Family values in Telugu Classic Stories by SriNiharika books and stories PDF | కుటుంబ విలువలు

Featured Books
Categories
Share

కుటుంబ విలువలు


తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు, వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి.

కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తోపట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.

“నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు
ఎగిరిపోతుంది కదా” అన్నాడు.
తండ్రి నవ్వాడు. “దారాన్ని తెంపేద్దామా మరి?” అని అడిగాడు. “తెంపేద్దాం నాన్నా” అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.

ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు.
“టప్’ మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది.

“ఇలా జరిగింది ఏంటి నాన్నా” అన్నాడు కొడుకు విచారంగా,
దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు.

కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. “గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా, తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే” అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు.

జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని .నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి.

కుటుంబం మనల్ని పట్టుకుని లేదు. పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టుతప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం.

తనను చూడటానికి నిరాకరించిన సాధువుకు మీరాబాయి  సమాధానం!

భక్తి సంప్రదాయానికి సంబంధించిన అగ్రశ్రేణ వ్యక్తుల్లో మీరాబాయి ఒకరు. ఆమె 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆమె రచించి, గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి. రాజస్థానీ కలగలసిన ప్రజాభాషలో ఆమె శ్రీకృష్ణుడి గుణగణాలను కీర్తించారు. రాజస్థాన్లోని ఓ రాజకుటుంబంలో మీరా జన్మించింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు రాయ్ దాస్ అనే యోగి వారి ఇంటికి వచ్చాడు.  చిన్నపిల్ల అయిన మీరాకు ఆయన ఓ శ్రీకృష్ణ విగ్రహం కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమెకు ఆ విగ్రహమంటే పంచప్రాణాలు. మీరా ఆ విగ్రహాన్ని అలంకరించేది,  పూజించేది. ఆ విగ్రహంతో ఆడుకునేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఆ శ్రీకృష్ణ విగ్రహమే తోడుగా జీవితం గడిపేది. ఆమె దాన్ని కేవలం ఓ ప్రాణం లేని బొమ్మ అనుకోలేదు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే సజీవంగా ఆ విగ్రహం రూపంలో ఉన్నాడని భావించేది.

కొన్నాళ్ళకు మీరాకు యుక్తవయస్సు వచ్చింది. ఆమెను చిత్తోర్ యువరాజైన భోజరాజుకు ఇచ్చి పెళ్ళిచేశారు. భోజరాజు కుటుంబం శక్తి ఆరాధకులు. దుర్గ, కాళి, చాముండి, పార్వతి మొదలైన రూపాల్లోని అమ్మవారిని వారు ఆరాధించే వారు. దాంతో, శ్రీకృష్ణుడి పట్ల మీరా భక్తి ఆమె భర్త కుటుంబంలోని వారికి మింగుడు పడలేదు. శ్రీకృష్ణుడి పట్ల ఆమెకున్న తీవ్రమైన భక్తిని అర్థంలేని ఆరాటంగా భావించారు.

ఇది ఇలా ఉండగా, రోజురోజుకూ మీరాలో భక్తి ఎక్కువ కాసాగింది. అంతకంతకూ సాధు సన్న్యాసులు, మహాత్ముల సన్నిధిలో ఆమె ఎక్కువ సేపు గడపడం మొదలుపెట్టింది. భోజరాజు తమ రాజమందిరానికి దగ్గరలో ఆమె కోసం ప్రత్యేకంగా ఓ ఆలయాన్ని నిర్మింప జేశాడు. దాంతో, శ్రీకృష్ణుణ్ణి పూజించడానికీ, ప్రార్థించడానికీ కావలసినంత స్వేచ్ఛ మీరాకు లభించింది. గుడిలో భగవంతుని గుణగానలను నంకీర్తన చేస్తూ, భక్తి పారవశ్యం నర్తిస్తూ, సాధువులు, సన్నిధిలోనే ఆమెల రోజంతా గడిపేది. ఇది చూసిన బంధువులు ఆమెకు పిచ్చి పట్టిందనే తీర్మానానికి వచ్చారు. అయితే, సాధునన్న్యాసులు, మహాత్ములు మాత్రం భక్తి సంప్రదాయంలో ఆమె గొప్ప యోగిని అని గుర్తించి, గౌరవిస్తూ వచ్చారు. చివరకు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానంలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్ తో కలసి మీరాబాయిని సందర్శించినట్టు చెబుతారు. 

ఇది ఇలా ఉండగా, సన్న్యాసులతో కలసి మీరా పాటలు పాడుతూ, నృత్యం చేస్తుండడం వల్ల తమ పరువు ప్రతిష్ఠలు మంట గలుస్తున్నాయని రాజ కుటుంబం భావించింది. ఇంతలో మీరాబాయి భర్త భోజరాజు మరణించాడు. దాంతో, భోజరాజు తమ్ముడు రాజు అయ్యాడు. అతను మీరాను వేధించడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఆమె మీద విషప్రయోగం చేశాడు. కృష్ణ భక్తురాలైన మీరా మాత్రం భగవత్ ప్రసాదంగా భావిస్తూ, అన్నిటినీ అంగీకరించింది. దేనినీ నిరసించలేదు. శ్రీకృష్ణుడి కరుణతో అన్ని అపాయాల నుంచీ ఆమె క్షేమంగా బయటపడింది.

చిట్టచివరికి మీరా తన స్వామి నడయాడిన బృందావనానికి వెళ్ళింది. ఆనంద పారవశ్యం మిన్ను ముట్టగా, శ్రీకృష్ణుడి ఎదుట ఆడి పాడింది. కాగా, జీవ గోస్వామి అనే ఓ వయసు మీద పడిన వైష్ణవ సాధువు అక్కడ ఉండేవాడు. ఆయన మీరా ముఖం చూడడానికి నిరాకరించాడు. తాను ఓ సన్న్యాసిననీ, కాబట్టి స్త్రీ ముఖం దర్శించననీ పేర్కొన్నాడు. ఆ సంగతి విని మీరాకు నవ్వొచ్చింది. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడనీ, మిగిలినవారందరూ గోపికలేననీ ఆమె బదులిచ్చింది. ఆమె మాటలు ఆ సాధువుకు ఆశ్చర్యం కలిగించాయి. అప్పటి దాకా సన్న్యాసిని కమ్ముకొని ఉన్న మాయ కాస్తా పటాపంచలైంది.


ఒకప్పుడు, దయగల మరియు ధైర్యంగల మహిళ సాధారణంగా తెలుగులో పేదరాసి పెద్దమా అని పిలువబడే సాధారణ ఇంట్లో నివసించేది. ఆమె ఎప్పుడూ తన కోసం పని చేస్తుంది మరియు ఊరగాయలు మరియు వివిధ రకాల ఆహారాలు అమ్మడం ద్వారా తన చిన్న వ్యాపారంతో డబ్బు సంపాదిస్తుంది. లేడీ నివసించే అదే వీధిలో, రెండు అమాయక పిల్లులు నివసిస్తున్నాయి. ఒకటి నలుపు, మరొకటి తెలుపు. ఆ రోజు ఆ లేడీ తన పనిలో నిమగ్నమై బయటికి వెళ్లింది. ఆకలితో ఉన్న ఆ పిల్లులు ఆమె ఇంటి నుండి ఆహారాన్ని దొంగిలించడానికి ఇదే సరైన సమయమని భావించాయి. చోరీకి పథకం వేశారు. నల్ల పిల్లి వంటగది తలుపు వద్ద కాపలాగా ఉంటుందని మరియు వంటగది నుండి ఆ నెయ్యి దోసెలను తీసుకురావడమే తెల్ల పిల్లి పని అని చెప్పింది. చాలా తెలివిగా ప్లాన్‌ని అమలు చేశారు. ఆ దోసెలను తమ మధ్య పంచుకోవడం మొదలుపెట్టారు. పంచిపెడుతున్నప్పుడు, తెల్లపిల్లి తెల్లదానికంటే దోసెలు ఎక్కువ కావాలంటూ సడన్ గా గొడవ పెట్టుకుంది. .



తెలివితక్కువ పిల్లులు మరియు తెలివైన కోతి

ఇంతలో, ఆకలితో మరియు జిత్తులమారి కోతి అమాయక పోరాట పిల్లులను రంపించింది మరియు ఆహారాన్ని పంపిణీ చేయడంలో వారికి సహాయపడుతుందని నటించింది. ఇది తెలివైన మరియు గమ్మత్తైన ప్రణాళికను ప్రారంభించింది. ప్లేట్లు తీసుకురావాలని పిల్లులను కోరింది. ఇంతలో పిల్లులు తెచ్చిన ఆహారాన్ని కోతి తిని అక్కడి నుంచి పారిపోయింది. పిల్లులు తిరిగి వచ్చేసరికి కోతి కనిపించలేదు. కోతి చేసిన ద్రోహం ఆకలితో ఉన్న పిల్లులను ఆందోళనకు గురిచేస్తుంది. తమ తప్పు తెలుసుకున్నారు. వారి పోరాటం కారణంగా, కోతి వారి ఆహారాన్ని తినడానికి ఉపయోగించుకుంది. వారు నిస్సహాయతతో వంటగది ముందు కూర్చున్నారు. ఆ మహిళ ఇంటికి వచ్చి, ఆకలితో కూర్చున్న విచారంగా ఉన్న పిల్లులను చూసి, ఆమె వాటికి ఆహారం సిద్ధం చేసింది. తమ దుఃఖానికి కారణం ఆహారం తినాలనే అధిక కోరిక అని వారు గ్రహించారు. దోసెల కోసం అత్యాశతో వారు తమ ఐక్యతను కోల్పోయారు. వారు ఐక్యంగా ఉంటే, వారి మధ్య మూడవ వ్యక్తిని అనుమతించకపోవచ్చు.



అదేంట్రా! షాలిని అందర్నీ పిలిచి నిన్ను మాత్రం పెళ్లికి పిలవలేదు. ఏమైనా గొడవ పడ్డారా? సంతోష్ అడిగాడు.


మధుకర్ అడ్డంగా తల ఊపుతూ అలాంటిదేం లేదురా అని అన్నాడు. 


ఆ రోజు మధుకర్ ఫేస్బుక్ అకౌంట్ కి ఒక సుదీర్ఘమైన మెసేజ్ వచ్చింది. అది షాలిని దగ్గర నుంచి.


హాయ్ మధూ. సారీ మధుకర్ గారూ! అవును. నేనిప్పుడు అలానే పిలవాలి. నిన్నే కాదు. నా భర్తను తప్ప ఏ మగ వ్యక్తితోనూ చనువుగా ఉండడం సాధ్యపడదు. ఆయన చెడ్డవారు అని నేను అనను. ఎంత మంది భర్తలు తమ భార్యల స్నేహ సంబంధాల్ని అర్థం చేసుకోగలరు? 


మనం చాలా విషయాల్లో డెవలప్ అవుతూ ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ మధుకర్, ఒక ఆడా మగా మధ్య స్నేహాన్ని సమాజం ప్రేమ లేదా మరో బంధంగానే చూడగలుగుతోంది. ఏ కొద్ది మందో స్వచ్ఛమైన మన స్నేహాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వారికి మనం పనిగట్టుకుని చెప్పలేం కదా. 


అందుకే. నిన్ను నా ప్రాణ స్నేహితుడిగా మనసులోనే నిలుపుకుంటాను. నిన్ను ముందు పెట్టుకుని నాకేం పట్టనట్లు నేను ప్రవర్తించలేను. అందుకే పెళ్లికి పిలవలేదు. ఇకపై నీకు ఈ మాత్రం స్వేచ్ఛగా కూడా మెసేజ్ చేయలేకపోవచ్చు. 


నా హితాన్ని కోరే స్నేహితుడికి గుడ్ బై..


షాలిని పంపిన మెసేజ్ చదివి అతను బాధ పడలేదు. కానీ.. ఎక్కడో ఆలోచన.. అంతలో కన్నీటి బొట్లు జల జలా రాలి పడ్డాయి.


నేస్తమా! ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అంటూ అతడు హమ్ చేశాడు.




ప్రేమంటే ఏంటో తెలీకుండానే పెళ్లి చేసుకున్నా.. కానీ తర్వాత ప్రేమలో లోతుగా మునిగిపోయా...!

పెళ్లి అయిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.



నేటి ఆధునిక కాలంలో చాలా మంది అబ్బాయిలు టీనేజీ వయసు నుండే వివాహం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తనకు కాబోయే భాగస్వామి కోసల దేశపు రాజకుమారిలా ఉంటుందా? తనను పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని ఆశపడుతుంటారు.



'జీవితం ఎప్పుడూ ఎలా ఉంటుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ముందుగా మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చేస్తుంది. తర్వాత ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తులకు.. వారినే దక్కకుండా చేస్తుంది'



అంటూ తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఓ యువకుడు. అసలు నాకు ప్రేమంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి తర్వాత మాత్రం ప్రేమలో మునిగిపోయాను.




నల్లగా ఉంటాను..

మా ఇంట్లో నేను, మా అన్నయ్య ఇద్దరమే ఉండే వాళ్లం. మా అన్నయ్య చూసేందుకు అచ్చం మహేష్ బాబులా తెల్లగా అందంగా ఉంటాడు. నేను మాత్రం సునీల్ మాదిరిగా చాలా నల్లగా ఉంటాను. దీంతో నేను చిన్ననాటి నుండే చుట్టుపక్కల వారు నన్ను ఎగతాళి చేసేవారు.



మనసు నొచ్చుకునేది..

‘ప్రతి ఒక్కరూ అలా చేస్తే ఎర్రగా అవుతావు.. ఇలా చేస్తే తెల్లగా మారతావు' అంటూ నా సహజమైన రంగు గురించి ఏవేవో చెప్పేవారు. వారి మాటలతో నా మనసు బాగా నొచ్చుకునేది. దీనికి తోడు మా అమ్మనాన్నలకు కూడా మా అన్నయ్య అంటేనే ప్రేమ. అలా అందరి చేత అవమానాలు ఎదుర్కొంటూనే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను.



ఓ మంచి సంబంధం..

ఓ రోజు మా బంధువు మా అన్నయ్య కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. వధువు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కట్నం, బంగారం వంటివి ఏమి లేకపోయినా పర్వాలేదని మాట్లాడుకున్నారు. వారం రోజుల తర్వాత వారు మళ్లీ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను. కానీ మా అమ్మ రావద్దంది. దీంతో నాకు మళ్లీ అవమానం ఎదురైందని భావించి, ఆఫీసుకి వెళ్లిపోయాను.



నెల రోజుల్లోనే పెళ్లి..

మా అన్నయ్యకు పెళ్లికూతురు కూడా బాగా నచ్చడంతో వారిద్దరి పెళ్లిని నెలరోజుల్లోనే చేసేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి మా అమ్మనాన్న హడావుడిగా పెళ్లికి అన్నీ సిద్ధం చేయడంలో మునిగిపోయారు. బంధువుల రాక కూడా ప్రారంభమైంది.

వివాహమైన నాటి నుండి మీ భాగస్వామి మీ విరహ వేదనను పట్టించుకోలేదా? అయితే ఇలా ట్రై చెయ్యండి...



అప్పులు చేసి పెళ్లి పనులు..

మా నాన్న తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు పెళ్లి చేసేందుకు కొంత డబ్బును అప్పు చేసి మరీ పెళ్లి పనులు మొదలెట్టారు. ఒకరోజు అందరం కలిసి షాపింగ్ చేసి కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటున్నాం. అంతలోనే అన్నయ్యకు కరోనా వచ్చింది. చూస్తుండగానే మా అందరికీ భయమేసింది. అప్పటికి పెళ్లికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది.



గుండెలు పగిలేలా ఏడ్చాం..

తనకు రకరకాల పరీక్షలు చేసి ఐసోలేషన్ లో ఉంచారు. అయితే తనకు కరోనాతో ఇతర వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో అందరం గుండెలు పగిలేలా ఏడ్చాం. మరో రెండు మూడు రోజుల్లో అన్నయ్యకు డిశ్చార్జ్ చేశారు.



అంతా సంతోషంగా..

అన్నయ్య ఇంటికి రాగానే.. పెళ్లి కూతురు వారికి ఫోన్ చేసి.. వాళ్లను పిలిపించి వారికి జరిగిందంతా చెప్పేశారు. అప్పుడు నేను ఆఫీస్ కి వెళ్లాను. సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి అంతా సంతోషంగా ఉన్నారు. నేను ఆ ట్విస్టును అస్సలు ఊహించలేదు. ఆ సంతోషానికి కారణం అన్నయ్య చెప్పేశాడు.



వరుడిగా చూసేందుకు..

పెళ్లి క్యాన్సిల్ కాలేదని.. అయితే తనకు బదులుగా నా పెళ్లి జరుగుతుందని చెప్పాడు. మా అన్నయ్య ఆఖరి కోరిక ‘నా పెళ్లి చూడటం అని.. నన్ను వరుడిగా చూసి తను సంతోషంగా మరణించేందుకు సిద్ధంగా ఉన్నా'నని చెప్పాడు. వాళ్ల తల్లిదండ్రులు కూడా నా పెళ్లికి ఒప్పుకోవడంతో మా ఇంట్లో అందరూ ఆనందించారు.

నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!



నాకే నమ్మకం కలగలేదు..

అంతే వెంటవెంటనే పెళ్లి పనులు వేగం పుంజుకున్నాయి. నాకు పెళ్లి కుదిరిందంటే నాకే నమ్మకం కలగలేదు. అలా అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది. అప్పుడు నాకు కూడా బాగా బాధగా అనిపించింది. అప్పుడే నాకు అనిపించింది దేవుడు ఒక్కోసారి మన జీవితాలతో ఆటలాడుకుంటాడు అని.



ఎవరికైనా కష్టమే..

తను ప్రేమించిన వ్యక్తిని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏ మగాడికైనా కష్టంగానే అనిపిస్తుంది. అప్పటి వరకు నేను నా భర్యను కేవలం ఒకట్రెండు సార్లు మాత్రమే చూశాను. అది కూడా సరిగ్గా చూడలేదు. తను కూడా నన్ను చూడలేదనుకుంటా.



పెళ్లి వేడుకలు పూర్తయ్యాక..

పెళ్లి వేడుకలు పూర్తయ్యాక నేను, మా అమ్మనాన్న, అన్నయ్య, నా భార్య మాత్రమే మిగిలాం. అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఇక అసలైన ఘట్టం శోభనానికి సమయం వచ్చేసింది. నేను పడకగదిలోకి వెళ్లాను. తన ముఖంలో నిద్ర మత్తును చూసి భయమేసింది. అయితే నేను లోపలికి వెళ్లిన తర్వాత తను నా దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు.. తన పట్ల నాకు ఎంతో గౌరవాన్ని పెంచాయి.



దగ్గరగా చూశాను..

తనని అప్పుడే నేను మొదటిసారిగా దగ్గరిగా చూశాను. తను చాలా అందంగా ఉంది. ‘నేను మాత్రం అందంగా లేననే ఫీలింగు'తో తన ముందు తల దించుకుని నిలబడిపోయాను.



మనం ముందు స్నేహితులుగా..

అప్పుడు తను ఇలా చెప్పింది. ‘భయపడకు మనిద్దరికీ అసలు ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలియదు. మన పెళ్లి అంతా హడావుడిగా జరిగిపోయింది. అందుకే మనం ముందు స్నేహితులుగా మారదాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాక.. ఆలుమగల్లా కలసి జీవిద్దాం. దీని వల్ల మనిద్దరికీ ఏ ఇబ్బంది ఉండదు అని తను చెబుతుంటే అది కలా?నిజమా అస్సలేమీ అర్థం కాలేదు. నన్ను ప్రేమించే వారు కూడా ఉంటారా' అని నేను అస్సలు ఊహించలేదు.



ప్రేమించే భాగస్వామి..

అలా అనుకోకుండా నాకు ప్రేమించే భాగస్వామి దొరికింది. నా జీవితంలో కొన్నాళ్లు తనతో స్నేహితుడిలా కలిసిపోయాను. కొన్ని నెలల పాటు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాక.. ఇద్దరం బాగా దగ్గరయ్యాం. అప్పుడే నాకు అర్థమైంది ప్రేమ అనేది కేవలం.. పెళ్లికి ముందే ఉండాలని రూలేం లేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని. అందుకు నా జీవితమే ఉదాహరణ కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

.



నీతి : దురాశ దుఃఖాన్ని కలిగిస్తుంది మరియు ఐక్యత బలం.