ఇంకొక సెకండ్ లో తన పెదవులు అందుకోవచ్చు అనుకున్న ప్రేమ్ కి ప్రియా అలా దూరంగా నెట్టేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాడు.నితిన్ వైపు కోపంగా చూస్తూ ' అన్ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ లో ఎవడో ఒక ఎదవ ఉన్నట్టుగా, వీడొకడు నా లవ్ స్టోరీ లో తగలడ్డాడు , ప్రతి దానికి అడ్డొస్తు , కృష్ణయ్య వీడిని మా లవ్ స్టోరీ లో నుంచి ఎలాగైనా సరే సైడ్ చేయవయ్యా నీకు పుణ్యం ఉంటుంది' అని అనుకుంటాడు తన మనసులో.నితిన్ మాట్లాడుతూ " స్వీటీ నాకెందుకో వీడి మీదే డౌట్ , వీడే వాడి ఇన్ఫర్మేషన్ నీకు కనపడకుండా చేసినట్లు ఉన్నాడు , వీడికి తప్ప ఆ అవసరం ఎవరికి ఉంటుందో నువ్వే ఆలోచించు " అని ప్రియా మనసులో ఒక కొత్త అనుమానం కలిగేలాగా చేస్తాడు. " నా తమ్ముడికి ఏమీ అలాంటి అవసరం లేదు వాడు ఏమి కావాలనుకున్నా