రక్తం రాత్రి
ఉదయం ఏడుగంటల సమయం...ఉత్తరప్రదేశ్‌లోని బడౌత్ పోలీస్‌స్టేషన్...ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఏదో పనిమీద ఆ సమయానికే స్టేషన్ చేరుకున్నాడు.ఆయన కుర్చీలో కూర్చోబోతుండగా ఓ వ్యక్తి హడావుడిగా స్టేషన్‌లో అడుగుపెట్టాడు.ఆయాసంతో రొప్పుతున్నాడు.బహుశా చాలాదూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఉండాలి లేదా పరుగు పరుగున వచ్చి ఉండాలి అని అనుకున్నాడు ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్.ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఆ వ్యక్తి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘సార్ ఘోరం జరిగిపోయింది. ఎవరో మా అన్నను హత్యచేశారు’’ అని గద్గదస్వరంతో అన్నాడు.హత్య అనే మాట వినగానే ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఉలిక్కిపడ్డాడు.తను ఈ స్టేషన్‌లో డ్యూటీలో చేరినప్పటి నుంచి చాలావరకు నేరాలు అదుపుచేశాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఏకంగా హత్య అంటే? ఇది తమ పోలీసులకే సవాల్‌గా అనిపిం చింది.ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఆ వ్యక్తిని కూర్చోబెట్టి గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. ఆ వ్యక్తి నీళ్ళు తాగి కాస్త సేదతీరాక అతడి నుంచి హత్య ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? శత్రువులు ఎవరైనా ఉన్నారా? మొదలైన వివరాలు రాబట్టాడు.ఆ వచ్చిన వ్యక్తి తన పేరు రమేశ్ అని, పక్కనే గల కోతానా గ్రామంలో తన సోదరుడు భాస్కర్ కిల్లీ కొట్టు నడుపుతుంటాడని, నిన్న రాత్రి అతను కిల్లీకొట్టు ముందు నిద్రపోతుండగా ఎవరో కత్తులతో పొడిచి చంపేశారని చెప్పాడు.ఇన్‌స్పెక్టర్ మనోహర్ సింగ్ కేసు నమోదు చేసుకుని వెంటనే తన సిబ్బందిని వెంట బెట్టుకుని ఘటనాస్థలికి చేరాడు.
అప్పటికే ఘటనాస్థలం దగ్గర జనం గుమిగూడి ఉన్నారు.జనాన్ని పక్కకు తప్పించి ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు.మృతుని వయసు ముప్ఫయి ముప్ఫయి ఐదు మధ్య ఉంటుంది. శవం వెల్లికిలా పడిఉంది. శరీరం మీద అనేకచోట్ల కత్తిపోట్ల గుర్తులు కనిపిస్తున్నాయి. వాటి ద్వారా స్రవించిన రక్తం నేల మీద గడ్డకట్టి ఉంది. శవం పక్కనే నులక మంచం ఉంది. నేల మీద ఉన్న పరుపు అస్త వ్యస్తంగా ఉంది.అది చూసి ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.తరువాత భాస్కర్ అంగట్లోని వస్తువులను పోలీసులు తనిఖీచేశారు. ఏదైనా నిషిద్ధ వస్తు వులను అతను అమ్ముతున్నాడా? ఆ క్రమంలో అతని హత్య జరిగిందా? లేదా దొంగతనం జరిగిందా? దొంగతనం కోసం వచ్చిన వాళ్ళు హత్య చేసి ఉండొచ్చా? అనే అనుమానంతో.
***********************
హఠాత్తుగా మెలకువ వచ్చిందతనికి. లేచి మంచినీళ్ళు తాగి పడుకోబోతూ పెరటి తలుపులు తీసివుండటం చూసి ఆశ్చర్యపోయాడతను. దొంగలు పడ్డారేమోనని భయపడి తల్లిదండ్రులను నిద్రలేపాడు. కానీ అతడి చెల్లెలు మంచం మీద కనిపించలేదు. కంగారుపడ్డారు. అంతా వెతికారు. కానీ ఆమె జాడ లేదు. తెల్లారింది. రైలుపట్టాలపై ఎవరిదో శవం పడివుందని తెలిసి అటువైపు పరిగెత్తారు. ఆ శవం ఎవరిది? ఆమె ఏమైంది?
******************
సమయం రాత్రి ఒంటిగంట!
ఎముకలు కొరికే చలి.
బిడాయించుకున్న తలుపుల వెనుక వెచ్చటి దుప్పటిలో ఊరు గాఢనిద్రలో ఉంది.
సరిగ్గా అదేసమయంలో
ఆ ఇంటి తలుపు చప్పుడైంది. చటుక్కున మేల్కొందామె.
కంగారుగా అటూఇటూ చూసింది.
పక్కనే మరో మంచంమీద గాఢనిద్రలో ఉంది తల్లి. అడుగులో అడుగేస్లూ పిల్లిలా బయటకు వచ్చింది ఆమె. చప్పుడు కాకుండా తలుపులు జేరవేసింది.
ఎదురుగా నిలబడిన వ్యక్తి గభాలున ఆమెను కౌగలించుకున్నాడు.
‘‘ఏమిటి విషయం?’’ అడిగిందామె గుసగుసగా.
‘‘నిద్ర రావడంలేదు, నీకోసమే వచ్చా’’ గోముగా అన్నాడతను.
‘‘సాయంత్రమేగా కలిసింది’’ ముద్దుగా కసిరింది.
‘‘అదీ ఒక కలవటమేనా?’’
‘‘మరి దేన్ని కలవటమంటారబ్బా?’’ కింది పెదవిని పంటితో కొరుకుతూ అడిగింది.
‘‘నే చెప్తాగా పద’’ అంటూ అతను ఆమెను ఎత్తుకుని ఆ ఇంటి వెనుకవైపు దారితీశాడు.
ఓ గుడిసెలోకి తీసుకెళ్ళి ఆమెను మంచంమీద పడుకోబెట్టాడు.
దూలానికి వేలాడుతున్న బుడ్డిదీపం వెలుతురు ఆ గుడిసెలో పల్చగా ఆక్రమించి ఉంది.
మంచం మీద యువతి ఒళ్ళు విరుచుకుంటూ అతడిని ఆహ్వానించింది.
మెల్లగా అతడామె దుస్తులు తొలగించాడు. తమకంగా అతడిని మీదికి లాక్కుంది ఆమె.
కోరికలతో రగిలిపోతూ ఆమెను ఆక్రమించుకున్నాడు అతను.
కానీ ఆ శృంగారకేళిని ఓ జతకళ్ళు ఆగ్రహంతో చూశాయి.
******************************
విజయవాడ పడమట పోలీస్‌స్టేషన్...ఫోన్ రింగయ్యింది.రిలాక్స్‌డ్‌గా కూర్చున్న ఇన్‌స్పెక్టర్ రవికాంత ఫోన్ లిఫ్ట్ చేశారు.‘‘సార్... నా భార్య హిమబిందు కన్పించడం లేదు...’’ అవతలి నుంచి ఒక గొంతు ఆందోళనగా వినిపించింది.ఇలాంటి ఫిర్యాదులు పోలీస్‌స్టేషన్‌కు తరచూ వస్తూనే ఉంటాయి. పెళ్లయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రియుడితో లేచిపోవడం, భర్తలు కంప్లయింట్స్ ఇవ్వడం... ఇలాంటి కేసులు ఎన్నో.‘‘సార్... ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ అయ్యింది...’’‘‘ఇంతకీ ఎప్పటి నుంచి కనిపించడం లేదు...’’ రొటీన్‌గా ప్రశ్నించారు ఇన్‌స్పెక్టర్.‘‘ఉదయం నేను బ్యాంకుకు వెళ్లే సమయంలో ఇంటి బయటకు వచ్చి మరీ టాటా చెప్పింది. మధ్యాహ్నం భోజనానికి వెళ్లేసరికి ఇంట్లో కనిపించలేదు. బీరువాలో చీరలు, నగలు కూడా కనిపించడం లేదు. ఆమె వేసుకునే చెప్పులు కూడా లేవు...’’‘‘అలాగా... మా కానిస్టేబుల్‌ని పంపిస్తున్నాను వివరాలు చెప్పండి’’ అని అడ్రస్ తెలుసుకుని ఫోన్ పెట్టేశారు ఇన్‌స్పెక్టర్ రవికాంత.
కొద్దిసేపటికే ఇద్దరు కానిస్టేబుళ్లు బ్యాంక్ మేనేజర్ సాయిరాం ఇంటికి వెళ్లారు.ఎంటీఎస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సాయిరాం ‘సప్తగిరి గ్రామీణ బ్యాంకు’లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.కానిస్టేబుల్స్ వివరాలు సేకరించడం ప్రారంభించారు. సాయిరాం చెప్పిన వివరాల ప్రకారం... ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒక కొడుకు చెన్నైలో చదువుకుంటున్నాడు. కుమార్తె కాలేజీలో చదువుతోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కుమార్తెను కాలేజీకి, భర్తను బ్యాంకుకు పంపించింది నడివయస్కురాలైన హిమబిందు. ఆ తర్వాత నుంచి ఆమె కన్పించడం లేదన్న విషయం తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసుగా రాసుకుని ‘‘సరే... ఎంక్వయిరీ చేస్తాం’’ అంటూ వెళ్లిపోయారు కానిస్టేబుల్స్. సాయిరాం ఆమె ఫోన్‌కు కాల్స్ చేస్తూనే ఉన్నాడు.
కానీ నో రెస్పాన్స్...ఆ రాత్రంతా తండ్రీ కూతుళ్లు ఆమె జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.ఆ మర్నాడు చెన్నైలో ఉన్న కొడుకు సెల్‌ఫోన్‌కు హిమబిందు నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.‘‘మీ అమ్మ నాతో పాటు వచ్చేసింది. మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం’’ అని ఆ ఫోన్‌కాల్ సారాంశం. వెంటనే తండ్రికి ఆ విషయం చెప్పాడా కుర్రాడు.కొడుకు చెప్పిన విషయం విని సాయిరాం నిర్ఘాంతపోయాడు. పాతికేళ్ల సంసారంలో హిమబిందు ప్రవర్తనను తాను ఎప్పుడూ శంకించలేదు. అలాంటిది... ఇదేంటీ... ఇలా జరిగింది. ‘నేను నమ్మనుగాక నమ్మను’ అనుకుంటూనే తన కొడుక్కు ఫోన్ వచ్చిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు సాయిరాం.
‘‘మిస్సింగ్ కేసులన్నీ ఇలాగే ఉంటాయి. ఈ విషయం మాకు ముందే తెలుసు...’’ అంటూ పోలీసులు తమదైన భాషలో చులకనగా మాట్లాడారు.వారి మాటలతో సాయిరాం మనసు చివుక్కుమంది. అసలే భార్య కనిపించడం లేదనే బాధలో ఉన్నాడు. మళ్లీ ఆమె ఫోన్‌కు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ అనే వస్తోంది.‘‘ సార్... నా భార్య అసలు ఎక్కడుందో తెలుసుకోండి... ఆమె తనంతట తాను వెళ్లిందా? ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? అసలామె సురక్షితంగానే ఉందా? అన్న విషయం తెలిస్తే కానీ నా మనస్సు శాంతించదు’’ అని ప్రాధేయపడ్డాడు సాయిరాం.‘‘సరే.. ఇన్వెస్టిగేట్ చేస్తాం...’’ అంటూ ఫోన్ పెట్టేశారు పోలీసులు.
మరో రోజు గడిచింది...హిమబిందు జాడ తెలియలేదు. కుటుంబసభ్యులు, బంధువులు తీవ్రమైన ఆవేదనలో ఉన్న సమయంలో...పెనమలూరు మండలం, వైకుంఠపురం గ్రామ సమీపంలోని బందరు కాలువలో ఒక మహిళ మృతదేహం కన్పించిందని స్థానికుల ద్వారా సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు.మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీసి విజయవాడ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు.విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన సాయిరాం మృతదేహాన్ని తన భార్యదిగా గుర్తుపట్టి రోదిస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైన విషయాలు పోలీసులను ఉలిక్కిపడేలా చేశాయి.ఆమెపై అత్యాచారం జరిగినట్లు, ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు, అంతకు ముందు ఆమెను తీవ్రంగా హింసించినట్లు స్పష్టం కావడంతో మిస్సింగ్ కేసు కాస్తా రేప్ అండ్ మర్డర్ కేసుగా మారింది.
ఈ విషయం మీడియాకు పొక్కడంతో గృహిణిపై సామూహిక అత్యాచారం, హత్య అంటూ వార్తలు పతాకశీర్షికన వచ్చాయి.నిందితులను పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ నిరసనల సెగ క్రమక్రమంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దాకా వెళ్లింది. గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకుని హిమబిందు కేసులో నిందితులను అరెస్టు చేయాలని విజయవాడ పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ కేసు మిస్టరీని చేధించగలిగారు పోలీసులు.ఫఫఫహిమబిందును హత్య చేసింది ఎవరో కాదు... పక్కింట్లో ఉండే కారు డ్రైవర్ సుభానీ. అతడే స్నేహితులతో కలిసి ఈ హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని విజయవాడ డీసీపీ రవిప్రకాష్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘‘హిమబిందుపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు. తమ దుర్మార్గపు ఛాయలను చెరిపేసేందుకు ఆమె గొంతు నులిమి చంపేశారు...’’‘‘ఎక్కడ జరిగింది సార్ ఈ ఘోరం...’’ ఒక విలేఖరి ప్రశ్నించాడు.‘‘ఈ దారుణం ఇంట్లోనే జరిగింది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే కుమార్తె, భర్త వెళ్లిన తర్వాత హిమబిందు ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని ప్రతీ రోజూ ఆమెను గమనిస్తున్న పక్క ప్లాట్ యజమాని కారు డ్రైవర్ సుభానీ ఎలాగైనా ఆమెను అనుభవించాలని చాలా రోజుల్నించి ఎదురుచూస్తున్నాడు. పక్కా ప్లాన్‌తో ఉన్న సుభానీ తోటి డ్రైవర్ గోపి, ఎలకీ్ట్రషియన్ కృష్ణ, చికెన్ దుకాణంలో పనిచేసే రమణ, మరో ఇద్దరిని పిలిపించాడు. ఫ్లాట్‌లోకి వెళుతున్న హిమబిందును ఆ ఆరుగురు అనుసరించారు.
అపార్ట్‌మెంట్ లోపల పైపు లైనుకు మరమ్మతులు చేయాల్సి ఉందంటూ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అకస్మాత్తుగా దాడి చేశారు. నోరు మూసి సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశారు. సుభానీ యజమాని ఆ రోజు ఊర్లో లేకపోవడంతో మృతదేహాన్ని ఆయన ఫ్లాట్‌లో దాచారు.మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చిన సాయిరాంకు భార్య కనిపించక పోవడంతో చుట్టుపక్కలంతా గాలించాడు. అప్పుడు సుభానీ కూడా అక్కడే ఉన్నాడు. హిమబిందు జాడ తెలియకపోవడంతో సాయిరాం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల రాకతో సుభానీకి భయం పట్టుకుంది. హిమబిందు మొబైల్ నుంచి ఆమె కుమారుడికి ఫోన్ చేసి ‘లేచిపోయినట్టు’ కలరిచ్చాడు.
ఆ తర్వాత... ఫ్లాట్‌లో దాచిన హిమబిందు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ తీసుకెళ్లి బందరు కాల్వలో పడేశాడు...’’‘‘సుభానే హంతకుడని ఎలా గుర్తించారు?’’ మరో విలేఖరి ప్రశ్నించాడు.‘‘హిమబిందు కొడుక్కి వచ్చిన ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశాం. హిమబిందు ఫోన్ తీసుకున్న సుభాని ఆ తర్వాత అందులోంచి సిమ్ తీసి, తన సిమ్ వేసి బయటకు ఒక కాల్ చేశాడు. అదే అతడ్ని పట్టించింది. సుభానీని అదుపులోకి తీసుకుని మా స్టయిల్‌లో విచారిస్తే నేరం అంగీకరించాడు. దాంతో కేసు మిస్టరీ వీడింది. ఆ తర్వాత మిగతావారిని కూడా అరెస్టు చేశాం’’ అని డీసీపీ చెప్పారు.
అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పటమట సీఐ రవికాంత్, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు విజయవాడ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు. ఆ తర్వాత విజయవాడ మహిళాకోర్టు పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించలేదంటూ కేసును కొట్టేసింది. పోలీసులు చెప్పిన వివరాలు కల్పిత కథలాగా ఉన్నాయని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. సాక్ష్యాధారాలు సరిగా లేకపోవడంతో ఆరుగురు నిందితులనూ నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కూడా కోర్టు పేర్కొంది. విజయవాడ పోలీసులు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయడంతో ప్రస్తుతం అక్కడ పెండింగ్‌లో ఉంది.
*********** THE END************