై తీవ్ర వేదన వ్యక్తం చేస్తూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం POCSO చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.
2012లో వచ్చిన ఫోక్సో చట్టం (The Protection of Children from Sexual Offences Act, 2012) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు . వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు.
చట్టంలోని ప్రధానాంశాలు
మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది. తప్పనిసరిగా రెండు నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది.
అత్యాచార కేసులలో అప్పీళ్ల పరిష్కారానికి ఆరు నెలల కాలపరిమితిని కూడా నిర్దేశించింది. బాలికపై లైంగికంగా హింసిస్తే POCSO చట్టం కింద నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండాహైకోర్టు సూచనలతో కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా పోక్సో ఈ-బాక్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల్లో ఫిర్యాదు చేసేలా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది.
POCSO Act: చట్టానికి అవరోధాలు
చాలామంది చిన్న పిల్లలు లైంగికవేధింపులు ఎదుర్కొంటునప్పటికీ వారిని గుర్తించలేకపోతున్నారు. దీంతో కీచకులపై ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. ఇదే దుర్మార్గులకు అనుకూలంగా మారింది. ముద్దు, లైంగిక చర్యకు ప్రేరణ, రహస్య భాగాలను తాకడం, నగ్నచిత్రాలను చూపడం వంటివి వేధింపుల్లో భాగమేననే విషయం చిన్నారులకు తెలియడం లేదు. చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే వారు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులై ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.
అత్యాచారం కేసుల్లో నిందితుడు బాధితురాలి కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే శిక్షల విషయం సమస్య మరింత పెద్దదవుతోంది. కుటుంబ సభ్యుడు లేదా బంధువు ద్వారా లైంగిక వేధింపులకు గురైన చిన్నారి బాధితురాళ్లు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు వాస్తవికంగా చాలా తక్కువగా ఉన్నాయి.
పోక్సో ఎందుకు తెచ్చారు?
దేశంలో తరచూ చిన్న పిల్లలపై లైంగిక నేరాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2022లో పిల్లలపై నేరాల విషయంలో 1,62,449 కేసులు నమోదైతే, అందులో సుమారు 64,500 కేసులు (39.7శాతం) పోక్సో కింద నమోదైనవే.
ఇలాంటి నేరాలను స్పష్టంగా నిర్వచిస్తూ శిక్ష వేసే చట్టాలు గతంలో (2012కి ముందు) లేవు. అప్పటికే అందుబాటులో ఉన్న చట్టాలు, అంటే ఐపీసీలోని పలు సెక్షన్లు పిల్లలకు పెద్దగా రక్షణ ఇవ్వలేకపోయాయి.
ఐపీసీ 354 అంటే మహిళ గౌరవానికి భంగం కలిగించడం, 375 అంటే అత్యాచారం, 377 ప్రకృతి వ్యతిరేక లైంగిక చర్యలు – ఈ మూడు మాత్రమే 2012 కి ముందు లైంగిక వేధింపుల చట్టాలుగా ఉండేవి.
‘’ఉదాహరణకు 354 సెక్షన్ కింద మహిళ గౌరవానికి భంగం కలిగించడం అంటే ఏంటనేది స్పష్టంగా లేదు. దాని నిర్వచనం కోర్టు తీర్పులను బట్టి మారేది. దానికి తోడు చిన్న పిల్లల్లో అబ్బాయిలపై ఏదైనా నేరం జరిగితే ఈ సెక్షన్ కింద అది నేరం కాబోదు. అన్నిటికీ మించి ఇది రాజీపడదగిన కేసు. ఇక 375 సెక్షన్ కింద కూడా కేవలం పెనిట్రేషన్ జరిగితేనే నేరం. మరే రూపంలోనూ అది నేరం కాకుండా ఉండేది. ఈ సెక్షన్ కూడా చిన్న పిల్లల్లకూ, అందునా మగ పిల్లలకు ఏ ప్రత్యేక రక్షణా ఇవ్వడం లేదు.’’ అని న్యాయవాది శ్రీనివాస్ బీబీసీకి వివరించారు.
‘‘ సెక్షన్ 377 కింద ఒకే జెండర్ వ్యక్తుల మధ్య శృంగారంతో పాటూ, ఇతరత్రా అసహజం అని అప్పటి బ్రిటిష్ చట్టాలు, తరువాత భారతీయ న్యాయమూర్తులు నిర్వచించిన లైంగిక చర్యలన్నీ ఉండేవి. అప్పుడు కూడా పెనేట్రేషన్ జరిగితేనే ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుంది. ’’
‘‘అయితే భారతదేశంలో తరచూ చిన్న పిల్లలపై పెద్దలు చేసే అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెక్షన్ల బదులు ఒక ప్రత్యేక చట్టమే రావాలంటూ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేసేవారు. ఆ క్రమంలోనే పోక్సో చట్టం వచ్చింది.’’ అని శ్రీనివాస్ తెలిపారు.
‘’అంతకుముందు సంప్రదాయ ఐపీసీ పరిధిలోకి రాని అనేక అంశాలను ఇందులో నేరాలుగా గుర్తించారు. చిన్న పిల్లల విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అందరికీ రక్షణ కల్పించారు. దీనివల్ల చిన్న వాళ్లయినా మగ పిల్లలపై నేరాలు చేసే వారిని కూడా శిక్షించొచ్చు.’’
‘‘అలాగే కేవలం పెనెట్రేషన్ జరిగితేనే నేరం, అది చేయకుండా ఇంకా ఏం చేసినా నేరం కాదు అనే వ్యవస్థ ముగిసింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే సంప్రదాయబద్ధంగా రేప్ అని సమాజంలో గుర్తించే చర్య మాత్రమే కాకుండా, ఆ దిశగా చేసే లైంగికపరమైన నేరాలన్నిటినీ శిక్షార్హమైనవిగా గుర్తించారు.’’ అన్నారు శ్రీనివాస్.
పోక్సో చట్టం 2012 ముందు అమలులో ఉన్న చట్టాలు
మార్చు
పోక్సో చట్టం 2012 ముందు, గోవా చిల్డ్రన్ యాక్ట్ 2003 అనేది పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ఏకైక చట్టం.[11] బాలలపై లైంగిక వేధింపుల నేరాలు భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ల కిందకు వచ్చేవి.
అవి..
ఐ.పి.సి. (1860) సెక్షన్ 375- అత్యాచారం
ఐ.పి.సి. (1860) సెక్షన్ 354- దౌర్జన్యం, స్త్రీ అణకువకు భంగం కలిగించడం
ఐ.పి.సి. (1860) సెక్షన్ 377- అసహజ నేరం
ఐ.పి.సి. సెక్షన్ 511- నేరాలు చేయటానికి ప్రయత్నించడం
అయితే, ఇవి పిల్లలను సమర్థవంతంగా రక్షించలేకపోయేవి. అందుకని ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం పోక్సో చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించిన వారికి ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 2012లో వచ్చిన ఫోక్సో చట్టం 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారు.