మానవుడే మాధవుడంటారు మానవుల్లో పురుషులు మీసాలను పెంచుకోవడాన్ని ఇష్ఠపడతారు. వీటిని పౌరుషానికీ ఆత్మ విశ్వాశానికీ ప్రతీకలుగా భావిస్తారు... ఈ మీసాలు మగవారి ముఖానికి అందాన్నిస్తాయి కూడా.. కానీ పెరుగుతున్న వయసుతోబాటు ఇవి వన్నెను కోల్పోతాయి..కానీ సమస్త మానవాళికీ సౌందర్యాన్నిచ్చే మీసాలు వేరే వున్నాయి చర్మ చక్షువులకు కనిపించని ఈ సూక్ష్మ మీసాలు స్తీ పురుష జాతి బేధాల్లేంకుండా అందరికీ వుంటాయి.. అదే ఆత్మాభిమానం అందరి పట్ల ఆత్మీయ అభిమానం ఎవరైతే ఈ మీసాలను సహజ రాజయోగమనే దువ్వెనతో దువ్వుతూ పరమాత్మాభిమానం అనే జ్ణాన సంపెంగ నూనెను పూస్తారో వారే దేవతలుగా కాగలరు నిజానికి ప్రతి ఆత్మ పురుషుడే ప్రకృతిలోని పంచ తత్వాలతో తయారైన శరీరం స్త్రీ.. ఇక జననజరామరణాతీతుడైన పరమాత్ముడే పరమ పురుషుడు వారే మనకు పరమ పిత ఇంకా పరమపతి కూడా.. కాబట్టి అందరం స్త్రీ పురుష స్థూల దేహాభిమానాన్ని వీడి మానవత్వంయొక్క పరమోన్నత స్థితికి పరాకాష్ఠ అయిన దైవత్వాన్ని పొందేందుకు శ్రేష్ఠ పురుషార్ధం చేద్దాం.. ఇందుకు కావలసినది ఆత్మిక స్థితి పరమాత్ముని శ్రేష్ఠస్మృతి.. ప్రపంచమే మన కుటుంబం అన్న ఉన్నత భావం మనమంతా భగవంతుని సంతానం పరస్పరం సోదరులం అన్న ఉత్తమ భావన అప్పుడు ప్రతీ జీవుడూ మీసమున్న దేవుడు కాగలడు..ప్రపంచాన్ని స్వర్గంగా మార్చగలడు..ఓంశాంతి