A girl... - 1 in Telugu Motivational Stories by madhava krishna e books and stories PDF | ఒక అమ్మాయి... - 1

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

ఒక అమ్మాయి... - 1

ఇసుక వేస్తే కూడా రాలనాటువంటి జనం తో కిక్కిరిసి పోయింది ఆ ప్రాంతం.. మీడియా వాళ్ళు లైవ్ ప్రసరాలతో మారు మోగపోతుంది ఆ ప్రాంతం.. ఎటువంటి పార్టీ కి సంబదం లేకుండా ప్రధాన పార్టీ నేతలు గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు ప్రధాన ప్రతిపక్ష నేత రాజారెడ్డి , సినిమా పెద్దలు, క్రికెటర్స్వ్యా,పారవేత్తలు దగ్గర నుంచి రోజు ఒక్క రూపాయి అడుక్కుంటే కూడా కడుపు కి ఇంత బన్ను ముక్క కూడా తినలేని పేదవాడి వరకు వచ్చే ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు.. అక్కడ వేదిక మీద మైకు లో మాట్లాడుతున్న అమ్మాయి ఈ విధముగా చెబుతుంది.. భగ భగ మండి పోతున్న ఆ భానుడు నీ సైతం లెక్క చేయకుండా.. గొంతు ఆ ఎండకు కి ఎందుటలేదు మా తెలుగు బిడ్డ మన ఆశ జ్యోతి చూసే ఆనందం తో ప్రజల గుండెల్లో నుంచి వచ్చే ఆనంద బస్పాలతో ఈ కరువు నెల కూడా తడిచి పోయింది . గూగుల్ మ్యాప్ లో కూడ చోటు లేనటువంటి ఆ ఊరు ఇప్పుడు ట్రెండింగ్ లో నెంబర్.1 లో ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీ లు బ్యానర్లు లో ఆ వ్యక్తి ఫొటోస్ తో చూడ్డానికే చాలా అంటే చాలా అందముగా వుంది. వచ్చిన వాళ్ళు అందరూ తను గురించి ఒక్కొక్కరి గ పొగడ్తలతో ముంచెత్త సాగారు. Breaking news:- ఎప్పుడు ఎప్పుడు అని యావత్ భారత ఎదూరు చూస్తున్న మన తెలుగు బిడ్డ .. భారతావని ముద్దుల బిడ్డ .. తెలుగు తల్లి ఒడి లో ఆడి ఇప్పటికీ ఆ తెలుగు తల్లి నీ మరచిపోని మనందరి ఆడపడుచు ఇంకెవ్వరూ కాదు మన శ్రీ భానుమతి.. శ్రీ బానుమతి గారు ఇంకా కాసేపట్లో హెలికాప్టర్ లో మన ముందు కి రాబోతున్నారు.. రాగానే మీ కరద్వానులతో సభా ప్రాంగణం మారు మోగలి అంటుండ్డగనే.. హెలికాప్టర్ రానే వచ్చింది. జనాలు అందరూ కూతలు కేకలు వేయ సాగారు. హెలికాప్టర్ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా కింద కి దిగి నమస్కారం చేశాడు ప్రజలకి. తర్వాత ఆ అమ్మాయి కి దిగతనికి చేయి సహాయం చేశాడు.. వేదిక మీద ఉన్న ప్రముఖులు లేచి నిల్చున్నారు. అలా హికాప్టర్ నుంచి దిగుతున్న ఆ అమ్మాయిని చూడ్డానికి అందరి కళ్ళు చాలట్లేదు.
మందార రంగులోని చీర లో. ఒక్కసారి చూస్తే మళ్ళీ కనురెప్ప కూడ కొట్టకుండా మరి మరి చూడాలనిపించే ఆ కళ్ళు. ఆ కను బొమ్మల మధ్యలో ఎంతో సింగరమిన ముక్కు . కనుల మధ్యలో ఒక చిన్నటి తిలకం (stikker). పార్వతీ దేవి నీ మించిన కురులు . తెలుగు కృష్ణా నది నీ మించిన వంపులతో ఎంత పొడవుగా ఉందో.. హెలికాప్టర్ గాలికి పైకి లేస్తున్నాయి జడలోని మల్లెపూలు కనకాంబరాలు.. కేసరి లోని ఎరుపు మొత్తం తన పెదాలకు ఉందేమో అనిపించేలా ఆ ఎర్రటి పెదాలు. తేనె లు కలిపిన పాలలో సుగంధాలు వేసి జాబిల్లి తో స్నానం అదిందేమో అనిపించేలా ఆ సౌందర్య అయిన శరీరం. నిండు చీర లో అలా నడిచి వస్తుంటే సాక్షాత్తూ ఆ తెలుగు తల్లి నే ఎంతో ముద్దుగా తనను కని మనకోసం ఇలా పంపిందేమో అనిపిస్తోంది. అలా ఆ వేలాది జన సమూహం మధ్యలో తనని కన్న నెల మీద, •ఒక అమ్మాయి• అంటూ చిన్న చూపు చూసిన నెల మీద, తన తండ్రి చెమట తో తడిచి న నేలమీద, తన తల్లి పుస్తెలు తెగిన నెల మీద, తన అక్క లు వాళ్ళ చదువు నీ త్యాగం చేసి తనని చదివించిన నేల మీద, నిండు పండుగ రోజు అప్పుల వాళ్ళు ఇంటి మీద కి వచ్చి హీనంగా మాట్లాడిన నెల మీద, అన్నింటి కంటే మించి తమనీ అక్కున చేర్చుకుని ఆసరాగా నిలిచిన కన్నపుట్టిన నేల.. నాన్న సొంతంగా ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఉన్న నేల ఇలా మదిలో మెలుగుతున్న జ్ఞాపకాలు తో వేదిక మీద అశినులు అయ్యింది భానుమతి. అలా కూర్చొని ఆ చేతి గోర్లు కొరుకుతూ తన జ్ఞాపకాల లోకి వెళ్ళిపోయింది...



అది ఒక చిన్న పల్లెటూరు.. రోజు పనికి పోతూ జీవనం సాగించే మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నటువంటి సాధారణమైన పల్లెటూరు అది.
ఊరిలో తెల్లవారు జామున కోడి కూయగానే గుడిలో పాటలు మొదలయ్యాయి.. అవి వింటూనే , ఇదిగో పాప తెల్లగ అయ్యింది అనుకుంటా గుడిలో పాటలు పెట్టారు లేయి త్వరగా, ఇయ్యాల పని చాలా ఉంది మి నాన్న కర్నూల్ కి పోవాలి అంట, నికు పరీక్షలు ఉన్నాయి అన్నవ్ కదా త్వరగలేసి పనులు త్వరగా చేసేయి అంటుంది .అక్క వల్లేమో హాస్టల్ లో ఉన్నారు పనులు అన్నీ నాకే చెప్పండి అంటూ గోముగా లేచింది భాను.. నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకొని.. గబ గబ ఆవుల పేడను కుప్ప చేసి ఒక బకెట్ లో నానబెట్టి, ఇంటిలో నుంచి చీపురు తో క్లీన్ చేస్తూ వచ్చింది. తర్వాత బండలు తుడిచింది, ఇప్పుడు తడిపిన పేడ తో ఇంటి ముందు అలికింది, అది ఆరకమునుపే అందులో రథం ముగ్గు వేసింది.. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టీ ఇదిగో నాన్న లే.. తెల్లారింది కర్నూల్ కి పోతాను అన్నవ్ గ త్వరగా లేసి తయారు అవ్వు రైలు వెళ్ళిపోతాది అనింది.. (ఇంకా ఉంది)