సమయం : ఉదయం 10:00 గంటలుస్థలం : విజయవాడ జిల్లా సెషన్స్ కోర్టు.కోర్టు బయట కేమెరా ముందు TV - 6 న్యూస్ చానల్ యాంకర్ నించోని మాట్లాడుతుంది.టీ.వి - 6 న్యూస్ యాంకర్ : "బ్రేకింగ్ న్యూస్..."రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ సిట్ అధికారి ఏ.సి.పి అజయ్, సి.ఐ ప్రవీణ్ మరియు దివంగత ఎం.ఎల్.ఎ దేవేంద్ర రెడ్డి కుమారుడు అరవింద్ రెడ్డిలను కాసేపట్లో విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లొ కోర్టు మొదటి హీరింగ్ మొదలవ్వబోతుంది. టీ.వి - 6 న్యూస్ యాంకర్ : వీరిపై...డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కు...బూటకపు ఎన్‌కౌంటర్లు...డా. రాఘవరావు హత్య...తులసి హత్య...ఇంజినేరింగ్ స్టూడెంట్ పల్లవిపై అత్యాచారం, హత్య...జూనియర్ డాక్టర్లు హరీష్, పద్మ కిడ్నాప్...డాక్టర్ పద్మపై అత్యాచారం, హత్య...డాక్టర్ శ్వేతపై హత్యాయత్నం...పోనికెగూడెం కుట్ర...వంటి అత్యంత తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి.టీ.వి - 6 న్యూస్ యాంకర్ : ఈ కేసులో అత్యంత సంచలన విషయం ఏమిటంటే...మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిందని అందరూ