Love - 1 in Telugu Love Stories by Harsha Vardhan books and stories PDF | ప్రేమ - 1

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ప్రేమ - 1

నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ నా కథని చదివి మంచిగా రివ్యూస్ ఇస్తారు అని కోరుకుంటూ ఉన్నాను . నన్ను ఫాలో చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు .

అనగనగా ఒక ఊరు . ఆ ఉరే ఒక " బ్యూటీ స్పొట్ ఆఫ్ ది నేచర్ " అని అంటారు . ఆ ఊరిలో అర్జున్ అనే ఒక అబ్బాయి . అతను ఇప్పుడు పదోవ తరగతి చదువుతున్నాడు . అతను వీధిలో రోడ్ మీద బజారు బంతి అనే ఆట అడుతు ఉన్నాడు . అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పరుగు తిస్తు ఉన్నారు .

మన హీరో కూడా అదే పనిలో ఉన్నాడు . ఇంతలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా కొంత మంది వీదిలో ఎవరో కూడా తెలియదు పరుగు పరుగున వచ్చారు . ఇద్దర్నీ తరుముతూ ఉన్నారు .

చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు దొరకగానే వారిని కసితీరా అక్కడే వీధి చివరలో కత్తితో పొడ్చి పోడ్చి చంపారు .
అది మన హీరో ఫ్రెండ్స్ చూసారు .

మనకు ఎందుకులే అని భయంతో వాళ్ళు తిరిగి

ఆడుకోవడానికి వెళ్లి పోయారు . అంత పరుగున వచ్చి బండ ముక్కలు ఒకదాని మీద ఒకటి పరుచుతు ఉన్నారు .

చివరిగా ఒక ముక్క మన హీరో చేతిలో ఉంది . అతను దాన్ని తెచ్చి వాటిపై పెట్టకుండా అలానే కూర్చొని శిలలా కదలకుండా ఉండి పోయాడు .

ఫ్రెండ్స్ అంతా ఏమైందిరా పెట్ర బండ అంటున్న వాడికి ఏమి వినిపించే విలు లేదు . ఆ బండ పెడితేనే వారు గెలిచినట్లు లేదా బంతితో కొడతారు. వాడు తెలియని ఎదో లోకంలో ఉండిపోయాడు . ఎందుకు అల ఉన్నాడు అని చూస్తే వాడి ముఖంలో చిరునవ్వు తో కూడిన ఆశ్చర్యం .

ఎందుకంటే మన హీరో ముందు ఒక అద్భుతం . వండర్ తను ఎప్పుడు చూడలేదు ఇలాంటి దేవ కన్య నీ . అది ఎవరో కాదండోయ్ మన హీరోయిన్ .

తను మన హీరో ఎదురుగా యెల్లో చుడీదార్ , వైట్ చున్నీతో మన హీరో అర్జున్ మనసు దొచేసుకుంది . తను అలా నడుచుకుంటూ వస్తు ఉంటే ప్రకృతి కూడా తనని చూసి కరిగిపోయింది .

అదే సమయంలో అకస్మాత్తుగా వాన చిరు చిరు చినుకుల అలజడి పడుతూ ఉంటే , మన వాడి గుండెల్లో పాట కవిత్వంలా బయటకు వినపడుతూ ఉంది .



కవిత్వం ఇలా ఉంది :

ఎన్ని నాళ్ళుగా ఉన్నా
ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే
కచ్చితంగ నువ్వే

మబ్బునీ , మెరుపునీ
కలిపిన వానల్లె
పెదవుకి , నవ్వుకీ
పరిచయం నీ వల్లే

చిగురుపై చినుకులే
ఎగిరితే యెంతందం
మనసుకో జ్ఞాపకం
దొరికితే ఆనందం

అలానే వాన చినుకులు ముగిసిపోయి . తను వెళ్తుంటే మన హీరో వెనకాలే నడుచుకుంటు తనలో తాను ఎదో సాధించిన అంత ఆనందంగా చిరు నవ్వు నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాడు .

మన హీరోయిన్ కూడా చిరునవ్వు నవ్వుకుంటూ అర్జున్ వెంట రావడం గమనించి సిగ్గుపడుతూ నడుస్తూ ఉంది .

చిన్నప్పటినుండి ఒకరు అంటే ఒకరికి ఇష్టం . ఆ ఇష్టం
అలానే పెరుగుతూ పెరుగుతూ ఆది ఏమవుతుందో తెలియదు . చూద్దాం పదండి..!!

ఆ అమ్మాయి అలానే సిగ్గుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది . మన అర్జున్ ఇంకా అలానే నిల్చొని పైకి చూస్తూ ఉన్నాడు . తను అర్జున్ కోసం బల్కానికి వచ్చింది .

ఒకరినిఇంకొకరు చూసుకుంటూ చాలా ముద్దుగా బొద్దుగా సిగ్గుపడుతుంటారు. ఇంతలో హఠాత్తుగా హీరోయిన్ వాళ్ళ అన్న రావడం గమనించి సిగ్గుపడుతూ ఉన్న అర్జున్ నీ వెళ్ళిపో వెళ్ళిపో అంటు ఉంటుంది . అర్జున్ మాత్రం తన కలల ప్రపంచంలో నుండి బయటికి రాలేదు . అలానే పైకి చూస్తూ సిగ్గుపడుతూ నిల్చున్నాడు .

తనకి ఏమి చేయాలో తెలియక తికమక పడుతూ ఉంది . వాళ్ళ అన్న చూస్తే అర్జున్ నీ చంపేస్తాడు . అతను మరింత వేగంగా వస్తూ ఉన్నాడు . ఇక చేసేది ఏమి లేక తను పరుగు పరుగున కిందకు దిగి వచ్చింది . ఇంతలో వాళ్ళ అన్న వచ్చేశాడు .

మరి మన హీరో దొరికి పోయాడా..?

అర్జున్ టైం చాలా బాగుందండోయి . ఎందుకంటే తను వాళ్ళ అన్న వచ్చి చూసే లోపే పక్కనే ఉన్న చిన్న సందులోపలికి లాక్కొని వెళ్ళిపోయింది .

అర్జున్ నీకేమైనా పిచ్చా నేను అన్న వస్తున్నాడు అంటున్నానుగా వెళ్ళడానికి ఏంటి నీకు అని మన హీరోయిన్ . అర్జున్ కి అవేమీ వినపడలేదు అతను తన కళ్ళలోకి చూస్తూ ఉండి పోయాడు .

తను అర్జున్ గుండెపై గట్టిగా గిల్లింది . అర్జున్ తిరిగి ఈ లోకానికి వచ్చాడు . ఏమైంది రా నీకు అని మన హీరోయిన్ . ఏమిలేదు అన్నట్టు తల ఉప్పడు అర్జున్ .

సరే రేపు నన్ను బయటికి తీసుకొని వెళ్తాను అన్నావు నిజంగా తీసుకు వెళ్తవా ..!! అంది తను .

హా నువ్వు రేపు పొద్దున్నే రెఢీ గా ఉండు చాలు నేను వస్తాగా అన్నాడు అర్జున్ .

అర్జున్ మంచిగా నీళ్ళు పోసుకొని , ఫ్రెష్ అప్ అయ్యి బయలు దేరడానికి సిద్దంగా ఉన్నాడు .

అక్కడ తను అర్జున్ వెంట వెళ్ళడానికి చాల అందంగా కనిపించాలని కుందనపు బొమ్మలా తయారు అవుతూ ఉంది .

తనకోసం గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేసుకొని స్కూటీ లో దాచాడు అర్జున్ . నేను రెఢీ గా ఉన్నాను అని మెసేజ్ పంపింది .

మరి కలిసి బయటకు వెళ్ళారా ..?

తనకోసం తీసుకున్నా ఆ గిఫ్ట్ ఏంటి ..?



ఇంకా ఉంది ... ☺️