అరుణ చంద్ర

(14)
  • 117.6k
  • 3
  • 39k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 1 "శరణం శ్రీ షిర్డీసాయిబాబా" అని, మలి నమస్కారం చేసి, పూజా గది లోనించి బయటకు వచ్చింది అరుణ.హాలులో తన అమ్మ, నాన్న ఉన్నారు.వాళ్లు ఆనందంగా కనిపించారు.వాళ్ల కాళ్లకు నమస్కరించింది అరుణ, చిరునవ్వుతో."శుభమ్." అన్నారు ఆ తల్లిదండ్రులు, నిండుగా.అరుణ నిల్చోగానే, ఆమెను దరికి లాక్కొని, కౌగిలించుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఏక కాలంన, "పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లీ" అని అన్నారు.అరుణ, "థాంక్సండీ" అంది, హాయిగా.వెళ్లి, ముగ్గురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు.టిఫిన్లు వడ్డించుకుంటూ, తింటూ, మాట్లాడుకుంటున్నారు, చక్కగా."ఇరవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా" అని అడిగాడు అరుణను తన తండ్రి నవ్వుతూ. ఆయన కృష్ణమూర్తి. ఒక కంపెనీలో ఉన్నత ఉద్యోగి."చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా" అంది అరుణ చాలా హుషార్గా."థాంక్స్ ఏమిట్రా. నీ కృషి మంచిగా ఉంది. సో,

Full Novel

1

అరుణ చంద్ర - 1

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 1 "శరణం శ్రీ షిర్డీసాయిబాబా" అని, మలి నమస్కారం చేసి, పూజా గది బయటకు వచ్చింది అరుణ.హాలులో తన అమ్మ, నాన్న ఉన్నారు.వాళ్లు ఆనందంగా కనిపించారు.వాళ్ల కాళ్లకు నమస్కరించింది అరుణ, చిరునవ్వుతో."శుభమ్." అన్నారు ఆ తల్లిదండ్రులు, నిండుగా.అరుణ నిల్చోగానే, ఆమెను దరికి లాక్కొని, కౌగిలించుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఏక కాలంన, "పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లీ" అని అన్నారు.అరుణ, "థాంక్సండీ" అంది, హాయిగా.వెళ్లి, ముగ్గురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు.టిఫిన్లు వడ్డించుకుంటూ, తింటూ, మాట్లాడుకుంటున్నారు, చక్కగా."ఇరవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా" అని అడిగాడు అరుణను తన తండ్రి నవ్వుతూ. ఆయన కృష్ణమూర్తి. ఒక కంపెనీలో ఉన్నత ఉద్యోగి."చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా" అంది అరుణ చాలా హుషార్గా."థాంక్స్ ఏమిట్రా. నీ కృషి మంచిగా ఉంది. సో, ...Read More

2

అరుణ చంద్ర - 2

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 2 తమ గదిలో, మంచం మీద కుదుట పడి, పక్కనున్న కృష్ణమూర్తితో, అరుణకు విసెస్ చెప్పి, నాతో మా అన్నయ్య మాట్లాడేడు అని చెప్పింది లక్ష్మి. ఏమైనా విషయం ఉందా అని అడిగాడు కృష్ణమూర్తి. మాటల్లో చెప్పాను, అరుణకు ఈ యేడాది పెళ్లి చేయాలనుకుంటున్నామని. దానికి అప్పటి మీ మాటలు దొర్లించి నొచ్చుకున్నాడు. మరోసారి మీరు ఆలోచిస్తే బాగుంటుందన్నాడు అని చెప్పింది లక్ష్మి. వద్దు లక్ష్మీ. నాకు మేనరికాలు నచ్చవు. కనుకనేగా మా అమ్మాయి కోసం వేచి ఉండక, ఆయన కొడుకుకు బయట సంబంధాలు చూసుకోమని చెప్పింది. అదే ఉద్దేశ్యం ఉంటే, మా అక్క తన కొడుకుకు మన అమ్మాయిని ఇమ్మనమని, మన అమ్మాయి పుట్టినప్పుడే అడిగేసి ఉంది. అప్పుడే నేను కాదనేశానుగా. అని చెప్పాడు కృష్ణమూర్తి, కాస్తా చికాగ్గా.లక్ష్మి ఏమీ మాట్లాడలేదు.కొంతసేపు తర్వాత, లక్ష్మే, నిద్రపోతున్నారా అని అంది. లేదులే చెప్పు అన్నాడు కృష్ణమూర్తి. అమ్మాయి ...Read More

3

అరుణ చంద్ర - 3

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 3 ఆ రోజు రానే వచ్చింది.అరుణ తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లారు, అక్కడ ఉంటున్న చంద్ర తల్లిదండ్రులును కలవడానికి. చంద్ర వస్తానన్నాడు. అందుకు వద్దన్నారు అరుణ తల్లిదండ్రులు.ముందుగా అనుకొని ఉన్నారు కనుక, ఎర్పోర్టుకు వచ్చారు చంద్ర తల్లిదండ్రులు.సులభంగా వాళ్లు అక్కడ ఒకరికొకరు మీటవ్వగలిగారు."నా పేరు శరత్" అని తొలుత పరిచయం చేసుకున్నాడు చంద్ర తండ్రి. ఆ వెంటనే, "ఈమె నా భార్య. శ్రావణి" అని తన భార్యను పరిచయం చేశాడు."నేను కృష్ణమూర్తి" అని పరిచయం చేసుకున్నాడు అరుణ తండ్రి. పిమ్మట, లక్ష్మిని పరిచయం చేశాడు.అంతా కలిసి, శరత్ కారులో వారి ఇంటిని చేరారు.కృష్ణమూర్తి, లక్ష్మి రిప్రెసై వచ్చేక, వారంతా హాలులో కూర్చున్నారు.శ్రావణి ఇచ్చిన కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు, ఉల్లాసంగా."ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీవి బ్రాడ్ మైండ్స్" అన్నాడు శరత్, కలివిడిగా."మీక్కూడా. మీవి కూడా" అన్నాడు కృష్ణమూర్తి, అదే రీతిన.అంతా చక్కగా నవ్వుకున్నారు."మన మధ్య ఏ ...Read More

4

అరుణ చంద్ర - 4

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 4 "బాబోయ్ ఇక్కడిదో పోబియాలా ఉంది. పద సుశీల. ఇక్కడ నేను ఉండలేను" అంటూ లేచాడు అప్పారావు."మామయ్యా" అని అరుణ, అప్పుడే."ఏమ్మా. నువ్వేం చెప్పుతావు. అదే చెప్పుతావులే. ఎంతైనా వీళ్ల కూతురువే కదా" అన్నాడు అప్పారావు."అంత అసహనం ఎందుకు మామయ్యా. మనం తిన్న తిళ్లును, మనం ఉన్న ఇళ్లును, మనం కట్టుకున్న బట్టలును, ఇలా ఎన్నింటినో, ఆ అన్నింటినీ మన మన సొంత సంబంధీకులే సమకూర్చి మనకు పెడుతున్నారా. వాటికి లేని అభ్యంతరం, అక్కడ రాని ఆంతర్యం, పెళ్లి బంధంకు మాత్రం ఎందుకు పట్టి పట్టి వెతుకుతున్నాం. ఇదేం పద్ధతి మామయ్యా. ఘోరం అనిపించడం లేదు, సిగ్గు అనిపించడం లేదు. ఆఁ. మా అమ్మ, నాన్న ప్రవర్తనలో తప్పు వెతుకుతున్నారు ఎందుకు మామయ్యా." అని మాట్లాడింది అరుణ.అక్కడ నిశ్శబ్దం ఉంది, కొంతసేపు.ఆ పిమ్మట, అరుణ, "మీరూ ఆలోచించండి మామయ్య. ఏదైనా ఎవరికి వారం ...Read More

5

అరుణ చంద్ర - 5

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 5 ఆదివారంతో కూడి వరసగా మూడు పబ్లిక్ హాలిడేస్ రావడంతో, కృష్ణమూర్తి చొరవతో, లక్ష్మి, అరుణ, చంద్ర లాంగ్టూర్కు ఇక్కడకు అని అనుకోలేదు వారు. కానీ, కారులో బయలుదేరారు, సైట్సీయింగ్కు అన్నట్టు. లక్ష్మికి తప్పా, ఆ ముగ్గురూ కారు డ్రయివింగ్ చేయగలరు. కనుక, ఓపిక మేరకు ముందుకు వెళ్తూ, చూడవలసిన వాటి దగ్గర ఆగుతూ, లేదా, బడలిక అనిపిస్తే, హోటళ్లులో బస చేస్తూ ఈ సెలవుల కాలం గడిపేసేలా ఒక ఆలోచన మాత్రం వారిలో ఉంది. అదే ప్రస్తుతం కొనసాగుతోంది.అరుణ కారు డ్రయివ్ చేస్తోంది. తను ఎప్పుడూ 60కి 70కి మధ్య స్పీడుతోనే డ్రయివింగ్ చేస్తోంది. అదే జరుగుతోంది ప్రస్తుతం.అరుణ పక్కన లక్ష్మి ఉంది. వెనుక సీట్లలో కృష్ణమూర్తి, చంద్ర కూర్చున్నారు.వారంతా చక్కగా సంభాషించుకుంటున్నారు.కారులో మ్యూజిక్ప్లేయర్లోంచి సరళంగా శాస్త్రీయ సంగీతం వస్తోంది."మామయ్యా రాత్రి నేను, అరుణ ఒకటనుకున్నాం. అది మీతో మాట్లాడాలను కుంటున్నాను" ...Read More

6

అరుణ చంద్ర - 6

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 6 శ్రీరాజ్ తొలుత నుండి కెమిస్ట్రీ సబ్జెక్టు చదువు వైపు ఇంటరెస్టు చూపేవాడు. పైగా వాడికి మీద, ఇంజనీరింగ్ మీద మక్కువ లేదు ముందు నుంచి. గ్రాడ్యుయేషన్ వైపు వెళ్లి, కెమిస్ట్రీ బేస్డ్ సబ్జెక్ట్స్ మీద లోతైన అవగాహన పొంది, తను అనుకుంటున్న ఆ సబ్జెక్టు బేస్ట్ న్యూ పార్ములా మీద తను పేపర్స్ క్రియేట్ చేసి, సబ్మిట్ చేయాలన్న తలంపు వాడిది తొలుత నుండి. దాంతో తమ చెంత ప్రస్తుతం అట్టి గ్రాడ్యుయేషన్ కోర్సులుకు వీలు పడక, వాడిని వేరే కాలేజీకి పంపించవలసి వచ్చింది, వాడి పెద్దలకు. *** అలా వేరే కాలేజీలో చేరిన శ్రీరాజ్ మొదటి సంవత్సరం మంచి శాతం మార్కులు పొందాడు. అదే జోష్తో రెండవ సంవత్సరం చదువు మొదలు పెట్టాడు. అప్పుడే, అక్కడ, మధుమతి పరిచయమయ్యింది శ్రీరాజ్కు, గమ్మత్తుగానే కాదు, కాకతాళీయంగానూ, అదీ ఉదయమే."మీ నాన్నగారు ...Read More

7

అరుణ చంద్ర - 7

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 7 మోర్నింగ్వాక్ తర్వాత, లాన్లోకి లక్ష్మితో కలిసి వచ్చిన కృష్ణమూర్తి, ఆల్రడీ అక్కడ ఉన్న అరుణ, చంద్రలను చూసి, రోజు మధ్యలో ఆపేసి వచ్చేశారా వాకింగ్ను" అని అడిగాడు వాళ్లను, కుర్చీలో కూర్చొని.అరుణ చుట్టూ తల తిప్పి చూసింది. శ్రీరాజ్ దూరాన వాకింగ్ చేస్తూ కనిపించాడు.ఆ వెంటనే, "శ్రీరాజ్ ఏం అంటున్నాడు నాన్నా" అని అడిగింది అరుణ, టక్కున."అదా సంగతి." అని నవ్వేడు కృష్ణమూర్తి, లక్ష్మి వంక చూస్తూ."మీరు ఇక్కడకు చేరడం చూసే, మీ నాన్న, నన్ను తీసుకొని వచ్చేశారు అరుణా" అని చెప్పింది లక్ష్మి, నవ్వుతూనే.ఆ తర్వాత, మరి ఆలస్యం చేయక, రాత్రి శ్రీరాజ్కు, తనకు మధ్య జరిగింది చెప్పాడు కృష్ణమూర్తి, క్లుప్తంగా, అన్నింటిని. ఆ తర్వాత, "శ్రీరాజ్ వెల్డన్ బోయ్" అన్నాడు కూడా.అరుణ, చంద్ర మురిసిపోయారు.అప్పుడే రాము ఐదు వాటర్ బాటిల్స్ను వారి మధ్య ఉన్న టీపాయ్ మీద పెట్టాడు. ...Read More

8

అరుణ చంద్ర - 8

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 8 మరో 18 నెలలు పిమ్మట -మోర్నింగ్వాక్లు కానిచ్చి, ఆ ఐదుగురు, లాన్లో, కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.రాము వెళ్లి తర్వాత, శ్రీరాజ్, "డియర్స్, నా గోల్ రీచింగ్కు దరి అయ్యాను. పేపర్స్ సిద్ధమైపోయాయి. సబ్మిట్ చేయడమే మిగిలింది." అని చెప్పాడు, చాలా హుషారుగా.అందరూ చప్పట్లు చరిచారు."గుడ్ జాబ్, కంగ్రాట్స్" అన్నాడు కృష్ణమూర్తి తొలుత.పిమ్మట ఆ మిగతా ముగ్గురూ కంగ్రాట్స్ చెప్పారు.అందరికీ థాంక్స్ చెప్పాడు శ్రీరాజ్."ఇప్పటికైనా మాకు నువ్వు ఆ పేపర్స్ ద్వారా చెప్పబోయేది ముందుగా తెలియచేస్తావా" అని అంది లక్ష్మి, కుతూహలంగా."ఎందుకు వాడిపై వత్తిడి. అంతటికీ త్వరలో తెలియచేయబోతున్నాడుగా" అన్నాడు కృష్ణమూర్తి.అరుణ, చంద్ర ఏమీ అనలేదు. కానీ వారికీ ముందుగా తెలుసుకోవాలని ఉంది.శ్రీరాజ్ చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. తప్పా, దానికై ఎట్టి వ్యాఖ్య చేయలేదు. కానీ, "నేను మధుమతిని కలవాలనుకుంటున్నాను" అని చెప్పాడు, గబుక్కున."తను గుర్తు ఉందా" అని అడిగింది అరుణ, విస్మయంగా."నేచురలీ. ...Read More

9

అరుణ చంద్ర - 9 - last part

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 9 శ్రీరాజ్ అన్ని నార్మ్స్ని పుల్ఫిల్ చేస్తూ, అతి జాగ్రత్తగా, అతి పొందికగా, తన పేపర్స్ను సబ్మిట్ చేశాడు, కొద్ది నిముషాల ముందు. పిమ్మట అతి సామాన్యంగా ఆ ఆఫీస్నుండి బయటకు వచ్చేశాడు.ఆ బయట, శ్రీరాజ్కై వేచి ఉంది, మధుమతి.శ్రీరాజ్ తను ఈ వేళటి ఈ ప్రొగ్రాంను ముందుగా మధుమతికి చెప్పి, తనను రమ్మనమని ఫోన్ ద్వారా కోరాడు, కృష్ణమూర్తి ప్రేరణతో. అందుకే మధుమతి రావడమైంది. ఆమె అందించగా అందుకున్న ఆ పేపర్స్ను శ్రీరాజ్ సబ్మిట్ చేయడమైంది. డన్ అన్నాడు శ్రీరాజ్, తన కుడి బొటన వేలును పైకెత్తి చూపుతూ. ఆల్ ఆర్ బెస్ట్ పేవర్ అంది మధుమతి, తనూ తన కుడి బొటన వేలును పెకెత్తి చూపుతూ.ఆ పిమ్మట, ఆ ఇద్దరూ, దగ్గరలోనే ఉన్న కాఫీ కేప్కులోకి నడిచారు. రెండు బ్లాక్ కాఫీ చెప్పింది మధుమతి. నీకూ ఆ బ్లాక్ కాఫీ ఇష్టమా అడిగాడు శ్రీరాజ్. ఉ. ...Read More