Adventures of jamesworth -1 in Telugu Fiction Stories by Amarnath books and stories PDF | VIRUS ( Adventures of jamesworth-1 )

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

VIRUS ( Adventures of jamesworth-1 )

హెచ్చరిక

ఈ కథ ఎవ్వరినీ ఉద్దేశింది కానీ, కించపరిచే విధంగా కానీ కాదు.
ఇందులో ప్రస్తావించిన అన్నీ పాత్రలు, వస్తువులూ, వూరి పేర్లు అన్నీ కేవలం కల్పితం. అంతే కాక ఇందులో ఉన్న కథ అంతా foriegn కంట్రీస్ నీ base చేసుకుని ఉంటుంది.

A story presented by, ®️
Amar arts & stories pvt.ltd.
since 2010.
©️ copyrights reserved 2020

if possible , I can write this in English.

హ్యాకింగ్ . హ్యాకింగ్ అనే పదం ప్రతి ఒక్కడూ కచ్చితంగా వినే ఉంటారు . ఈ కాలంలో ఈ పదాన్ని చిన్న పిల్ల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరిని అడిగినా చెప్తారు దాని అర్థం ఎంటి అని. కానీ, దాని గురుంచి అంతో , ఇంతో ప్రతి ఒక్కరూ తెలుసుకునే ఉంటారు. హ్యాకింగ్ గురుంచి ఇక మీకు పెద్ద గా చెప్ప దగినది ఏమీ లేదు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కాలంలో టెక్నాలజీ గురుంచి తెలీని మనిషి ఎవడూ ఉండడు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ , లాప్టాప్, మొబైల్ యూజ్ చేస్తుంటారు ...కానీ , వారు ఉపయోగించే ఫోన్ ఎంత వరకు safe అని భావిస్తున్నారు?. మీరు వెతికే ప్రతీ ఒక్క wedsite మీ వివరాలను ఎక్కడ save చేస్తోంది?. మీరు కాకుండా మీ మొబైల్ details, data ని ఎవరెవరు చూస్తున్నారు? . ఇవి ఏవీ తెలీకుండానే మన వాళ్ళు ఎక్కడ బడితే అక్కడ email details ఎంటర్ చేయడం, పర్స్నల్ నంబర్ ni ఎక్కడ బడితే app లాగిన్ కొరకు ఉపయోగిస్తుంటారు. అంతెందుకు, మీ ఫోన్ ను ఎవరు అడిగినా, వాడికి మీ ఫోన్ ఇట్టే ఇచ్చేస్తుంటారు ఇప్పటికీ. అరె, వాడు మన ఫోన్ లో ఎంచేసాడు, ఎందుకు తీసుకున్నాడు అని ఆరా తీయరు ఒక్కడు కూడా. ఒకవేళ మీరు చెక్ చేస్తే హిస్టరీ వేతుకుతారు అంతే. but అక్కడ కూడా మీ ఫోన్ తీసుకున్న వాడు తెలివైన వాడు అయితే హిస్టరీ delete చేసి ఉంటాడు. అప్పుడు ఇంకెక్కడ వెతుకుతారు? why? think it. విదేశాలలో ఇప్పటికే చాలా మంది హాకర్స్ తమ పంజా విసిరారు. అవి టెక్నికల్ లో చాలా ఎదిగిన దేశాలు కాబట్టి వారు దానిని ఈజీ గా decoding చేసి వారి దేశ టెక్నాలజీ నీ బలపరచుకుంటూ వస్తున్నారు నేటికీ. అదే పరిస్థితి మన భారత దేశానికి వస్తె మనం ఏమీ చేయలేని పరిస్థితి నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో, ఈ కథ ఆ కోణంలో సాగుతుంది.

ఇక నా సోది పక్కన పెట్టేసి ఈ కథలోకి ఎంటర్ అవుదాం మరి .....

Balien city:

అది ఊరు చివర ఉన్న నదీ ప్రాంతం. చిన్న అటవీ ప్రాంతాన్ని తలపిస్తుంది వారి నివాసం. కొద్దిపాటి ఇల్లులు తప్ప అక్కడ ఇంకెవరూ ఉండరు.

"అమ్మా! ..అమ్మా! నాన్న ఇంటికి ఎప్పుడు వస్తాడు అమ్మా?"

"వచ్చేస్తుంటాడు కన్నా ! , ఇందాకే నాన్న ఫోన్ చేసి చెప్పాడు , నీకోసం బొమ్మలు కొన్నాడంట, రాత్రి కల్లా నాన్న ఇంటికి వచ్చేస్తాడు, ముందు నువ్వు బుద్దిగా తిని ఆడుకో కన్నా...!"
ఆ పిల్ల వాడు (2 years) అమ్మ మాట మేరకు ఇంటి ఆవరణలో ఒక మూల బొమ్మలతో ఆడుకుంటున్నాడు.ఇంతలో ఆమె ఫోన్ తీసుకుని భర్తకు ఫోన్ చేయసాగింది.

" కిర్..కిర్.. (ఫోన్ కాల్ రింగింగ్)...కిర్ ..కిర్..." ఫోన్ కట్ అయ్యింది. మళ్లీ ఒక సారి ప్రయత్నించింది.

" కిర్..కిర్.."ఈ సారి లిఫ్ట్ చేశారు.

"ఏంటండీ ఫోన్ తీసేకి ఇంత ఆలస్యం చేస్తున్నారు?, ఇందాక మన బాబు మీరు ఎప్పుడు వస్తారని అడిగాడు, మీరు వాడికి బొమ్మలు కొంటున్నారు అనీ , వచ్చేసరికి రాత్రి అవుతుందని వాడికి అబద్దం చెప్పాను . ఇంతకీ మీరు బయలుదేరా రా లేదా? hello ...helloo... నేను ఇంత సేపటి నుండి గొంతు చించుకుని అరుస్తున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడరెంటి?".

( unknown person)
"నీ భర్త చనిపోయి చాలా సేపు అయ్యింది. మర్యాదగా నీ భర్త దాచిపెట్టిన pendrive నాకు ఇచ్చేయ్. కనీసం నువ్వు , నీ కొడుకు అయినా బతుకుంటారు , లేదంటే నువ్వు మా నుంచి తప్పించుకోలేవు , తప్పించుకోడానికి ప్రయత్నించావంటే అది నీ వెర్రి తనం . దేశం లో ఎక్కడ ఉన్నా సరే నిన్ను నేను ఈజీ గా కనుక్కుంటాను"అని ఫోన్ కట్ అయ్యింది.

తననీ , తన కొడుకుని కూడా వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు అని భయపడి న Mareena తన భర్త ఇచ్చన pendrive ను బయటికి తీసి , దానిని తన వద్ద ఉంచుకుని, డూప్లికేట్ pendrive నీ కంప్యూటర్ పక్కన వాళ్ళకి కనబడేలా పెట్టీ, వెంటనే తన కొడుకుని తీసుకొని వీధుల వెంట పారిపోతుంది. వారి నుండి తప్పించుకోడానికి చాలా ప్రయత్నిస్తోంది. ఇంకా కొంతమంది అయితే ఆమె ఇంటికి వెళ్లి pendrive కోసం వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు వార్కి.వారిలో ఒకడు ఆ pendrive చూసి , దానిని తీసుకుని ఆమె ఎక్కడుంది వెతుకుతున్నారు. ఆమె వెళ్లే ప్రతీ దారిని వాళ్ళు కనుక్కొని ఆమె వెంట పడుతున్నారు.ఎటు వెళ్ళినా వారు ఆమెను కన్నిపెట్టడం mareena గమనించి వెంటనే తన వద్ద నున్న ఫోన్ ను విసిరి పారేసింది .అలా ఒక బ్రిడ్జి మీద పరుగిడుతున్న ఆమెను వాళ్ళలో ఒకడు గురి చూసి gun కి silencer పెట్టీ కాల్చేసాడు. ఆ బుల్లెట్ దెబ్బకు ఆమె నేలకు ఒరిగింది. అయినా ఆమె పట్టువిడవకుండా లేచి పరుగిడుతూనే ఉంది. అతను ఇంకో సారి తుపాకీ తో కాల్చగా ఆమె తన కొడుకుతో పాటు బ్రిడ్జి కింద ప్రవహిస్తూ ఉన్న నదిలో కి పడిపోయింది. ఆమె నీటి అడుగుకి చేరుకుంది కాబోలు ఇంకా బయటికి రాలేదు. వాళ్లంతా ఆమె ఎంతకీ బయటికి రాకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆమె ఆ నీటిలో తన కొడుకు నీ గట్టిగా పట్టుకుని ఒంటి చేత్తో లోలోపలే ఈదుతూ బ్రిడ్జి base పిల్లర్ మీద నిలబడి తన కొడుకు కి ఏమైందని చూసుకుంటోంది. ఆ పిల్లాడికి అదృష్టవశాత్తం ఏమీ కాలేదు. చీకటి పడుతోంది. ఒకపక్క ఆమె ఒంటిలోకి దిగిన బుల్లెట్ ల వలన రక్తం కారుతూనే ఉంది. మెల్లిగా ఆమె కళ్ళు బయర్లు కమ్ముకుంటున్నాయి. స్పృహ కోల్పోతోంది. ఆ సమయంలో అటుగా పడవ లో వచ్చిన ఒక డాక్టర్ ఆమెని బైనాకులర్ లో చూసి, ఆమెను , ఆ బాలుడిని తన పడవలోకి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ ఆమెకు ఆ పడవలోనే ట్రీట్మెంట్ చేశాడు. ఆ పడవలో ఆ డాక్టర్ తో పాటు ఇంకో ఆమె కూడా ఉంది.ఆమె ఎవరూ కాదు ఆ డాక్టర్ భార్యనే. ఆమె ఆ బాబు నీ మీ నాన్న ఎవరినీ అడిగింది. ఆ బాలుడు ఏమీ చెప్పలేదు. ఏమీ తెలియని బిక్క మొహం వేసుకుని ఉన్నాడు ఆ బాలుడు. ఆ పిల్లాడికి ఏమీ తెలీదని భావించిన డాక్టర్ భార్య అతనిని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంది.
..... ఒకరోజు గడిచింది....
ఆమె నిద్రలోనే ఏదో కలవర పడుతూ ఉంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూడసాగింది. అదే సమయం లో ఆ డాక్టర్ ఆమె ఎలా వుందని చూడడానికి వచ్చాడు ఆమె ఉన్న రూం కి. ఆమె సరిగ్గా కోలుకోలేక పోతోంది అని భావించాడు డాక్టర్ . ఆమె డాక్టర్ తో "తన కొడుకు ఎక్కడని?" ప్రశ్నించింది. పిల్లాడు తన భార్యతో ఆడుకుంటున్నాడు అని చెప్పాడు ఆమెతో. ఆమె ఇక బతకనని ఆమెకు తెలుసు కాబోలు కిటికీ లోంచి తన కొడుకు డాక్టర్ భార్యతో ఆడుకోవడం చూసింది. ఇక మరో మాట్లాడకుండా" నా కొడుకు జాగ్రత్త!" అని మాట్లాడి మౌనంగా ఉండిపోయింది. ఆ డాక్టర్ ఆమె గురించిన వివరాలను అడిగే లోపు ఆమె చనిపోయింది. ఆ డాక్టర్ తన పడవ లో వారి ఊరి శివారు లోపలికి ప్రయాణించి , దారిలో ఉన్న జీసస్ స్మశాన వాటిక లో ఆమె శవానికి అంత్యక్రియలు చేయడానికి , పడవను ఒక చోట ఆపి , ఆమె శరీరాన్ని చేతులతో ఎత్తుకుని సిద్దం చేసిన గుంత లో ఆమెను పడుకోబెట్టాడు. అప్పుడు ఆమె బొడ్డు కు దాచుకున్న ఒక pendrive నీ చూసాడు డాక్టర్ . దాన్ని తీసుకుని ఆమెను ఆమెను సమాధి చేశాడు. ఆ డాక్టర్ కి కూడా ఎటువంటి సంతానం లేకపోవడంతో ఆ పిల్లాడి నీ వారు అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.ఆ డాక్టర్ భార్య అయిన marie ఆ పిల్లాడికి మంచి పేరు పెట్టాలని తలచి తన భర్తకు చెప్పింది. కానీ, ఆ డాక్టర్ ఆ పిల్లాడికి తన అన్నయ్య కి ఉన్న మరో పేరు " jamesworth " అనే పేరు పెడదామని చెప్పాడు తన భార్యతో. ఆమె ఈ పేరు చాలా బావుందని చెప్పి ముద్దుగా james అని పిలవడం మొదలెట్టింది.

VIRUS
Adventures of jamesworth-1
The birth

james కి వయస్సు పెరిగే కొద్దీ కంప్యూటర్ టెక్నాలజీ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. చిన్న వయసు నుండే చిన్న , చిన్న ప్రయోగాలు చేసేవాడు. marie , ronald కి james ante చాలా ఇష్టం. james ఎం చేసినా అది వాడి ఎదుగుదలను ,వాడే నిర్ణయించుకుంటున్నాడు అని భావించేవారు. అంతే కాక , ఒక సారి james కి తన పెదనాన ఉపయోగించిన హ్యాకింగ్ బుక్ ఒకటి ఇతనికి తన ఇంటి పాత garage రూములో దొరికింది. దాంతో james ఎప్పుడు చూసినా ఆ పుస్తకాన్ని పట్టుకుని కూర్చుని చదివేవాడు. అలా ఇతనికి ఉన్న సొంత టాలెంట్ తో పాటు, ఆ బుక్ ద్వారా చిన్ననాటి నుండే కంప్యూటర్ టెక్నాలజీ నీ బాగా అర్థం చేసుకునేవాడు. దాని పై గట్టి పట్టు వచ్చింది. మిగతావి మాత్రం అంతంత మాత్రమే. james ఒక సారి తన తల్లిదండ్రుల తో "ఇక నేను స్కూల్ కి వెళ్ళను.నాకు ఆ చదువు వ్యర్థం అని అనిపిస్తోంది, నేను ఇంట్లోనే కూర్చుని కంప్యూటర్ నీ నేర్చుకుంటారు " అని అన్నాడు. అతని త్లలి marie -"అది కాదు నాన్నా...!, మీ నాన్న చదువుకున్నాడు, నేను చదువుకున్నాను, నువ్వు చదువుకోక పోతే ఎలా?" అని ప్రశ్నించింది. james" నాకు చదువు లేక పోయినా పర్లేదు , నేను మాత్రం కంప్యూటర్ నీ మాత్రమే నా చదువు గా భావిస్తున్నా" అని అన్నాడు. ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కదా వారు ఏమీ అనలేదు james నీ. తనకి కంప్యూటర్ పెట్టుకోడానికి ఒక గది కావాలి. అందుకు వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న pent house ను శుభ్రం చేసుకుని అందులో ఉండాలని fix అయ్యాడు. james ఆ రూం తాళాలను ఎక్కడున్నాయి అని తన అమ్మను అడిగాడు. " ఆ రూం లో ఒకప్పుడు మీ పెదనాన్న ఉండేవాడు, ఆయన వెళ్ళిపోయాక ఆ రూం నీ ఎవరూ ఓపెన్ చెయ్యలేదు, నీకు ఆ రూం clean చేసేకి సాయంగా మన పని మనిషి niana ను తీసుకుని వెళ్ళు " అని అంది marie . ఏం వద్దు దాన్ని నేనే clean చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు james. గదిని ఓపెన్ చేసాడు . తన పెదనాన్న ఉపయోగించిన రూం నీ శుభ్రం చేసే సమయంలో అక్కడొక రహస్య గది ఒకటి కనిపించింది.అందులోనికి వెళ్ళడానికి ఒక డోర్ ఉంది. దానిని తెరవడానికి ఎంతగానో ప్రత్నించాడు .కానీ ,ఆ గది తలుపు తెరుచుకోలేదు. దానిని తెరవడానికి ప్రయత్నించి నప్పుడల్లా ఆ తలుపుకి రెడ్ లైట్స్ వెలిగేవి. దాన్ని చూసిన james దీనికి సెక్యూరిటీ పాస్వర్డ్ ఉందని భావించాడు. దానిని ఎలాగైనా తెరవాలని తనకు తెలిసిన టెక్నిక్ తో ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. అది చస్తే ఓపెన్ కాలేదు. ఎందుకులే అనిపించిందేమో కానీ james దాని గురుంచి విడిచి పెట్టేసి , రూం clean చేసుకున్నాడు. ఆ తరువాత తన అమ్మా, నాన్నలను అడిగి వారితో కొంత డబ్బు ఇప్పించికుని , తాను పోగుచేసుకున్న money నీ తీసుకుని కంప్యూటర్ సామాగ్రి అంతా కొన్నాడు తన తండ్రిని వెంట తీసుకెళ్ళి. తను శుభ్రం చేసుకున్న రూములో ఆ కంప్యూటర్ సామాగ్రిని తానే సెట్ చేసుకుని వాటికి అతనే కనెక్షన్స్ ఇచ్చుకున్నాడు. రోనాల్డ్ తన కొడుకు చేసే ప్రాయోగాలని చూసి ఆశ్చర్యపోతున్నారు. james ఇక తనకు అనుకూలంగా పని చేసే సాఫ్ట్వేర్ నీ develop చేసుకోవడం మొదలుపెట్టాడు ఆ రూం లో కూర్చుని . తన ఫ్రెండ్ లూసీ అప్పుడప్పుడు james నీ చూడడానికి వచ్చిపోయేది. కాల క్రమంలో james వయసు కూడా పెరుగుతోంది. 3 సంవత్సరాల నిరంతర కృషితో , రేయింబవళ్ళు కష్టపడి తను ఒక వైరస్ నీ డెవలప్ చేసుకున్నాడు. ఇక దానిని ప్రయోగించడానికి సిద్దం అయ్యాడు. మొదట తన రూంలోనే లైట్స్ నీ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. అది successful గా off అయ్యింది. ఈ సారి తన తండ్రి లాప్టాప్ నీ హాక్ చేయడానికి ప్రయత్నించాడు. అది సక్సెస్ఫుల్ గా పని చేసింది కాబోలు ,తన తండ్రి లాప్టాప్ హాక్ అయ్యింది అని పోలీస్ complaint ఇవ్వబోగా ....james అడ్డుకుని ఈ పని తానే చేశానని చెప్పి దానిని మళ్ళీ మామూలుగా పనిచేసే విధంగా decoding చేసి తన ప్రతిభను తన తల్లిదండ్రులకు చూపాడు. 20 ఏళ్లకే తమ కొడుకు ఇంతటి గొప్ప వాడయ్యాడు అని వారు చాలా సంతోషించి , మీ పెదనాన్న కూడా ఒక గ్రేట్ హ్యాకర్ అని చెప్పారు james తో. వారు చెప్పిన మాటలు పట్టించుకోకుండా james తన రూం కీ వెళ్లి జాలీ గా సాంగ్స్ వింటున్నాడు. అలా అనుకోకుండా అక్కడున్న locker గుర్తుకు వచ్చి దాన్ని ఓపెన్ చేయడానికి ఈ సారి మళ్లీ ప్రయత్నించాడు. దాంతో ఆ డోర్ కాస్తా ఓపెన్ చేయగలిగాడు. లోపల అంతా చీకటిగా ఉంది, బూజు పేరుకుపోయింది. ఇతను తయారు చేసుకున్న ఆండ్రి వైరస్ తో "ఆండ్రి... లైట్స్ on" అని అనగానే లోపల ఉన్న అన్ని lights వెలిగాయి. లోపల ఉన్న కంప్యూటర్ things ను చూసిన james కి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. లోపల భారీ equipment ఏ ఉంది. మూడు కంప్యూటర్స్ , ఒక satellite connecter, ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి . దాన్ని చూసి james ఒకింత ఆశ్చర్యపోయాడు. జమేస్ దాన్ని ఎలా ఆన్ చేయాలని ఆలోచనలో పడ్డాడు. ఇంకేముంది తన ఆండ్రీ virus ఉంది కదా అని పెద్దగా భయపడలేదు . కానీ, దాన్ని ఆపరేట్ చేయడం ఎలా? అని అలోచనలో పడ్డాడు మళ్లీ. తన ఆండ్రీ వైరస్ తో దాన్ని ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆ కంప్యూటర్స్ పని చెయ్యలేదు. దాని మీద విసుగొచ్చి అక్కడి నుండి బయటకు వచ్చేసాడు. james కి ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండి , ఉండి bore కొట్టీంది ఏమో అలా బయటికి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ తాను కనుగొన్న వైరస్ ఎలా పనిచేస్తోంది అని ఒక సారి ప్రయోగించాడు. అక్కడ ఉన్న అందరి సెల్ లోని వారి , వారి బ్యాంక్ details, పెర్సొనల్ నంబర్స్, ఫొటోస్, వీడియోస్ , చాటింగ్ లిస్ట్....ఇలా ప్రతీది james mini laptop లో display అవుతున్నాయి. పర్లేదు నేను తయారు చేసిన వైరస్ టెక్నాలజీ బాగానే పనిచేస్తోంది అని తన మనసులో అనుకున్నాడు.
ఇంటికి తిరిగొచ్చిన james తనకు బుక్ దొరికిన garrage లో ఏమైనా దొరుకుతుందేమో అని ఎక్కడికి వెళ్లి వెతుకుతున్నాడు మళ్లీ . అక్కడేమీ దొరకలేదు కానీ చిన్న pendrive ఒకటి మాత్రం దొరికింది. సరే, అని అక్కడి నుండి నిరాశతో వెళ్ళిపోయాడు james.తన రూం కీ వెళ్లి దిగాలుగా ఆన్లైన్ chess game నీ ఆడుకుంటున్నాడు. కాసేపటికి తనకు దొరికిన pendrive లో ఏముందో అని దాన్ని తన device కి కనెక్ట్ చేసి చూసాడు.అందులో చాలా files ఉన్నాయి . అందులో వున్న ఒక సమాచారాన్ని encrypt చేసుకున్నాడు. అంతే కాదు అక్కడున్న ఒక ప్రోగ్రామ్ నీ చూసిన james ఇది తను కనిపెట్టిన virus ప్రోగ్రాం లాగే ఉండటం చూసి ఆ కోడింగ్ నీ తన హార్డ్ డిస్క్ కి save చేసుకున్నాడు.
కాసేపటి తరువాత james mind లో ఒకటే ఆలోచన మెదులుతోంది. secret రూం కి , దీనికి ఏదైనా సంబంధం ఉన్నదేమో అని ఆ secret రూంలో వెళ్ళాడు మళ్లీ. తనకి దొరికిన సమాచారాన్ని తీసుకున్న పిమ్మట, secret రూంలో ఉన్న కంప్యూటర్ నీ ఓపెన్ చేయడానికి తాను తయారు చేసిన వైరస్ నీ దానికి కనెక్ట్ చేసాడు. దాంతో దాని సెక్యూరిటీ లాక్ నీ access చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా access denied అని అంటోంది. తరువాత ఎన్నో తిప్పలు పడి ఆ కంప్యూటర్ నీ ఆన్ చేయగలిగాడు. అది ఆన్ అయ్యి "welcome to the james" అని చెప్పింది. మొదట james కి ఏమీ అర్థంకాలేదు , ఇదేంటి నా పేరు పలుకుతోంది అని. తరువాత ఏమయిందో తెలీదు కానీ దాని గురించి పక్కన పెట్టీ , pendrive లో ఉన్న data దీనికి match అవుతుందేమో అని ప్ర యత్నించాడు . ఆ కంప్యూటర్ స్లో గా run అవుతోంది. ఇది ఏ పనినీ సరిగ్గా చేయడం లేదు, ఇక దీంతో లాభంలేదని తన కంప్యూటర్ లోనే దీన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు.
అయితే తన తల్లితండ్రులు చెప్పిన మాట అప్పుడు తనకి గుర్తుకి వచ్చి " ఓహ్ ! దీన్ని కచ్చితంగా మా పెదనాన్న కనిపెట్టాడు అన్న మాట" అని తన మనసులో అనుకున్నాడు james. ఆ తరువాత దాన్ని off చేసి తన కంప్యూటర్ వద్దకు వెళ్లి , ఆ pendrive లో ఏమేమి ఉన్నాయో అని వెతుకుతున్నాడు. అందులో ఉన్న data కి ఒక secret లాక్ ఉంది. దాన్ని easy గా తనకున్న టెక్నాలజీ తో ఓపెన్ చేసాడు. అందులో చాలా మంది details , profiles, online business corruption details, ఇంకా women trafficking కి సంబందించిన సమాచారం, online పోర్న్ హర్రాషింగ్, child సెళ్ళింగ్స్, అన్నీ అక్రమ నేరాలకు కు సంబంధించిన విషయాలు గురుంచి అందులో డిటైల్స్ గా ఉన్నాయి. ఇదంతా చూసిన జమెస్2 కి ఒక్కసారిగా mind పనిచేయలేదు. ఆతరువాత కొద్దిసేపటికి ఆ shock నుండి తేరుకుని , సో...ఇదంతా తన పెదనాన్న బయటికి ఎందుకు తేలేదు?ఒకవేళ ఇతను కూడా ఏమైనా అందులో భాగస్తుడా అని ఆలోచన చేయసాగాడు james.

Next అడ్వెంచర్-2 ...... on..
may be second adventure coming on one month later.....