ప్రణయ గీతిక - 33

  • 1.5k
  • 567

రాత్రంతా పెద్దాయన తను నాటువైద్యం ఎలా నేర్చుకున్నాడో, ఆ విద్య వెనుక దాగి ఉన్న అనుభవాలేమిటో చెబుతుంటే ప్రభకు సమయం తెలియనే లేదు. ఆ కథలోని ప్రతి సంఘటన అతని మనసులో ఏదో ఒక ముద్ర వేసింది. పెద్దాయన మాటలు వింటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. చివరకు ఎప్పుడు నిద్రపోయాడో కూడా తెలియకుండా గాఢనిద్రలోకి జారుకున్న ప్రభ, ఉదయం కాస్త ఆలస్యంగా, దాదాపు పది గంటల సమయంలో కళ్లు తెరిచాడు. నిద్రలేచిన వెంటనే నిన్నటి రాత్రి పెద్దాయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తొచ్చాయి. వాటిని తలుచుకుంటూ ఊరికి వెళ్లాలనుకుని బయటకు వచ్చిన ప్రభకు అక్కడ గోవిందు కనిపించాడు. ఇద్దరూ మాట్లాడుతుండగా ,ప్రభ అని గోవిందు పిలిచేసరికి అట్ట చూస్తాడు .  " ప్రభ నా పెళ్ళికి గీతిక వచ్చింది "అని చెప్పగానే ప్రభా కళ్ళు ఆశ్చర్యంగా చూస్తాయి. అప్పుడే వచ్చిన అరణ్య కాఫీ తీసుకొని రావడంతో వాళ్ళిద్దరూ మాట్లాడకుండా మంచం మీద కూర్చుంటారు."గోవిందు