Nuli Vechani Vennela - 9 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 9

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 9

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"నో సందీప్. సమీర మేడం కి ఏ ప్రమాదం రాకూడదు.  తనకి ఏ ప్రమాదం జరగకూడదు. తనకి ముప్పు తలపెట్టాలనుకుంటున్న ఆ ఆడ మనిషి ఎవరు?"

కాస్తలో గుర్తుకొచ్చేసింది. తన హస్బెండ్ పేరు సందీప్. అది గుర్తుకు రాగానే సమీర గుండెవేగం పెరిగింది. నీరజ భర్త చనిపోయాడు. చనిపోయిన తన భర్తతో నీరజ ఎలా మాట్లాడుతూంది? అందులోనూ తనగురించి. పూర్తిగా పోయిన భయం మళ్ళీ సమీర గుండెల్లోకి నిండుగా వచ్చి చేరింది.

"ఏమిటి ఆ స్త్రీ కి మాడం డాడ్ వల్ల అన్యాయం జరిగిందా? అందుకని అది మాడం ని వదలదా? మరి దానికి నువ్వేమీ చెయ్యలేవా? మాడం మన కుటుంబాన్ని పోషిస్తోంది, ఆ విషయం మర్చిపోకు."

"నీరజా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు?" ఇంక ఆగలేక తిన్నగా నీరజ దగ్గరికి వెళ్లి, పక్కన నిలబడి అడిగింది సమీర.

"మాడం మీరెప్పుడు వచ్చారు?" గాభరాగా కుర్చీలోనుంచి లేచినిలబడి, సమీర మొహంలోకి కంగారుగా చూస్తూ అడిగింది నీరజ.

"నువ్వు నీ ఫోన్లో మాట్లాడుతూ వున్నప్పుడు." కోపంగా అంది సమీర. "నేను చెప్పాను కదా నీ ఫోన్ నా ఛాంబర్లో యూజ్ చెయ్యొద్దని."

"నేను నా ఫోన్లో మాట్లాడలేదు మాడం." అదే కంగారుతో తడబాటుగా ఇంకా సమీర మొహంలోకి చూస్తూనే అంది నీరజ.

"మరి అలా ఎవరితో మాట్లాడుతున్నావు? నీలో నీకే మాట్లాడుకునే జబ్బేమన్నా ఉందా?" చాలా కోపంగా అనిపిస్తూ ఉంది సమీరకి.

"నో మాడం." తల దించుకుని అంది నీరజ. "నేను నా హస్బెండ్ తో మాట్లాడుతున్నాను."

"వాట్ రబ్బిష్ యు అర్ టాకింగ్? యువర్ హస్బెండ్ ఈజ్ లేట్. తను రెండు సంవత్సరాల కిందట ఆక్సిడెంట్ లో పోయారని నువ్వే చెప్పావు." ఇంకా అలాగే నిలబడి అదే కోపంతో నీరజ మొహంలోకి చూస్తూ అంది సమీర.

"ఎస్, మాడం. అది నిజమే. కానీ నా హస్బెండ్ ఎప్పుడూ నాతో కాంటాక్టులో వుంటారు. తను నాతో అన్ని విషయాలు చెప్తూ వుంటారు." తలెత్తకుండానే అంది నీరజ.

"నేను నీకొక ఫూల్ లా కనిపిస్తున్నానా నీరజా? ఏం చెప్పినా నమ్మేస్తాననుకుంటున్నావా?" వెళ్లి తన కుర్చీలో కూలబడుతూ అంది సమీర అదే కోపం మైంటైన్ చేస్తూ. "చనిపోయిన మనిషి నీతో కాంటాక్ట్ లో ఎలా వుంటారు?"

"తను చనిపోయినా నా మీద తన కూతురి మీద ప్రేమ చావక ఇంకా స్పిరిట్ గా వుండిపోయారు. తను నన్నిలా కాంటాక్ట్ చేసి మాట్లాడుతూ వుంటారు."

"నో నీరజా, నువ్వు చెప్పేదేదీ నేను నమ్మను."

"మాడం మీరు నేను చెప్పిందేది నమ్మొద్దు. నేనిలా మాట్లాడినందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వండి పరవాలేదు." సడన్గా ఒక ధైర్యంతో సమీర మొహంలోకి చూస్తూ అంది నీరజ. "కానీ ఒకపని మాత్రం చెయ్యండి."

"ఏమిటది?" కుర్చీలో వెనక్కి జారగిలబడి చిరాగ్గా అడిగింది సమీర.

"మీరు జాగ్రత్తగా వుండండి. ఒక స్త్రీ వల్ల మీ ప్రాణాలకి ప్రమాదం వుందని  నా లేట్ హస్బెండ్ సందీప్  చెప్తున్నాడు. తను మీ మీద చాలా పగబట్టివుందట. మీ ప్రాణాలు మా అందరికి చాలా ముఖ్యం. దయచేసి జాగ్రత్తగా వుండండి." ఆందోళనగా అంది నీరజ.

"వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మాట్లాడేముందు కొంచెమైనా ఆలోచించవా?" తన గుండెల్లో భయం ఇంకా ఎక్కువ అయిపోయినా, అది బయటకి కనపడనివ్వకుండా అంది సమీర.

"మాడం మీరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు. కానీ జాగ్రత్తగా వుంటానని మాట ఇవ్వండి చాలు." అదే ఆందోళనతో అంది నీరజ. 

"ఆల్రైట్, ఆల్రైట్. జాగ్రత్తగానే వుంటాను." ఇంక ఏం అనాలో తెలీక అంది సమీర. "ఇప్పుడు మనం చెయ్యాల్సినదేమిటి?"

తరువాత ఇద్దరూ అప్పటికి చెయ్యాల్సిన వర్కులో పడ్డారు. అయినా నీరజ తనలో క్రియేట్ చేసిన డిస్టర్బన్స్ మాత్రం పోలేదు.               

&&&

"ఈ నీరజని ఎలా అర్ధం చేసుకోవాలో బోధపడడం లేదు." జరిగిన విషయం అంతా అనురాగ్ కి ఎక్స్ప్లెయిన్ చేసాక అంది సమీర. "ఖచ్చితంగా తానేదో సైకలాజికల్ డిసార్డర్ తో సఫర్ అవుతూంది."

"నువ్వు చెప్పింది విన్నాక నాకూ అదే అనిపిస్తూంది. తనకి సెక్రటరీగా ఇంతకుముందు కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం వల్ల నీకు ఉపయోగ పడుతుందనుకున్నాను కానీ ఇలా ఎక్సపెక్ట్ చెయ్యలేదు. చేంజ్ చేసేద్దామంటావా?" అనురాగ్ అడిగాడు.

"నో అనురాగ్. వర్క్ విషయంలో తనతో నాకు ఏ ప్రాబ్లెమ్ లేదు. తను ఒకవేళ ఏదైనా సైకలాజికల్ డిసార్డర్ తో సఫర్ అవుతూ వుంటే, తనకి హెల్ప్ చెయ్యాలి కానీ జాబ్ నుండి రిమూవ్ చెయ్యకూడదు." కుర్చీలో  మరికొంచెం కంఫర్ట్ కి అడ్జస్ట్ అవుతూ అంది సమీర.

"సరే అయితే. కానీ నీకు ఇబ్బంది కలిగించేలా విషయం మారితే మాత్రం, నువ్వు టోలరెట్ చెయ్యకు." తనూ కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అనురాగ్.

"కానీ అనురాగ్, తనలా ఎందుకు అంది? నాకు ఎదో స్త్రీ వల్ల ప్రమాదం ఏమిటి? తన హస్బెండ్ తనతో ఎందుకలా చెప్పాడు?" సడన్గా సమీర మొహం ఆందోళనతో నిండిపోయింది.

"ఓహ్, మై గాడ్! సమీరా." నవ్వుతూ అన్నాడు అనురాగ్. "తన హస్బెండ్ లేట్. తానేదో సైకలాజికల్ డిసార్డర్ తో సఫర్ అవుతోందని నువ్వే చెప్పావు. మళ్ళీ తన హస్బెండ్ చెప్పడమేమిటి?"

"ఏం మాట్లాడాలో బోధపడడం లేదు అనురాగ్. నా జీవితం అంతా నాకు చాలా గందరగోళంగా వుంది." దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది సమీర.

"నువ్వలా ఫీలవ్వకు. మేమందరం నీకున్నాం. నీకే ప్రమాదం రానివ్వం. నువ్వు కాస్త జాగ్రత్తగా వుంటే చాలు." భరోసా ఇస్తూ అన్నాడు అనురాగ్.

"ఆ విషయం నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు." సడన్గా మళ్ళీ రిలీఫ్ గా ఫీలయ్యి నవ్వింది సమీర. "ఓహ్, నీకొక సడన్ డెవలప్మెంట్ చెప్పడం మర్చిపోయాను." అప్పుడే సడన్గా సమీరకి తన డాడ్ డైరీలో రాత్రి చదివిన విషయం గుర్తుకొచ్చింది.

"ఐ యాం అల్ ఇయర్స్ సమీరా. టెల్ మీ వాట్ ఇట్ ఈజ్?" కుతూహలం నిండిన మొహంతో అడిగాడు అనురాగ్. అదే కుతూహలంతో మధ్యలో డిస్టర్బ్ చెయ్యకుండా సమీర చెప్పేదంతా విన్నాడు.

"మై గాడ్! సమీ. అవర్ అసంషన్ ఈజ్ రైట్. నీ ప్రాణాలు నిజంగానే ప్రమాదంలో వున్నాయి. నీ డాడ్ నీ గురించే అలా ఆందోళన పడ్డారు." అనురాగ్ మొహం కూడా పూర్తి ఆందోళనతో నిండిపోయింది

"నాకు అప్పుడప్పుడు ఎదో స్త్రీ ఏడుస్తున్నట్టుగా, ఇంకా నవ్వుతున్నట్టుగా, కాలి మువ్వల శబ్దం వినిపిస్తూ వుంది. ఇప్పుడేమో నీరజ ఇలా అంటూ వుంది. నిజంగానే నా మీద ఎవరైనా స్త్రీ పగబట్టి వుందా అని నాకు అనుమానంగా వుంది."

"నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకేం బోధపడడం లేదు." అయోమయంగా అన్నాడు అనురాగ్.

"నేను నీతో షేర్ చేసుకోవలసిన విషయాలు చాలానే వున్నాయి." సడన్గా తన సమస్య అంతా అనురాగ్ తో షేర్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసింది సమీర. "నువ్వు నాక్కొంచెం సమయం స్పేర్ చేయగలవా?"

"వాట్ ఈజ్ దిస్ సమీరా, నువ్వు నన్నిలా అడగాలా?" కోపం అభినయిస్తూ అన్నాడు అనురాగ్. "నువ్వే విషయం అయినా ఏ అరమరికలు లేకుండా నాతో షేర్ చేసుకోవచ్చు. చెప్పు, నువ్వేం చెప్పదలుచుకున్నావో?" ముందుకు వంగి, తన రెండు మోచేతులు మధ్యలో వున్న బల్లమీద బాలన్స్ చేసుకుని, సమీర మొహంలోకి చూస్తూ అడిగాడు అనురాగ్.

"ఇక్కడ కాదు అనురాగ్. వేరేచోట. నేను పూర్తిగా రిలాక్స్డ్ గా, రీలీఫ్గా ఫీలయ్యే చోట. ఇక్కడ కేవలం బిజినెస్ విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడాలని నాకు అనిపించదు." చిరునవ్వుతో అంది సమీర.

"అయితే నువ్వే ఆ ప్లేస్ ఏంటో డిసైడ్ చెయ్యి." కుర్చీలో మళ్ళీ వెనక్కి జారగిలబడి, తనూ చిరునవ్వుతో అడిగాడు అనురాగ్.

"మీ ఇంట్లో. నీకభ్యంతరం లేకపోతె ఈ రోజు సాయంత్రమే మీ ఇంటికి వచ్చి, అక్కడ నీకు చెప్పాలనుకున్నదంతా చెప్తాను." మునిపట్లా టైట్ గా అనిపించలేదు. ఎదో క్లోజ్ నెస్ వచ్చేసింది అనురాగ్ తో.

"ఈ కంపెనీ తన ఎంప్లాయిస్ గురించి కట్టిన గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ అది.  నేను జాయిన్ అయినా ఆరునెలలకే ఆ ఫ్లాట్ నాకు అలాట్ చేశారు మీ డాడ్. అది నా ఇల్లు అనడం కన్నా నీ ఇల్లు అనడమే సబబు." నవ్వాడు అనురాగ్. "ఇట్ విల్ బీ మై ప్లెజర్. నాకేం అభ్యతరం లేదు."

&&&

"అప్పట్లో నేనూ, మల్లిక నీ ఇంటికి వచ్చేవాళ్ళం. బహుశా అప్పుడు మాకు పన్నెండు, పదమూడేళ్ల వయసు ఉండొచ్చు. తరవాత, తరవాత నీ వల్ల మా డాడ్ హర్ట్ అయ్యేవరకూ, నువ్వంటే మాకు మంచి అభిప్రాయమే ఉండేది. మేమిద్దరం నీ గురించి ఏమనుకునేవాళ్ళమో తెలుసా?" 

ఆ సాయంత్రం తనూ, అనురాగ్ అతని ఫ్లాట్ లో, అక్కడ హాల్ లో,  అనురాగ్ అక్కడ వున్న కుర్చీలో, తను సోఫాలో, ఎదురుఎదురుగా కంఫర్టుబుల్ గా సెటిల్ అయ్యాక, మాట్లాడడం మొదలు పెట్టింది సమీర.

"ఏమనుకునేవాళ్ళేం?" చిరునవ్వుతో కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు అనురాగ్.

"చాలా హ్యాండ్సమ్ గై వని. నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ వుండివుంటారనుకునేవాళ్ళం."

"రియల్లీ!" పెద్దగా నవ్వాడు అనురాగ్. "మీలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ నా గురించి అలా అనుకోవడం నాకు చాలా ఆనందం గా వుంది."

"కానీ అది నిజమే కదా, అప్పుడూ ఇప్పుడూ కూడా." తను ఇలా ఎలా మాట్లాడగలుగుతూంది? ఆశ్చర్యంగా వుంది సమీరకి

"ఇట్స్ ఆల్రైట్ సమీ." సడన్ గా అనురాగ్ మొహం సీరియస్ గా మారి పోయింది. "మనం ఇప్పుడు వేరే విషయాల గురించి డిస్కస్ చెయ్యడానికి ఇక్కడ వున్నాము. నువ్వు నాతో ఏవో విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పావు."

అనురాగ్ సీరియస్ ఎక్సప్రెషన్ తో అలా అనేసరికి నిజంగానే హర్ట్ అయిపొయింది సమీర. ఏదీ చెప్పకుండానే అక్కడనుండి వెళ్లిపోవాలనిపించింది. తనని తను పొగుడుకోవడం కాదు కానీ, తన అందం ఎలాంటిదో తనకి తెలుసు.

ఏ వయసులో వున్న వాళ్ళయినా యిట్టె అట్ట్రాక్ట్ అవుతారు. అలాంటిది తనిలా మాట్లాడుతూ వున్న తనమీద ఏ ఇంప్రెషన్ రావడం లేదా ఇతగాడికి?

"నువ్వు దేనికీ సంకోచించాల్సిన అవసరం లేదు. నేను ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. కానీ ప్రతి విషయం నాకు చెప్పు. నీ ప్రాణాలు అలా ప్రమాదంలో వున్నప్పుడు అది చాలా అవసరం."

గట్టిగా నిట్టూర్చి చెప్పడం మొదలు పెట్టింది సమీర. తనకి ఎలా ఎవరో ఏడుస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా, ఎవరో తనని టచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూందో చెప్పింది. వాటిని మల్లిక కి చెప్తే, మల్లిక తనతో ఏమన్నదీ కూడా చెప్పింది. తనకి బాత్రూం లో ఇంకా, బెడ్ రూమ్ లో కలిగిన అనుభవం గురించి మాత్రం చెప్పలేదు.

"మల్లిక చెప్పింది రీజనబుల్ గానే వుంది. అవి కేవలం నీ ఆడిటరీ ఇంకా సెన్సువల్ హల్యూసీనేషన్స్ మాత్రేమే అయివుండొచ్చు. వాటిగురించి అయితే నువ్వు పెద్దగా ఆందోళన పడక్కర్లేదు."

"బట్ నాకెందుకు అలాంటి ఆడిటరీ, సెన్సువల్ హల్యూసీనేషన్స్ కలగాలి? నేనేం పాపం చేసాను?" కోపంగా అంది సమీర.

"నేనేం నీ ఫ్రెండ్ లా సైకాలజిస్ట్ ని కాదు. కానీ ఈ సబ్ కాంషస్ మైండ్ గురించి నాకు కొంత తెలుసు. అదప్పుడప్పుడు మనని అలాంటి హల్యూసీనేషన్స్ కి గురయ్యేలా చేస్తుంది." నవ్వుతూ అన్నాడు అనురాగ్.

"నువ్వలా మాట్లాడితే నాకేం చెప్పాలో తోచడం లేదు అనురాగ్." విచారంగా అంది సమీర.

"నీకు మీ డాడ్ కి మధ్య ఎంత అనురాగం ఉండేదో నాకు తెలుసు. తను చనిపోయాక నువ్వు బాగా అప్సెట్ అయిపోయావు. బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు. అందువల్లే నీకలాంటి హల్యూసీనేషన్స్ వస్తున్నాయనిపిస్తూంది. నువ్వివన్నీ మల్లికతో షేర్ చేసుకున్నావు కాబట్టి, ఎమన్నా చెయ్యాల్సి వుంటే తను ఖచ్చితంగా చేస్తుంది. నువ్వనవసరంగా ఆందోళన పడకు."

"కానీ డాడ్ రాసింది గుర్తుకు వస్తూ వుంటే నాకు చాలా ఆందోళనగా వుంది. డాడ్ నే అంత ఆందోళనకి గురిచేసిన ఆ విషయం ఏమిటో నాకు బోధపడడం లేదు." మళ్ళీ ఆందోళనతో నిండిపోయింది సమీర మొహం.

"టెన్షన్ పడకు. జాగ్రత్తగా మాత్రం వుండు. అదేమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం." అదే భరోసా తో అన్నాడు అనురాగ్.

"ఒకే అనురాగ్. నీతో మాట్లాడాక నాకు రిలీఫ్ గా వుంది." కానీ సమీరకి రిలీఫ్ గా కానీ, ఆనందం గా కానీ లేదు. తను దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూన్నా, అనురాగ్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూన్నాడు. అందుకనే అన్నివిషయాలు ఫ్రీగా షేర్ చేసుకోలేక పోయింది.

"ఈ రోజు నువ్విక్కడే సప్పర్ చెయ్యాలి. చాలా రోజుల తరవాత మా ఇంటికి వచ్చావు." అనురాగ్ అన్నాడు.

"నో, నేనింటికి వెళ్ళాలి. నేనిలా వస్తూన్నట్టుగా ఇంట్లో చెప్పలేదు." సమీర లేచి నిలబడింది.

"నువ్వా విషయం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు. అదేమన్నా పెద్ద విషయమా?"

"లేదు అనురాగ్. మరోసారి ఇక్కడ భోజనం చేస్తాను." అలా అన్నాక ఇంక అక్కడ ఆగకుండా ఇంటికి వచ్చేసింది సమీర. 

&&&

"నాకేం డౌట్ లేదు. తనేదో సైకలాజికల్ డిసార్డర్ తో సఫర్ అవుతూంది." సమీర, నీరజ అలా మాట్లాడుతూ వున్నదాని గురించి చెప్పిందంతా విన్నతరువాత మల్లిక అంది. "నువ్వీ విషయంలో కంగారు పడకు."

"నేనూ అదే అనుకుంటున్నాను. అనురాగ్ కూడా అదే అభిప్రాయ పడ్డాడు." సమీర అంది.

"ఓహ్, నువ్వు చాలా విషయాలు తనతో షేర్ చేసుకుంటున్నట్టు వున్నవే." చిరునవ్వుతో అంది మల్లిక.

"ఎస్, అంతే కాదు." సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డా, మల్లికకి చెప్పాలనే నిర్ణయించుకుంది. "నేను ఈ రోజు తనింటికి కూడా వెళ్ళాను. అందుకనే ఇంటికి వచ్చేసరికి లేటయింది."

"రియల్లీ! ఇంటరెస్టింగ్! ఎందుకు వెళ్ళావ్, ఏం మాట్లాడుకున్నారు?" సమీర భుజాలచుట్టూ చెయ్యివేసి తన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.

"ఎందుకో నా విషయాలన్నీ తనతో షేర్ చేసుకోవాలనిపించింది." గట్టిగా నిట్టూరుస్తూ అంది. "అందుకనే నాకు కలుగుతూన్న వింత అనుభవాలగురించి వాడికి చెప్పాను. డాడ్ డైరీలో మనం రీసెంట్ గా ఫైండ్ అవుట్ చేసినదాని గురించి కూడా చెప్పాను. తనూ చాలా భయపడుతున్నాడు. ఎనీహౌ నాకు పూర్తిగా హెల్పింగా వుంటానన్నాడు."

మల్లిక బెడ్ దిగి, దూరంగా వెళ్లి, నిలబడి సమీర మొహంలోకి చూస్తూ అంది. "నాకిప్పుడు ఇంక అనుమానం లేదు. ఐ యాం స్యూర్."

"ఏ విషయంలో?" కన్ఫ్యూజన్ నిండిన మొహంతో అంది సమీర.

"నువ్వు వాడితో లవ్లో పడ్డావు."

"నేనేం డినై చెయ్యదలుచుకోలేదు." సమీర బుగ్గలు ఇంకా ఎర్రబడిపోయాయి. "యు ఆర్ రైట్."

"బట్ ట్రై టు బి ప్రాక్టికల్. అనురాగ్ ఈజ్ ఏ గుడ్ గై. మేమందరం ఆ విషయం అంగీకరిస్తాం. కానీ వాట్ అబౌట్ ఏజ్ డిఫరెన్స్? నీకన్నా వాడు దగ్గర, దగ్గర ఇరవై ఏళ్ళు పెద్ద వుంటాడు."

"అవన్నీ ఆలోచించుకుని పుడితే అది ప్రేమ కాదు." సమీర అందంగా నవ్వింది. "లవ్ డజ్ నాట్ హావ్ కాలికులేషన్స్ అండ్ ఇట్ డోంట్ సి ఫర్ రీజన్స్ అండ్ లాజిక్స్. నీకు నేను అది చెప్పాల్సిన అవసరం లేదు."

"లవ్ ఈజ్ ఏన్ ఎమోషన్ జస్ట్ లైక్ ఆల్ అదర్ ఎమోషన్స్. నువ్వు బ్లైండ్ గా ఆలోచిస్తే సఫర్ అవుతావు."

"ఐ యాం రెడీ టు సఫర్ బట్ నాట్ రెడీ టు యాక్సప్ట్ ఎనీ అదర్ గై ఇన్ మై లైఫ్ దెన్ అనురాగ్" సమీర వాయిస్ ఫర్మ్ గా వుంది.

"ఆల్రైట్. ఇంక నేనేం చెయ్యలేననుకుంటా." గట్టిగా నిట్టూర్చి, మళ్ళీ సమీర పక్కకి వచ్చి కూచుంది మల్లిక. "ఎనీహౌ ఇంకా నువ్వు వాడికి నీ లవ్ ఎక్ష్ప్రెస్స్ చెయ్యలేదు, అవునా?" మరోసారి సమీర మొహంలోకి చూస్తూ అడిగింది.

"అసంషన్ రైట్." సమీర కూడా నిట్టూర్చింది. "నేను దగ్గర అవ్వాలని చూస్తూ వుంటే, డిస్టెన్స్ మైంటైన్ చేస్తూన్నాడు. కానీ వాడిని వదిలేది లేదు. నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తాను." మళ్ళీ ధృడంగా అంది సమీర.

"నువ్వింతగా కమిట్ అయ్యాక నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంకన్నా నేను చెయ్యగలిగింది ఏమీ లేదు." నవ్వింది మల్లిక. "అయినా నువ్విలాంటి ఏజ్డ్ గై తో లవ్లో పడడంలో నాకు పెద్దగా ఆశ్చర్యం కూడా లేదు. నీకు వాడితో ఏ రకంగానూ ప్రోబ్లం రాకూడదనే కోరుకుంటున్నాను."

"నీకెందుకు ఈ విషయంలో ఆశ్చర్యం లేదు? నాలాంటి యంగ్ గర్ల్ ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్డ్ గై తో లవ్లో పడడం ఆశ్చర్యమే కదా?" మోహంలో కుతూహలంతో అడిగింది సమీర.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)