ప్రణయ గీతిక - 31

  • 777
  • 261

ఫంక్షన్ కి వెళ్ళిన గౌరీ  రాత్రి  ఎనిమిదయినా    ఇంటికి రాకపోయేసరికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో తనే బండి తీసుకొని ఫంక్షన్ జరిగే చోటికి వెళ్ళాడు ప్రభ . ఫంక్షన్ ముగిసిపోయి ఇంటికి వెళ్లాలని నిలుచున్న గౌరీని ఓనర్ చెల్లి వచ్చి "మా అన్నయ్య చెప్పిన గౌరీ దేవి మీరేనా" అంటూ పలకరించింది. అవునండి నేనే అంది గౌరీ. చూస్తుంటే మీరు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు  అడిగింది ఆమె.  అదేం లేదు మేడం ఏదైనా వెహికల్ వస్తుందేమోనని చూస్తున్న అంది గౌరీ కొడుకు కోసం అని చెప్పకుండా ఇలాగైనా వాడు వస్తాడేమోనని కాస్త ఆలస్యమైన అక్కడే నిలబడి ఉంది గౌరీ అలా మాట్లాడితే ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే వచ్చాడు ప్రభ.   అమ్మా! ఏడుకే ఫంక్షన్    అయిపోతుందన్నావు కదా  ఏదైనా వెహికల్లో వచ్చేయొచ్చుగా లేదంటే ఫోన్ చేయొచ్చుగా అన్నాడు బండి తిప్పుతూ ప్రభ. వెహికల్ కోసమే ఇక్కడ  నిలుచున్నా  ఇంతసేపయినా ఏది రాలేదు