Love rain in Telugu Love Stories by SriNiharika books and stories PDF | ప్రేమ వర్షం

Featured Books
Categories
Share

ప్రేమ వర్షం




ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆ రూపం మళ్ళీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నాకోసమే అన్నట్టు అనిపిస్తుంది. ఏం అల్లరి గాలి ఇది నన్ను కుదురుగా వుండనివ్వట్లేదు. ఏం తుంటరి వాన ఇది నాలో కొత్త ఆశలు పుట్టిస్తోంది. ఈ వాతావరణ ప్రభావం నా నరాలని పట్టి లాగేస్తుంది, ఊపిరి వేడెక్కి పోతుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమె కి కూడా అదే విధంగా ఉందా???? అని తెలుసుకోవాలని మనసు తపన పడుతుంది.

అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది. ఇద్దర్ని ఎందుకు ఒక చోటుకి చేర్చింది. అబ్బా!!! తన కళ్ళెంటి అంతలా నన్ను ఆకర్శిస్తున్నాయి, చూపు తిప్పుకోలేకపోతున్నానే......

అమ్మాయి!!! అలా నవ్వకు, నీ అందం రెట్టింపు అవుతుంది, నా కోరిక ఇంకా బలపడుతుంది. ఈ వర్షం ఆగేనా నా కోరిక చల్లారేన, ఏంటి దేవుడా!!! ఈ అగ్నిపరీక్ష.

వాన ఎక్కువయ్యేకొద్ది ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది. చలి ప్రభావం ఏమో?? వెచ్చదనం కోరుకుంటుంది శరీరం. మాటలు కలపాలని అనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న భయం నన్ను ఆపేస్తుంది. తనకి ఏం అనిపిస్తుందో మరి🤔

మళ్ళీ మెరుపు....భయం తో నా దగ్గరకి చేరింది. ఇక ఈ వేడి నేను తట్టుకోలేను. మెల్లగా తన చేతి వేళ్ళని నా చేతి వేళ్ళతో తాకాను. భయం తో వెనక్కి జరిగింది ఆమె.

అయ్యో!!! తప్పు చేసానేమో, ఛ! అనుకున్నా. తను నన్ను తప్పు గా అనుకుంటుందా??? అసలు ఎందుకు ఇలా చేసాను..... ఏమో ఈ వర్షం త్వరగా ఆగితే ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకున్నాను.

ఫోన్ లేదు చేతిలో టైం పాస్ చేద్దాం అంటే. దగ్గరలో వేరే గూడు లేదు, తల దాచుకుందాం అంటే. ఇలా ఒకే పంజరం లో ఇద్దరం చిక్కుకుపోయాము.

మళ్ళీ ఆకాశం గర్జించింది. ఈసారి భయం తో నా చేతిని గట్టిగా పట్టేసుకుంది. కళ్ళు మూసుకుని 'అర్జున, ఫాల్గుణ' అంటూ అనుకుంటుంది. తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది. వర్షం ఆగకుండా కురవాలని కోరుకున్నా.

మెల్లగా కళ్ళని పైకి లేపి చూసింది. వెంటనే నా చేతిని వదిలి, 'ఐ ఆమ్ సారి' భయం వేసి మీ చేతిని పట్టుకున్నాను అని చెప్తుంటే తన గొంతు ఎంత మధురంగా ఉందొ తేనీరు తాగినట్టు.

కాసేపటికి ఈ మౌనాన్ని బద్దలకొట్టాము. నిశబ్ధం ఓడిపోయింది. మీ పేరు ఏంటి??? అని తను అడిగింది నన్ను.

ఏం చెప్పాలి, తన గొంతు విని నా గొంతు మూగబోయింది. తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్న. ఐనా మాటని గొంతుదాటించి మౌనాన్ని ఛేదించాను.

'ప్రేమ్' నా పేరు. మరి మీది అని అడిగాను.

'వర్ష' నా పేరు అని బదులిచ్చింది.....మీకు నన్ను తాకాలని ఆశ గా ఉందా??? అని అడిగింది తను.

ఎందుకు అలా అడిగిందో నాకు అర్ధం కాలేదు. అలా హఠాత్తుగా అడిగేసరికి భయం వేసింది. ఏం చెప్పాలి ఇలాంటి ప్రశ్నకి. అవును అని నిజం చెప్పాలా???? కాదు అని అబద్ధం చెప్పి తప్పించుకోవాలా???? ఏం చెప్పి తన ప్రశ్నని దాటేయాలి అనుకుని చిక్కుముడిలో పడ్డాను.

చెప్పండి ప్రేమ్ గారు. ఏం అనిపిస్తుంది మీకు? అని మళ్ళీ అడిగింది.

సూటిగా అడిగితే ఏమని చెప్తామ్. తాకాలని వుంది కానీ అది నా తప్పు కాదు, వాతావరణ ప్రభావం వల్ల అలా అనిపిస్తుంది. మీరు సినిమా హీరోయిన్ లా వున్నారు. చూడడానికి చాలా అందంగా, చక్కగా వున్నారు. మీ ఊపిరి తగిలితేనే మత్తు ఎక్కిపోతుంది నాకు. మీ వయ్యారాల నడుము, దాని పైన జారుతున్న వాన చినుకులు, తడిచిన చీర లో మీ అందాలన్నీ ఆరబోస్తుంటే నాలోని కోరికలు కొత్తగా చిగురిస్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ నాకు ఎదురవ్వలేదు. ఏమిటో ఈ వర్షం కొత్త కోరికల్ని నాలో మొలకెత్తిస్తుంది అని చెప్పాను.

నవ్వుకుంది ఆమె. సరే! నాకు ఈ అనుభూతి కొత్తగా వుంది. కోరికలు అనే వాటికి హద్దే లేదే. ఇదే ఏ పగటి పూట మనం ఇలా ఎదురయ్యి, వాతావరణం వేడిగా వుంటే అప్పుడు పుట్టే కోరికలు వేరేలా వుండేవి కదా!!!!

మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో, నాకు అదే ఎదురయ్యింది. మిమ్మల్ని తాకాలని నాకు అనిపించింది. అందుకే మెరుపు కోసం ఎదురుచూసాను. మీ బిగి కౌగిట్లో వెచ్చదనాన్ని కోరుకున్నాను. కొన్ని క్షణాలు మన మాట వినవే!!!! ఏమని నచ్చజెప్పను మనసుని....... కార్ వేగం బ్రేక్ వేస్తే ఆగుతుంది....హృదయాన్ని ఎలా ఆపాలో తెలీలేదు....

ఇంతలో గట్టిగా ఓ మెరుపు, మళ్ళీ ఇద్దర్ని ఒకటి చేసింది. తను నన్ను గట్టిగా వాటేసుకుంది. వద్దంటున్న ఆగని మనసు నన్ను తనని తాకమని రెచ్చగొడుతుంటే తన మెత్తని బుగ్గలని నా అధరాల తో ముద్దాడను.

తను నా కౌగిలి వదిలి పక్కకి జరిగింది. బుగ్గని తుడుచుకుంది. తలని దించి నన్ను విలన్ లా చూస్తుంది. తప్పు చేసానా???? ఆలోచించాల్సింది. ఒక మంచి అబ్బాయిని ఇన్ని రోజులు, ఒక చిన్న తప్పు ఆ మర్యాద ని దూరం చేసేసింది.

క్షమించమని కోరుదాం. కాస్త ఐనా మనసు కుడుటపడుతుంది. లేకుంటే ఇదే గిల్ట్ తో బ్రతకాలి, అది మనకు అవసరమా??? అని ఆలోచించాను.

మేడమ్ అని పిలవబోయా క్షమించమని కోరడానికి. కానీ ఆమె కళ్ళు నన్ను తదేకంగా అలానే చూస్తున్నాయి. అది కోపమా??? తాపమా???? అర్ధం కానంత లోతుగా వుంది తన చూపు.

మీ అబ్బాయిలు ఇంతేనా??? కాస్త అవకాశం ఇవ్వాలే కానీ అస్సలు ఆగరు. లేలేత బుగ్గలు అండి. అలా సడన్ గా ముద్దు పెట్టేస్తే కందిపోవు అని సిగ్గుపడుతున్న తనలో ఓ చిన్న పిల్ల కనిపించింది. నవ్వుకున్నా, తను నవ్వుకుంది.

ఇద్దరం మళ్ళీ మాటల్లో పడ్డాము.

నన్ను మా నాన్న తర్వాత ముద్దు పెట్టుకున్న మగాడు మీరే అని చెప్పింది తను. నేను కూడా మా అమ్మ తరువాత ముద్దు పెట్టిన ఆడది మీరే అని చెప్పాను.

ఇప్పుడు ఇది వరకు కలిగిన అనుభూతి లేదు. ఇది వేరే, ఏదో మనసుకు హాయిగా అనిపిస్తుంది. కానీ అదే చల్ల గాలి, అదే తొలకరి వాన. మరి ఏం జరిగింది కొత్తగా నాకు. ప్రేమ అంటారు అది ఇదేనా!!!!! ఏమో ఈ వర్షం నాలోని కొత్త కొత్త భావాలను పలికిస్తుంది.

ఈ వింత ని గమనించారా????? ప్రేమ్ గారు అని పిలిచింది వర్ష నన్ను.

లేదు.. ఏమిటా వింత??? అని సందేహాంగా అడిగాను.

మీ పేరు లో ప్రేమ వుంది. నా పేరులో వర్షం వుంది. ఎదురుగా వర్షం కురుస్తుంది. మన ఇద్దరి పేర్లని కలిపితే "ప్రేమ వర్షం" అని వస్తుంది అని నవ్వింది మందార పువ్వు వికశించినట్టు.

అవును!! నిజమే.... నేను గమనించనేలేదు. "వాహ్ వాహ్" భలే కనిపెట్టారు అని మెచ్చుకున్నా.

మొదటి చూపులో ప్రేమ పైన మీ అభిప్రాయం ఏంటి?? అని అడిగాను తనని.

మిమ్మల్ని మొదటి సారి నాంపల్లి ఎగ్జిబిషన్ లో చూసాను. బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్ లో గోగుల్స్ పెట్టుకుని సరదాగా మీ స్నేహితులతో మాట్లాడుతుంటే కను రెప్ప వేయకుండా మిమ్మల్నే చూసాను. అప్పుడు కలిగిన భావన పేరు ప్రేమ అని నాకు తెలియదు. కేవలం ఆకర్షణ అనుకున్న.

నిజమా!!! ఐతే నీ చూపులు నన్ను తాకాయేమో నీ కోసం నేను కూడా వెతికాను అదే ఎగ్జిబిషన్ లో. పసుపు రంగు చుడిదార్ లో నువ్వు దేవత లా దర్శనం ఇచ్చి కనిపించకుండా మాయం అయ్యావ్. మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ ఇలా నా కళ్ళ ముందు, నాకు దగ్గరగా నువ్వు నిల్చుంటే కుదురుగా వుండలేకపోతున్న.

మళ్ళీ నవ్వింది వర్ష..... ఏమో ఈ వర్షం వల్ల వర్ష ప్రేమ్ గారి ప్రేమ లో పడిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మన ఇద్దరి మనసులు ఒకటే ఆలోచిస్తున్నాయి, ఒకటే కోరుకుంటున్నాయి. ఏంటమ్మా వర్షం ఎంత పని చేసావు, లోలోపల దాచుకున్న నా ప్రేమ ని బయటకి వచ్చేలా ఇద్దర్ని ఒక చోటికి చేర్చావు అని వర్ష మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా వుందో చిన్నపిల్లలా.

తన చేతిని పట్టుకుని దగ్గరగా లాక్కున్నాను. తన తడిచిన జుత్తు నా మొఖం పైన పడింది. నా ఎద చప్పుడు తనకి వినిపిస్తోంది. మాటలు లేవు ఇక, తన చేతులతో నా నడుముని చుట్టేసింది మెత్తగా. సమయం తెలీదు మాకు. ఆ కౌగిలింత లో ఏం మాయ వుందో వెచ్చగా వదిలిపెట్టలేని బంధం ఏర్పడింది ఇద్దరికి.

హఠాత్తుగా ఓ పెద్ద మెరుపు మమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది మళ్ళీ. సిగ్గు పడుతూ అటు వైపుకి తిరిగింది తను.

వర్ష గారు, ఈ వర్షం సాక్షిగా చెప్తున్న ఈ కొద్ది గంటల్లో మన మధ్య ఏర్పడిన ఈ ప్రేమ ఎప్పటికి తగ్గనివ్వను, ప్రాణం వున్నంత వరకు. "విల్ యు బీ మై వైఫ్" అని అడిగాను.

ఆలోచిస్తూ ఒక్కసారి ఇటు తిరిగి ప్రేమ్ ని గట్టిగా వాటేసుకుంది వర్ష. "ఐ లవ్ యు టూ" అని చెప్పి తన బుగ్గని ముద్దాడింది. ఇద్దరు నవ్వుకున్నారు.

వర్షం కూడా ఆగిపోయింది. ఇంకేముంది వర్షం కాస్త "ప్రేమ వర్షం" గా మారింది. ఇద్దరి ప్రేమ కొనసాగాలి ఇలానే అని కోరుకుందాం😊💐

తొలిసరిగా నాలో జీవం పోసేను నీ స్వరం

తొలిసరిగా నాలో ప్రాణం నింపేను నీ పల్లవి

తొలిసరిగా నాలో అలజడిని ఆపేను నీ పాట

తొలిసారిగా నాలో ఆనందరు కురిపించాయి నీ సప్తస్వరాలు....
అమ్మ పిలిచే తోలి పలుకులు జ్ఞాపకం 

అమ్మ లలించిన లాలనలు జ్ఞాపకం 

అమ్మ ప్రేమ మధురమైన జ్ఞాపకం 

అమ్మ చల్లని చూపులే చిరునవ్వుల జ్ఞాపకం
అక్షరాలు అల్లుకుంటున్నాయి నా మదిలో

 జడలో మల్లెల మురల సువాసనలు నింపుతున్నాయి

 కోకిలల కవిస్తున్నాయి నీ రాతలు

 మదిలో మేదులుతున్నాయి సవ్వడులు

 ముంగిల్లాలో మొదలవుతున్నాయి చిరునవ్వులు

వెన్నెల వెలుగులు నింపుతాయి నీ మనసులోని రాతలు... ✍️
నీ కురులు ముంగిళ్ళకి పలుకులు 

నీ చూపులు మాదికి పాలు తేనెలు 

నీ శ్వాస చేసే తియ్యని కేరింతలు 

నీ పులకరింపులు చిరునవ్వుకూ ఆహ్వానలు
నీ తొలి పరిచయం ఒక అద్భుతం 

నీ తొలి మాటలు ఒక అమోఘం 

రామచిలక అందించే ప్రేమ లేఖలు 

నా కనులు చూసాయి ప్రేమ లేఖలు 

మదిలోని మారాయి మధుర భవనాలు
మనసు రాసే మరుపురాని రాతలు 

వయసు చేసే చిలిపి చేష్టలు

నీ నవ్వు చుసి కోయిల పడే పాటలు

నీ చూపులు నాకు తియ్యని మాయమరుపులు 

నీ అందాలు నాకు అందమైన అనుభవాలు

నీ కురులు నాకు అందమైన నమిలికలు
మాటలు లేకుండా భావానా తో ప్రేమ నీ తెలుపుతే అది మధురనుభూతి 

చెప్పలేని ఆనందం కదలాడే మదిలో 

ముసి ముసి నవ్వులతో మురిసిపోయే మనసు

ఒక సారి అ ప్రేమ కనబడకపోతే అల్లాడి పోయే వయసు 

కనిపించే నీ రూపు తొలి కాంతిగా ఎదలో మొదలయే సంబరాలు ఇక 

నువ్వు నేను ఏకమావుదాం ప్రేమ జంటగా 

మారుపంటూ రానే రాదు చివరి దాకా 

అద్భుతలు అమృతలు మన ఇద్దరి ప్రేమలు 

శాశ్వతమైన ప్రేమతో శాశ్వతంగా ప్రేమించు కుందాం 

ప్రేమే లోకంగా ప్రేమే జీవితంగా ప్రేమని ప్రేమతో ప్రేమించుకుందాం... ✍️
తొలి సరిగా నాలో కలవరం పరిచయం అయింది 

ఏమితో ఈ వింత ఆవేదన ఆగడం లేదు 

నీ మౌనానికి నా మనసు ముగా బోతుంది 

ఈ అలజడిలో ఒక ఆనందం వుంది 

నీ మాటే నా మనసుకు ప్రాణం పోస్తుందని ఈ క్షణమే తెలిసింది..✍️🌹❤️
నీ స్వరం ఒక మరో జన్మకి పునాది,
 నీ స్వరం తొలి జల్లుల చిలకరింపు,
 మీ స్వరం విని పరవశిండిపోదా మది,
 మీ స్వరం విని గుండెచాటున బాధ కూడా కరిగిపోదా మంచుల...❤️