Suryakantham - 3 in Telugu Love Stories by keerthi kavya books and stories PDF | సూర్యకాంతం - 3

Featured Books
  • स्वयंवधू - 35

    धोखा सुहासिनी उसे लिविंग रूम से निकालकर गलियारे में ले जाने...

  • शोहरत का घमंड - 115

    आर्यन की आँखें गुस्से से लाल होती है और वो बहुत ही गुस्से मे...

  • बन्धन प्यार का - 35

    "नरेश"आवाज सुनकर नरेश ने देखा था "अरे आकाश तू?"कॉलेज के साथी...

  • गुज़ार लूँ कुछ पल

    कुछ पल युही गुज़ार  लूं तेरे संग फिर पता नहीं तुम रहो या ना र...

  • रहस्यमय कहानी

    भूतिया हवेली का रहस्यगाँव के पास एक पुरानी हवेली थी, जिसे लो...

Categories
Share

సూర్యకాంతం - 3

సూర్యకాంతం పార్ట్ -3 


ఎప్పటిలానే సూర్య అందరు నిద్రలేచి ఎవరి పనుల్లో వాలు మునిగిపోతూ ఉంటారు.


కానీ సూర్య మాత్రం ఈరోజు లేటు గ నిద్ర లేచి భాదగా తన ముఖం అద్దం లో చూసుకొని ఇంకా ఆలోచనలో ఉంటుంది.  సూర్య కళ్ళు భాగావాచి పోయి కళ్ళు ఎర్రగా ఉంటాయి.


అప్పుడే నిద్రలేపడానికి అని భాగమతి తలుపు కొడుతుంటే , " ఆమ్మో నన్ను ఇలా చూసింది అంటే అమ్మ ఇంకా బాధపడుతుంది అని 


సూర్య: అమ్మ ! నేను నిద్ర లేచాను స్నానం చేస్తున్న ! అంటూ నేను రెడీ అయి వస్తాను మీరు వెళ్ళండి అని భాగమతి ఎం పిలవకుండానే.


భాగమతి: ఏంటిది కొత్తగా ప్రవర్తిసుతుంది ! ఏమైనా దాస్తోందా అని సందేహం తో ఏ విషయం ఎలా ఐనా భాను గారికి చెప్పాలి అని అనుకుంటుంది


శ్రీధర్: ఎలా ఐనా సరే ముందు సూర్య కి పెళ్లి గురించి ఒపీనియన్ మార్చాలి లేదు అంటే తాను జీవితం లో చాల కోలుపోతుంది అని ఆలోచిస్తుంటే తన ఫోన్ మోగుతుంది.


ఎవరో అన్నోన్ నెంబర్ అని ఎవరయి ఉంటారు అబ్బా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు.


అవతల వాలు హలో అనగానే , " రేయ్! శ్రీ నువ్వేనా అని " భాను సంభోదిస్తుంటే ఆ మాటలు విని  కాంతమ్మ , భాగమతి తమ కళ్ళు ఆనందం తో చెమ్మగిలుతాయి.


( ఇక్కడ ఫోన్ చేసింది శ్రీధర్ )


శ్రీధర్: హలో భాను ! నేను శ్రీధర్ నే ఎలా ఉన్నారు అని యోగక్షేమాలు అని అడిగాడు? 


భాను: అంత బాగున్నం! నా మావయ్యా, అత్తయ్య , చెలాయి ఇక నా ముద్దుల అల్లుడు ఎం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటున్నాడు.


శ్రీధర్: రేయ్! నాకన్నా విల్లు అందరు ఎక్కువైపోరు రా నీకు ? నీకు నేను కావాలా లేక విలందరు కావాలా?


భాను: వాలు బాగుంటే నువ్వు బాగున్నావో లేవో ఇట్టే తెలిసిపోతాది కదరా ! 


శ్రీధర్: నువ్వు ఏ మాత్రం మారలేదు రా ! అంతే అలానే ఉన్నావు


భాను: ఇన్నాళ్లు కి గుర్తొచ్చాము మేము. ఇక మీరు దేనికోసమని కాల్ చేసారో మాకు సెలవు ఇవండీ ప్రభో !


ఇక్కడ శ్రీధర్ ఫోన్ స్పీకర్ లో ఉంది అందరూ ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు 


శ్రీధర్: నాకు నిన్ను నా కోడల్ని చూడాలి అని ఉంది రా అని అంటాడు


భాను: ఆ మాటకి మురిసిపోయి, రండి రా ! మీ ఇంటికి మీరు రావడానికి పర్మిషన్ కావాలా రా ! 

వచ్చేయండి కానీ ఒక షరతు !


శ్రీధర్: ఏంటి రా!


భాను: ఒక నెల రోజులైనా ఇక్కడే ఉండాలి రా! ముఖ్యం గా నా అల్లుడు మాత్రం నేను చాల మిస్ అయ్యాను వాడు రావాల్సిందే


శ్రీకాంత్: మావయ్య ! నేను మిమల్ని చాల మిస్ అయ్యాను తప్పకుండ వస్తాను !


భాను: వచ్చేయండి ఇక ! అందరూ !


శ్రీధర్: అలాగే రా!


రామారావు: అసలు విషయం చెప్పకుండా ! ఎందుకు అక్కడికి రావాలి అన్నావ్ !


శ్రీధర్: మనం చెప్పే విషయం కచ్చితంగా ఒప్పుకుంటాడు నాన్న కానీ మనం చేపినక తన కళ్ళలో ఆనందాన్ని చూడాలి అని నేరుగా వేలి చెబితే బాగుంటుంది అని ....


రామారావు: నిజంగానే నువ్వు అనాది కరెక్ట్ ! అలాగే చేదాం ! కానీ శ్రీకాంత్ కి సూర్య మీద ఇష్టం లేనట్టు ఉంది మనం ఎలా ఐనా సరే విల ఇద్దరి పెళ్లి చేయాలి.


శ్రీధర్: అవును నాన్న ! మనం ఎలా ఐనా సరే చేయాలి. ముందు వాడు వస్తానని ఒప్పుకున్నాడు కదా అది చాలు ! అక్కడికి వెళ్ళాక మనం ప్లాన్ చేదాం. 


-------------------------------------------------

సూర్య కూడా రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద కూర్చుట్టుంది. 


కానీ చలనం లేని మనిషిలా ఎం అల్లరి చేయకుండా సైలెంట్ గా తనే టిఫిన్ పెట్టుకొని  తింటూ ఉంటుంది.


భాను, భాగమతి , కాంతమ్మ ముగ్గురు ఆనందం లో మునిగి పోతు ఉంటారు. 


( కాంతమ్మ మనసులో హమ్మయ్య దేవుడు నా కోరికని తిరుస్తున్నాడు అని ఆనందం లో మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది )


భాను: భాగమతి, న స్నేహితుడు ఎన్నో ఏళ్ళు తర్వాత కలుస్తునం నెల రోజులు ఉంటారు ఇక్కడే ఆ ఏర్పాట్లు చూడు అలానే నా ఫ్రెండ్ ఇష్టమైన పూతరేకులు, చేపల పులుసు .....చేసి రెడీ చేసి ఉంచు అని హడావిడి గ మాట్లాడుతూ ఉంటాడు.


భాగమతి: హా సరే అండి. అన్నయ కి ఇష్టమైనవి అని నాకు తెలుసు అండి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని 


ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు లోపలి వస్తారు. 


ఇది గమనించిన సూర్య ఏంటి నాన్న ఎవరు వస్తున్నారు మన ఇంటికి అంత హడావిడి చేస్తున్నారు?


భాను: అది మీ శ్రీధర్ మావయ్యా వస్తున్నాడమ్మా నీకు గుర్తున్నాడా?


సూర్య:హా నాన్న గుర్తున్నారు మావయ్యా ఎలా మర్చిపోతాను. చిన్నపుడు  నాకు ఏది కావాలి అంటే అది ఇప్పుస్తుంటారు 


భాను:హా శ్రీధర్ మావయ్యా వాలా ఫ్యామిలి వస్తున్నారు అమ్మ!


సూర్య: సరే నాన్న! కానీ ఆ కోతిమూక కూడా వస్తున్నాడా?


భాను: కోతిమూక ఎవరు సూర్య?


సూర్య: అదే నాన్న మావయ్య వాలా అబ్బాయి, నాకు పేరు కూడా గుర్తులేదు


భాను: సూర్య!!!! మంచి మర్యాదలు లెవా నీకు ? వాలా మన బంధువులు. హ తాను కూడా వస్తున్నాడు. అతని పేరు శ్రీకాంత్. రేపు నువ్వే బస్సు స్టాప్ కి వేలి వాలని మర్యాదపూర్వకంగా మన ఇంటికి తీసుకురావాలి. సరేనా?


సూర్య: నువ్వు ఆర్డర్ వేసాక తప్పుతుందా ! తీసుకొస్తలే నాన్న. (అని నిట్టూర్పుగా తన రూమ్ లోకి వెళ్తుంది)


కాంతమ్మ: భాను, ఎలాగైనా మనం ఈ పెళ్లి సంబంధం విషయం వాలా తో మాట్లాడాలి అలాగే రామారావు అన్నయకి కూడా ఈ  విషయం తెలుసు. కానీ నా భాద ఆలా ఒకటే ఈ సూర్య పెళ్లి కి ఒప్పుకుంటుందా అని?


భాను: నేను వియ్యం అందుకుంటున్న కుటుంభం స్వయానా న ప్రాణ మిత్రుడు . సూర్య ఇక్కడ ఎలా ఐతే ఉందూ అక్కడ కాబోయే అత్తా వారింట్లో కూడా అలానే ఉంటుంది. ఆ ధైర్యం తోనే నేను ఈ విషయం మాట్లాడాలి అని ఆలోచించాను అమ్మ. ఇక సూర్య ని ఒపించాలి అంటే మనం అందరం కలిసి ఒప్పించి చేపించాలిసిందే తర్వాత తానే అని తెలుసుకుంటుంది అమ్మ. నువ్వు ఎం బయపడకు. అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది.


భాగమతి: హా అత్తయ్య! మనం అందరం కోరుకున్నట్టే జరుగుతుంది. ఆ దేవుడు దయ వాలా ఈ పెళ్లి జరిగితే నా కూతురు గురించి నాకు ఏ చింత ఉండదు. ( అని తన పని లో తాను మునిగిపోయింది )


కాంతమ్మ: హా భాను ! ఇక పద మనం శ్రీధర్ వాలా కోసం అని ఏర్పాట్లు చేయాలి.


-------------------------------------------------------------------------------


**************మరుసటి రోజు *************


శ్రీధర్ వాలా కుటుంభం అంత సర్దుకొని ఊరికి బయలుదేరతారు. ఇక మన హీరో (శ్రీకాంత్) కూడా తప్పక భయాలు దేరాల్సి వస్తుంది. 


ఇక సూర్య వాలా ఇంట్లో సూర్య కి  తప్ప అందరు హడావిడికి అవధులు లేవు. 


సూర్య వాలా మావయ్యా వాలని చూస్తున ఆనందం ఓ పక్క నా ఉన్న ఆ కోతిమూక ని తో నెల రోజులు ఎలా భరించాలి అని ఆలోచనలో పడింది 


ఇక వాలా నాన్న అరుపులు తట్టుకోలేక అందంగా రెడీ అయి రిసీవ్ చేసుకోడానికి వెళ్తుంది


శ్రీధర్ వాలు అంత కార్ లో భయాలు దేరుతారు.


శ్రీకాంత్: నాన్న ! నేను నా బైక్ పై వస్తాను మీరు కార్ లో వచ్చేయండి. 


శ్రీధర్: అలాగే ! నువ్వు జాగ్రత్త గా రా ! మా వెనకాలే!


శ్రీకాంత్: సరే నాన్న!


**************************************************************

సూర్య: ఎంత సేపు ఇక ! అని వెయిట్ చేస్తూ ఉంటుంది.


శ్రీధర్ కార్ ని కొంత వరకు ఫాలో అయి మధ్యలో ఫ్రెండ్ ఫోన్ చేయటం వాళ్ళ శ్రీకాంత్ వాలని మిస్ అవుతాడు.


శ్రీకాంత్: చ్చ! వీడు ఇపుడే ఫోన్ చేయాలా. నేను నాన్న కార్ మిస్ అయ్యిందే . ఇప్పుడెలా ? సర్లే ఏది ఐతే అది అయింది. మనం బస్సు స్టాప్ దగ్గర కానీ చుట్టుపక్కల వాలని అడిగితే చెప్తారుగా అని ఇక స్టార్ట్ అవుతాడు.


శ్రీధర్ వాలు ఇక భాను వాలా ఇంటికి వచ్చేస్తారు కానీ సూర్య వాళ్లతో రాకపోవటం గమనించి 


భాను : (మనసులో) సూర్య విలనీ కలిసిందా లేదా ? అని ఆలోచిస్తున్నాదు


శ్రీధర్: రేయ్ భాను ! భాను ! ( అంటూ ఆలింగనం చేసుకుంటాడు భాను)


భాను: శ్రీధర్! ఎలా ఉన్నావ్ రా! ఎలా ఉన్నారు అత్తయ్య , మావయ్యా అని నమస్కరిస్తారు.


రామారావు, సీతమ్మ: బాగున్నాం భాను.


భాను: నేను మిమల్ని రిసీవ్ చేసుకోమని సూర్య ని బస్సు స్టాప్ దగరికి పంపించాను. తాను మీకు కనపడలేదా?


శ్రీధర్: అవునా! మాకు ఇల్లు తెల్సు డైరెక్ట్ గ వచ్చేసాం. మేము బస్సు స్టాప్ రూట్ కాకుండా వేరే రూట్ నుంచి వాచం రా. సూర్య ని  ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ ?


భాను: అదేం లేదు మా మర్యాదలు మాకుంటాయ్ కదరా. ఇంతకీ నా అల్లుడు ఎక్కడ?


శ్రీధర్: వెనకాల వస్తున్నాడు. ఇంకో 10 నిముషాల్లో ఇక్కడ ఉంటాడు లే

( ఇక ఇంటి లోపలి వెళ్తారు అందరు)


శ్రీధర్ కుటుంభం , భాను కుటుంభం ఇక అంత కలిసి ముచ్చట్లో మునిగిపోతారు. 


శ్రీకాంత్ నానా అవస్థలతో బస్సు స్టాప్ చేరుకుంటాడు. 


(బస్టాప్ దగ్గర సూర్య తప్ప ఇంకెవరు ఉండరు)


శ్రీకాంత్: హలో! మిస్ ! ఇక్కడ భాను గారి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా?


సూర్య: హా తెల్సు. ఆయనతో మీకు ఏంటి పని?


శ్రీకాంత్: అతను మా మావయ్యా ! చాల రోజులు తర్వాత వచ్చాను కానీ నాకు అడ్రస్ గుర్తులేదు. కొంచం అడ్రస్ చెప్తారా?


సూర్య: (మనసులో) వామ్మో కోతిమూకన విడి కి నేను నా ఇంటి అడ్రస్ చెప్పాలా ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటానో. (అంటూ ఓరగా కోపంగా చూస్తుంది శ్రీకాంత్ వైపు)


శ్రీకాంత్: (మనసులో) ఏంటి దీనికెమ్మన చెవుడా ! ఏంటి ఆలా గుడ్లప్పగిచి చూస్తుంది. 

(సూర్య ముఖం ముంది చిటికెలు వేస్తూ)


శ్రీకాంత్: హెళ్ళూ! మిస్ ! అడ్రస్ చెప్పండి.


సూర్య: నేను చెప్పాను! నేను ఎందుకు చెప్పాలి ?


శ్రీకాంత్: మిస్! మనిషి కి మనిషి సాయం చేయాలి అండి.


సూర్య: హా అదే నీకు సాయం చేస్తే నాకు ఏంటి అంటున్న?


శ్రీకాంత్: ఒహ్హ్! సరే చెప్పండి మీకు ఎం కావాలి?


సూర్య: నాకు తాటి ముంజలు కావాలి అలాగే ఏది కావాలి అనిపిస్తే అవి కొనిపించాలి అని అడుగుతది


శ్రీకాంత్: (మనసులో ) ఇది పెద్ద తిండిబోతు ల ఉంది. దీని ఎవడు చేసుకుంటాడో వాడు ఐపోయాడు.

శ్రీకాంత్: హా సరే మేడం! రండి బైక్ ఎక్కండి! 


సూర్య: హా సరే (అని బైక్ ఎక్కుతుంది) 


సూర్య దారిలో కనిపించే పునుగులు, బజ్జిలు, పానీపూరి, స్వీట్స్, ఐస్క్రీమ్ ఇలా ఏవి కనిపిడితే అవి మొత్తం కొనిపించొని ఊరంతా తీపించి చివరికి ఇంటికి తీసుకొస్తుంది. 


సూర్య: ఇదే మీ మావయ్యా భాను గారి ఇల్లు. 


శ్రీకాంత్: ( మనసులో) ఏదో పల్లెటూరు అనుకున్న ఇంత పెద్దగా ఉంది ఏంటి! పైగా ఈ తిండిబోతు మహారాణి నా డబ్బులు అని అవ్వగొటేసింది. 


శ్రీకాంత్: (పైకి ఏమనలేక ) థాంక్ యు సో మచ్ మేడం ! ఇంతకీ మీ పేరు ఏంటి అండి ?


సూర్య: వాము ఇపుడు వీడికి నా అసలు పేరు చెప్తే నా గురించి తెలిసే ఛాన్స్ ఉంది అని మనసులో అనుకుంటూ నోటికి వచ్చిన పేరు గ శైలజ అని చెప్పేస్తుంది.


శ్రీకాంత్: నైస్ నేమ్! సరే అండి ! బాయ్! (అని లోపలి వెళ్తాడు) 

*************************************************************
ఇంకా ఉంది.