The Author Madhu Follow Current Read నా ఫిలాసఫీ... - 4 By Madhu Telugu Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books अंगद - एक योद्धा। - 9 अब अंगद के जीवन में एक नई यात्रा की शुरुआत हुई। यह आरंभ था न... कॉर्पोरेट जीवन: संघर्ष और समाधान - भाग 1 पात्र: परिचयसुबह का समय था, और एक बड़ी बहुराष्ट्रीय कंपनी की... इंटरनेट वाला लव - 90 कर ये भाई आ गया में अब हैपी ना. नमस्ते पंडित जी. कैसे है आप... नज़रिया “माँ किधर जा रही हो” 38 साल के युवा ने अपनी 60 वर्षीय वृद्ध... मनस्वी - भाग 1 पुरोवाक्'मनस्वी' एक शोकगाथा है एक करुण उपन्यासिका (E... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Madhu in Telugu Motivational Stories Total Episodes : 6 Share నా ఫిలాసఫీ... - 4 (1) 3.1k 9.2k నా ఫిలాసఫీ Part __2(c) 🌹నిజానికి మీరు అనుకునేది అసలు సమస్య కాదు🌹🌹ఒక ఆమె తన రూపురేఖల్ని ఎక్కువగా పట్టించుకునేది.... మరీ ముఖ్యంగా ఆమె పంటివరుసలనీ.... ఆమె ఎంతో మంది "పంటి "డాక్టర్లను కలిసింది ...వారంతా కలిసి ఆమె పళ్ళను మరింత అద్వాన్నంగా చేశారు ....అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది... ప్రతి డాక్టర్ ఆమె అంతర్గత నమ్మకమైన, "నేను అందంగా లేను "అనే నమ్మకాన్ని బహిర్ ప్రపంచంలో సరిగ్గా సంభవింపజేశారు.... నిజానికి ఆమె అసలు సమస్య ,ఆమె రూపురేఖలు కావు ...ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం....🌹 ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గురక పెట్టేది.... చుట్టూ ఉన్నవాళ్లు చాలా అసహనంగా భావించేవారు ...ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్స్ చేస్తుండేది ....బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది... కానీ, ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ పడతారేమో అన్న కోపంతో ,అసూయతో, రగిలిపోతుండేది.... ఆమె అంతర్గతపు ఆలోచన విధానాలే ఆమెను అలా అసహ్యకరంగా గురకపెట్టేటట్లు చేశాయి ....దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటికి ఆమె ఎంత ప్రేమ పూరితంగా నటించినా ,ఆమె లోపల చాలా బాధపడుతూ ఉండేది ...ఆమెను ఎవరు భయపెట్టలేదు! ఆమె తప్ప ......🌹ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు... అతడు "హాడ్జ్ కీన్స్" ( Hodgkin's disease) అనే వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు.... అతని తల్లి ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకు వచ్చింది ....ఇక అతడు మూడు నెలలు బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారట.... వాళ్ళ అమ్మ అతడిని ఎలా బ్రతికించుకోవాలో తెలియక చాలా భయపడితూ ఉండేది.... కానీ ఆ అబ్బాయి చాలా చలాకీగా, తెలివిగా ఉన్నాడు... అతడికి చావాలని లేదు.... బ్రతకడానికి అతడు ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు.... తన ఆలోచన విధానాలను, మాటల తీరును ,మార్చుకోవడానికి తయారయ్యాడు ....తన తల్లిదండ్రులు విడిపోయారు.... ఇంకా వాదులాడుకుంటున్నారు.... అతడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు ... ఇదీ అతడి పరిస్థితి......🌹 కానీ అతడికీ ఒక నటుడు కావాలని తీవ్రమైన కాంక్ష ఉండేది.... పేరు ప్రతిష్టలు లేవని భావించడం ,అదృష్టం లేదని భావించడం ,వల్ల తన తీవ్ర ఆకాంక్షను అణచుకున్నాడు... అతడికి బాగా పేరు ఉంటేనే తప్ప అతన్ని నటించడానికి ఒప్పుకోరని అనుకున్నాడు.... నేను అతడికి తనను తాను మంచిగా భావించడం నేర్పించాను ...అతడు చాలా చక్కగా వీటన్నిటినీ పాటించాడు....అప్పుడు అతను టీవీ ప్రోగ్రామ్స్ లో తరచుగా కనిపిస్తుంటాడు.... అతడు తనను తాను అంగీకరించుకోవడం, వలన తనలాగే తాను ఉండడము, వలన అవకాశాలు అతడి ముంగిటకి చేరాయి ....అ🌹" అధిక బరువు"ను తగ్గించుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాల్ని వెతికి వెతికి మన శక్తినంత వ్యర్థము చేసుకుంటాము.... ఎన్నో ఆహార విధానాలను పాటిస్తాము.... ఇక్కడ "అధిక బరువు"కాదు అసలు సమస్య, కొంతమంది తమ లావుతో పోరాడి ,పోరాడి ఇంకా లావు అవుతారు.... తత్ఫలితంగా అధిక బరువు వలన వారు ఎదుర్కొనే సమస్యలకు, ఇంకా ఎక్కువగా తమను తాను నిందించుకుంటూ ఉంటారు.... ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది వారి అంతరంగంలోని ఒకానొక ఆలోచనా విధానం వల్ల ఉత్పన్నమైనదే ....ఈ సమస్య భయం మరి రక్షణ అవసరం అనే ఆలోచనా విధానాల వల్ల తలెత్తుతుంది.... మనం ఎప్పుడైతే భయపడతామో లేక అభద్రతతో ఉంటామో, లేక బాగాలేమని అనుకుంటామో, అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకా అధికంగా బరువు అవుతాము.....🌹 మనం ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండడం పట్ల మనల్ని మనం కోపగించుకోవడం ,తిట్టుకోవడం, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడం, మరి ప్రతిసారి ఎంత బరువు పెరిగాము అని చెక్ చేసుకోవడం ,చాలా వ్యర్థము ....ఇలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు ...ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరి చేసుకోవడం ప్రారంభించలేదు... మనము చేసినదంతా ఇంకా ఎక్కువ భయపడి ఇంకా ఎక్కువ ఆభద్రతాభావంతో ఉండి, మన రక్షణ కోసం ఇంకా ఎక్కువ బరువెక్కినాము అంతే.... అందుకే నేను అధిక బరువు పట్ల లేదా ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టను... ఇక్కడ ఆహార నియమాలు పనిచేయవు ...ఒకే ఒక నియమం పనిచేస్తుంది అది "నెగిటివ్ గా ఆలోచించకపోవడం" అనే నియమం....🌹 ఎవరన్నా నన్ను అధిక బరువు సమస్యతో సంప్రదిస్తే ,ముందు ఈ అధిక బరువు విషయాన్ని పక్కన పెట్టండి. అని చెప్పి ,వారికి మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా భావించాలని వివరిస్తాను.... అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు, వారిని వారు ప్రేమించుకోలేరని బదులిస్తారు... అప్పుడు మీరు లావుగా ఉండడానికి కారణం మీరు మిమ్మల్ని ప్రేమించుకోకపోవడమేనని నేను వివరిస్తాను.... మనల్ని మనం ప్రేమించుకుని, మన పట్ల మనం మంచిగా భావించి, ఉంటే ఆశ్చర్యకరంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ,ఎలా సహజమవుతామో అన్నది చాలా అద్భుతమైన విషయము....🌹మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభమని చెప్తే కొన్నిసార్లు వినేవారికి చాలా కోపం వస్తుంది... వారి సమస్య నాకర్థం కాలేదని కూడా వారు భావిస్తారు... ఒక ఆమె అయితే చాలా నిరుత్సాహంతో నేను మీ దగ్గరకు వచ్చింది నా డిగ్రీ ని ఎలా పూర్తి చేసుకోవాలోనని, మీరు ఇచ్చే సలహా కోసమే గాని! నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి కాదు ...అని చెప్పేది... ఆమె ఒక డిగ్రీ పట్టా కోసం ఒక "థీసిస్" వ్రాస్తోంది.... ఆమె పట్ల ఆమెకు ఎంత ద్వేష భావన ఉందో నాకు స్పష్టంగా తెలుస్తోంది ....ఆ బావని ఆమె జీవితంలో అన్ని దిశాలూ వ్యాపించి ,ఆమె 'థీసిస్ 'ను పూర్తి చేసుకోకుండా అడ్డుకుంటోంది.... ఆమె అయోగ్యురాలని ఆమె భావించేంతవరకూ ఆమె ఎలా విజయం సాధించగలదు? చెప్పండి ?🌹ఆమె నా మాటలు విడచెవిన పెట్టింది... ఏడ్చింది ...తర్వాత సంవత్సరానికి ఉన్నదానికి తోడు ఇంకొన్ని సమస్యల్ని నెత్తిన వేసుకొని వచ్చింది... కొంతమంది మారేందుకు సిద్ధంగా ఉండరు ...అలాగని వారిలో తప్పులు ఎంచాల్సిన అవసరం లేదు ...జీవితంలో మార్పులు సంభవించడం, సరైన సమయంలో ,సరైన ప్రదేశంలో ,సరైన క్రమంలో, జరుగుతుంది.... నా జీవితంలో మార్పులు సంభవించడము ప్రారంభమైనది ,నాకు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు..... 🌻అసలు సమస్య🌻 🌹ఎటువంటి అపాయం తలపెట్టలేని ఆ చిన్న అద్దములో వారిని వారు చూసుకుని నిరుత్సాహపడ్డాక, నాకు సమస్య అర్థమైందన్నట్లుగా ,ఒక ఓ చిరునవ్వుతో నేనిలా అంటాను ...మంచిది ఇప్పుడు మీరు అసలు సమస్యని చూస్తున్నారు ...ఇప్పుడు మన దారికి నిజంగా అడ్డం వచ్చే విషయాల్ని బయటకు గెంటే యవ... తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం, అనే విషయంపై ఎక్కువగా మాట్లాడుతాను.... మనల్ని మనం ఎప్పుడు గానీ ,దేనికి గాని నిందించుకోకూడదు.... మనల్ని మనం ప్రేమించుకోవడం దీనితోనే మొదలవుతుంది ....🌹తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీరు ఒప్పుకోకుండా నిందించుకుంటూ ఉంటారు...??? అని ప్రశ్నిస్తాను... సమాధానం చెప్పేటప్పుడు వారి స్పందనలను గమనిస్తాను... 🌹 ఊ.... కొన్నిసార్లు... 🌹 ఇంతకుముందు చేసినన్ని సార్లు కాదు... 🌹సరే నన్ను నేను ఒప్పుకుంటే మార్పు ఎలా వస్తుందంటారు ?🌹అందరూ అంతే కదా?🌹 పై విధంగా సమాధానాలు ఇస్తారు.... 🌹తర్వాత నేను" మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు మనం మాట్లాడేది 'నీ 'గురించి !నువ్వు ఎందుకు నిన్ను నీవు ఒప్పుకోవు? నీలో ఏం లోపం ఉందని? ప్రశ్నిస్తాను....🌹 అలా అడుగుతూ వారిచ్చే సమాధానాలను ఒక' లిస్ట్' గా రాస్తాను... ఇప్పుడు వారు చెప్పేవి ఇంతకుముందు వారు కచ్చితంగా చేసి తీరాల్సిన '' తో పోల్చుతాను ...చాలా వరకు రెండు ఒకటిగా ఉంటాయి.... వారు చాలా పోడవని ,చాలా పొట్టి అని ,చాలా లావు అని ,చాలా బక్క అని ,వారికి చాలా నత్తి అని ,వారికి చాలా వయసైపోయిందని ,మరి వయసులో చిన్న అని ,అందంగా ఉండరని (చాలా అందంగా ఉండే వారే ఇలా) చెప్తారు లేదా వారు పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారని, అన్నింటికీ చాలా ఆత్రుత పడతారని, ఇంకా ఎన్నెన్నో చెప్తారు.... మీరు ఇక్కడ ఓ విషయం గమనించాలి ....అన్ని సమస్యలలోనూ "చాలా" అన్నదే సమస్యగా ఉంది ...ఇలా వారి అంతః కరణాలను తవ్వుతూ పోతే వారు వారి అంతరంగంలో నేను బాగాలేను అని అసంతృప్తితో ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది....🌹 హమ్మయ్య !!! చివరికి మనం సమస్యలు అన్నిటికీ కారణభూతమైన కేంద్ర బిందువుని చేరుకున్నాము ...వారిని వారే ఎందుకు ఒప్పుకోరు ,అంటే "నేను బాగాలేను అని వారి అంతరంగంలో తీవ్ర అసంతృప్తి" దాగి ఉంది కాబట్టి .....ఈ విషయమే వారికి చెబితే వారినంతగా అన్ని ఏళ్లుగా వేధించిన సమస్యలకు కారణం ఇంత త్వరగా తేలినందుకు చాలా ఆశ్చర్యపోతారు..... "ఈ నేను బాగాలేను" అన్న భావన ,మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల జనిస్తోంది ....అప్పుడు సమస్యలు ఏవైనా, అవి శారీరక సమస్యలైనా, సంబంధం సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, లేక సృజనాత్మక వ్యక్తీకరణ లోపానికి సంబంధించినవైనా పట్టించుకోనవసరం లేదు.... మన శక్తినంత ఈ సమస్యలనన్నింటికీ అసలు కారణమైన "మనల్ని మనం ప్రేమించుకొనకపోవడం "పై కేంద్రీకరించాలి....... 🌹 నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది ...నేను సదా దైవ శక్తిచే పరిరక్షించబడుతూ, సరియైన మార్గంలో నడపబడుతున్నాను.... నా అంతరంగంలోకి చూసుకోవడం నాకెంతో క్షేమకరము.... నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడం నాకెంతో క్షేమకరము.... జీవితం పట్ల నా దృక్పతాన్ని విస్తరించుకోవడం నాకెంతో క్షేమకరము.... "నేను" అనబడేది నా వ్యక్తిత్వం కన్నా... భూత,భవిష్యత్తు ,వర్తమాన కాలాల కన్నా,, ఎంతో ఉన్నతమైనది ....నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి ,నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగడానికి, నేను నిశ్చయించుకుంటున్నాను..... నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను.... మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది 🌹 🌹ధన్యవాదములు 🌹 ‹ Previous Chapterనా ఫిలాసఫీ... - 3 › Next Chapter నా ఫిలాసఫీ... - 5 Download Our App