ప్రణయ గీతిక - 12

  • 366
  • 90

పప్పు మల్లెపూలు కొనాలని చెప్పడంతో ముందు మల్లెపూలు ఎందుకు అని   ప్రశ్నించిన ప్రభ పూల బండి చక్రాల మధ్యలో నుంచి ఒక అమ్మాయి మృదువైన పాదాలు కనిపించడంతో చూడాలనికుతూహలంగా మనసు  తపించడంతో బండి దగ్గరికి వెళ్ళమంటాడు. "అన్నా ఒక మోర పూలు ఎంత ?," ప్రశ్నిస్తాడు పప్పు. పూలమ్మే వ్యక్తి మరోవైపుకు మాట్లాడుతూ ఉండడంతో హ్యాండిల్ మీద చెయ్యి పెట్టి అతని వైపు చూస్తున్నాడు.వెనక కూర్చున్న ప్రభ మాత్రం ఆ మృదుసదనని చూడాలని కాస్త అలా అతని చూపుని ముందుకు పోనివ్వగా రకరకాల పూల హారాలు చంకీ దారాలతో చుట్టి  ఉండగా తను కనిపించలేదు పైగా ఏదో చీర అలా గాలికి కొంగు ఎగిరినట్టు అనిపించడంతో  అవాక్కయ్యాడు ప్రభ."అమ్మాయే కాదు తనతో పాటు మరొకరు ఎవరో ఉన్నట్టున్నారు" అనుకుని సంపంగి పూలతో అల్లిన పూల హారం నుంచి చూడాలని అలా  తొంగి చూస్తూ తన చేతి వేళ్ళని పప్పు భుజం మీద పెట్టి అలా