ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని బైక్ ను పైకి లేపాడు,ఇంతలో వెనకనుంచి ఎవరో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకున్నారు, “ఆ చల్లటి గాలిలో చమటలు పట్టాయి”. మెల్లగా వెనక్కి తిరిగాడు, అది ఎవరో కాదు తన కలలో వచ్చిన ఆకాష్. కలలో భయపెట్టిన ఆకాష్ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఆ రోధన చాలా భయంకరంగా ఉంది.“ రేయ్.. ఎందుకురా నన్ను చంపావు…. చెప్పు! చెప్పరా….. “విక్రమ్ భయం అంచులు దాటింది, బైక్ కిందకు వదిలేసాడు.. “రేయ్ నేను ఏది కావాలని చేయలేదు రా!!..”“లేదు .. నువ్వు కావాలనే చేశావు” అంటూ అరిచాడు ఆకాష్..నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా “నేనేది కావాలని చెయ్యలేదు”..అంటూ ఆకాష్ కి సమాధానం చెప్పే క్రమంలో విక్రమ్ కూడా బాధపడుతున్నాడు..“రేయ్ విక్రమ్! ఏమైంది రా నీకు, రాత్రిపూట ఒక్కడివే మర్రి చెట్టు కింద పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నావ్” అని వినిపించింది… విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తాతయ్య ఆలస్యం అయ్యేసరికి