A meal in a garden - A meal in a garden in Telugu Drama by Bk swan and lotus translators books and stories PDF | ఒక తోట లో పూట - ఒక తోటలో ఒక పూట

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ఒక తోట లో పూట - ఒక తోటలో ఒక పూట

(అది ఒక పార్కు ఆ పార్కులో ముగ్గురు మిత్రులు దిగులుగా కూర్చుని ఉన్నారు . వారి మధ్యన సాగుతున్న సంభాషణ ఇలా ఉంది)
********************************************

మొదటి వ్యక్తి: రమేష్ మనం మన సమస్యలనుండి గట్టెక్కాలంటే ఇంతకంటే మరోమార్గం లేదంటావా

రెండో వ్యక్తి: అవును రమేష్ నువ్వు మరోమారు ఆలోచించు ఉమేష్ అంటున్న మాటలు వింటుంటే నాకు కూడా మనం తొందరపడుతున్నామేమోనని అనిపిస్తోంది

రమేష్: ఆపరా ..సతీష్ నువ్వూ ఈ ఉమేషుగాడు ఇద్దరూ చవట దద్దమ్మలు.. శుద్ధ మొద్దులు... పిరికి సన్నాసులు...మిమ్మల్ని స్నేహితులుగా చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగావుంది

సతీష్ :అది కాదురా రమేష్...
కంటి చూపు తగ్గిందని కళ్ళు తీసేసుకుంటామా కళ్ళజోడు పెట్టుకోమూ...  అలాగే ఈ సమస్యకి కూడా వేరే పరిష్కారమేదైనా ఉందేమో కాస్త ఆలోచించు

ఉమేష్: అవున్రా రమేష్ నీ కోపాన్ని తగ్గించి కాస్త శాంతంగా ఆలోచించి చూడు ... వేరే దారి దొరక్కపోదు

రమేష్: ఈ మెట్ట వేదాంతం కట్టి పెట్టండి ఈ సొల్లు కబుర్లు పక్కన పెట్టండి  అన్ని అవకాశాలు మూసుకుపోయాయని తెలుసుకున్నాకే ఇలా డిసైడయ్యా.. మీకు నచ్చితేనే ప్రొసీడవ్వండి..ఎవరికైనా ఏదైనా అభ్యంతరం వుంటే నిరభ్యంతరంగా సైడవ్వచ్చు

సతీష్,ఉమేష్: ఛ.. మా ఉద్దేశ్యం అది కాదురా!ఇంత కాలం ఏం పని చేసినా ముగ్గురం కలిసే చేశాం 
కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇంకోసారి ఆలోచించమన్నాం..ఇప్పటికీ నీ నిర్ణయం అదే అయితే ..మేమూ నీతోబాటే ...కానీ ఒక్కసారి శ్యాంని సలహా అడిగితే మంచిదనిపిస్తోంది

రమేష్: ఆ అయోమయం జగన్నాధంగాడా మీరు సలహా అడగడానికి దొరక్కదొరక్క వాడే దొరికాడా దేడ్ దిమాగ్గాడు ఈ పాటికి ఏ చెట్ల వెంటో పుట్ల వెంటో తిరుగుతుంటాడు... ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో వాడికే తెలియదు ....
రమేష్ ఇంకా ఏదో అనబోతుండగానే అక్కడికొచ్చిన శ్యాం ఇలా మాట కలిపాడు

శ్యాం : ఏంటీ ఉన్నట్టుండి అందరూ నన్ను తలచుకున్నారు
హఠాత్పరిణామానికి అవాక్కయిన రమేష్ కాస్త తటపటాయించిన వెంటనే తేరుకు పెడసరంగా ఇలా అన్నాడు

రమేష్ : అవున్నాయనా అవును తమరి గురించే ఆలోచిస్తున్నాం అవతార పురుషుడిలా ప్రత్యక్ష్యమై ఆదుకుంటావని...మా పూర్వ జన్మ సుకృతం తమ దర్శన భాగ్యం కలిగింది

శ్యాం:ఆ.. నేను అవతార పురుషుణ్ణి కాదుగానీ మీరు తలచుకోగానే ప్రత్యక్ష్యం అయ్యాను చూశారా.. అది సరేగానీ రమేష్ ఇంతకీ ఏమయ్యింది నీ కోపం మొత్తం మనవాళ్ళ మీద చూపిస్తున్నావ్ అసలే మయ్యింది ఈ సారికూడా ముగ్గురూ పరీక్ష తప్పారా లేక నిన్నొదిలేసి ఈ ఇద్దరూ పరీక్ష పాసయ్యారా 

సతీష్  : అదికాదు శ్యాం విషయం వేరే వుంది

శ్యాం : ఓహో.. మీ ఫేవరెట్ హీరో సినిమాకు టికట్లు దొరకలేదా నన్నడిగితే నేనిచ్చేవాడినికదా..

ఉమేష్ : (కాస్త అసహనంగా..) అది కాదు శ్యాం 

శ్యాం :ఆది కూడా కాదా...ఐతే... మీరు టీవీ చూస్తుంటే మధ్యలోనే కరెంటు పోయిందా

అసలే కోపంతో రగిలిపోతున్న రమేషుకు శ్యాం వాగుడు మరింత విసుగు తెప్పించింది చిర్రెత్తుకొచ్చిన అతను శ్యాంను ఉద్దేశించి ఇలా అన్నాడు

రమేష్: అది కాదురా వెంగళప్ప మేం ముగ్గురం పెద్ద ప్రోబ్లం లో ఇరుక్కున్నాం

శ్యాం : అరెరే..సినిమా క్రికెట్టు ఈ రెండూకానీ సమస్యలు మనకేముంటాయి చెప్మా ఒక వేళ చదువుగురించి అనుకుంటే అది మన సబ్జెక్టు కాదు కదా...

రమేష్: ఏరా ... మాలోకం మమ్మల్ని చూస్తే నీకు వేళాకోలంగా వుందా...
పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకున్న శ్యాం  రమేష్ మాటలను అపార్ధం చేసుకోకుండా... ఇలా అన్నాడు

శ్యాం : ఛా.. నా ఉద్దేశ్యం అది కాదురా మీరేదో మూడాఫ్ లో ఉన్నట్టు కనిపిస్తే కాస్త కూల్ చేద్దామని అలా అన్నాను
ఐనా ఇన్నాళ్ళ మన స్నేహంలో మీరు నన్ను అర్ధం చేసుకున్నది ఇదేనా... అని వాపోయాడు
తన దురుసు ప్రవర్తనకు నొచ్చుకున్న రమేష్ పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు

రమేష్ : సారీరా శ్యాం ఏదో టెన్షన్లో ఉండి
నీ గురించి తెలుసుండి కూడా ఏమీ ఆలోచించకుండా ఏదో అనేశాను నన్ను క్షమించు 

శ్యాం : అరే.. అంత మాటలెందుకులేరా ... ఇంత మాత్రానికే ఇంతలాఇదైపోతే ఎలా... ఐనా ఇవన్నీ మనకు ముందునుంచీ ఉన్నవేగా ... అదిసరే ఇంతకీ ప్రోబ్లం ఏంటి

ఉమేష్: మా లైఫే పెద్ద ప్రోబ్లంగా మారిందిరా

శ్యాం: అంత కష్ఠం ఏం వచ్చిందిరా

సతీష్ : ఈ సారి పరీక్షల్లో కాపీ కొడుతూ మేం ముగ్గురం స్క్వాడుకు దొరికిపోయాం మమ్మల్ని డిబార్ చేశారు

రమేష్ : నీ పరిస్థితే నయం పరీక్షల టైంలో చికెన్ గున్యా వచ్చి చక్కగా మంచమెక్కావ్... లేకుంటే నువ్వుకూడా మా లిస్ట్ లో చేరేవాడివి

ఉమేష్ : ఇన్నాళ్ళూ ఈ విషయాన్ని కొంతవరకూ మేనేజ్ చేశాం ఇంక మావల్ల కాదు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా మమ్మల్ని తవ్వి పాతేస్తారు

రమేష్: అసలే పంకజ్ ని ర్యాగింగ్ చేస్తే అతడు సూసైడుకి ఎటెంప్ట్ చేసిన విషయం ఇంట్లో తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళతో మేం మాట్లాడలేకపోతున్నాం

సతీష్ : పంకజ్ తో మేం ఎలా బిహేవ్ చేసిందీ మొత్తం పూస గుచ్చినట్టు పేపర్లో వ్రాశారు.. కళ్ళకు కట్టినట్టు అన్ని టీవీ ఛానెళ్ళలో చూపించారు...ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా వుందా వాళ్ళైనా చస్తారు లేదా మమ్మల్నైనా చంపుతారు... ఐనా ఇంత జరిగాకా మేం ఎవరికోసం బ్రతకాలి ...ఎందుకోసం బ్రతకాలి అందుకే....చనిపోవాలని నిర్ణయించుకున్నాం...ఐతే ఎలా చనిపోవాలా అని ఆలోచిస్తున్నాం

శ్యాం : ఇందులో ఆలోచించడానికేముంది నిద్ర మాత్రలు మింగితే సరి నేను తెచ్చిన నిద్రమాత్రలు గ్యారెంటీగా పని చేస్తాయి
తలనొప్పికి శారిడాన్ వేసుకోమన్నంత తేలికగా చచ్చిపోడానికి నిద్రమాత్రలు మింగుదామని శ్యాం ఇచ్చిన సలహాతో అందరికీ దిమ్మతిరిగింది... 
అదిసరే..ఇంతకీ ఈ నిద్ర మాత్రలు నీకెందుకు... అని నిర్ఘాంతపోయిన ముగ్గురూ... చిద్విలాసంగా చూస్తున్న శ్యాంని ముక్త కంఠంతో ప్రశ్నించారు... 

                                   ..ఇంకావుంది