యూ ఆర్ మై డెస్టినీ - 29

(110)
  • 2k
  • 1
  • 879

శైలు ప్రియా అని చెక్ చేస్తూ ఉంటుంది. " ఎలా ఉంది శైలు ఇప్పుడు నా మనవరాలికి కి " అని అడుగుతుంది ఊర్మిళాదేవి గారు." పర్వాలేదు అమ్మమ్మ ఇప్పుడే కదా ఇంజక్షన్ చేసింది ఇంకొక అరగంటలో లేచి కూర్చుంటుందిలే" అని అంటుంది శైలు." నా కూతురు ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకోలేదంటావా"  అని అడుగుతుంది సునంద గారు." ఆంటీ మీకు తెలిసిందే కదా మనం ఎన్ని డాక్టర్లు చూపించాము తనకు తానుగా ఈ భయం నుంచి బయటికి వస్తే కానీ మనం ఏం చేయలేము"  అని అంటుంది శైలు. గాయత్రి గారు మాట్లాడుతూ " ఇంతకీ ప్రియా కి ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది"  అని అడుగుతుంది.గాయత్రి గారికి అన్ని తెలియాలి అని అనుకొని జగదీష్ చంద్ర మాట్లాడుతూ  " అక్క నీకు నేను అన్ని వివరించి చెప్తాను,  ప్రియా కి ఇది మొదటి సంబంధం కాదు.  ప్రియ నాలుగు