Heart Beat - 1 in Telugu Love Stories by Pooja books and stories PDF | గుండె చప్పుడు - 1

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

గుండె చప్పుడు - 1

నా పేరు పూజ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ ఒక ఆటో డ్రైవర్. మా మమ్మీ ఊరికి దగ్గర్లో ఉన్న ఒక కంపెనీ కి వెళ్తుంది. నాకు ఒక అక్క తన పేరు సాహితి.తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. దగ్గర్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్న ఎదో ఒక వంక పెట్టి వద్దు అనే దాన్ని ఎందుకంటే నాకు ఫైనర్ట్స్ చేయాలనీ కోరిక. డాడీ కి చాలా సార్లు చెప్పి చూసాను కానీ కన్వీన్స్ అవ్వలేదు. ఎందుకంటే డాడీ కి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం తాను ఎలాగో చేయలేకపోయారు కాబట్టి నన్ను అయినా ఇంజనీర్ చేద్దామని కంకణం కట్టుకున్నాడు. ఇక పది రోజుల్లో కాలేజీ లో జాయిన్ అవ్వాలి. అది తలుచుకుంటే చాలా భయమేస్తుంది ఎందుకంటే నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు గర్ల్స్ హాస్టలేయ్ అందుకే కోఎడ్యుకేషన్ అంటే చాలా భయం వేస్తుంది. మా మమ్మీ, డాడీ ఫ్రీ గా ఉన్నప్పుడు నా పక్కన కూర్చొని చాలా దూరం వెళ్తున్నావు ఎప్పుడు ఇంత దూరం నిన్ను పంపించలేదు జాగ్రత్తగా ఉండు, ఎవరితో గొడవలు పెట్టుకోకు,అందరితో బాగుండు, ఊరికే బయటకి వెళ్లకు ఇలా చెప్తూనే ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని నేను చిరాకు పడలేదు ఎందుకంటే చిన్నప్పట్నుంచి నాకు చెప్పి చెప్పి అలవాటైపోయింది అంతేకాదు చిన్నప్పటి నుంచి మా డాడీ నన్ను ఎప్పుడు బయటకి పంపించలేదు, ఎవరితోనూ ఆడుకొనిచ్చేవాడు కాదు ఎవరితోనైనా ఆడుకోవాలి అంటే మా ఇంటికి వచ్చి ఆడుకోమని చెప్పేవాడు. ఇలా చేస్తుండేసరికి నాకు మా డాడీ అంటే చాలా కోపం గా ఉండేది. మా ఫ్రెండ్స్ ఏమో మా నాన్న ఎక్కడికైనా పంపిస్తాడు, ఏదయినా చేయినిస్తాడు అంటుంటే మా డాడీ ఎందుకు ఎలా ఉండదు అనిపించేది. నేను పాదోవతరగతికి వచ్చినప్పుడు అర్ధం చేసుకున్నాను మా డాడీని.చిన్నప్పట్నుంచి నాకు ఎన్ని చేసుంటాడు, అయినా అవన్నీ చెప్పింది నా జాగ్రత్త కోసమే కదా. బయటకి వెళ్లకు అంటున్నాడు ఎందుకు రోజులు బాగాలేవు అనే కదా. నేను పుట్టినప్పుడు ఇద్దరం ఆడపిల్లలమే అని నన్ను చుట్టుపక్కల వాళ్ళు పడేయమన్నారు కానీ మా డాడీ నన్ను ఆలా పడేయలేదు. చిన్నావయసులోనే పెళ్లి చేసేసి, మీ బతుకు మీరు బతకండి అని వేరుగా పెట్టిన, పెద్ద చదువులు లేకపోయినా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మాకు ఇలాంటి లోటు లేకుండా పెంచాడు మా డాడీ. ఈ ప్రేమ, నా ఫైనర్ట్స్ ఒక తక్కెడా లో వేయి తుస్తే నా ఫైనర్ట్స్ ఒక పక్కకి కూడా రాలేదు అందుకే ఇంజనీరింగ్ చదవడానికి ఒప్పుకున్నాను.ఒక పక్క మా అక్క కి పిల్ల అయ్యి పిల్లలు లేరు. చాలా హాస్పిటల్స్ లో చూపించారు కడుపులో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు వాటికి మెడిసిన్ వాడితోంది. పెళ్లికాకముందు మా ఇద్దరికీ ఒక్క నిమిషం పడేది కాదు ఎప్పుడు చిన్న దానికి పెడసా దానికి గొడవ పడుతూనే ఉండేవాళ్ళం. కానీ ఒక్క సారి అక్క పెళ్లి చేసుకొని వెళ్లి పోగానే చాలా మిస్ అయ్యాను. అందుకే తన కోసం అయిదు రోజులు మా ఇంట్లో అయిదు రోజులు అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. నేను ఇంటికి వస్తే చాలు అక్క అన్నా ఇంటికి వస్తుంది లేదంటే నేనే అక్క వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. నిజంగా చెప్పాలంటే పక్కన ఉన్నప్పుడు ఎవరికీ దాని విలువ తెలియదు అది దూరం అయినప్పుడే దాని విలువేంటో తెలుస్తుంది. అక్క డిగ్రీ కంప్లీట్ చేసి కంపెనీ కి వెళ్ళేది బావ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ లైఫ్ బానేవుంది ఒక్క పిల్లలు లేరనే బాధ తప్ప.ఇక మా విషయానికోస్తే మా డాడీ కి ఇప్పట్నుంచో ఒక ఆటో కొనాలని ఉండేది ఆ కోరిక 2010 లో నెరవేరింది. అప్పటి వరకు కల్కి లో వాచ్మాన్ గా పంచేస్తుండేవాడు ఆటో కోనేసరికి ఆ జాబ్ వదిలేసి ఆటో తోలడం స్టార్ట్ చేసాడు. నా చిన్నప్పటి రోజులు చాలా బాగుండేవి అక్క, నేను, బాబాయ్ బొండాలకోసం , టీవీ రిమోర్ట్ కోసం కొట్టుకోవడం చాలా ఫన్నీ గా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి జీవితం వారిది.అదేంటో గాని నా చదువు విషయం లో ఎప్పుడు డాడీ మా పెద్దమ్మ కొడుకు తోనే కంపేర్ చేస్తాడు.10th, inter లో అన్నకంటే నాకు మర్క్స్ తక్కువచ్చాయని తిట్టాడు. తిడితే తిట్టాడు కానీ తిట్టే ప్రతీసారి రాత్రి తినేట్టప్పుడే తిడతాడు. ప్లేట్ లో అన్నం వేసుకొని ఒక ముద్ద నోట్లే పెట్టుకుంటూ ఉంటానా ఇంకా స్టార్ట్ చేస్తాడు తిట్టడం. తినేట్టప్పుడే ఎందుకు తిడుతాడు అని అనుకుంటారేమో అప్పుడొక్కటే నేను దొరుకుతాను కాబట్టి. నేను ఎక్కవ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఎందుకు అంటే మమ్మీ కంపెనీ కి వెళ్తుంది, డాడీ ఏమో ఆటో తీసుకొని బజార్ కి వెళ్తాడు ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా అందుకే నేను ఎక్కువ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. చూస్తూనే రోజులు చాలా తొందరగా గడచిపోయాయి. నేను కాలేజీ కి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. నేను, నాతోపాటు ముగ్గురు ఫ్రెండ్స్ మేము నలుగురం అమ్మ, నాన్న ల తోపాటు కాలేజీ కి బయలుదేరాం. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అమ్మ నాన్న ల ని ఇంటికి పంపించేసి రూమ్ లో అంరితో సమావేశామాయ్యను. ఎందుకంటే రేపు నా కాలేజీ మొదటి రోజు.