ప్రియా ఊర్మిళాదేవి గారి మాటలు తిప్పి ఆవిడకే తిప్పి కొట్టడంతో అక్కడున్న వాళ్ళకి నవ్వు వచ్చింది కానీ నవ్వితే ఊర్మిళాదేవి గారు ఊరుకోరు అని సైలెంట్ గా ఉంటారు.ఊర్మిళాదేవి గారు జగదీశ్ చంద్ర వైపు కోపంగా చూసి "చూసావా రా నీ కూతురు నన్ను ఎనేసి మాటలు అంటుందో అంతా నీ గారాబం వల్లే అది అలా తయారయింది, ఒక్కటే కూతురు కదా అని నెత్తిన పెట్టుకున్నావ్ ఇప్పుడు చూడు నా నెత్తి మీద నుంచుని ఎలా నాట్యం ఆడుతుందో, మందు దాని కాదురా నిన్ను నాలుగు పీకితే దానికి బుద్ధి వస్తుంది" అని జగదీష్ చంద్రని తిడుతుంది.సునంద గారు చిన్నగా "మీరే అంటారుగా అత్తయ్య నా మనవరాలికి అన్ని నా పోలికలే అని మరి ప్రియా కూడా అదే కదా అత్తయ్య చెప్పింది" అని అంటుంది.దానికి ఊర్మిళ దేవి గారు సునంద వైపు కోపంగా చూసి " అంటే ఏంటే