Truth - 21 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 21

The Author
Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

నిజం - 21

రాఘవులు తనకు అప్ప చెప్పిన పనిలో బిజీ గా ఉన్నాడు , మరో వైపు చంద్రం మచిలీపట్నం కి బయలుదేరాడు , చైర్ లో కూర్చుని వున్న విజయ్ సాగర్ వైపు తిరిగి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రా , ఆ పీటర్ చంపటానికి డబ్బు తీసుకుంటే డైరెక్ట్ గా వాడే ప్లాన్ చేసి పిల్లాడిని చంపకుండా ఎందుకు మధ్యలో ఈ శరభయ్య తో మర్డర్ చేయించాడు అని ఆలోచిస్తూ అన్నాడు సాగర్ తో , నేరం శరభయ్య మీద పడ్డాక వాళ్ల గురించి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదని కావాలనే ప్లాన్ చేసి ఉండ వచ్చు అన్నాడు సాగర్ ,

Any way ముందు ఆ రామారావు గారికి శత్రువులు ఎవరున్నారో ముందు కనుక్కోవాలి , వాళ్ల ఇంటికి వెళ్ళి అందరితో ఒక సారి మాట్లాడాలి అని చైర్ లోంచి లేచాడు విజయ్.

నేను కూడా నీతో వస్తా అని విజయ్ ని అనుసరించాడు సాగర్.

రామారావు గారి ఇంటికి చేరుకున్నారు విజయ్ , సాగర్.

వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి ఇల్లంతా హడావుడి గా కనిపించింది.

బయటకు హడావుడి గా వస్తున్న పాలేరు వీరయ్య ని చూసి ఎక్కడికి వీరయ్య అంత హడావుడిగా వెలుతున్నావ్ అడిగాడు సాగర్ .

స్వప్న అమ్మ గారికి నొప్పులు మొదలయ్యాయి, పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాలి, ఆటో మస్తాన్ ని తీసుకురావాలి అని ఆగకుండా వెళుతూనే సమాధానం ఇచ్చాడు వీరయ్య .

వీరయ్య మాటలు వినగానే విజయ్ , సాగర్ ఇద్దరూ లోపలికి పరుగు తీశారు .

విద్య , గంగ ఇద్దరూ స్వప్న పక్కనే కూర్చుని చేతులు రబ్ చేస్తున్నారు .

నొప్పితో అరుస్తూ మెలికలు తిరిగిపోతోంది స్వప్న .

అయ్యో సమయానికి మోహన్ కూడా ఇంట్లో లేడు అని కంగారు పడుతోంది శాంతమ్మ .

రామారావు గారు ఎవరికో కాల్ చేయటానికి ట్రై చేస్తూ, ఆ టాక్సీ నడిపే జగన్ ది కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది , ఇప్పుడు ఎలా అని కంగారు పడుతున్నారు .

లోపలికి వచ్చిన విజయ్ , సాగర్ ఇద్దరూ స్వప్న ని అలా చూడగానే చెరొక వైపు పట్టుకొని బయట ఉన్న జీప్ లో ఎక్కించారు , వెనుకనే విద్య , గంగ కూడా వచ్చి స్వప్న కు తోడుగా చెరొక వైపు ఎక్కి కూర్చున్నారు .

బయటకు వచ్చిన రామారావు గారు మీరు వెళ్ళండి మేము వెనుక వస్తాం అన్నారు .

జీప్ స్టార్ట్ చేసాడు విజయ్ , ఫాస్ట్ గా అక్కడి నుండి బయలు దేరి వెళ్ళిపోయారు.

శాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిల్చొని దేవుడికి మనసులోనే అంతా సవ్యంగా జరిగే టట్టు చూడు వెంకన్నా నీ కొండకి మీదకి కాలి నడకన వస్తా అని వేడుకుంటుంది .

వీళ్ళు అటు వెళ్ళగానే ఆటో మస్తాన్ ని తీసుకొచ్చాడు వీరయ్య .

వీరయ్య : అయ్యా స్వప్న అమ్మ గారిని జీప్ లో తీసుకెళ్లారా

రామారావు : అవును వీరయ్య , ఈ విజయ్ కి మాకు ఏదో పూర్వ జన్మ బంధం వుందేమో అనిపిస్తుంది , అప్పుడు సంపత్ ని సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు , ఇప్పుడు కూడా అడక్కుండానే వచ్చి స్వప్న ని ఆసుపత్రికి తీసుకెళ్లారు .

శాంతమ్మ : మస్తాన్ ఒక 5 నిమిషాలు ఉండు, నేను ఆసుపత్రిలోకి కావలసినవి తీసుకొస్తా.

ఆటో మస్తాన్ : సరే పెద్దమ్మ .

ఒక 5 నిమిషాల లో ఒక బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది శాంతమ్మ .

రామారావు : నువ్వు ఎందుకు , ఇంట్లోనే ఉండు నేను వెళ్ళొస్తా.

శాంతమ్మ : లేదండి , వస్తాను స్వప్నను తన బిడ్డను కూడా చూడాలి , సంపత్ ని కూడా ఒకసారి చూసుకొని వస్తా .

ఆటో మస్తాన్ : రానివ్వండి sir కుదుపులు లేకుండా మెల్లగా తీసుకెళతాగా నేను .

సరే అని వీరయ్య వైపు తిరిగి అరే ఇల్లు జాగ్రత్త గా చూసుకో నేను , అమ్మగారు రాత్రికి కి ఇంటికి వచ్చేసాము మస్తాన్ తో పాటు అని వీరయ్య కి చెప్పి బయలు దేరారు రామారావు గారు .

మరోవైపు విజయ్ వాళ్ళు ఒక అరగంటలో హాస్పిటల్ కి చేరుకున్నారు, సంపత్ ని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కే వెళ్లారు స్వప్నను ,ఆపరేషన్ థియేటర్ కు తీసుకు వెళ్లారు స్వప్న ని .

గంగా స్వప్న అక్కకి డెలివరీ డేట్ నెక్స్ట్ మంత్ అన్నావ్ కదా ఇప్పుడే పైన్స్ వచ్చేశాయి ఏమయింది అడిగాడు సాగర్.

బాగా స్ట్రెస్ ఎక్కువ అయి ఇలా ముందుగానే పైన్స్ వచ్చేశాయి అని ఏడ్చేసింది గంగ .

అయ్యో స్వప్న అక్కకి ఏమి కాదు , నువ్వు ఏడవకు బంగారం అని గంగ ని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు సాగర్ .

వీళ్లిద్దరి నీ అలా చూసి షాక్ అయ్యాడు విజయ్ .

విద్య ఆపరేషన్ థియేటర్ బయటే అటు, ఇటు తిరుగుతోంది .

విజయ్ ని చూసి అరే నువ్వు ఇక్కడ వుండు నేను వెళ్లి మోహన్ ని పంపిస్తాను అన్నాడు సాగర్ .

ఇక్కడ నా కంటే నీ అవసరమే ఎక్కువ వుంది గాని , నువ్వే ఇక్కడ వుండు, నేనే వెళతా అన్నాడు గంగ వైపు కళ్ళతో చూపించి చిన్నగా నవ్వుతూ విజయ్.

ఈ లోగా నర్స్ వచ్చింది అక్కడికి , sir అర్జెంట్ గా ఈ పేపర్స్ మీద ఆవిడ హస్బెండ్ సైన్ చేయాలి , and ఇక్కడ ఎవరిదైనా B పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వెంటనే రండి , పేషన్ట్ కి బ్లడ్ చాలా తక్కువ వుంది అర్జెంట్ గా బ్లడ్ కావాలి అంది నర్స్ హడావుడిగా ,

నాది B పాజిటివ్ , సిస్టర్ నేను బ్లడ్ ఇస్తాను పదండి అన్నాడు సాగర్ .

సరెరా నువ్వెళ్లు బ్లడ్ ఇవ్వడానికి నేను మోహన్ ని పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి మోహన్ దగ్గరికి వెళ్లాడు విజయ్ .

రిసెప్షన్ నుండి ఒక వైపు గైనకాలజీ వార్డ్ ఉంటే మరో వైపు సంపత్ ని ఉంచిన రూం వుంది అందుకే మోహన్ కి వీళ్ళు కనిపించలేదు .

విజయ్ మోహన్ దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి తన చేతిలో ఉన్న పేపర్స్ ఇచ్చి గంగ వాళ్ళ దగ్గరకు పంపించాడు .

కాసేపట్లో రామారావు గారి దంపతులు కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు , రిసెప్షన్ లో అడిగి లోపలికి వెళ్లారు.

విద్య , గంగ ఆపరేషన్ థిఏటర్ బయట కూర్చొని వున్నారు , మోహన్ మాత్రం అక్కడే అటు, ఇటు తిరుగుతున్నాడు .

మోహన్ దగ్గరికి వెళ్లిన శాంతమ్మ నన్ను క్షమించు రా నేను కోడలిని సరిగా చూసుకో లేకపోయారు అందుకే ఇలా అయ్యింది అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది .

అమ్మా నువ్వెలా చూసుకుంటా వో అందరికీ తెలుసు , స్వప్న కూడా పుట్టింటికి వెళ్లకుండా , తోడుగా నువ్వు వున్నావనే కదా మన తోనే వుంది , కాకపోతే అది సంపత్ మీద బాగా బెంగ పెట్టుకుంది , అందుకే ఇలా అయింది , నువ్వు ఇలా అయిపోతే ఇంటికి వచ్చాక స్వప్న ని బిడ్డ ని ఎవరు చూసుకుంటారు , నువ్వు ధైర్యం గా వుండాలి అని శాంతమ్మ కు సర్ది చెప్పి విద్య పక్కన కూర్చోపెట్టాడు మోహన్ .

ఇంతకీ డాక్టర్ ఏమయినా చెప్పారా లోపల స్వప్న ఎలా వుందో అడిగాడు రామారావు .

లేదు నాన్న , కానీ అర్జంట్ గా బ్లడ్ కావాలి అన్నారు, అందుకే సాగర్ వెళ్ళాడు బ్లడ్ ఇవ్వడానికి అంది గంగ.

వీళ్ళు మాట్లాడుకుంటూ వుండగానే సాగర్ ఒక రూం లో నుండి బయటకు వచ్చాడు బ్లడ్ ఇచ్చి.

థాంక్స్ సాగర్ అన్నాడు మోహన్ సాగర్ చేతులు పట్టుకొని . అరె మనలో మనకు థాంక్స్ ఏంటి అన్నాడు సాగర్ మోహన్ తో .

కాసేపట్లో నర్స్ బయటకు వచ్చి నవ్వుతూ పాప పుట్టింది , క్లీన్ చేసి చూపిస్తాను వెయిట్ చేయండి అంది.

అమ్మా నా కోడలు ఎలా వుంది అడిగింది శాంతమ్మ నర్స్ ని , ఆవిడ కొంచెం వీక్ గా వుంది బ్లడ్ ఎక్కుతోంది , అది అవగానే రూం కి షిఫ్ట్ చేస్తాం అప్పుడు చూడొచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది నర్స్ .

ఈలోగా సంపత్ ని చూసొద్దాం అండి అన్నది శాంతమ్మ రామారావు గారితో.

నేను తీసుకువెళతాను రండి ఆంటీ అని రామారావు గారి దంపతులను అక్కడి నుండి తీసుకు వెళ్ళాడు సాగర్ .

సంపత్ ని అలా చలనం లేకుండా చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు శాంతమ్మ కి , నువ్వు వీడిని ఇలా చూడలేవు అనే రావద్దన్నాను అన్నాడు రామారావు .

వాడిని నాకు ఇన్ని రోజుల నుండి చూడాలని వుంది కానీ స్వప్న ని చూసుకోవాలి కాబట్టి అడగలేక పోయాను అంది రామారావు తో .

సంపత్ ని నుదుటి మీద ముద్దు పెట్టుకొని అరే నీకు చెల్లి వచ్చిందిరా నువ్వు త్వరగా ఇంటికి వచ్చేస్తే నీ చెల్లి తో ఆడుకోవచ్చు , రోజు అడిగే వాడివి కదా చెల్లి ఎప్పుడు వస్తుంది అని , నీ కోసం ఇప్పుడు నీ చెల్లి ఎదురు చూస్తోంది త్వరగా లేచి రారా అంటూ తన కొంగు లో నుండి కుంకుమ తీసి తన మనవడి నుదుటి మీద పెట్టింది శాంతమ్మ .

తల్లీ గంగానమ్మ నా మనవడు త్వరగా కోలుకొనేలా చూడు తల్లి అనుకుంది మనసులో .

విజయ్ , సాగర్ ల ముందుకి వచ్చి మీ ఇద్దరి వల్లే ఈ రోజు నా కోడలు , మనవరాలు క్షేమంగా ఉన్నారు .

ఆ దేవుడే పంపినట్టు సమయానికి వచ్చారు , మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీటం లేదు అన్నాడు రామారావు.

నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే మీ వల్లే కదా uncle అంటున్న సాగర్ ని ఆపి లేదు సాగర్ , నువ్వు తెలివయిన వాడివి కాబట్టే ఈ పొజిషన్ లో ఉన్నావు , కానీ ఒకరికి ప్రాణం కాపాడటం అంటే చాలా గొప్ప విషయం మీ ఇద్దరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ వెనుక నేనున్నాని మర్చిపోకండి అని అక్కడి నుండి బయలుదేరారు రామారావు గారు , ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని సాగర్ కి విజయ్ కి నుదుటి న కుంకుమ పెట్టి ఇద్దరినీ ఆశీర్వదించి రామారావు గారిని అనుసరించింది శాంతమ్మ .

వాళ్లిద్దరి వెనుక వెళుతున్న సాగర్ ని ఆపి , మీ మామ గారే చెప్పారుగా ఏ అవసరం వచ్చినా వెనుకే వుంటానని పిల్లనిచ్చి పెళ్లి చేయమని డైరెక్ట్ గా అడిగేయి అన్నాడు విజయ్.

సాగర్ : అరే ఎక్కడ ఏమ్ మాట్లాడుతున్నావ్ రా నువ్వు ఇది హాస్పిటల్.

విజయ్ : అబ్బో ఇందాక నా చెల్లి గంగ ని దగ్గరకు తీసుకొని ఓదార్చి నప్పుడు గుర్తు రాలేదా ఇది హాస్పిటల్ అని.