సాగు బాగు కొరకు సేంద్రీయ పద్ధతులు
పాటించమనుచుండె ప్రభుత నేడు
ఆ విధముతోబాటు యోగమును జోడించ
మంచి ఫలితము వచ్చు మెండుగాను
వ్యవసాయం బాగుపడాలంటే సేంద్రీయ పద్ధతులు అవలంభించాలని ప్రభుత్వం చెబుతోంది...ఈ విధానానికి తోడు సహజ రాజయోగ సాధన చేస్తే మంచి ఫలితాలు మరింత మెండుగా సాధించవచ్చని భావం...ఓంశాంతి