కోర్టు అజయ్, ప్రవీణ్ మరియు అరవింద్ రెడ్డీలకి 15 రోజుల పోలీసు కస్టడీకి పంపించడానికి అనుమతించిన తరువాత వాళ్ళని పోలీసు వ్యాన్లొ ఎక్కించి విజయవాడ నగర శివార్లొ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ (SIT) తాలుకు ప్రత్యేక విచారణా విభాగం(Special Interrogation Facility) కి అదె రోజు తరలిస్తారు.సమయం : 05:15 గంటలుసిట్ (SIT) తాలుకు ప్రత్యేక విచారణా కేంద్రం (Special Interrogation Facility)వీళ్ళ ముగ్గురుని తీసుకొస్తున్న వ్యాన్ అక్కడికి చేరుకుంది. వ్యాన్ నెమ్మదిగా ఆగగానే...అక్కడ ముందే సిద్ధంగా ఉన్న సాయుధ పోలీసులు చుట్టుముట్టారు.వ్యాన్ వెనుక తలుపులు తెరుచుకున్నాయి."దిగండి..."అని ఒక కానిస్టేబుల్ గట్టిగా అన్నాడు.ముందుగా...అజయ్ దిగాడు.అతని వెనక...ప్రవీణ్...చివరగా...అరవింద్ రెడ్డి.ముగ్గురి చేతులకు సంకెళ్లు అలాగే ఉన్నాయి.కోర్టు బయట ఉన్న మీడియా హడావిడి ఇక్కడ లేదు.ఆ ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా...కొంతమంది పోలీసులు మాత్రమే ఉన్నారు. వాళ్ళు తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు.చుట్టూ పొడవైన ప్రహరీ గోడలు...మూడు వరుసల భద్రత...ప్రతి మూలలో సీసీ