ప్రేమ ప్రయాణం

(23)
  • 150.1k
  • 10
  • 68.2k

మాది ఒక మధ్యతరగతి కుటుంబం నా పేరు (సూర్య) నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తాను వరుసకు నాకు మరదలు అవుతుంది . తనపేరు సత్య సత్య అంటే మా కుటుంబసభ్యులకు ఇష్టమే అందువల్ల నేను సత్యని ప్రేమించాను. తాను నన్ను ఇష్టపడింది అనుకున్నానే గాని తన అభిప్రాయని తెలుసుకోలేకపోయాను ఆ ప్రేమ ఎంతలా అంటే తనని చూడకుండా ఉండలేనంతగా.వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సత్య వాళ్ళ నాన్నగారికి .అమ్మమ్మగారికి నేను అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తనతో మాట్లాడుదామన్న వల్ల అమ్మమ్మో నాన్నగారో దగ్గర ఉండేది. కానీ ఎప్పుడునేను అడిగిన తన మనస్సులోని అభిప్రాయాన్ని చెప్పలేదు. అలా అని నామీదున్న ఇష్టాన్ని ఎప్పుడూ తాను చెప్పలేదు అలా ఎప్పుడూ తన గురించి ఆలోచించేవాడిని మా వాళ్ళు అది గమనించి నన్ను కాళీగా ఉన్నానని నన్ను టైప్ నేర్చుకోమని పంపారు. అప్పుడు నేను టైప్ ఇన్స్ట్యూషన్ లో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు

Full Novel

1

ప్రేమ ప్రయాణం - 1

మాది ఒక మధ్యతరగతి కుటుంబం నా పేరు (సూర్య) నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తాను వరుసకు నాకు మరదలు అవుతుంది . సత్య సత్య అంటే మా కుటుంబసభ్యులకు ఇష్టమే అందువల్ల నేను సత్యని ప్రేమించాను. తాను నన్ను ఇష్టపడింది అనుకున్నానే గాని తన అభిప్రాయని తెలుసుకోలేకపోయాను ఆ ప్రేమ ఎంతలా అంటే తనని చూడకుండా ఉండలేనంతగా.వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సత్య వాళ్ళ నాన్నగారికి .అమ్మమ్మగారికి నేను అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తనతో మాట్లాడుదామన్న వల్ల అమ్మమ్మో నాన్నగారో దగ్గర ఉండేది. కానీ ఎప్పుడునేను అడిగిన తన మనస్సులోని అభిప్రాయాన్ని చెప్పలేదు. అలా అని నామీదున్న ఇష్టాన్ని ఎప్పుడూ తాను చెప్పలేదు అలా ఎప్పుడూ తన గురించి ఆలోచించేవాడిని మా వాళ్ళు అది గమనించి నన్ను కాళీగా ఉన్నానని నన్ను టైప్ నేర్చుకోమని పంపారు. అప్పుడు నేను టైప్ ఇన్స్ట్యూషన్ లో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు ...Read More

2

ప్రేమ ప్రయాణం - 2

నరేష్ వాళ్ళ అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు నరేషకి ఇద్దరు చెల్లెళ్లు. ఇద్దరు చాలా తెలివైన వారు. చదువులో కూడా. నరేష్ కి చిన్నపటినుంచి ఫోటో గ్రాఫీ అంటే చాలా ఇష్టం. కానీ అది నరేష్ వాళ్ల తల్లిదండ్రులకు నచ్చేది కాదు. ఎప్పుడు కూడా చదువు కోమని చెప్పేవారు. నరేష్ 10థ్ క్లాస్ అయ్యాకా ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇష్టంలేకున్న కూడా ఇంటర్ కంప్లీట్ చేసాడు. ఇంటర్ తరువాత నరేష్ కుటుంబ పరిస్థితి రీత్యా ప్రైవేట్ గా డిగ్రీ చదువుకొంటూ ఒక కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసేవాడు.నరేష్ వాళ్ల అమ్మమ్మా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అక్కడ కొన్ని రోజులుండీ వచ్చేవాడు. అక్కడ దగ్గర లో నరేషకి దగ్గర బంధువులు ఉన్నారని వాళ్ళ అమ్మమ్మా వాళ్ళు చెప్పగా నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళని పలకరించి నరేష్ ఇంటికి వెళ్తుండగా నరేష్ కి మువ్వల శబ్దం వినిపించింది. నరేష్ ...Read More

3

ప్రేమ ప్రయాణం - 3

సంధ్య ప్రణయ్ ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళు వాళ్ళ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా తిరిగేవారు. నేను, సూర్య ,వర్ష ఏరియా నుండి వచ్చేవాళ్ళం. వర్ష అందరితోకన్నా సూర్య తో ఎక్కువగా చనువుగా ఉండేది. ఎందుకంటే వర్ష డిగ్రీ లో జాయిన్ అవ్వక ముందు టైప్ ఇన్స్టిట్యూషన్లో సూర్య పరిచయమయ్యాడు. వర్ష వలనే సూర్య డిగ్రీ జాయిన్ అయ్యాడు. సూర్య జాయిన్ అవుతూ నన్ను కూడా జాయిన్ చేసాడు అందువల్ల వర్ష కు సూర్య అంటే మంచి అభిప్రాయం. వర్షిత మాత్రం కొంచెం దూరం నుండి వచ్చేది. తాను వర్ష వాళ్ల ఇంటికి వచ్చేది అక్కడ నుండి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం వర్షిత అందరితోనూ చనువుగా మాట్లాడేది. అందువలనేమో వర్షితని నరేష్ ఇష్టపడ్డాడు. కాని ఈ విషయాన్ని సూర్య ఒక్కడి తోనే చెప్పాడు నరేష్ .తనతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని ఎదురు చూసేవాడు. కానీ తాను మాత్రం ...Read More

4

ప్రేమ ప్రయాణం - 4

సంధ్య - ప్రణయ్ ల విషాద ప్రేమ గాథ సంధ్య ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి వాళ్ళ సొంత ఉరు కేరళ వాళ్ళ నాన్నగారు వ్యాపారం చేసుకునేవారు. తాను అక్కడ వాళ్ళా అమ్మమ్మగారి ఇంటిలో ఉండి చదువుకొంది అయితే చిన్నతనం లొనే సంధ్యకి వాళ్ళ అత్తకొడుకుని ఇచ్చి పెళ్లి చేయటానికి పెద్దలు మాట్లాడుకున్నారు అయితే సంధ్యకి తెలియని వయస్సులో పెద్దలు చెప్పిన దాని ప్రకారం తనకు కాబోయే భర్త వాళ్ళ బావే అని అనుకునేది కానీ తన మనస్సులో వాళ్ళ బావ మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోలేక పోయింది. తనకు వాళ్ళు చెప్పారుకనుక అదే ప్రేమ అని అనుకునేది. కేరళ నుండి తమిళనాడు కొన్ని రోజులు వాళ్ల నాన్నగారు వ్యాపార నిమిత్తం కుటుంభంతో వాళ్లు వెళ్ళవలిసి వచ్చింది తనని కూడా వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడ అల్లికలు, కుట్లు, అలాంటివి నేర్చుకుంది. కానీ వాళ్ళ పరిస్థితి ...Read More

5

ప్రేమ ప్రయాణం - 5

సిరి మరియు మహా చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటినుండి సిరి మహా వాళ్ళు హైదరాబాద్ లోని ఇబ్రహ్మీమ్ నగర్ లో ఉండేవారు హైదరాబాదు లోని వాసవి జూనియర్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకొనేవారు సిరి మరియు మహా చాలా తెలివైనవారు అలాగే అందంలో , గుణంలో కూడా. సిరి మహా వాళ్ళది మధ్యతరగతి కుటుంబాలు. సిరి వాళ్ల తల్లితండ్రులు సిరిని కొంచెం గారాబంగా పెంచారు సిరి తన చిన్నతనంనుండే తన తల్లితండ్రులకు అన్నిపనులలోను చేదోడు వాదోడుగా ఉండేది ఇంటర్ పూర్తి అయ్యాక వల్ల ఆర్ధిక పరిస్థిని బట్టి డిగ్రీ లో జాయిన్ అయ్యారు సిరి, మహా 1స్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యిన కొద్దిరోజులకే కొంతమంది స్నేహితులైయ్యారు. అందులో శ్రీరామ్ ఒకడు . శ్రీరాం చాలా తెలివైన వాడు, చాలా మంచివాడు , ఆస్తిపరుడు, తన తల్లితండ్రులకి శ్రీరాం ఒక్కడే కొడుకు .అందుకేనేమో శ్రీరాంని వాళ్లు అతిగారబంగా పెంచారు. శ్రీరాం సిరిని చూసిన మొదటి చూపులోనే ...Read More