వారో పరమ పరమాణువు
అనంత జ్ణాన సింధువు
రూపంలో కాంతి రేణువు
వసుధైవకుంటుంబ భావనకు ఆధారమైన కేంద్ర బిందువు
అల్లా యహోవా శివ ...
ఇలా అనేక నామాలు కలవు
సకల సద్గుణాలకు వారే నెలవు
పుట్టుక గిట్టుకలు లేవు
అకలి దప్పులు అసలే లేవు
ఆస్తిక నాస్తిక భేదాలు లేవు
ధనిక పేద తేడాలు లేవు
చిదానంద స్వరూపులు చీకు చింతలంటవు
కాలాతీతులు వారు కలిమి లేములుండవు
వారి రాక దుఃఖానికి శాశ్వత శెలవు
వారే ఇప్పిస్తారు సుఖ శాంతుల కొలువు
మనం ఆత్మలం ఈ తనువుల వలువలు
శాస్వతాలు కావు
ఇవి లేని ఆ సర్వేశ్వరులే
మనకు అసలైన బంధువు