ప్రేమాధ్యంతం

(10)
  • 33.6k
  • 2
  • 12.7k

"యు బ్లేడీ!! నా ఊరికోచ్చి, నా సామ్రాజ్యంలోని రహస్యాలని అమ్మేయ్యాలని చూస్తావా?? "... గొంతు పట్టి ఒక్క ఉదుటున విసురుతాడు. ఐదు అడుగుల దూరంలో గాల్లో ఎగురుతు వెళ్లి కింద పడి గొంతు మీద చెయ్యేసి దగ్గుతున్న అతన్ని విసురుగా చేరి కాలు లేపి తన్నేవాడు కాస్త మరుక్షణం దవడలు బిగించి అలానే ఉండిపోతాడు. రక్తవర్ణాన్ని తలపించే అతని కళ్ళు, నరసింహాస్వామి ఉగ్రాన్ని చూపిస్తున్న అతని మోము, పిడికిలి బిగించి, ఆవేశంగా ఉన్న సింహం గాయం రుచి చూస్తే వచ్చే గర్జన శ్వాస.. అక్కడంత నిశ్శబ్దం. ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న ఆ కొండప్రాంతం ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దన్ని పలికిస్తుంది. వందల మంది కొండజాతి జనుల సమక్షంలో ఆర్భాటంగా అవమానిస్తుంది అతన్ని ఓ అడవి తల్లి అందమైన కూన.

1

ప్రేమాధ్యంతం - 1

యు బ్లేడీ!! నా ఊరికోచ్చి, నా సామ్రాజ్యంలోని రహస్యాలని అమ్మేయ్యాలని చూస్తావా?? ... గొంతు పట్టి ఒక్క ఉదుటున విసురుతాడు.ఐదు అడుగుల దూరంలో గాల్లో వెళ్లి కింద పడి గొంతు మీద చెయ్యేసి దగ్గుతున్న అతన్ని విసురుగా చేరి కాలు లేపి తన్నేవాడు కాస్త మరుక్షణం దవడలు బిగించి అలానే ఉండిపోతాడు.రక్తవర్ణాన్ని తలపించే అతని కళ్ళు, నరసింహాస్వామి ఉగ్రాన్ని చూపిస్తున్న అతని మోము, పిడికిలి బిగించి, ఆవేశంగా ఉన్న సింహం గాయం రుచి చూస్తే వచ్చే గర్జన శ్వాస..అక్కడంత నిశ్శబ్దం.ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న ఆ కొండప్రాంతం ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దన్ని పలికిస్తుంది.వందల మంది కొండజాతి జనుల సమక్షంలో ఆర్భాటంగా అవమానిస్తుంది అతన్ని ఓ అడవి తల్లి అందమైన కూన.అతని చెంప మీద పడిన చేతి వేళ్ళ అచ్చులు బహుశా అతనిలో మగాడి అహంకారాన్ని నిద్రలేపాయేమో...??ఒక్క ఉదుటున అతని పక్కనే భయంతో బిగుసుకుపోయిన ఆమె చేతిని పట్టుకొని లాక్కేలుతున్నాడు.విశ్వప్రయత్నలు చేస్తున్న ...Read More

2

ప్రేమాధ్యంతం - 2

తన తల్లి తండ్రిని చూస్తూ ఏడుస్తున్న ఆమె కన్నీరు రాథోడ్ మనసుని కాస్త కూడా కరిగించవు ఆ క్షణం.ఇరవై ఏళ్ళు కంటికి రెప్పలా మారి తన నాన్న చెంతన ఆనందంగా గడిపిన ఆ అమ్మాయి ప్రయాణం ఓ భయంకరమైన నరక కూపంలోకి వెళ్తుంటే కన్నీరు, మున్నీరుగా విలపిస్తాయి అక్కడి తండా వాసుల సున్నిత హృదయాలు."దయచేసి నన్ను వదిలేయండి దొర, మీ కాళ్లు పట్టుకుంటాను"... అంటూ ఎక్కిళ్ళు పెడుతున్న ఆ అమ్మాయి మాటలు పూర్తి కాకుండానే ఒక్కసారిగా బిగుసుకుపోతుంది.పోకెట్ నుండి తీసిన గన్ వేళ్ళతో తిప్పుతున్న అతని చర్యకి గొంతులో మాటలు అక్కడే సమాధి చ ...Read More

3

ప్రేమాధ్యంతం - 3

తన కన్నీళ్లు సున్నితంగా తుడుస్తున్న ఆ చేతిని అలానే పట్టుకొని నుదురుకి ఆణించుకుంటుంది కోమలి.ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న తనని దగ్గరికి తీసుకొని వెన్ను నిమురుతుంటే తన గుండెల్లో ఒదిగిపోయి మరింతగా రోదిస్తుంది కోమలి మనసు."మళ్ళీ చెప్తున్నాను బంగారం, ఇక్కడి నుండి ఎలాగైనా తప్పిస్తాను, వెళ్ళిపోరా?"... అని బాధగా అడుగుతున్న మాళవిక గారి మాటకి అడ్డంగా తల ఊపుతుంది.మరు నిమిషం కోమలి చెంప మీద చిన్నగా కొట్టి కోపంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే తన అత్తయ్య కన్నీళ్లు తుడుస్తూ బలవంతంగా నవ్వుతుంది."ఎందుకే.. ఎందుకే ఇలా ప్రతిసారి మొండిగా ప్రవర్తిస్తావు? ఇంటిల్లిపాది నీకు సహాయం చేస్తాం అంటుంటే నువ్వెందుకే ఇక్కడే ఉంటే వాడి రాక్షసత్వానికి బలి అవ్వాలి అని అనుకుంటున్నావు?....మరింత స్వచ్ఛంగా నవ్వుతు తన మెడలో ఉన్న ఎర్ర దారాన్ని చూపిస్తుంది కోమలి.అసహనంగా మారిపోతారు మాళవిక గారు."అది తాళి అని నువ్వు అనుకున్నా, నిన్ను వాడికి బానిసగా మార్చుకున్న బలి తాడే అది, దానికి ...Read More