యూ ఆర్ మై డెస్టినీ - 33

(11)
  • 1k
  • 372

అరుణ్ ఇంటికి చేరుకోగానే హాల్లో టీవీ చూస్తూ కనపడ్డారు సంధ్యా గారు.అరుణ్ నేరుగా వెళ్లి ఆవిడ ఒడిలో తల పెట్టుకొని పడుకొని "  హాయ్ మా డాడీ ఏరి అప్పుడే ఆఫీస్ కి వెళ్ళిపోయారా"  అని అడుగుతాడు.ఆవిడ టీవీ చానల్స్ మార్చుతూ " లేదు మీ ఆవిడ ఓదార్పు యాత్రకు వెళ్ళాడు"  అని అంటుంది." ఏంటి?" అని అరుణ్ ఆవిడ ఒడిలో నుంచి లేచి కూర్చుంటాడు ." మీ ఆవిడని ప్రియా ఎంగేజ్మెంట్ కి తీసుకెళ్లలేదని అలిగి కూర్చుంది , దాని అలక తీర్చే ప్రోగ్రాం లో ఉన్నాడు మీ డాడీ"  అని అంటారు సంధ్య.అరుణ్ వాళ్ళ అమ్మ వైపు ఐ బ్రో రేస్ చేసి చూస్తే.సంధ్య గారు జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. " మేము ప్రియా ఫంక్షన్ కోసం రెడీ అయ్యే టైం కి మీ ఆవిడ బ్రష్ చేసుకుంటూ కిందకి వచ్చింది.  అప్పటికి మీ నాన్న ఫంక్షన్ కి వెళ్తున్న