ఓం శరవణ భవ

(3)
  • 65.1k
  • 0
  • 25.5k

కార్తికేయ చరితము కుమార గాధా లహరి తొలి పలుకులు కార్తికేయుడని, షణ్ముఖుడని ఉత్తరాపథం లోను, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఆర్ముగం అని దక్షిణ దేశం లోను కొలువబడుచున్న శివ" కుమారుడు అశేష జనావళికి జ్ఞాన ముక్తి ప్రదాత. వ్యాస ప్రోక్తమై, అష్టాదశ పురాణాల లో ఒకటైన" శ్రీ స్కాంద పురాణం " ప్రామాణికంగా సుబ్రహ్మణ్యుని చరితము ను వివరిస్తుంది. అంతేగాక, శివ, అగ్ని పురాణాలలో కూడా సందర్భోచితంగా కుమార గాధను ప్రస్తావించారు. ఇక కుమార సంభవం" షణ్ముఖుని కమనీయ గాధను కావ్యాత్మకంగా ప్రబోధించింది. దక్షిణ భారతంలో కాశ్యప శివాచార్యుని

New Episodes : : Every Wednesday & Sunday

1

ఓం శరవణ భవ - 1

కార్తికేయ చరితము కుమార గాధా లహరితొలి పలుకులుకార్తికేయుడని, షణ్ముఖుడని ఉత్తరాపథం లోను, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఆర్ముగం అని దక్షిణ దేశం లోను కొలువబడుచున్న శివ" కుమారుడు జనావళికి జ్ఞాన ముక్తి ప్రదాత.వ్యాస ప్రోక్తమై, అష్టాదశ పురాణాల లో ఒకటైన" శ్రీ స్కాంద పురాణం " ప్రామాణికంగా సుబ్రహ్మణ్యుని చరితము ను వివరిస్తుంది. అంతేగాక, శివ, అగ్ని పురాణాలలో కూడా సందర్భోచితంగా కుమార గాధను ప్రస్తావించారు. ఇక కుమార సంభవం" షణ్ముఖుని కమనీయ గాధను కావ్యాత్మకంగా ప్రబోధించింది. దక్షిణ భారతంలో కాశ్యప శివాచార్యుని ( కచ్చియప్ప. అన్నీ నామంతో తమిళులు వ్యవహరిస్తారు. ) 'కంద పురాణం ' దేశీయత, విచిత్ర కధా సంవిధానం తో పండిత, పామర జనరంజకమైంది.పై గ్రంధాలన్నింటి సారమైన " శ్రీ స్కాంద పురాణ సారామృతం " నేటి కథా సంగ్రహమునకు మూలం. సంస్కృత దేశీయ భాషల్లోని ముఖ్య గ్రంధములను అవలోకించి, సారాన్ని గ్రహించి, శ్రీ నటరాజన్ , ...Read More

2

ఓం శరవణ భవ - 2

రాక్షస నాయకుడైన మహా సురుని పుత్రిక మాయాదేవి . కారణజన్మురాలు . శుక్రాచార్యుని ప్రియ శిష్యురాలు . అపూర్వ లావణ్య శోభిత మాయాదేవి . అసమాన . రాక్షస జాతి సముద్ధరణ కై కంకణం కట్టుకున్న ఈ కారణజన్మురాలు గురువు ఆనతి మేరకు కశ్యప ప్రజాపతి ని ఆశ్రయిస్తుంది. దైత్య కులవర్ధనుడైన ఆ మహాపురుషుని సేవించి , అయన సంపర్కము చే అసమాన బాల సంపన్నులు , అసహాయ శూరులు అయిన సోదర త్రయమునకు తల్లి అవుతుంది . సహస్రాధికమైన రాక్షస వీరుల జన్మకు కారణమవుతుంది . శూరపద్ముడు ,సింహ ముఖుడు, తారకాసురుడు తల్లిదండ్రులైన మాయాదేవి, కశ్యప ప్రజాపతులకు ప్రణమిల్లి మాతృవాక్య పరిపాలకులై ఘోర తపము చేయ తరలి వెళ్లి పోతారు . శివ ధిక్కార పాపము దక్ష ప్రజాపతి నే కాదు దేవతలను కూడా కష్టాల పాలు చేస్తుంది . సాధ్యాసాధ్యములను విశ్లేషించక దక్షుని ప్రాభవ ...Read More

3

ఓం శరవణ భవ - 3

మహా పరివర్తనమునకు సమయం సమీపించింది . ఓంకార స్వరూపుడైన కుమారుడు ప్రభవించే శుభ తరుణం అతి చేరువలోనే ఉంది . సమున్నత హిమాలయ గిరి , మానస సరోవర ప్రాంతం ,. ప్రశాంత ప్రకృతి లో , పరమ రమణీయ ప్రదేశము లో ..... హిమవంతుడు , మేనక …. హిమవంతుడు అచంచల తపోదీక్షలో ఉన్నాడు . ఆయన సంకల్పం మహోత్కృష్టం . శుభకరం. విశ్వ కల్యాణ కారకం . పరాత్పరుని పుత్రికగా పొందాలన్నది హిమవంతుని అభిమతం . అందులకే సాగుచున్నది నిశ్చల తపం . హిమవంతుని ధర్మపత్ని మేనక తపో దీక్షలో సర్వం మరచిన పతికి శుశ్రూషలు చేస్తూ సతిగా తన కర్తవ్యం నిర్వహిస్తూంది . తరుణమాసన్నమైంది . వినీల ‘ప్రభలు’ వెదజల్లే ఓ ‘దివ్య జ్యోతి’ సాకారమయ్యే క్షణం రానే వచ్చింది . అందుకు సంకేతంగా ప్రకృతి లో ఆణువణువూ పులకించి పోయింది . ...Read More

4

ఓం శరవణ భవ - 4

సోదర త్రయం లో రెండవవాడైన సింహ ముఖుడు అసురుడైననూ సర్వశాస్త్రములు తెలిసిన వివేకి . సహజమగు అసుర స్వభావం తో నాశము కోరి తెచ్చుకుంటున్న వరించ తన వంతు ప్రయత్నం చేస్తాడు . కానీ, ఫలితం శూన్యం . శూర పద్ముని పట్టుదల, పంతం యుద్ధానికే దారితీశాయి . శూర పద్ముని మంత్రాంగం, మనోభీష్టం నారదమహర్షి సమయస్ఫూర్తి , సరస సంభాషణతో మరింత దృఢమవుతుంది . దేవతలపై , దండయాత్ర చేయాలనీ రాక్షసకోటి తీర్మానిస్తుంది . శూర పద్ముడు అశేష సేన వాహిని తో అలకాపురిపై దాడి చేస్తాడు . ఎలాంటి ప్రతిఘటన లేకుండా కుబేరుడు శూర పద్ముడికి లొంగి పోతాడు . కానుకలు సమర్పించి రాక్షసపతిని ప్రసన్నం చేసుకుంటాడు . సునాయాస విజయం తో విజృంభించిన శూర పద్ముడు అమరావతి పై దడి చేస్తాడు . అతడి ధాటికి నిలువలేని సురాధిపతి ఆకాశమార్గాన పారిపోతాడు . దానవేంద్రుడు ...Read More

5

ఓం శరవణ భవ - 5

మనసు చెదిరినట్లు నటించిన మహాదేవుడు లిప్తకాలం మూడో నేత్రం కొద్దిగా తెరిచి మన్మధుని వైపు దృష్టి సారించాడు . ఆ స్వల్ప వీక్షణానికే సుమశరుడు భస్మావశిష్టమైపోయాడు ఈ ఘోరానికి తల్లడిల్లిపోయింది రతీదేవి శంకరుని పాదాలపై పడి పతి భిక్ష ప్రసాదించమని వేడుకుంటుంది . కరుణించిన కైలాసపతి కన్నులు తెరిచి , ఇదంతా తన లీలా విశేషమని , ‘శుభ తరుణం’ సమీపించగానే మన్మధుడు పునర్జన్మ పొందగలడని ఊరడించి పంపుతాడు . తిరోగమించిన సుమశరం హిమాలయము చేరి హైమావతి ఎదలో సున్నితం గా నాటుకుంటుంది . తత్ఫలితంగా ఆమె లో భావసంచలనం కలుగుతుంది . మధుర భావనలతో ఆమె ఏకాగ్రత కోల్పోతుంది . ఈ పరివర్తనమునకు కారణమేమిటో ...Read More

6

ఓం శరవణ భవ - 6

అమేయంగా ఎదిగిన వింధ్యను సమీపించాడు అగస్త్యుడు . దక్షిణాపథము వెళ్ళుటకు దారి విడువుమని వింధ్యుని ఆదేశించాడు . గ్రహ నక్షత్ర గతులకే అవరోధం కల్పించిన వింధ్యడు తో మహర్షి మాటలను నిర్లక్ష్యం చేశాడు . వెంటనే అగస్త్యుడు వింధ్యుని తల మీద తన అరచేతిని ఉంచి బలంగా నొక్కాడు . ఆ ఒత్తిడికి వింధ్యుడు పాతాళమునకు కృంగాడు . మహర్షి మహిమను అవగతం చేసుకున్న వింధ్యుడు అగస్త్యునికి శరణాగతుడయినాడు . తన పూర్వ వైభవం తిరిగి పొందేలా కనికరించమని వింధ్యుడు మహర్షిని వేడుకుంటాడు . తిరుగు ప్రయాణం లో వింధ్యు డి కోరిక తీరగలదని మహర్షి దీవిస్తాడు . కానీ, దక్షిణాపథమును చేరిన అగస్త్యుడు నేటి వరకు ఉత్తరాభిముఖంగా పయనించలేదు . వింధ్యుడి అభీష్టము నెరవేరలేదు . గర్వాతిశయం ప్రగతికి అవరోధమన్న పరమ సత్యం వింధ్యుని ఉదంతం ద్వారా మనకు అవగతమవుతుంది . ...Read More

7

ఓం శరవణ భవ - 7

దేవతలందరూ పరమేశ్వర సన్నిధి చేరారు . పరాత్పరుని ఆర్తిగా స్తుతించారు . వారి మనోగతం తెలిసిన మహేశ్వరుడు కుమార సంభవమునకు ఉద్యమించాడు . కరుణా సముద్రుడైన రమణు డు ప్రస్తుత రూపాన్ని విడిచి పెట్టాడు . తన యొక్క ఆరు ముఖాలతోను , ఆరు త్రినేత్రాలతోను, దర్శనమిచ్చాడు . శివుని ఆరు ముఖాల్లోని గుణాలు —---- 1. ఐశ్వర్యం,( ఆదిశక్తి), 2. 3. వీర్యం( ఇచ్ఛా శక్తి), కీర్తి( క్రియా శక్తి ) , 4. శ్రీ( పరాశక్తి) , 5. జ్ఞానం ( జ్ఞాన శక్తి ) , 6. వైరాగ్యం ( కుండలినీ శక్తి ) ...Read More

8

ఓం శరవణ భవ - 8

షోడశ కళలకు ప్రతిరూపం గా పదహారు ఆకృతులలో , తన సంకల్పమునకు తగిన గుణ రూప .విశేషాదులతో వెలసిన కుమార స్వామి పరిపూర్ణ అవతార . ఈ రూప వైవిధ్యం కాదు ఆసక్తికరం . జ్ఞాన మోక్ష దాయకం . నిప్పు రవ్వ కైనా, నిటలాక్షుని జ్వాలకైనా దహనగుణం ఒక్కటే . ధర్మం లో ఏమాత్రం తేడా ఉండదు . ఇదే పోలిక సుబ్రహ్మణ్యుని విషయం లోనూ , సదాశివుని విషయం లోనూ వర్తిస్తుంది . బాలుడైనా, కార్తికేయుడు పరిపూర్ణ అవతార పురుషుడు . పరాత్పరునకు ఏమాత్రం తీసిపోడు . కానీ, మాయామోహితులైన దేవతలు ఈ సత్యం గ్రహించక షణ్ముఖుని శక్తి యుక్తుల విషయం లో సందేహాలు వ్యక్తం చేస్తారు . శివకుమారుని బాల్య క్రీడలు వినోద , విస్మయ భరితములై తల్లిదండ్రులనే కాక కైలాసవాసులందరినీ ముగ్ధులను ...Read More

9

ఓం శరవణ భవ - 9

మహేశ్వరుడు పరంధాముని కధనం ద్వారా ఈ విడ్డూరం తెలుసుకొని కుమారుని వారింప స్కందగిరిని దర్శిస్తాడు . తండ్రి ఆగమనం తనయునకు పరమానందభరితమవుతుంది . జనకుని ఆనతి స్కందుడు సృష్టి కర్తను బంధవిముక్తుని చేస్తాడు . అజ్ఞానం తొలిగిన బ్రహ్మదేవుడు వినయశీలుడై , తన తప్పును గ్రహించి శివకుమారునకు శరణాగతుడవుతాడు . తండ్రికి తనయుడి పాండిత్య ప్రకర్ష తెలుసుకోవాలన్న పితృసహజమైన ఉబలాటం మదిని జనిస్తుంది . పరాత్పరుడు ప్రణవ రహస్యం వివరించమని షణ్ముఖుని ఆదేశిస్తాడు . మంత్ర రహస్యం బహిర్గతం చేయటం పధ్ధతి కాదు గనుక బాలుడైనా తాను గురు స్థానం లో ఉండి జగదీశ్వరుడికే తారక మంత్రం వివరించాలనుకుంటాడు సుబ్రహ్మణ్యుడు . తండ్రిని మించిన తనయుడి ఆలోచన అభయంకరుడికి ఆమోదయోగ్యం అవుతుంది . నేటి ‘ కుంభకోణం’ పట్టణానికి చేరువై యున్న ‘ స్వామి మల’ అను క్షేత్రమున సుబ్రహ్మణ్యుడు సదాశివునకు ...Read More

10

ఓం శరవణ భవ - 10

తన మూడవ మజిలీ లో సుబ్రహ్మణ్యుడు నేటి పంజాబు లోని భాక్రానంగల్ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చాడు . అక్కడొక జన పదం లో ఓ పుణ్యాత్మురాలి పశుల కాపరిగా చేరాడు . తన పశువులను మేపినందుకు ఆ స్త్రీ ప్రతిఫలంగా రెండు పూటలా గోధుమ రొట్టెలను స్వామికి సమర్పించుకునేది . ‘ బాలక్ నాధ్ ‘ నామధేయం తో కుమారస్వామి పామరుని భంగి పశు సంరక్షణలో లీనమైపోయాడు . విశుద్ధ జ్ఞాన స్వరూపునకు ఈ విచిత్ర వేషమేమిటి ? జగత్పతి పుత్రుడు జానపదుడు కావటం కేవలం ఈశ్వర సంకల్పమే కదా ! బాలక్ నాధ్ రోజూ పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లేవారు . కానీ, పశువులు అడవిలో పచ్చిక మేసే వి కావు . బాలక్ నాధ్ వాటిని ఒక రక్షణ వలయం లో ఉంచి తను చెంతనున్న గుహలో తపో సమాధి లో ఉండిపోయేవాడు . ఇలా కొంతకాలం ...Read More

11

ఓం శరవణ భవ - 11

సుందరవల్లి తన సోదరిలా కాక మనసు కుదిరినప్పుడు తపోధ్యానములో కూర్చునేది . లోక కల్యాణ కారకుడైన నారదమహర్షి తరుణం చూసి శివ తనయుని స్కందగిరి లో . నారాయణ పుత్రికల మనో వాంఛితమును షణ్ముఖునికి వివరిస్తాడు . యుక్తవయస్కుడైన కార్తికేయుడు విష్ణుకన్యల రూపురేఖలను, మనసును నారదుని కథనం ద్వారా గ్రహించి వారిని అనుగ్రహించాలని సంకల్పిస్తాడు . పై ఉదంతం శివకేశవుల అభేదాన్ని ఆవిష్కరిస్తుంది . శివశక్తి విష్ణుశక్తి వైపు మొగ్గు చూపటం చాల సహజమైన పరిణామం. ‘ జగతి లో ఏ మహత్కార్యానికైనా శివకేశవులు ఏకం కానిదే పరిపూర్ణ సిద్ధి లభించదు’ పైగా జ్ఞానశక్తికి ఇచ్ఛా క్రియా శక్తులు సోపానములై , సాధనా విశేషములై అలరారుట ఒక ‘ క్రమ పరిణామం.’ ఇదొక సహజగతి ‘ HYPOTHESIS, OBSERVATION, EXPERIMENTATION AND INFLUENCE అనే SCIENTIFIC PROCESS కు ఇదొక ప్రతిరూపం వల్లీ దేవసేనా సమేతుడైన ...Read More