Love, Life and Vitamin M

(5)
  • 29k
  • 0
  • 10.8k

Love, Life and Vitamin M ప్రేమ, జీవితం మరియు ఎం విటవిన్. M అంటే ఇక్కడ మోర్.. అంటే ఒక్కటి కాదు మరిన్ని. మరెన్నో. ఎం ఫర్ మనీ, ఎం ఫర్ మ్యానర్, ఎం ఫర్ మోటివేషన్, మేనేజ్మెంట్, మ్యాజిక్, మిరాకిల్.. ఇలా మోర్. మోర్ దాన్ మోర్.. అంశాలు. ఈ అంశాల చుట్టూ అల్లిన కథలు. అల్లుకున్న చిన్ని కథలు. చిన్న కథలు. చిన్న చిన్న కథలు. చిన్నవి అంటే చాలా చిన్నవి. షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా.. అలా అన్నమాట. షార్ట్ ఈజ్ స్వీట్ కూడా కదా.. అందుకు అన్నమాట. ఎప్పుడో రాసుకున్నవి. ఎప్పుడూ రాసుకునేవి. ఇప్పుడూ రాస్తున్నవి.

New Episodes : : Every Thursday

1

Love, Life and Vitamin M - 1

Love, Life and Vitamin M ప్రేమ, జీవితం మరియు ఎం విటవిన్. M అంటే ఇక్కడ మోర్.. అంటే ఒక్కటి కాదు మరిన్ని. మరెన్నో. ఫర్ మనీ, ఎం ఫర్ మ్యానర్, ఎం ఫర్ మోటివేషన్, మేనేజ్మెంట్, మ్యాజిక్, మిరాకిల్.. ఇలా మోర్. మోర్ దాన్ మోర్.. అంశాలు. ఈ అంశాల చుట్టూ అల్లిన కథలు. అల్లుకున్న చిన్ని కథలు. చిన్న కథలు. చిన్న చిన్న కథలు. చిన్నవి అంటే చాలా చిన్నవి. షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా.. అలా అన్నమాట. షార్ట్ ఈజ్ స్వీట్ కూడా కదా.. అందుకు అన్నమాట. ఎప్పుడో రాసుకున్నవి. ఎప్పుడూ రాసుకునేవి. ఇప్పుడూ రాస్తున్నవి. కవ్వించేవి. లవ్వించేవి. నవ్వించేవి. కదిలించేవి. ఇప్పుడు పనికొచ్చేవి. ఎప్పుడూ గురుతుకు వచ్చేవి. . ఎప్పటికీ మరిచి పోలేనివి. . “మాతృభారతి” ద్వారా మీతో పంచుకునే అవకాశం.. ఒక అదృష్టం. ఆదరిస్తారని, అభిమానిస్తారని.. అభిప్రాయం తెలియజేస్తారని.. ఆశిస్తూ.. ...Read More

2

Love, Life and Vitamin M - 2

రెండో కథ : నమ్మకం ఒక చెరువు అలుగు పోస్తున్నది. దాని దగ్గర ఒక అమ్మాయి, అబ్బాయి ఆడుకుంటున్నారు. అబ్బాయికి ఇసుకలో చాలా రంగు రాళ్ళు అమ్మాయికి మాత్రం ఒక్కటీ దొరకలేదు. కానీ, ఆమె దగ్గర ఇంటి నుంచి తెచ్చుకున్న రవ్వ లడ్డూలు చాలా ఉన్నాయి. అబ్బాయికి ఆశ కలిగింది. "నేను నీకు ఈ రంగు రాళ్ళన్నీ ఇస్తాను. నువ్వు నాకు నీ లడ్డూలన్నీ ఇచ్చేస్తావా?" అని అమ్మాయిని అడిగాడు అబ్బాయి. అందుకు అమ్మాయి ఒప్పుకుంది. అబ్బాయి ఒక రాయి దాచుకుని మిగిలిన రాళ్లన్నీ ఇచ్చేశాడు. అమ్మాయి మాత్రం మొత్తం లడ్డూలు ఇచ్చేసింది. ఆ రోజు రాత్రి.. అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమెది నమ్మకం. పూర్తి విశ్వాసం. అబ్బాయికి మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకంటే, తను ఒక రాయి దాచుకున్నట్లే.. ఆ అమ్మాయి కూడా ఒక లడ్డూ దాచుకుని ఉంటుందేమోనని అతని అనుమానం. ఇలాగే మనం ఎవరిని ...Read More

3

Love, Life and Vitamin M - 3

ఐదో కథ : సామూహిక ఏకాంతం! ఒకతనికి ఉరిశిక్ష పడింది. "నీ చివరి కోరిక ఏంటి? అని అడిగాడు జడ్జి. "నన్ను ఉరితీస్తున్నట్లు నా వాట్సప్ అప్డేట్ చేయాలి" సమాధానం ఇచ్చాడు అతడు. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిది. ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించి కండీషన్ చాలా సీరియస్ గా ఉంది” అని చెప్పాడు. “మీ వాళ్ళకు ఏమైనా చెప్పాలా?" అని అడిగింది నర్స్. "ఒక వేళ నేను చనిపోతే నా మొహం పైన వెంటనే గుడ్డ కప్పేయండి. లేదంటే మా ఫ్రెండ్స్ ఫోటో తీసి ఇన్స్టా గ్రాంలో పెడతారు” సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి. వర్తమాన కాలంలో ఇవి కాస్త “అతి”శయోక్తులే కావొచ్చు. అలా అనిపించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కానీ, రేపటి కాలంలో అతిశయోక్తులు కావు. . అతి దగ్గరి వాస్తవాలు. "ఫోన్ పక్కనపెట్టి కిందికి వచ్చెయ్ కలిసి భోజనం చేద్దాం" ...Read More