అలల అంచున నిలబడి వేళ..
ఆకాశం రంగులు మార్చిన వేళ..
మనసు లోపల మాటలు లేని మౌనలు
గాలిలో నిశ్శబ్దంగా తేలుతుంటాయి..
సూర్యుడు పొద్దు వాల్చి దిగిపోతుంటే
నా ఆశలు మాత్రం ఉదయమే
అలలు వచ్చి వెళ్లినట్టే
వేదనలు కూడా దారితప్పాలి అనిపిస్తుంది..
దూరంగా ఎగిరే పక్షుల్లా
కలలు కూడా దిక్కులు దాటాలి..
ఈ ఒంటరి క్షణం కూడా
ఒక అందమైన జ్ఞాపకమై మారాలి..