దేనికైనా సమాధానం చిరునవ్వు....
ఎంతటి అలసటకైనా సమాధానం చిరునవ్వు...
ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చిరునవ్వు...
ఎంత చులకనకైనా సమాధానం చిరునవ్వు...
ఎన్ని కోరికలైనా సమాధానం చిరునవ్వు...
ఎన్ని సమస్యల పరిష్కారానికైనా సమాధానం చిరునవ్వు.....
కన్నవారి ప్రేమకైనా,కోపానికైనా....మెట్టినింటి బంధానికైనా బాధ్యతకైనా.....
పేగుబంధాలకైనా.... తోడబుట్టిన వారి పలకరింపుకైనా......
ఆడపడుచు అలకకైనా....బావామరుదుల సరదా మాటలకైనా....సమాధానం చిరునవ్వు....
అత్త తానూ అతివనని మరిచి మాట అన్నా
కన్నీరు దాచేసి చెప్పే సమాధానం చిరునవ్వు...
తన కుటుంబాన్ని నడిపిస్తూ తండ్రిలా తనని గౌరవిస్తున్నా
కోడలు కూతురులాంటిదని మరిచి అవమానించినా
ఉబికి వచ్చే కన్నీటిని దాచేసి చెప్పే సమాధానం చిరునవ్వు....
పగలంతా తన కోసం తానే బాధ్యతల్ని పంచుకుని కాదు తనవి కూడా
తాళి కట్టిన కారణంగా అన్నీ తానే అయి నడుచుకుంటున్నా
ఇంకా ఏదో చేయలేదని తనకేదో తక్కువయిందని నిందించి
తూలనాడే మాటకైనా మనసు పడితే రోదన లోపల నొక్కేసి కన్ళీళ్ళతో కూడా చెప్పే సమాధానం చిరునవ్వు.....
ఆడదానిగా జన్మించడం ఒక గొప్ప వరం అని
పురాణాలు ఘోషిస్తున్నాయి....
అందరూ ఆడది ఆడది అంటూ గొప్పలు చెప్పేస్తారు....
కానీ భ్రూణముగా ఉండగానే ఉసురు తీసేస్తారు...
పోనీ బ్రతకనిచ్చినా చిన్నచూపు తో చూస్తారు....
పది రోజుల ప్రాయం నుంచి ఎనభై ఏళ్ళ వరకు ఎవరినీ వదలని కామంతో కళ్ళు మూసుకుపోయి కాటేస్తారు....
ఏదీ మా బ్రతుకు....ఎక్కడ ఉంది మా బ్రతుకు....
ఎన్నాళ్ళు మాకు ఈ బ్రతుకు అని మగువ అడిగితే సమాధానం చెప్పే మగవాడు ఏడి?
అందరూ అలా కాదు ఉన్నారని చెప్పడం లేదు కానీ అండగా నిలబడే వారు లేరే అని....
ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎదురొడ్డి అడుగు ముందుకు వేస్తూ
తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని గెలుపు వైపు పయనిస్తోన్న పడతికి మా వందనం...
అభినందనలు......మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.....