This is our story - 1 in Telugu Love Stories by Harsha Vardhan books and stories PDF | ఇది మన కథ - 1

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ఇది మన కథ - 1

వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..!
.
ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్‌ కార్డుపై గోల్డ్‌ కలర్లోని ‘మానస వెడ్స్‌ తరుణ్‌’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్‌ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్‌ యార్‌. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది.
నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్‌ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్‌ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు.
నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది.
చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్‌ లీడర్‌గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్‌ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్‌ అవసరం పడింది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్‌ చేసి రిక్రూట్‌ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్‌ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్‌ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్‌లోకి పంపించమన్నాను.

మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్‌ ఎనాలిసింగ్‌ టెక్నిక్స్‌ డిస్కస్‌ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్‌.ఐ.టి గ్రాడ్యుయేట్‌. కానీ


అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్‌ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది.
ఇదేమి వింత! ఇది కరెక్ట్‌ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్‌ మాడ్యూల్స్‌ డిస్కస్‌ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్‌ సెలెక్టెడ్‌’ అని చెప్పాను. ‘థాంక్‌ యూ సో మచ్‌ ఫర్‌ సెలెక్టింగ్‌ మీ. ఈ జాబ్‌ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్‌లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది.

ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్‌ల విద్యుత్‌ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్‌ అఫ్‌ బర్త్‌ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్‌ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్‌ యూస్‌ చెయ్యి. నో ప్రాబ్లెమ్‌’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది.
అయితే ఒకటే టీమ్‌ అయినా ఆఫీస్‌లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్‌ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్‌ కుడా జూమ్‌లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్‌ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు.
.
‘నువ్వు మామూలు డ్రెస్‌లో కంటే జీన్స్‌.. టీ షర్ట్‌లో సూపర్‌ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్‌. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్‌ బాక్స్‌ షేర్‌ చేసేది.

కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్‌ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్‌ విషయాలు కూడా షేర్‌ చేసుకునేది.

# ఆ తరువాత ఏమి జరిగింది .. ?

( ఇంకా ఉంది ) ... 😉