truth - 9 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 9

The Author
Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

నిజం - 9

రాఘవులు కార్ దిగగానే సాగర్ ఎదురుగా వచ్చాడు , రామారావు , మోహన్ కూడా కార్ దిగి వచ్చారు , తనతో రమ్మన్నట్టు సైగ చేసి లోపలికి వెళ్ళాడు సాగర్ , అతని వెనకాలే వెళ్ళారు రాఘవులు , రామారావు , మోహన్ . వీళ్ళు లోపలికి వెళ్ళగానే , డాక్టర్ బయటకు వచ్చారు మోహన్ దగ్గరకు వెళ్లి డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు అని అడిగాడు , ఎవరు అన్నట్టు ఒక చూపు చూసి విజయ్ వైపు చూసాడు డాక్టర్ , అతను బాబు తండ్రి డాక్టర్ , ఈయన బాబు తాతగారు అని మోహన్ ని, రామారావు ని చూపించాడు , మీరు నాతో రండి అని వాళ్ళని రూం కి తీసుకెళ్ళాడు డాక్టర్ , రూం కి వెళ్ళగానే , డాక్టర్ మాట్లాడటం మొదలు పెట్టాడు చూడండి ప్రస్తుతం బాబు ప్రాణానికి ప్రమాదం తప్పింది , కొంచెం లేట్ అయినా బ్రతికించలేక పోయేవాళ్ళం , అనగానే చాలా థాంక్స్ డాక్టర్ నా ఇంటి దీపాన్ని నిలబెట్టారు మీ రుణం అని రామారావు అంటుంటే , థాంక్స్ నాకు కాదు విజయ్ గారికి చెప్పండి , టైం కి బాబును తీసుకొచ్చాడు, తను టైం కి బ్లడ్ ఇవ్వబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి క్రిటికల్ అయ్యేది , ఇక్కడ AB positive బ్లడ్ ఇచ్చే డోనార్స్ ఒక రిద్దరే ఉన్నారు , వాళ్ళు కూడా టైం కి రీచ్ అవడం కష్టం , విజయ్ ది సేమ్ బ్లడ్ గ్రూప్ అవడం తో మేము బాబు ని బ్రతికించ గలిగాం కానీ అని ఆపాడు డాక్టర్ , బాబు కి తల కి చాలా పెద్ద గాయం అయింది , బాబు కోమాలోకి వెళ్ళాడు అన్నాడు డాక్టర్ , ఒక్కసారిగా కుప్ప కోల్పోయాడు రామారావు , కొంచం మనసు దిట్టువ చేసుకోండి sir , బాబు త్వరలోనే కోలుకుంటాడు మేము ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాం అని సర్ధిచెప్పాడు డాక్టర్ , బాబుని తల మీద రాడ్ తో బలంగా కొట్టారు , ఆ దెబ్బకి కోమా లోకి వెళ్ళాడు , బాబు చనిపోయాడు అనుకొని ఉండొచ్చు వాళ్ళు అన్నాడు డాక్టర్ , రామారావు ఆశ్చర్య పోయాడు , మోహన్ కళ్ళు ఎర్ర బడ్డాయి , విజయ్ వైపు ఎవడు నా కొడుకుని చంపడానికి చూసింది అన్నాడు పిడికిలి బిగించి , అతన్ని అరెస్ట్ చేశాం అవన్నీ బయటకు వెళ్ళాక వివరంగా చెప్తాను అన్నాడు విజయ్ , డాక్టర్ బాబుని ఒకసారి చూడచ్చా అని అడిగాడు రామారావు , ఒకేసారి వద్దు sir , ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి , అని చెప్పి నర్స్ ని పిలిచి పేషన్ట్ దగ్గరికి one by one తీసుకెళ్ళు అని చెప్పి పంపించాడు , ముందు మోహన్ లోపలికి వెళ్ళాడు తలకి కట్లు కట్టి అచేతనంగా పడి ఉన్న బాబుని చూసి దుఖం ఆగలేదు మోహన్ కి , దీనికి కారణం అయిన వాడిని ప్రాణాలతో ఉంచకూడదు అని మనసులోనే బలంగా అనుకున్నాడు , అల్లారుముద్దుగా చూసుకున్న తన కొడుకుని ఇలా చేసిన వాడి మీద పగ తో రగిలి పోతున్నాడు మోహన్ , నర్స్ లోపలికి వచ్చి sir ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని మోహన్ ని బయటకు పంపేసింది , రామారావు కూడా లోపలికి వెళ్ళి బాబును చూసాడు ఇంటికి వెళ్లగానే మీ అమ్మ ,నానమ్మ బాబు ఏడని అడిగితే ఏమని చెప్పాలి , వాళ్ళ కోసం అయినా త్వరగా కోలుకోరా బంగారం నువ్వు ఏది అడిగితే అది కొని తెస్తా, నీకు బీచ్ కి వెళ్ళడం అంటే ఇష్టం కదా నువ్వు లేవగానే బీచ్ కి తీసుకువెళతాను అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు , ఒక పక్కన నిల్చుని చూస్తున్న నర్స్ కి కూడా కళ్ళ లో నీళ్ళు తిరిగాయి , ఆమె రామారావు దగ్గరికి వచ్చి మీ అందరి ప్రేమ వల్లే బాబు ప్రాణాలతో వున్నాడు , త్వరలోనే కోలుకుంటాడు ఆ భగంతుడి మీద భారం వేయండి sir , అని చెప్పి బయటకు తీసుకువచ్చింది , రాఘవులు , సాగర్ , విజయ్ కూడా ఒకరి తర్వాత ఒకరు బాబు ని చూసి వచ్చారు , అసలేం జరిగింది ఇప్పుడయినా చెప్పు విజయ్ అని నిలదీశాడు మోహన్ , ఇక్కడ కాదు పదండి అని క్యాంటీన్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు విజయ్ అందరూ తన వెనకాలే వెళ్లారు , క్యాంటీన్ లో ఖాళీ గా ఉన్న చోట చూసి ఒక కార్నర్ లో ఉన్న చైర్స్ లో కూర్చున్నారు , విజయ్ చెప్పటం స్టార్ట్ చేసాడు , ముందు చిట్టి దగ్గర తెలుసుకున్న విషయాలు తరువాత శరభయ్య మీద అనుమానం గురించి చెప్పాక , శరభయ్య , సుజాత తల్లి తో గొడవ లో ఉన్నప్పుడు అదే అదును అనుకొని వెనుక నుండి లోపలికి వెళ్ళాను , అక్కడ ఒక రూమ్ మాత్రం లాక్ వేసి ఉంది అనుమానం వచ్చి తాళం పగల గొట్టి లోపలికి వెళ్ళాను, తను చూసింది గుర్తు తెచ్చుకుంటూ నొసలు చిట్లించి , బాబు ను రక్తపు మడుగులో చూసాను , అది చెప్తున్నప్పుడు అప్రయత్నం గానే తన రెండు చేతులు వణికాయి , వెంటనే పల్స్ చెక్ చేసి బాబు ప్రాణాల్తోనే ఉన్నాడని నిర్ధారించుకొని ఆలస్యం చేయకుండా జీప్ లో హాస్పిటల్ కి తీసుకువచ్చారు , తరువాత జరిగింది డాక్టర్ చెప్పారు కదా మీకు , చెప్పడం ఆపి ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు విజయ్ , ఇంత ఘోరం చేసిన శరభయ్య ని నా చేతులతో నే చంపుతా అని విసురుగా లేచాడు మోహన్ , నువ్వు వాడ్ని చంపి జైలుకు పోతే ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏం అవుతుందో ఆలోచించు , నీకు కోపం రావడం లో తప్పు లేదు కానీ ఆవేశం ఆలోచన ని చంపేస్తుంది , ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని మోహన్ ని చేయి పట్టుకొని కూర్చోపెట్టాడు రామారావు . ఏం చేయమంటారు నాన్న బాబుని అలా చూడలేక పోతున్నా , బాబు ఎక్కడ అని స్వప్న అడిగితే ఏం చెప్పను , మన కుటుంబానికి ఇంత నరకం చూపిస్తున్న వాడిని ఏం చేయకుండా ఎలా ఉండమంటారు అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మోహన్ , రామారావు కొడుకు వీపు నిమురుతూ ఆ శరభయ్యకు తప్పకుండా శిక్ష పడుతుంది , కానీ వాడికి ఏం అన్యాయం చేశామని ఇదంతా చేశాడు , అసలు వాడి భార్య సుజాత ఎందుకు చనిపోయింది ఇవన్నీ మనం తప్పకుండా తెలుసు కోవాలి ,అంటున్న రామారావు వైపు అంతా తల తిప్పి అలానే చూసారు విజయ్ తప్ప, తన చుట్టూ జరిగేవి పట్టించు కోకుండ తల దించుకొని అలోచిస్తున్నాడు విజయ్ , విజయ్ ని గమనించిన రామారావు దేని గురించి బాబు ఆలోచిస్తున్నావు శరభయ్య ఇంట్లో ఇంకేమైనా చూసావా అనుమానంగా అడిగాడు రామారావు , అవును అన్నట్టు తల ఊపి ఆ శరభయ్య ఇంట్లో చూసిన దాని గురించే ఆలోచిస్తున్నాను అక్కడ నక్షత్రం ఆకారం లో ఒక పెద్ద ముగ్గు వేసి ఉంది చుట్టూ నిమ్మకాయలు , అక్కడ పసుపు కుంకుమలు , ఆ ముగ్గు ఆకారం మధ్యలో ఒక విచత్రమయిన బొమ్మ , ఆ బొమ్మ ఎదురుగా రక్తం లో పిల్లాడు ఇవన్నీ విచిత్రం గా అనిపించాయి దాని గురించే ఆలచిస్తున్నాను అన్నాడు విజయ్ , అందరూ విజయ్ వైపు ఆశ్చర్యం గా చూసారు, ఆ శరభయ్య క్షుద్ర పూజలు చేస్తున్నాడా , మా వూరిలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు , అన్నాడు రామారావు ఆశ్చర్యపోతూ , ఆ శరభయ్య వెనుక ఎవరో ఉండి ఇదంతా చేపించారని అనుమానం గా ఉంది , ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి , రాఘవులు గారు ఆ శరభయ్య ని ఇంటరాగేషన్ చేయాలి స్టేషన్ కి వెళదాం పదండి , అని రామారావు ని మోహన్ ని చూసి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను , అని అక్కడ నుండి బయలుదేరాడు విజయ్ , నేను కూడా మీతో వస్తాను పద అన్నాడు సాగర్ , వద్దురా నువ్వు మోహన్ వాళ్లకు తోడుగా ఉండు అన్నాడు విజయ్ , మోహన్ విజయ్ రెండు చేతులు పట్టుకొని నీ రుణం ఎలా తీర్చుకోవాలి , నువ్వే లేకపోతే ఈరోజు బాబు మాకు దక్కేవాడే కాదు అన్నాడు , అయ్యో ఇది నా డ్యుటీ , నేను చేయగలిగింది చేశాను బాబు బ్రతికాడు అంటే అంతా ఆ దేవుడి దయ అన్నాడు విజయ్ , నువ్వు వాడికి సమయానికి నీ రక్తం ఇచ్చి కాపాడావు ఇక నుండి నువ్వు మా కుటుంబం లో ఒకడివి నువ్వు నా చిన్న కొడుకు తో సమానం అని విజయ్ ని మనసారా హత్తుకున్నాడు రామారావు , మంచి వాళ్ల కు ఎప్పుడూ మంచే జరుగుతుంది sir , నేను త్వరలో దీని వెనుక ఉన్న నిజం కనిపెడతాను బాబు జాగ్రత్త నేను వెళతాను అని చెప్పి, సాగర్ ని చూసి నువ్వు వూరికి వచ్చాక కలువు నన్ను అన్నాడు విజయ్ , సరెరా బావ అని ఒకసారి విజయ్ ని హత్తుకొని బై చెప్పాడు సాగర్ , విజయ్ సాగర్ ఇంత క్లోజ్ గా ఉండటం చూసి మీరిద్దరూ కీ ముందే పరిచయం ఉందా అని అడిగాడు రాఘవరావు , నేను అమ్మమ్మ వాళ్ళింట్లో చదువుకున్నప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు సాగర్ .

రామారావు , మోహన్ , సాగర్ అక్కడే కూర్చున్నారు మళ్ళీ ఒకసారి వెళ్లి డాక్టర్ ని కలుద్దామని , విజయ్ ,రాఘవులు కలిసి జీప్ లో స్టేషన్ కి బయలు దేరారు .