ఆత్మ పగ ప్రతీకారం దెయ్యం హార్రర్
రాత్రి ఒంటగంట అయింది.....
మల్లికకు సడెన్ గా మెలుకువ వచ్చింది...
ఎవరో అటుగా వెళ్తున్నట్టు అనిపించింది...
కిటికీ ముందు ఉన్న కర్టెన్ నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు అనే విషయం మల్లిక గమనించింది..
దుప్పట ముసుగు వేసుకొని తలగడ తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కళ్ళు రెండు మూసుకొని పడుకుంది..
డోర్ తెరుచుకుంటున్న శబ్ధం వినిపించింది..
అప్పుడు వరకు డబై రెండు కొట్టుకుంటున్న గుండె వేగం కాస్త వందకు చేరింది...
నోటిలో హనుమాన్ చాలీసా చదువుకుంటూ....
దెయ్యం కాదు దెయ్యం కాదు అని మనసులో అనుకుంటుంది మల్లిక....
ఈలోగా దుప్పటి ఎవరో కిందకి లాగుతునట్టు అనిపించి...ఒక చేతితో పిల్లో పట్టుకొని మరొక చేతితో దుప్పటిని గట్టిగా పట్టుకుంది..
లాగుతున్న వేగం పెరిగింది...ఎవరో దుప్పటి లాగేసారు..
మల్లిక ఎవరో కూడా చూడకుండా కళ్ళు మూసుకునే తన పిల్లో తీసుకోని ఎదురుగా ఉన్న వ్యక్తిని టపా టపా టపా కొట్టసాగింది...
ఆగు మల్లి ఆగర నేను అన్నయను....
హ్యాపీ బర్తడే.....చెప్పడానికి వచ్చాను.....
అన్నయ నువ్వా?????
థాంక్స్.....
దెయ్యం అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఎందుకు నీకు ఈ ఈవిల్ డాక్యుమెంటరీ...
భయం ఉన్న దాని మీద రీసెర్చ్ చేస్తే భయం పోతుంది అని చెప్పి నవ్వింది మల్లిక.
అహా ఇంకొక మాట చెప్పు...
వాళ్ళు చెప్పింది మేము చెయ్యాలి కదా అన్నయ సో చేసి తీరాలి అందుకనే భయం ఉన్న బాధ్యతగా చేస్తున్నాను..
ఇప్పటి వరకు ఎవరు అంతా సక్సెస్ఫుల్ గా చెయ్యలేదు..
అదే నేను చేస్తే మంచి పేరు అలాగే మంచి జాబ్ కూడా వస్తాది...అని చిన్న కోరిక అంతే...
అయిన నువ్వు వస్తె పన్నెండు గంటలకు రావాలి లేకపోతే మార్నింగ్ విష్ చెయ్యాలి అంతే గానీ ఇలా ఎటు కానీ టైమ్ లో వచ్చావు ఎంటి....
అది నీకోసం చిన్న సర్ప్రైజ్ కళ్ళు మూసుకొని నాతో రా చెప్తా....
రాము మల్లిక ను తన రూంకి తీసుకోని వెళ్ళాడు....
ఇప్పుడు కళ్ళు తెరువు....
వావ్ ఇంత డెకరేషన్ నువ్వు ఒక్కడివే ఎలా చేశావు అన్నయ.....????
నువ్వు నాటకాలు ఆడకు నాకు బల్లోన్స్ ఊధడం రాదు అని నీకు తెలుసు అందుకనే వెటకారం ఆడుతున్నవా???
అలా కాదు అన్నయ జోక్ చేశాను ఎంతైన నిన్ను కాకపోతే ఇంకా ఎవరిని అంటాను చెప్పు...
నడు నడు కేక్ కట్ చెద్దువు కమ్....
థాంక్స్ అన్నయ
రేపు ఎక్కడికి వెళ్తావు మరీ.....
కడవల్ అనే ఊరికి వెళ్తా అన్నయ..
అక్కడ ఒక ఆమె తన భర్త మరణం నాచురల్ గా అయింది కాదు అని చాలా సార్లు చెప్పుతుంది అసలు వల్ల హస్బెండ్ ఎలా చనిపోయారు నాచురల్ కాదు అంటే ఏదో తేడాగా ఉండి ఉంటాది అది తెలుసుకుంటా..దానిని నా డాక్యుమెంటరీ లో యాడ్ చేసేస్తాను......
ఉదయానే లేచి......
అన్నయ నేను వెళ్తున్నాను ....
రేయ్ ఎందుకు రా ఈరోజు నీ బర్త్ డే కదా రేపటినుంచి స్టార్ట్ చెయ్యవచ్చు కదా...
ఈరోజు నా బర్త్ డే కాబట్టి ఏదోకటి మంచి జరుగుతుంది అని నా నమ్మకం...
నేను వెళ్లి వస్తాను.....బాయ్....
కాడవల్....చేరుకున్నాను...ఇంతకీ ఆమె ఎక్కడ ఉందో ఏమిటో.....దారిలో ఎవరో కనిపిస్తే వారితో ఏవండీ !!!!!!
మీకు రమ గారి ఇల్లు ఎక్కడ ఉందొ తెలుసా..????
ముందుకు వెళ్ళి మొదటి సందులో మొదటి ఇల్లు ఆమెదే..
దగ్గరే కదా అని నడుచుకుంటూ ఆమె వెళ్ళిపోయింది.
కాలింగ్ బెల్ కొట్టింది..
ఎవరు మీరు.....????
నా పేరు మల్లిక అండి నేను మీ భర్త మరణించారు అని విన్నాను అసలు ఆయన మరణం ఎలా జరిగింది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాస్త నాకు మీరు చెప్ప్తరా....??
నేను నా భర్త చాలా అన్నున్యంగా ఉండే వాళ్ళం అండి ఒక రోజు ఆయన గదిలో కూర్చుని లాప్టాప్ లో ఏదో చేసుకుంటున్నాను నువ్వు డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పి లోపలికి వెళ్లి గది డోర్ క్లోజ్ చేసుకున్నారు...
అప్పటికే రెండు గంటలు దాటేసింది ఆయన బయటకు రాలేదు నాకు అనుమానం వచ్చి నేను డోర్ కొట్టాను లోపలినుంచి అసలు స్పందనే లేదు మళ్లీ ప్రయత్నించాను కానీ పలకలేదు నాకు బాగా భయం వేసి చుట్టూ పక్కల వారిని పిలిచి తలుపు బద్దల కొట్టించాను లోపల ఆయన ఉరి వేసుకుని ఉన్నారు కిందకి దింపేటప్పటికి ఆయన మరణించారు...
నేను చాలా మందికి చెప్పాను ఆయన చాలా సంతోషంగా ఉన్నారు చనిపోయే కారణాలు లేవు అని పోస్టుమార్టం చేసి ఆయనది అత్మ హత్య అని వెల్లడించారు....
కానీ నాకు మాత్రం అలా ఎప్పుడు అనిపించలేదు...
మీరు ఏమి అనుకోను అంటే నేను మీ హస్బెండ్ లాప్టాప్ చుడోచ్చా ఒకసారి హా తప్పకుండా .....
నాకు ఆయన మరణానికి కారణం తెలుసుకోవాలి అని చాలా ఆశగా ఉంది.....
లోపలికి వెళ్ళి ఆ లాప్టాప్ ఓపెన్ చేసింది మల్లిక...
మీ పేరు...(మల్లిక అడిగింది)
రమ....
రమ గారు మీ భర్త ఎప్పుడు చనిపోయారు డేట్ అండ్ టైమ్ చెప్పగలరా...
24th జూలై ........టైమ్ 11:30......
ఆ రోజు ఆయనకు వచ్చిన మెసేజెస్ అన్ని చూసింది..
మెసేజెస్ లో ఏమీ లేదు...
తరవాత అతని మెయిల్ ఓపెన్ చేసింది..
మెయిల్ లో ఒక లింక్ ఉంది అది బ్యూటీ డాట్ కామ్ నుంచి వచ్చింది...దానిలో ఏమని రాసి ఉంది అంటే...
మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూడకపోతే మీ జీవితం పూర్తి అయినట్టు కాదు...త్వరగా ఓపెన్ చేసి చూడండి మిమల్ని మత్తేకించడానికి తప్పకుండా చూడండి అని ఉంది....ఆ లింక్ వచ్చిన టైమ్ 11:20 అంటే ఈ లింక్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికీ అతను మరణించాడు ....
ఆ లింక్ మల్లిక షేర్ చేసుకుంది........
ఓకే థాంక్స్ అండి నేను త్వరలోనే ఈ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ వేతుకుతాను...అని చెప్పు వెళ్లబోతున మల్లిక ను మీరు కావలితే ఇక్కడ ఉంది వర్క్ చేసుకోవచ్చు...
లేదండి.కవలితె నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది....
ఆ సైట్ కి సంబందించిన డీటైల్స్ అన్ని చూసింది...
ఆ సైట్ నుంచి మొత్తం ముప్పై ఐదు మందికి మెసేజెస్ వెళ్ళాయి....
వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది వారికి ఫోన్ చేసి మాట్లాడగా ఆ ముప్పై ఐదు మంది కూడా
24th జూలై నా.....11:30 నిమిషాలకు మరణించారు..అని ఆమెకు తెలిసింది.....
అసలు ఇది అంతా ఎలా జరిగింది అని ఆరా తీయగా...బ్యూటీ డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి అందరికీ ఇలానే మెసేజెస్ వెళ్ళాయి...వారు ఓపెన్ చేసిన తరవాత ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది....
మల్లిక ఆ వెబ్సైట్ ఓనర్ గురించి చాలా ట్రై చేసింది కానీ యూస్ ఏం లేకుండా పోయింది అసలు అలాంటి ఒక వెబ్సైట్ ఉన్నటు కూడా చూపించడం లేదు...
ఇప్పుడు లేదు కానీ ముందు ఉండి ఉంటాది అని గూగుల్ లో కొట్టి చూడగా......
ఒక అమ్మాయి పేరు షాలిని ......
అందం ఐశ్వర్యం అంతా ఆమెలో కలగలిసి ఉండేది..
ఆమె ఈ బ్యూటీ డాట్ కామ్ అనే వెబ్సైట్నీ నడుపుతూ ఉండేది..
దానిలో ఆ అమ్మాయి చాలా బ్యూటీ కి సంబందించిన వీడియోస్ పెట్టేది...
ఒక రోజు ఆమె సడెన్ గా తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని చనిపోయినట్టు తెలిసింది....కానీ ఎందుకు చనిపోయింది అనే విషయం మాత్రం ఇంకా ఎవరికి తెలియలేదు.....
@@@@@@
ఆమె మరణం ఈ ముప్పై ఐదు మందికి లింక్ అయినట్టు
(మల్లిక మనసులో అనుకుంటుంది).....
కానీ ఆ విషయం ఎలా తెలుసుకోవాలి)...
హా రమ గారి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ లాప్టాప్ ఉంది గా దానిని చూద్దాం అని అనుకొని వెళ్లి ఆమెను కలిసి లాప్టాప్ తీసుకుంది....
ఆ రోజు మల్లిక వాళ్ళ అన్నయకి నైట్ షిఫ్ట్ తను లాప్టాప్ ముందు పెట్టుకొని ఆ లింక్ పైన క్లిక్ చేసింది...
అప్పటివరకు లైట్స్ ఆన్ అవి ఉన్నాయి సడెన్ గా లైట్స్ ఆగిపోయాయి...
ఒక అమ్మాయి బెడ్ మీద కూర్చొని ఉంది......
వెల్కమ్ టు మై ఛానల్ అని బొంగురు గొంతులో మాట్లాడుతూ......
ఛానెల్ నడిపితే ఏదో లాభం కోసం కాదు సంతోషం కోసం నడుపుతాము అని చెప్పి వీడియోలో ఆమె ఉరి వేసుకున్నట్టు చూపించింది....
భయం వేసి మల్లిక లాప్టాప్ క్లోజ్ చేసింది...
ఆమె ఇలా క్లోజ్ చేసిన వెంటనే తన ఎదురుగా షాలిని ....
షాలిని నాకు నీ మరణానికి ఏం సంబంధం లేదు....అని చెపుతున్నా వినిపించుకోకుండా ఆమెను పిక పట్టుకొని నొక్కింది...
నేను నీ మరణం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నా అంతే కానీ నీ గతంతో గాని నీ మరణంతో గాని నాకు సంబంధం లేదు అయిన నీ పగ తీరింది కదా ఇంకా నువ్వు ఇక్కడే ఎందుకు ఉన్నావు...
నా బాధ నీకు తెలుసా....
ఎంతో ఆనందంగా ఛానల్ నడుపుకుంటూ ఉన్న నాకు ఆ ముప్పై ఐదు మంది ఎంతో చెండలంగా కామెంట్స్ పెట్టేవారు రిపోర్ట్స్ కొట్టేవారు అందుకనే ఆ ఛానల్ వదిలేసి ఇంకొక ఛానల్ పెట్టుకున్నా మళ్లీ వారు అలా చేశారు వచ్చిన చాస్స్ అన్ని వాళ్ళ వల్ల పోయేవి వారు ఎవరో తెలియదు ఎలా ఉంటారో తెలియదు అందుకనే చచ్చి వారిని కూడా చంపేసా.....అని నవ్వుతూ ఆమె మాయం అయిపొయింది.
మల్లిక మళ్లీ ఆ లింక్ ఓపెన్ చేసింది కానీ థాంక్స్ అని వచ్చి ఆ వెబ్సైట్ మాయం అయిపొయింది.....
ఇలా మల్లిక ఆ కేస్ సాల్వ్ చేసింది....
డాక్యుమెంటరీ లో కూడా పెట్టేసుకుంది.