3
 ప్రతి మారు.. కళాజ్యోతితో.. ప్రతి పొందు నాకు ప్రీతికరమే.
 అలా.. అవకాశం కుదిరేటప్పుడల్లా.. మా మధ్య పొందు.. విచ్చలవిడిగా విజృంభిస్తుంది.. విరాజిల్లుతుంది.
 అలా సాగుతున్న.. మా మధ్య వ్యవహారం..
 తలవని తలంపుగా.. పుటుక్కున తెగిపోయింది.. కళాజ్యోతి మూలంగానే. 
 కారణం తెలియదు.
 తనూ తెల్పలేదు. 
 మేము ఎంత ఈజీగా కలిశామో.. అంతేలా విడిపోయాం. 
***
 "కమలారాణి"
 ఫోన్ ద్వారా.. నా పిలుపుకి ఆమె పలికింది.
 వెంటనే.. "ఇంట్లో ఎవరూ లేరు. రా వచ్చుగా" అన్నాను. 
 కమలారాణి సమాధానం ఆశించకనే.. వెంటనే ఆ ఫోన్ కాల్ ని కట్ చేసేశాను.
 కమలారాణి వచ్చింది.
 మా ఇంట్లో.. మా ఇద్దరమే.
 "మీ వాళ్లు అప్పుడే రారు కదా" అడిగింది ఆమె.
 "మరో రెండు గంటలు పైనే అవుతోంది వాళ్లు రావడానికి" చెప్పాను.
 కమలారాణి నా కౌగిలి లోకి వచ్చేసింది.
 మా మధ్య ముద్దులు మురిసి పోతున్నాయి.
 ఎంతో సేపు పిమ్మట..
 అడ్డంగా.. మంచం మీద పడ్డాం.
 తర్వాత.. 
 చాలా సేపు పిమ్మట..
 కమలారాణి.. లేచి.. బట్టలు కట్టుకుంది. 
 నేనూ బట్టలు కట్టుకుంటూ.. 
 "ప్రతి సారీ నీతో కలయిక నాకు కొత్తగానే ఉంటుంది" చెప్పాను.
 కమలారాణి నవ్వింది.
 "నువ్వు భలేగా సహకరిస్తున్నావ్" అన్నాను.
 "పిల్లలు పుట్టలేని ఆపరేషన్ నీకు కావడం.. అది నాకు భరోసా కావడం.. కూడా కారణాలే"  చెప్పింది.
 నేను ఏమీ అనలేదు.
 కమలారాణి.. "మరి వెళ్తాను" అంది.
 "మళ్లీ ఎప్పుడు" అడిగాను.
 "మళ్లీ ఇలా కలిసి వచ్చినప్పుడు" చెప్పింది.
 "ఎన్నాళ్లు ఇలా" అడిగాను.
 "సాగినన్నాళ్లూ" చెప్పింది.
 "అంతేనా" అన్నాను.
 "మరి.. నువ్వు పెళ్లైన వాడివి. నాకు పెళ్లి వద్దా.  ఆ ముచ్చట నాకు కావాలి. లేచి పోవడం.. ఉంచు కోవడం.. నాకు నచ్చవని మొదటే చెప్పేశానుగా"
 కమలారాణి వెళ్లి పోయింది.
 'సరే సాగని.. ఎన్నాళ్లైతే అన్నాళ్లు..' అనుకున్నాను.
 కమలారాణితో నాకు గమ్మత్తుగా పరిచయం ఐంది.
 ఆ రోజు.. 
 ఆమె మా షాపుకి వచ్చింది మా చెల్లితో కలిసి.
 "అన్నయ్యా.. ఈమె కమలారాణి. తనకి బ్రౌన్ కలర్ నైల్ పాలీష్ కావాలంట" చెప్పింది నా చెల్లి. 
 తనే అంది మళ్లీ.. 
 "మా దగ్గర లేకపోయినా.. మా అన్నయ్యకి చెప్పి తెప్పించు కోవచ్చని అన్నాను. అందుకే వచ్చింది" 
 నేను..  "నిజమే లేదు. సాయంకాలంకి తెచ్చి ఇస్తాను. రండి" చెప్పాను. 
 అలాగే.. ఆ సాయంకాలంకే.. దాన్ని తెచ్చి ఆమెకి అందించాను.
 అలా.. అక్కడ.. మొదలైన మా పరిచయం.. పోను పోను.. మా శారీరక కలయిక వరకు.. అతి సులభంగా ఎదిగి పోయింది.
 కమలారాణి.. తన మాట కంటే తన చేత మిన్న. 
 రవ్వంత కదిపితే.. డొంకంతా కదుపుతుంది ఆమె.
 అందుకే.. ఆమె పొందుని పొందికగా కాక.. ఆబగా అనుభవించేస్తున్నాను ప్రతి మారు.
 అలా.. ఇప్పటికి..  ఎన్నో మార్లు ఆమె పొందు పొంద గలిగాను.
 అలాగే ఎప్పుడో నేను అనుకున్నట్టే.. కమలారాణి కూడా నాకు దూరం ఐపోయింది.
 అదీ ఈ మధ్యనే.. తనకి పెళ్లైపోగానే.
***
 శ్రీలక్ష్మి.. నాకు దగ్గరగా ఉంది.
 అమె దిగువ పెదవిని నా కుడి చేతి బొటన.. చూపుడు వేళ్లతో పట్టి.. దానిని కిందకు లాగి.. ఆమె ఎగువు పెదవి మీద నా రెండు పెదాలతో ముద్దు పెట్టాను.
 "నీది అంతా కొత్త పద్ధతి" అంది శ్రీలక్ష్మి.
 ఐనా ఆమె.. తన ముఖాన్ని ఇంచి కూడా కదపక.. అలానే ఉంచి.. నిలుచుని ఉంది నా చేరువున.
 "అంటే నీకు పాత పద్ధతులు ఏమైనా తెలుసా." అడిగాను.
 వెంటనే నవ్వేను.
 "మా అక్కా బావల సరసం.. నేను.. గది కిటికీ సందుల్లోంచి బోల్డు మార్లు చూశానులే" చెప్పింది శ్రీలక్ష్మి.
 నేను తిరిగి నవ్వేను.
 శ్రీలక్ష్మి పరిచయం లగాయితు నా చేష్టలన్నింటికీ ఆమె ఒప్పుకుంటుంది.. సహకరిస్తుంది.
 కానీ.. కలయికకి ఒప్పుకోవడం లేదు.
 నేను. తన నాన్నని కలిసిన పిమ్మటే.. అది అని తేల్చి చెప్పుతుంది.
 దాని కోసమే తపిస్తున్న నేను..  తప్పక ఆమెతో కలిసి ఆమె నాన్నని కలిశాను ఒక రోజున.
 "మీకు పెళ్ళైనా.. మీరు నా కూతురు కోసమే మీ ఆవిడని వదిలేసి.. వచ్చేస్తామన్నారట. నా కూతురు కోసమే నేను అందుకు సరే అంటున్నాను" చెప్పాడు ఆయన.
 నేను తలాడించాను.
 "నా వ్యాపారం కుదేలు కాబోతుంది. నాకు భారీ మొత్తం కావాలి. మీకు బాగానే ఉందిగా. నాకు సర్దండి" సూటిగానే నాతో అన్నాడు ఆయన.
 నేను అదిరిపోయాను.. కదిలిపోయాను.
 శ్రీలక్ష్మితో కలవడం నా వల్ల కాదనుకున్నాను.
 కావాలనే శ్రీలక్ష్మికి నేను దూరం అయ్యాను.
 నాకు.. నా చర్య సరైనదే అనిపిస్తోంది ఇప్పటికినీ.
*** 
 వాగ్దేవి..
 ఈమెతో నాకు పరిచయం.. సూటయ్యిన ప్రయత్నంతో ఏర్పడింది.
 ఈమెకు తొలుతనే నాలోని తనపై తపనని తెలిపాను.
 అదీ ఒక ఉత్తరం ద్వారా. 
 ఆ ఉత్తరంలో.. నా తహతహని సహజంగానే వ్రాశాను.
 వాగ్దేవి ఆ ఉత్తరం చదివి..
 "నిజమైనా" అడిగింది.
 "నిక్కచ్ఛిగా" అన్నాను.
 వాగ్దేవి చలించింది.
 అది మొదలు.. వాగ్దేవి.. నాకు తన కనికరం.. నికరంగా అందిస్తోంది.
 అది మొదలు.. ఈమె చెంత.. నాకు చిక్కనైన చేరువ దక్కుతోంది.
 అదీ మానసిక ఓదార్పుగానే తప్పా.. శారీరక చమత్కారంగా.. ఎంత మాత్రం కాదు.
 ఐనా చాలా సౌఖ్యంగా.. సౌలభ్యంగా.. వాగ్దేవికై ప్రాకులాడుతూనే ఉన్నాను.
 కనీసం ముద్దు లైనా దొరక్కపోవా అని తపిస్తున్నాను.
 ఒక మారు మాత్రం..
 "నాకు ముద్దు కావాలి. ఇవ్వాలనుకుంటే.. రేపు ఓణీ వేసుకురా" చెప్పేశాను.
 వాగ్దేవి ఎక్కువుగా మోడరన్ డ్రెస్ ల్లోనే కనిపించేది.
 ఆ రేపు..
 వాగ్దేవి.. ఓణీ లో వచ్చింది.
 నేను పొంగాను.
 చాక్లెట్ ఇచ్చాను.
 దానిని తినమన్నాను.
 "తింటేనే ముద్దు పెట్టుకుంటాను" చెప్పాను.
 అప్పుడు..
 వాగ్దేవి ఆ చాక్లెట్ ని తిన లేదు.
 నేనూ అప్పుడు ముద్దుకి పట్టు పట్ట లేదు.
 వాగ్దేవి చెంత సాంగత్యం నాకు హాయి నిచ్చేది.
 వాగ్దేవి సహజ నవ్వు నాకు ఊరట నిచ్చేది. 
 ఉదయం వస్తూనే..
 వాగ్దేవి.. "కమలారాణి కలిసింది" చెప్పింది.
 నేను జంకాను.
 "పరిచయం చేసుకుంటూ చెప్పింది.. తనంటే నీకు భలే మక్కువ అట కదా" అడిగింది.
 "ఏదో పరిచయం" అంటూనే.. ఇంకా చెప్పబోతుండగా..
 వాగ్దేవి.. "తను నీ దరిన ఉంటే.. నువ్వు ఎవర్నీ నీ చెంత ఉండనీయవట కదా." అడిగింది.
 అంతలోనే.. 
 నేను తలవని తలంపుగా..
 మా మధ్యకి కమలారాణి వచ్చేసింది.
 నన్ను నవ్వుతూ పలకరించింది.
 పైగా..
 వాగ్దేవి వంక చూడనే లేదు.
 నేను కదలలేక పోతున్నాను.
 వాగ్దేవి లేచి వెళ్లిపోయింది.
 నేను తనని ఉండమని కూడా చెప్పలేక పోయాను.
 అంతలోనే..
 కమలారాణి కూడా నవ్వుకుంటూ వెళ్లి పోయింది.
 అంతే..
 అదే చివరాఖరు ఐంది.. వాగ్దేవి నా చెంతకి రావడం.. నన్ను కలవడం. 
***
 "శ్రీతులసి" పిలిచాను.
 తను నన్ను చూస్తూనే ఉంది.
 ఇద్దరం ఎదురు ఎదురుగా మా గదిలోని మంచం మీద కూచుని ఉన్నాం.
 అంతకు కొద్ది ముందు..
 నా చేతి వాచీని తీసి.. ఆమె జాకెట్టులోకి నేర్పుగా దానిని జార విడిచాను.
 "నా వాచీని తీసి ఇస్తావా.. లేక నేను తీసుకోనా" అడిగాను.
 "చాలా తమాషా చేస్తున్నారు.. చనువు చూపితే మీరు చెత్త చూపుతున్నారండీ" చెప్పింది శ్రీతులసి.
 తను నిజంగా నన్ను ఇంత వరకు ఏకవచనంతో పిలవనే లేదు.
 'మీరు.. అండీ' అంటుంది.
 నేను ఏమీ పట్టించుకోక నా వాచీని తీసే చొరవ చేయబోతుండగా..
 ఎవరో వచ్చినట్టు అలికిడి అయితే..
 నేను టక్కున లేచి షాపులోకి పరుగున వచ్చాను.
 ఆ వచ్చింది.. శ్రీతులసి స్నేహితురాలు.
 "శ్రీ తులసి వెళ్ళి పోయిందా." అడిగింది తను.
 నేను తల ఊపేను.
 "ఉంటాను.. షాపుకు రా అందే" అంటూనే తను వెళ్లిపోయింది.
 కొద్ది సేపు ఆగి.. తిరిగి ఇంటిలోకి వెళ్లి.. శ్రీతులసి ముందుకు చేరాను.
 "మీ ఫ్రెండ్ వచ్చింది" చెప్పాను.
 "వెళ్తాను" అంటూ తన జాకెట్టు లోని నా వాచీని తీయబోతుండగా..
 శ్రీతులసిని ఆపి..
 "నువ్వు వెళ్లిపోయావు అనుకొని తను వెళ్లిపోయిందిలే" అన్నాను.
 కానీ..
 శ్రీతులసి.. నా వాచీని మంచం మీద పడేసి జరజరా వెళ్లి పోయింది.
 వెళ్తూ..
 "మీకు చెప్పవలసింది ఏమీ లేదు.. చెప్పినా మీరు పట్టించుకోరు.. మీ చీడ నేను అంటించుకోలేను" అనేసింది.
 నేను తేరుకోలేకపోయాను.
 తర్వాత..
 తర్వాత్తర్వాత.. ఆలోచించాను.
 మళ్ళీ మళ్లీ.. ఆలోచించాను.
 నన్ను నేను ప్రశ్నించుకున్నాను.
 నాలో నేను తర్కించుకున్నాను.
 నా మీద..
 నాకే..
 అసహ్యం..
 ఛ..
 ఛఛ..
***
 ఇన్నాళ్లూ..
 ఏమిటీ చపల బుద్ధీ..
 వదులుకోవాలి.
 మారాలి.
 ఈ గుట్టు గుట్టు.. దాగుడుమూతలు మరి వద్దు..
 మారిపోతాను.
***
 ఇన్నాళ్లూ..
 నా కాలక్షేపాల నడుమ..
 నేను ఇద్దరు పిల్లలకి తండ్రినైన సంగతే విస్మరించాను.
 ఛ..
 ఎప్పుడూ.. ఎన్నడూ.. వాళ్లని కన్నబిడ్డల్లా చూసిందే లేదు..
 నా సొద నాదిలా..
 నా ప్రాకులాట నాదిగా..
 మల్చుకున్నాను..
 ఛఛ..
 వద్దు.. ఇక వద్దు..
 మారాలి..
 మారతాను..
 నా భార్య.. సుమతే..
 నాకు కావాలి..
 నేను కోరాలి..
 పిచ్చిది..
 నా దాపరికాలతో..
 నా నికృష్టాలతో..
 చాలా కోల్పోయి ఉంటుంది..
 నన్నే నమ్ముకుంది..
 నన్నే సమ్మతిస్తుంది..
 ఇక..
 తనని లాలించుకోవాలి..
 తనని పాలించుకోవాలి..
 అవును..
 అవునవును..
 ఇక మీదట..
 నేను.. నా భార్య..
 అబ్బ..
 అనుకుంటుంటే..
 ఎంత భారం తీరింది..
 అంత భయం పోయింది..
 ***
 "సుమతీ"
 తను నన్నే చూస్తుంది.
 ఆమె కొప్పు ముడిన..
 మూరెడు మల్లెలని చుట్టాను..
 ఆమె పాదాల దరిన..
 నా అర చేతులని జోడించాను..
 కన్నీళ్లు వదిలాను..
 క్షమని కోరుకుంటున్నాను..
 మనసారా..
 నికరంగా..
(ముగిసింది)