YOUR THE ONE - 21 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 21

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

జతగా నాతో నిన్నే - 21







“ అయినా భూమి పైన మొక్కలు నాటడం పెద్ద విషయమేం కాదు కదా? ఎందుకు దీనికి అంత సీన్ చేస్తున్నారు . నేను ఇక్కడికి వచ్చింది అమ్మని చూడడానికి , ఎందుకు ఇంకా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచించడం ? చిల్ మామ చిల్ ” అంటూ ఎగురుతూ వెళ్ళిపోయాడు అభయ్.


కొంత దూరం వెళ్ళాక “ ఛీ నేనేంటి ? మనిషి లాగా మారిపోతున్నాను . కొన్ని రోజులు వాళ్ళతో ఉండేసరికి వాళ్ళలా ప్రవర్తిస్తున్నాను ” అని వోళ్ళంతా జలదరిస్తుండటంతో సద్దుమనీగాడు.


కొంతసేపటికి తన ఇంటిని చేరుకున్న అభయ్ తన కుటుంబంతో చాలా సంతోషంగా గడిపాడు. భూమి పైన జరిగిన ఒక్కొక్క విషయాన్ని తనకు వచ్చిన ఆ చివరి మిషన్ గురించి చెప్పాడు . తను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ......వాళ్ళ అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నాడు.



చివరిగా ఒకసారి తన మిత్రులందరికీ చూసి మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో? అని దిగాలుగా భూమి వైపుకి బయలుదేరాడు .


“ ఏంటి బాబు, ఇక వెళ్లడానికి సిద్ధమా? ” అంటూ అడిగింది ఆ చిన్న ఏంజెల్ .


“ నేను ఉంటాను అన్న, మీరు ఇక్కడ ఉండనివ్వరు కదా ? టైం అంటే టైమే అని ఒక పెద్ద చట్టం కూడా చేశారు కదా ” అన్నాడు వెక్కిరింపుగా .


చిన్నగా నవ్వుకున్న ఆ చిన్ని ఏంజెల్ , గాల్లో ఎగురుతూ వచ్చి తను తీసుకు వెళ్తాల్సిన ఆ పవిత్ర వృక్షాలను చూపించింది.


అవి మంచు మొక్కల్లాగా మెరిసిపోతున్నాయి. వాటిని చూడగానే ఉన్న బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా ఉండాలనిపించే భావన కలుగుతుంది. ఆ మొక్కల్ని అభయ్, చేతిలో పెట్టబోయిన ఆ ఏంజెల్; మళ్లీ వాటిని వెనక్కి తీసుకోని “ జాగ్రత్తగానే చూసుకుంటావా ? అసలే చిన్న పిల్లోడివి ” అంది.


అభయ్ ప్రశ్నింపుగా “ ఎవరు చిన్నపిల్లలు ....?” అంటూ కొరికే చూపులతో ఏగాదిగా చూశాడు.


“ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పవిత్ర మొక్కలు ఎక్కడైతే ఉంటాయో, అక్కడికి దుష్ట శక్తులు వచ్చి దీన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి . దీనికి కాపలాగా ఒక మంచి మనసును ఉంచాలి ” అంటూ అసలు విషయాన్ని చెప్పింది ఆ చిన్ని ఏంజెల్ .


“ అనుకున్నా! నువ్వు ఈ టాస్క్ ఇచ్చే ముందే ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావు అనుకున్నా....పెట్టావుగా ” అన్నాడు ఏడుస్తూ.


“ అందుకే ముందే చెప్పాను. ఇక అయిందేదో అయ్యింది . నాకు దీనితో సంబంధం లేదు .నువ్వు వాటిని బతికించకపోతే మళ్లీ నీ శిక్షణ రాసేది నేనే” అంది గర్వంగా. వాటిని అతడి చేతులుగా పెట్టేసింది.


అక్కనుండి నేరుగా మునుపటి సమయంకీ మళ్లీ భూమి పైన ఉండే ఆ సెయింట్ చర్చిలో ప్రత్యక్షమయ్యాడు అభయ్. తర్వాత తనకొచ్చిన ఆ కష్టాన్ని పోప్తో చెప్పి ,ఏడుస్తూ ఉన్నాడు.


అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టుగా“ దీనికి పరిష్కారం నాకు తెలుసు ” అంటూ చిన్నపిల్లాడిలా ఎగిరిగంతేస్తూ వాటిని కొన్ని రోజులు ఆ చర్చిలోనే ఉంచమని చెప్పి మరీ వెళ్ళాడు.


#####


సీరియస్ గా చూస్తున్న రాహుల్ ని కాస్త శాంతపరుస్తూ , “ ప్రభు ! అసలు విషయం ఏమిటి అంటే అన్వీగారు ఈరోజు రాత్రి వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక చోటికి వెళ్లారు . ఆ ప్రాంతం చూడటానికి ” అంటూ ఏదో చెప్పబోతున్న ఆత్మని ఆపి ,విషయాన్ని అర్థం చేసుకున్నాడు రాహుల్.



“ సరే ఆ ప్రాంతం ఎక్కడో నాకు చెప్పు. నేను వెళ్లి చూస్తాను ” అంటూ కళ్ళతోనే సైగ చేశాడు .


ఆత్మ మరేం ఆలోచించకుండా ; బెంగళూరు మెట్రో స్టేషన్ నుంచి కొంత దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. అందులో చివరి ఇల్లే అంటూ చెప్పేసి అక్కడి నుండి మాయమైపోయింది .


చివరిగా ఆ రక్తాన్ని పూర్తిగా తాగేసిన రాహుల్ పూర్తి శక్తి వంతుడిగా మరీ లేచి నిలబడ్డాడు.తన వొళ్ళు అంతా విరుచుకొని , తన శక్తిని ప్రయోగించగానే ; ఒక నల్లని గబ్బిలంలా మారడు.



ఆకాశంలో అరుస్తూ అన్వి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు . ఆత్మ చెప్పిన ఆ ప్రాంతాన్ని చూడగానే రాహుల్ కి నోట మాట రాలేదు .ఎందుకంటే అది సగం కాలిపోయిన ఒక భవంతి . అది పూర్తిగా ఐదు సంవత్సరాల నుండి శిధిలావస్థలో ఉన్నట్టుగా తెలుస్తుంది .


“ అన్వి ఎందుకు ఇందులో ఉంటుంది ? ” అంటూ ఆలోచనగానే అడుగు ముందుకు వేశాడు.


తను ఎప్పుడూ ఉండే రాక్షస నరకం కంటే ఆ భవంతి ఎందుకో మరింత భయంకరంగా అనిపించింది. లోపల నుండి సంతోషంగా కబుర్లు చెప్తున్న అన్వి గొంతు వినిపించింది . ఒక్క క్షణం తలుపు దగ్గరే ఆగిపోయాడు.


రాహుల్ కి ఏమీ అర్థం కాలేదు . ఇంత పాతపడిన భవంతులు అన్వితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అంటూ మనస్సు కీడు శంకించింది.


చిన్నగా తలుపు తీసుకొని లోపలికి నడిచాడు .తను అడుగుల చప్పుడు ఆ గదంతా ప్రతిధ్వనిస్తూ ఉంటే తన కాలికి అంటుకున్న నల్లని దుమ్ము అడుగులుగా మారుతుంది .


అప్పుడే సగం కాలిపోయిన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏవో కబుర్లు చెప్తున్న అన్వీని చూసి ఒక్క క్షణం నిర్ధాతపోయాడు .


తన ఎదురుగా కానీ తన పక్కన కానీ ఎవరూ లేరు . కానీ తను ఎవరితో మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు రాహుల్.


గొంతులో నుండి మాట కూడా పేగలడం లేదు. అయినా కూడా కాస్త బలాన్ని కూడా తెచ్చుకొని బలవంతంగా “ అ.......న్వి.....” అంటూ ఒక్కొక్క పదాన్ని కూడా పలికాడు . ఆ శబ్దానికి సంతోషంలో ఉన్న అన్వి ఒక్కసారిగా తిరిగి చూసింది .


ఎదురుగా రాహుల్ కనిపించడంతో “ రాహుల్ నువ్వేంటి ఇక్కడ ? నేను ఇక్కడ ఉంటానని నీకు ఎలా తెలుసు ?” అంటూ సూటిగా ప్రశ్నిస్తూ డైనింగ్ టేబుల్ ఎదురుగా ఒకసారి చూసి , టక్కున లేచి నిలిచింది .


“ అంటే నాన్న ! రాహుల్ అనీ నీకు చెప్తూ ఉంటాను కదా .ఎప్పుడూ నన్ను కాపాడుతూ ఉంటాడు . గీతకి నయం అవ్వడానికి కూడా కారణం తనే ” అంటూ చిన్న గొంతుతో వినయంగా తలదించుకొని చెప్పింది .


తను ఎవరితో మాట్లాడుతుందో కూడా అర్థం కాని రాహుల్ , ఆ టైమింగ్ టేబుల్ బెంచ్ వైపు చూశాడు. అక్కడ తనకి ఎవరు కనిపించలేదు.



ఇంతలోనే ఏదో ఉత్సాహం వచ్చినట్టుగా, “ నిజమా నాన్న.....” అంటూ ఆశ్చర్యపోతూ, రాహుల్ వైపు చూసింది.


“ నీ అదృష్టం బాగుంది. మా నాన్న ఈరోజు నిన్ను ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు తెలుసా ! రా వచ్చి కూర్చో , మా అమ్మ దోసలు సూపర్ వేస్తుంది తెలుసా? ” అంటూ కొద్దిగా బాగున్న కుర్చీని లాగి తనని కూర్చోబెట్టింది .


ఒక్క క్షణం రాహుల్ తన పైన తానే అనుమానపడ్డాడు . నా కళ్ళ సరిగ్గానే పనిచేస్తున్నాయా ? అంటూ తడిమి మరి చూసుకో సాగాడు .


అన్వి మాత్రం వాళ్ళ అమ్మతో నాన్నతో ఎప్పటిలాగే మాట్లాడుతూ ప్లేట్ తీసుకొని వచ్చి తన ముందు పెట్టింది .


ఆ ప్లేట్ కూడా కాలిన గుర్తులతో ఎన్నో సంవత్సరాలుగా అలాగే ఉన్నట్టుంది . ఖాళీ ప్లేట్ సడన్గా రాహుల్ ముందుకు రాగానే ఆశ్చర్యపోతూ అన్వి వైపు చూశాడు .


“ మా అమ్మ అంతే రాహుల్ . ఎంత చెప్పినా వినదు . ఇంటికి ఎవరైనా వచ్చారు అనీ తెలిస్తే , సరసరి మాకు కూడా లేకుండా ఉన్నవన్నీ వాళ్లకే పెట్టేస్తుంది. చూడు నాకేమో రెండు దోశలు వేసింది. నీకేమో అయిదు వేసింది. ” అంటూ సాగదీస్తూంది రాహుల్ ఖాళీ ప్లేట్ వైపు చూస్తూ .


ఏంటి ఇందులో దోశలు ఉన్నాయా ? అసలు ఏం మాట్లాడుతుంది అంటూ మార్చి మార్చి అన్విని ఇంకా ప్లేట్ ని చూస్తున్నాడు .


“ మొహమాట పడకు తిను!” అంటూ తను కూడా ఖాళీ ప్లేట్లో ఏదో ఉన్నట్టుగానే తింటూ సంతోషంగా మాట్లాడుతూ ఉంది.


కొద్దిసేపు ఖాళీ ప్లేట్లో దోశలు తిన్నడం అయిపోయింది అనుకుంటా “నా తిడం అయిపోయింది . ఇక వెళ్లీ పడుకుంటాను. మళ్లీ రేపు పొద్దున్నే వెళ్లాలి.....లవ్ యు నాన్న......లవ్ యు అమ్మ ” అంటూ చెప్పి , పైనున్న తన గది వైపుకి నడిచింది.



అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒక క్షణం రాహుల్ కి అర్థం అవ్వకపోవడంతో , తను కూడా నెమ్మదిగా తన గది వైపుకు నడిచాడు.

కాలిపోవడం కారణంగా పైన ఉన్న టెర్రస్ యొక్క గోడలు పగిలిపోయి బయట ఉన్న ఆకాశం కనిపిస్తుంది . అక్కడే చిన్నగా సగం కాలిన బెడ్ ఒకటి కనిపించింది.


అన్వి పాట పాడుకుంటూ తన బ్యాగ్ ని అక్కడ పెట్టేసి , వెళ్లి దాని పైనే పడుకుంటుంది .


రాహుల్ నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ అన్వి దగ్గరకు వచ్చాడు .


“ అన్వి, నేను ఒకటి అడుగుతా నిజం చెప్తావా? ” అంటూ కింద కూర్చుంటూ అడిగాడు .


“ హా ..అడుగు ......” అంటూ ; నువ్వేంటి నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వచ్చేసావు? అంటూ కాస్త కోపంగా చూసింది.


“ ఇంట్లో మీ అమ్మానాన్న ఉన్నారా? ” అంటూ మాటలు పట్టించుకోకుండా అడిగాడు .


“ అదేంటి ? ఇప్పటిదాకా మా అమ్మే గా దోశలు పెట్టింది . మా నాన్న ఇంతసేపు నీతో కబుర్లు చెప్పారుగా? మళ్ళీ ఏం తెలియనట్టు అలా అడుగుతావేంటి ?” అంటూ తన కోపం ఇంకా రెట్టింపు అయింది .


“ అన్వి , నీకు ఒక నిజం చెప్పనా? నాకు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు . ఇది ఒక పాడుబడిన ఇల్లు మాత్రమే ” అంటూ తన భుజాలను రెండు చేతులతో పట్టుకొని తనని కాస్త ఊపుతూ చెప్పాడు రాహుల్. అప్పటికే అర్థం అయింది రాహుల్కి , తను ఒక భ్రమలో బ్రతుకుతుంది అనీ !


రాహుల్ యొక్క శక్తి కారణంగానో లేక తనకి ఇలాగ ఎవరు చెప్పకపోవడం వల్లనో, తెలీదు కానీ ఒక క్షణం తనకి ఏదో గుర్తుకొచ్చినట్టుగా చుట్టు చూసింది.



అప్పటిదాకా కళ్ళకి కనిపించిన ఒక అందమైన ఇల్లు ....వాళ్ళ అమ్మానాన్నలు బూడిదలాగా గాలికి ఎగిరి కొంచెం కొంచెంగా మాయమవుతూ వచ్చారు. చూస్తుండగానే తన కళ్ళముందు ఆ అందమైన ప్రపంచం కాస్త మసితో కూడిన నల్లని గోడలాగా మారింది . చుట్టూ చూస్తున్న తనకి తెలియకుండానే కంట్లో నుండి కన్నీళ్లు ప్రవాహం మొదలైంది .


ఒక్క క్షణం రాహుల్ దగ్గర నుండి విడిపోయి “ అమ్మ.......నాన్న .....ఎక్కడికి వెళ్లారు ? . ఈ ఇల్లు ఏంటి ఇలా ఉంది ?” అంటూ గట్టిగా అరుస్తూ అన్ని రూమ్ లో చూడటం మొదలు పెట్టింది .


తను అరిచి అరిచి చుట్టు చూసి ఏమి కనిపించకపోవడంతో కూలబడిపోయింది . ఏడవడం మొదలు పెట్టింది . ఇంత వరకు తను చూసింది అంత ఇకపైన కనపడదు అని తెలిసి , కన్నీరు కాలువ కట్టాయి. తన ఏడుపు చూస్తున్న రాహుల్ కి గుండె తరుక్కుపోతుంది.


రాహుల్ ఏం మాట్లాడలేక వెళ్లి తన పక్కన కూర్చున్నాడు మోకాళ్ళ పైన !.


తెల్లగా పాలలా ఉండే తన చర్మం ఏడుపు కారణంగా ఎర్రగా మారింది . కన్నీళ్ళ కారణంగా జుట్టు అంత చెదిరి బుగ్గలపై చారాలు కట్టాయి.


“ అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇంకా రారా? వాళ్ళు నిజంగానే చనిపోయారా ? నువ్వు ఎందుకు వచ్చావు.....నిజన్ని ఎందుకు తెలిసేలా చేశావు....నాకు అమ్మానాన్న కావాలి ” అంటూ రాహుల్ ఏద పైన తన చేతులతో కొడుతూ ఏడుస్తూ ఉండిపోయింది .


తనని ఎప్పుడు అలా చూడని రాహుల్ ; తనకి తానే తెలియకుండానే అన్విని దగ్గరికి తీసుకొని ఓదార్చడం మొదలు పెట్టాడు.


రాహుల్ ఎదకి హత్తుకున్న అన్వి ఏడుస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది . రాహుల్ గుండె చప్పుడు అదేదో సంగీత పరికరంలా తన నిద్రకి సహకరించింది . కొద్దిసేపటి తర్వాత అన్ని నిద్ర పోయిందని గ్రహించిన రాహుల్ తనని ఓదార్చే స్థితిని చూసి , ఒక క్షణం తనని తానే నమ్మలేకపోయాడు.


నేను మనుషుల్ని చంపే ఒక మృగాన్ని ? నాకు ఈ జాలి, దయ అన్నవే ఉండవు కదా ! మరి ఎందుకు ఈ అమ్మాయి విషయంలో అవన్నీ తప్పని నిరూపితం అవుతున్నాయి ? ఈ అమ్మాయికి హాని చేయాలని ఎంత ప్రయత్నించినా నావల్ల అవ్వటం లేదు ఎందుకని ? అంటూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు.


——— ***** ———